కంపెనీ క్వార్టర్‌మాస్టర్ హవల్దార్ అబ్దుల్ హమిద్ PVC (1 జూలై 1933 – 10 సెప్టెంబరు 1965) భారత సైనిక దళం కు చెందిన ద గ్రనేడర్స్ యొక్క నాల్గవ బెటాలియన్ కు చెందిన సైనికుడు. ఆయన 1965లో ఖేం కరణ్ సెక్టారులో జరిగిన ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందాడు. ఆయనకు మరణానంతరం భారతదేశ అత్యున్నత మిలిటరీ పురస్కారమైన పరమ వీర చక్ర ను భారత ప్రభుత్వం ప్రధానం చేసింది. దేశంకోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మహాసాహసి హవల్దార్ అబ్దుల్ హమిద్
అబ్దుల్
హమిద్ ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాపూర్ జిల్లాకు చెందిన ధాముపూర్ గ్రామంలో జూన్ 1, 1933 న జన్మించాడు. ఆయన తండ్రి మొహమ్మద్ ఉస్మాన్
అబ్దుల్
హమిద్ మొదట 1954 డిసెంబర్ 27న "ద గ్రెనేడియర్స్ ఇన్ ఫాంట్రి" లో ఒక
సైనికునిగా చేరాడు. తరువాత అబ్దుల్ హమిద్ 4వ
బెటాలియన్లోకి మార్చబడ్డాడు. ఆపై చివరిదాకా అక్కడే పనిచేశాడు. అలా సైన్యంలో ఉంటూనే
అబ్దుల్ హమిద్ ఆగ్రా. అమృత్‌సర్, జమ్మూకాశ్మీర్, ఢిల్లీ, రాయగఢ్ మొదలైన ప్రాంతాలన్నీ తిరిగివచ్చాడు.
బ్రిగేడియర్
"కాన్ డాల్వీ" నాయకత్వంలో ఇండియా కు చైనాకూ మధ్య జరిగిన యుద్ధంలో పాల్గొన్నాడు. కాలినడకన "భూటాన్" కూ, "మిసామరి" కి వెళ్చాచ్చాడు. అబ్దుల్ హమిద్ గొప్ప
"షూటర్" (తుపాకీ వీరుడు) కావడంవల్ల 106 పూరింగ్ బెటాలియన్ కు
పంపించబడ్డాడు.
ఇండో-పాక్ యుద్ధం 1965
భారత దేశం- పాకిస్తాన్ కు మద్య జరిగిన యుద్ధంలో 1965 సెప్టెంబర్ 10న ఉదయం 8 గంటలకు
పాకిస్థాన్ సైనిక దశాలు బిక్కివిండీ అమృత్‌సర్ రోడ్డు మీద "చీమా"
గ్రామం"పై దాడిచేసారు. ఈ ప్రాంతం "భమెకరన్" విభాగంలో ఉంది. ఉదయం 9
గంటలయ్యేసరికి వారు మరింత ముందుకు వచ్చారు. ఇంకా ఇంకా ముందుకు భారత సైన్యం మిదకు
తుఫానులా వస్తున్న ట్యాంకులను చూసి ప్రమాదాన్ని అబ్దుల్ హమిద్ పసిగట్టాడున. వెంటనే
తన తుపాకీతో సివంగిలా తన జీపులోకి దూకి ముందుకెళ్చాడు. అప్పడతను తన దళానికి
కమాండరుగా ఉన్నాడు. శత్రుసైనికులు బాంబులతో, ట్యాంకులతో అగ్ని వర్షం కురిపించసాగారు. ఏమాత్రం బెదరకుండా అబ్దుల్
హమిద్ ఎదుర్కొన్నాడు. చూస్తుండగానే తన సాధారణ తుపాకీతో మూడు ట్యాంకులను
పేల్చివేసాడు. ఇది గమనించిన శత్రుసైనికులు నాల్గవ ట్యాంకును పేల్చబోతుండగా మిషన్
గన్ తో అబ్దుల్ హమిద్ ను కాల్చి చంపారు.
అబ్దుల్ హమిద్ కు సెప్టెంబరు 16, 1965న భారతదేశ అత్యున్నత మిలిటరీ పురస్కారం పరమవీర చక్రను భారత ప్రభుత్వం ప్రకటించింది. దానిని 1966, జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా హమీద్ సతీమణి "రసూలన్" కు రాష్ట్రపతి సర్వేపల్లి రాథాకృష్ణన్ గారు అందజేసారు.
లెగసె:
· ఉత్తర ప్రదేశ్ లోని "అసల్
ఉత్తల్" లో అతని సమాధిపై ఒక స్మారక స్థూపం నిర్మించబడినది. ప్రతీ సంవత్సరం
అక్కడ "మేళా" నిర్వహిస్తారు.
· హమీద్ పేరుమీద ఒక పాఠశాల, గ్రంథాలయం, ఆసుపత్రినీ నెలకొల్పారు.
· "ఆర్మీ పోస్టల్
సర్వీసు" హమీద్ పేరిట ఒక పోస్టల్ కవర్ ను సెప్టెంబరు 10, 1979న జారీచేసింది.
· 1988లో చేతన్ ఆనంద్ యొక్క
టెలివిజన్ సీరియల్ "పరమ వీర చక్ర" లో ఆయన పాత్రలో నసీరుద్దీన్ షా నటించారు.
· మూడు రూపాయల విలువ గల పోస్టల్
స్టాంపును భారత ప్రభుత్వం జనవరి 28, 2000 న జారీచేసారు. ఆ స్టాంపుపై
హమీద్ ఒక జీప్ పై నుండి ట్యాంకులను కాల్చుతున్నట్లు చిత్రం ఉంటుంది.
· 2008లో హమీద్ భార్య రసూలన్ బీబీ
అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ను కలిసి వారి గ్రామంలో మిలిటరీ రిక్రూట్ మెంటు
సెంటరు నెలకొల్పవలసినదిగా కోరారు.
· అదే విధంగా దుల్లాపూర్ లోని ఆయన
గృహాన్ని స్మారక భవనంగా చేయాలని కోరారు.
No comments:
Post a Comment