ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ (21 మార్చి 1913 - 21 ఆగస్టు 2006) భారతదేశం గర్వించదగిన రత్నం. సాంప్రదాయ
వేడుకలలో ప్రధానంగా జానపద వాయిద్యంగా షెహనాయ్ ప్రాముఖ్యత కలిగి ఉండగా, బిస్మిల్లా ఖాన్ దాని స్థాయిని పెంచి దానిని కచేరీ వేదికపైకి తీసుకురావడం విశేషం.
షెహనాయ్ మాస్ట్రో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ భారతరత్న
పురస్కార గ్రహీత మరియు భారతరత్నతో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్ మరియు పద్మవిభూషణ్ వంటి నాలుగు అగ్ర పౌర పురస్కారాలను కూడా
అందుకున్నారు.
21మార్చి 1913 న బీహార్‌లోని డుమ్రాన్‌లో జన్మించిన బిస్మిల్లా
ఖాన్, పైగంబర్ ఖాన్ మరియు మిత్తాన్ దంపతులకు రెండవ కుమారుడు. బిస్మిల్లా ఖాన్ కుటుంబానికి
సంగీత నేపథ్యం ఉంది మరియు అతని పూర్వీకులు భోజ్‌పూర్ సంస్థానంలో సంగీతకారులు. బిస్మిల్లా
ఖాన్ అసలు పేరు ఖమరుద్దీన్. అతని అన్నయ పేరు షంసుద్దీన్. కాని తాత రసూల్ బక్ష్
ఖాన్ అతడిని "బిస్మిల్లా" అని పిలిచేవాడు అందువల్ల అతను బిస్మిల్లా ఖాన్ గా పిలువబడ్డాడు.
బిస్మిల్లా ఖాన్ తండ్రి డుమ్రాన్ మహారాజా కేశవ్ ప్రసాద్ సింగ్ ఆస్థానంలో షెహనాయ్ వాద్యకారుడు.
బిస్మిల్లా ఖాన్ నిగర్వి, నిరాడంబరుడు.
బిస్మిల్లా ఖాన్ సంపద మరియు ఇతర భౌతిక ఆస్తులను కూడబెట్టుకోలేదు మరియు పవిత్ర నగరం
బెనారస్‌లో సామన్యుల మద్య నివసించాడు. బిస్మిల్లా
ఖాన్ వారణాసి నగరంపై ప్రేమను కలిగి ఉన్నాడు, మరియు యుఎస్‌లో స్థిరపడటానికి శాశ్వత వీసా ప్రతిపాదనను
తిరస్కరించాడు.
బిస్మిల్లా ఖాన్ గురువు అతని మేనమామ అలీ బక్ష్ 'విలయతు', ప్రఖ్యాత షెహనాయ్ వాద్య విద్వాసుడు. బిస్మిల్లా ఖాన్ మతపరంగా షెహనాయిని అభ్యసించాడు
మరియు చాలా తక్కువ సమయంలో పరిపూర్ణతను సాధించాడు. షెహనాయ్‌ని అత్యంత ప్రసిద్ధ
శాస్త్రీయ సంగీత వాయిద్యాలలో ఒకటిగా చేసిన ఘనత బిస్మిల్లా ఖాన్ కు దక్కింది.
కలకత్తాలో జరిగిన ఆల్ ఇండియా మ్యూజిక్
కాన్ఫరెన్స్ (1937) లో అతని కచేరీ షెహనాయ్‌ని వెలుగులోకి
తెచ్చింది మరియు సంగీత ప్రియులచే ఎంతో ప్రశంసించబడింది. స్వాతంత్య్రానంతర కాలంలో
షెహనాయ్ పై నిపుణత సాధించాడు మరియు
శాస్త్రీయ సంగీతం యొక్క వారసత్వాన్ని సజీవంగా ఉంచాడు. ప్రపంచం నశించినా సంగీతం
మనుగడ సాగిస్తుందని ఎప్పుడూ నమ్మే బిస్మిల్లా ఖాన్ నిజంగా స్వచ్ఛమైన కళాకారుడు అని
పిలవవచ్చు. బిస్మిల్లా ఖాన్ హిందూ-ముస్లిం ఐక్యతను విశ్వసించాడు మరియు తన సంగీతం
ద్వారా సోదర సందేశాన్ని వ్యాప్తి చేశాడు. సంగీతానికి కులం లేదని బిస్మిల్లా ఖాన్ ఎప్పుడూ
ప్రకటించేవారు.
1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంగా బిస్మిల్లా ఖాన్ ఢిల్లీలోని ఎర్రకోటలో షెహనాయ్ దర్శన ఇచ్చాడు మరియు ప్రతి సంవత్సరం ఆగస్టు 15 న భారత ప్రధాని ఎర్రకోట నుండి తన ప్రసంగం చేసిన వెంటనే షెహనాయ్ కచేరి చేసేవాడు.. బిస్మిల్లా ఖాన్ అనేక దేశాలలో షెహనాయ్ కచేరీలు నిర్వహించారు మరియు అక్కడ అతనికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బిస్మిల్లా ఖాన్ ఆఫ్ఘనిస్తాన్, యుఎస్ఎ, కెనడా, బంగ్లాదేశ్, యూరప్, ఇరాన్, ఇరాక్, పశ్చిమ ఆఫ్రికా, జపాన్ మరియు హాంకాంగ్‌లో షెహనాయ్ ప్రదర్శన ఇచ్చారు. బిస్మిల్లా ఖాన్ తన షెహనాయ్‌తో ప్రత్యేక బంధాన్ని ఏర్పర్చుకున్నారు మరియు భార్య మరణించిన తరువాత షెహనాయ్ ని "బేగం" అని ముద్దుగా పిలిచేవారు..
21ఆగస్టు 2006న, 90 సంవత్సరాల వయస్సులో, ఉస్తాద్
బిస్మిల్లా ఖాన్ గుండెపోటుతో తుది
శ్వాస విడిచారు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ కు భారత సైన్యం 21 గన్ సెల్యూట్ ఇచ్చింది. ఉస్తాద్ బిస్మిల్లా
ఖాన్ షెహనాయ్, వారితో పాటు సమాధిలో ఖననం
చేయబడినది. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ మరణ దినాన్ని జాతీయ సంతాప దినంగా పిలుస్తారు.
ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఘనమైన వారసత్వం కలవారు.
ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఎల్లప్పుడూ మన హృదయాలలో స్ఫూర్తిగా ఉంటారు, భారతీయ
శాస్త్రీయ సంగీతానికి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అందించిన సహకారం మరువలేనిది మరియు
భారతీయ శాస్త్రీయ సంగీతానికి ఒక గుర్తుగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు.
ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ మరణ వార్షికోత్సవం
సందర్భంగా, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం మరియు అందరు
గొప్ప నివాళులు అర్పిస్తారు మరియు భారతీయ
శాస్త్రీయ సంగీతానికి ఆయన చేసిన కృషికి చాలా కృతజ్ఞతలు తెలుపుతారు..
No comments:
Post a Comment