8 September 2021

షేక్ గులాబ్‌- ప్రముఖ బీహార్ స్వతంత్ర సమర యోధుడు. 1857-1920

 

 

 

షేక్ గులాబ్‌ను గుర్తు చేసుకోవడం చాలా ప్రత్యేకమైనది. ఈ నిజమైన దేశభక్తి గల రైతు నాయకుడు తన  దేశం కోసం  మాత్రమే కాకుండా దేశ ప్రజలు మరియు సమాజం కోసం కూడా తన చివరి శ్వాస వరకు పోరాడాడు.

మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ “మహాత్మాగాంధీ” అవ్వడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి పేరు షేక్ గులాబ్, కానీ అతను అజ్ఞాత వ్యక్తిగానే  పరిమితమయ్యాడు. తన జీవితాంతం రైతుల కోసం మరియు వారికి  న్యాయం కోసం పోరాడిన వ్యక్తి ప్రతిఫలంగా అణచివేత మరియు ఉదాసీనత మాత్రమే పొందాడు. షేక్ గులాబ్ చంపారన్ రైతుల బాధను ఒక ఉద్యమం గా ప్రారంభించాడు,

1905 లో బెంగాల్ విభజించబడింది, ప్రస్తుత బీహార్ ఆ సమయంలో బెంగాల్‌లో భాగం అని గమనించాలి.

 షేక్ గులాబ్ చంపారన్ రైతుల సమస్యలకు ప్రచారం కల్పించాడు. చంపారన్ సత్యాగ్రహం ద్వారా గాంధీకి గుర్తింపు వచ్చింది. కానీ షేక్ గులాబ్ యొక్క గుర్తింపు చరిత్ర పుటలలో ఖననం చేయబడింది.

 1857 లో చంపారన్‌లోని సాఠి పోలీసు స్టేషన్‌లోని చంద్‌బర్వ గ్రామంలో జన్మించిన షేక్ గులాబీ రైతు. సాధారణ విద్య మాత్రమె పొందాడు. కాని తెలివితేటలతో పదునుగా ఉన్నాడు మరియు బాల్యం నుండి అతని నరాలలో లో దేశభక్తి ప్రవహిస్తోంది.

గాంధీజీకి ముందు, 1905 నుండి, షేక్ గులాబ్ నాయకత్వంలో, చంపారన్ రైతులు బ్రిటిష్ ఇండిగో (అంటే బ్రిటిష్ భూస్వాములు) కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ పోరాటం లో చంపారన్ రైతులు తీవ్ర దురాగతాలకు గురయ్యారు. ప్లాంటర్స్ అసోసియేషన్ బీహార్ లైట్ హార్స్ Bihar Light Horse అని పిలువబడే వారి స్వంత సైన్యాన్ని కలిగి ఉంది, ఇది రైతులపై క్రూరత్వాలకు ప్రసిద్ధి చెందింది. అణచివేత చర్యల ద్వారా రైతుల పోరాటాలను అణచివేయడానికి బ్రిటిష్ వారు తమ వంతు ప్రయత్నం చేశారు.

 12 సెప్టెంబర్ 1907, షేక్ గులాబ్‌ను ఒక కేసులో అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసులో 162 మందిని శిక్షించబడినప్పటికీ జైలు లోపల బ్రిటిష్ వారు అత్యంత కిరాతకంగా షేక్ గులాబ్ ను హింసించారు అని అంటారు

 1907-08లో, సాఠి కోఠి రైతులు  నీలిమందు విత్తడం మానేశారు. చుట్టుపక్కల ప్రజలు కూడా ఒకరి తర్వాత ఒకరు నీలిమందు విత్తడం ఆపడం ప్రారంభించారు. షేక్ గులాబ్ సత్తి కోఠిలో నీలిమందు నాటడాన్ని ఆపడంలో పెద్ద పాత్ర పోషించారు. గులాబ్ తన 60 బిగ్హా భూమిలో నీలిమొక్కను నాటలేదు. అతని ఆదర్శం ప్రజల హృదయాలలో మరింత ధైర్యాన్ని మరియు ఉత్సాహాన్ని నింపింది. షేక్ గులాబ్ వ్యక్తిగతంగా భారీ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నప్పటికి  రైతుల  దృష్టిలో అతని ప్రతిష్ట బాగా పెరిగింది. అతన్ని తమ నిజమైన శ్రేయోభిలాషిగా పరిగణించడం ప్రారంభించాడు.

