12 September 2021

1857 ప్రధమ భారత స్వాతంత్ర సంగ్రామo లో మర్చిపోయిన మహిళా యోధులు -అజీజున్ బాయి, అస్గరి బేగం, హబీబా The forgotten women Heroine’s of 1857- Azizun Bai, Asghari Begum, Habiba

 

బేగం హజ్రత్ మహల్ మరియు రాణి లక్ష్మీబాయి మాత్రమే కాదు, డజన్ల కొద్దీ మహిళలు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొన్నారు. వారి కథలు ఎక్కువగా రికార్డ్ చేయబడలేదు

బేగం హజ్రత్ మహల్Begum Hazrat Mahal:

తిరుగుబాటుకు ప్రధాన కారణం బ్రిటిష్ వారు అవధ్‌ను తమ రాజ్యం లో విలీనం చేయడం. తిరుగుబాటు ప్రారంభమైనప్పుడు, బేగం హజ్రత్ మహల్ అవధ్‌ను రీజెంట్‌గా పరిపాలించింది మరియు తన అనుచరులను బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా నడిపించింది. బేగం హజ్రత్ మహల్ బ్రిటిష్ వారికి సుదీర్ఘమైన ప్రతిఘటన ఇచ్చింది. బేగం హజ్రత్ మహల్ అతిపెద్ద తిరుగుబాటుదారుల సైన్యానికి ఆధిపత్యం వహించినది మరియు బ్రిటీష్ వారి తో సంధి ప్రయత్నాలను తిరస్కరించినది. బ్రిటిష్ ఆధిపత్యంలో తన భర్తకు రాజ్యాన్ని తిరిగి ఇవ్వడానికి కూడా తిరస్కరించినది.  బేగం హజ్రత్ మహల్ పూర్తి స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే ఉంది. తిరుగుబాటును  బ్రిటిష్ వారు అణిచివేసినప్పుడు బేగం హజ్రత్ మహల్ నేపాల్‌లో ఆశ్రయం పొందింది మరియు  అక్కడే  1879 లో మరణించింది.

 అజీజున్ బాయిAzizun Bai:

మొదటి స్వాతంత్ర యుద్ద అత్యంత మనోహరమైన కథలలో ఒకటి కాన్పూర్ యొక్క వేశ్య అజీజున్ బాయి కథ. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నానా సాహిబ్ మరియు తాత్యా తోపే దళాల మధ్య కాన్పూర్ లో  భీకర యుద్ధాలు జరిగాయి.

కాన్పూర్ యుద్ధాలలో అజీజున్ పాత్ర గురించి వలస మరియు భారతీయ చరిత్రకారులు పేర్కొన్నారు. తిరుగుబాటులో పాల్గొన్న అనేక మంది మహిళలకు భిన్నంగా ఆమె నానా సాహిబ్ నుండి ప్రేరణ పొందింది.

కాన్పూర్ ప్రజలలో ఆమె జ్ఞాపకం ఇప్పటికీ సజీవంగా ఉంది. ఆమె లక్ష్మీబాయి లాగా  పురుషుల వస్త్రధారణ ధరించి, సైనికులతో గుర్రంపై స్వారీ చేసింది పిస్టల్‌ల బ్రేస్‌తో సాయుదంగా ఉండేది.  నానా సాహిబ్ ప్రారంభ విజయాన్ని పురస్కరించుకుని కాన్పూర్‌లో జెండా ఎగురవేసిన రోజు ఆమె ఊరేగింపులో పాల్గొంది.

కాన్పూర్‌లో నియమించబడిన 2వ అశ్వికదళం యొక్క సిపాయిలకు  అజీజున్ చాలా ఇష్టమైన వ్యక్తి అని మరియు ముఖ్యంగా సైనికులలో ఒకరైన షంషుద్దీన్‌ ఆమెకు  సన్నిహితుడని లతా సింగ్ తన "మార్జిన్ 'విజిబుల్" అనే వ్యాసంలో రాశారు. ఆమె ఇల్లు సిపాయిల సమావేశ ప్రదేశం. ఆమె మహిళల సమూహాన్ని కూడా ఏర్పాటు చేసింది, వారు పురుష  పురుషులను ఉత్సాహపరిచేవారు. వారి గాయాలకు కట్టుకట్టేవారు మరియు వారికి ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని పంపిణీ చేసేవారు.. ఈ పని కోసం ఆమె గన్ బ్యాటరీలలో ఒకదాన్ని తన ప్రధాన కార్యాలయంగా చేసింది. కాన్పూర్ ముట్టడి మొత్తం కాలంలో, ఆమె తన స్నేహితులుగా భావించే సైనికులతో ఉంది, మరియు ఆమె ఎప్పుడూ పిస్టల్ వంటి  ఆయుధాలు కలిగి ఉండేది.

అస్గరి బేగం Asghari Begum:

అస్గారి బేగం గురించి పెద్దగా తెలియదు. కొన్ని వివరాల ప్రకారం, ఆమె 1811 లో జన్మించింది, మరియు తిరుగుబాటు సమయంలో ఆమె వయస్సు 45 సంవత్సరాలు. ప్రస్తుత పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో బ్రిటిష్ వారితో పోరాడడంలో ఆమె ముఖ్యమైన పాత్ర పోషించిందని అంటారు. చివరికి 1858 లో ఆమె బ్రిటిష్ వారిచే బంధించబడింది మరియు సజీవ దహనం చేయబడింది

హబీబాHabiba:

 ముస్లిం గుజ్జర్ కుటుంబానికి చెందిన హబీబా అనే మహిళ ముజఫర్‌నగర్ ప్రాంతంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా అనేక యుద్ధాల్లో పోరాడింది. బ్రిటిష్ వారు గెలిచినప్పుడు, ఆమెతో పాటు 11 మంది మహిళా తిరుగుబాటుదారులను ఉరితీశారు. ఆ సమయంలో ఆమె వయస్సు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే.

తిరుగుబాటు చేసిన మహిళల ఇతర పేర్లు ఝాన్సీ కి చెందిన రాణి లక్ష్మీబాయి, రామ్‌గఢ్‌కు చెందిన రాణి అవంతిబాయ్ లోధి, రాణి జిందన్ కౌర్, జల్కారిబాయి, ఉదా దేవి, ఆశా దేవి, భక్తవారి, భగవతి దేవి త్యాగి, ఇంద్ర కౌర్, జమీలా ఖాన్, మన్ కౌర్, రహీమి, రాజ్ కౌర్ , శోభా దేవి, ఉమ్దా

.వీటిలో కొన్ని పేర్లు మాత్రమే, మరియు వాటి గురించి చాలా ఎక్కువ వివరాలు తెలియదు. 1857 నాటి ఈ ధైర్య స్వాతంత్ర్య సమరయోధుల గురించి పెద్దగా వ్రాయబడలేదు మరియు వారిపై వివరాలు తక్కువగా ఉన్నాయి. కానీ షంసుల్ ఇస్లాం యొక్క వ్యాసం హిందూ-ముస్లిం ఐక్యత: భారతదేశపు మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో సాధారణ ప్రజలు మరియు మహిళల భాగస్వామ్యం’, లో చాలా మంది మహిళల పేర్లను ప్రస్తావించింది.

ఈ ధైర్యవంతులైన మహిళలను భారతదేశం గుర్తుపెట్టుకుని, వందనం చేయాల్సిన సమయం వచ్చింది.

 

-ది మిల్లీ గెజిట్ 31 అక్టోబర్ 2016సౌజన్యం తో 

No comments:

Post a Comment