1909 లో, షేక్ గులాబ్ నాయకత్వంలో, రైతులందరూ ఏకమయ్యారు. రైతుల సంఘీభావానికి బ్రిటిష్ నీలి మందు వ్యాపారులు ఆశ్చర్యపోయాడు. షేక్ గులాబ్‌తో సహా రెండు వందల మందికి  సైనికులుగా  ఉద్యోగాలు ఇవ్వడానికి బ్రిటిష్ వారు ప్రలోభాలను ప్రారంభించారు. కాని రైతులు  కానిస్టేబుళ్లు కావడానికి పూర్తిగా నిరాకరించారు. ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఆందోళనకారులందరినీ ప్రభుత్వం విచారించింది. నాయకులందరినీ అరెస్టు చేశారు. రైతుల ఈ పోరాటం తరువాత స్వాతంత్ర్య పోరాటంగా వ్యాపించింది.

రైతుల నిరసన మరియు తిరుగుబాటు జ్వాలలు గ్రామం నుండి గ్రామానికి వ్యాపించడం ప్రారంభించాయి. సత్వారియాకు చెందిన రాజ్‌కుమార్ శుక్లా, సతి గ్రామానికి చెందిన షేక్ గులాబ్ మరియు మథియా గ్రామానికి చెందిన శీతల్ రాయ్ గ్రామ గ్రామానికి పాదయాత్ర చేయడం ప్రారంభించారు, నీలిమందు వ్యాపారుల నిరంకుశత్వాన్ని చేపట్టడానికి రైతులను మేల్కొలిపారు. షేక్ గులాబ్ నాయకత్వంలో, ముస్లిం రైతుల సమావేశం నిర్వహించి, నీలిమందు సాగును నిలిపివేశారు.

 నేడు చంపారన్ ప్రజలు షేక్ గులాబ్‌ను మర్చిపోయారు. నగరంలో అతని పేరు మీద 'గులాబ్ మెమోరియల్ కాలేజ్' ఉంది, కానీ ఇక్కడి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు షేక్ గులాబ్ త్యాగం గురించి తెలియదు.

గులాబ్ మెమోరియల్ కాలేజీ' వ్యవస్థాపకుడు మరియు షేక్ గులాబ్ మనుమలలో ఒకరైన ఫఖ్రే ఆలం, షేక్ గులాబ్‌కు సంబంధించి తాను అనేక లేఖలను ప్రభుత్వాలకు రాశానని చెప్పారు. అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కూడా ఈ విషయంలో అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఇంత జరిగినప్పటికీ, ఏ ప్రభుత్వం కూడా ఈ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడిని గుర్తుంచుకోలేదు.' అని అంటారు.

 షేక్ గులాబ్ వంటి వారిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే షేక్ గులాబ్ లేకుంటే, చంపారన్ సత్యాగ్రహం ఉండేది కాదు మరియు బహుశా గాంధీకి అంత పేరు వచ్చేది కాదు. గాంధీజీకి  ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు రావడానికి షేక్ గులాబ్ ప్రధాన కారకులు .

  ఆధారాలు:

1.www.heritagetimes.in

2.టు సర్కిల్స్ (హిందీ) లో మూలవ్యాస రచయిత న్యాయవాది పర్వేజ్ ఆలమ్, షేక్ గులాబ్ గారి మనవడు. వీరు  ప్రస్తుతం షేక్ గులాబ్‌పై పరిశోధన చేస్తున్నారు. వారు త్వరలో షేక్ గులాబ్ జీవితం పై ఒక పుస్తకాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు

 

 

 

 


 “/>

 

 

 

No comments:

Post a Comment