షేక్ ముషీర్ హుస్సేన్ కిద్వాయ్ (1878-1937)
ఒక
ఇస్లామిక్ పండితుడు, రచయిత, న్యాయవాది,
రాజకీయవేత్త
మరియు స్వాతంత్ర్య సమరయోధుడు. ఆగస్టు 17, 1878న,
జిల్లా
బారాబంకి (UP)లోని గాడియాలో జన్మించిన షేక్ ముషీర్
హుస్సేన్ కిద్వాయ్ అవధ్ (UP)లోని గాడియాలోని
జమీందార్ కుటుంబం నుండి వచ్చాడు.
షేక్ ముషీర్ హుస్సేన్ కిద్వాయ్ లక్నోలో
విద్యాభ్యాసం పూర్తి చేసిన తరువాత, ఇంగ్లాండ్‌కు వెళ్ళి బార్
పరీక్షలో ఉత్తీర్ణత సాధించి. 1921లో అలహాబాద్
హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించాడు మరియు బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్‌కు
సలహాదారు అయ్యాడు మరియు లక్నో బెంచ్‌లో సీనియర్ న్యాయమూర్తిగా కూడా పనిచేశాడు.
షేక్ ముషీర్ హుస్సేన్ కిద్వాయ్ ఖిలాఫత్ మరియు సహాయ నిరాకరణ
ఉద్యమం యొక్క చురుకైన నాయకులలో ఒకడు మరియు పాన్ ఇస్లామిక్ సొసైటీ యొక్క శాఖ అయిన ‘అంజుమన్-ఎ-ఇస్లాం లండన్’ యొక్క జాయింట్ సెక్రటరీ
1913
ప్రారంభంలో, షేక్ ముషీర్ హుస్సేన్ కిద్వాయ్, మౌలానా
అబ్దుల్ బారీ ఫిరంగి మహలీతో కలిసి హరమైన్ షరీఫైన్ Haramain
Sharifain రక్షణ కోసం ఒక సొసైటీ స్థాపన కోసం ఒక పథకాన్ని రూపొందించాడు,
తద్వారా
ఈ పవిత్ర స్థలాలు మొదటి ప్రపంచ యుద్ధంలో ముస్లిమేతరులచే దాడి చేయబడవు. ఈ పథకం
మొదటిసారిగా 30 ఏప్రిల్ 1913న
మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క ‘అల్-హిలాల్’లో
ప్రచురించబడింది. దీనికి సంబంధించి, మౌలానా అబ్దుల్ బారీ
మరియు అతని సహచరులు మే 6, 1913న "అంజుమన్ ఖుద్దాం-ఎ-కాబాAnjuman
Khuddam-e-Kaaba" ని స్థాపించారు, దానికి ముషీర్ హుస్సేన్ కిద్వాయ్ కార్యదర్శిగా
వ్యవరించారు.
షేక్ ముషీర్ హుస్సేన్ కిద్వాయ్ "ఫ్యూచర్
ఆఫ్ ముస్లిం స్టేట్" అనే కరపత్రాన్ని వ్రాశాడు, దీనిని
1921లో
సెంట్రల్ ఇస్లామిక్ సొసైటీ ఆఫ్ లండన్ ప్రచురించింది, అందులో
టర్కీ దోపిడీ మరియు విచ్ఛిన్నం ముస్లిం ప్రపంచాన్ని నాశనం చేస్తుందని రాశాడు. షేక్
ముషీర్ హుస్సేన్ కిద్వాయ్ లండన్‌లో ఒక మ్యానిఫెస్టోను కూడా ప్రచురించాడు
మరియు టర్కీకి మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేసినాడు..
టర్కీని ముక్కలు చేసే కుట్ర నేపథ్యంలో టర్కీ
కి మద్దతుగా మార్చి 1920లో,
షేక్
ముషీర్ హుస్సేన్ కిద్వాయ్, మౌలానా అబ్దుల్ బారీ, మౌలానా
ఆజాద్ మరియు మౌలానా షౌకత్ అలీలతో కలిసి ఒక మ్యానిఫెస్టోపై సంతకం చేశాడు,.
మే 1920లో
ఫైజాబాద్‌లో జరిగిన ‘అవధ్ ఖిలాఫత్
కాంగ్రెస్’కు షేక్ ముషీర్ హుస్సేన్ కిద్వాయ్ అధ్యక్షత
వహించారు. పాన్-ఇస్లామిక్ ఉద్యమానికి షేక్ ముషీర్ హుస్సేన్ కిద్వాయ్ చేసిన విశిష్ట
సహకారానికి గాను సుల్తాన్ అబ్దుల్ హమీద్ II
చేత
‘ఆర్డర్
ఆఫ్ ఉస్మానియా’బిరుదు పొందినాడు.
డిసెంబరు 1921లో
ముస్లిం లీగ్ ఏర్పాటు చేసిన ‘మోప్లా తిరుగుబాటు
యొక్క కారణాలు మరియు సంఘటనల’పై విచారణ కమిషన్
సభ్యుడు అయిన షేక్ ముషీర్ హుస్సేన్ కిద్వాయ్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ సభ్యుడు.
మే 1926లో,
షేక్
ముషీర్ హుస్సేన్ కిద్వాయ్ భారతదేశానికి రాజ్యాంగం కోసం ఒక పథకాన్ని
రూపొందించడానికి ముస్లింలీగ్ ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యుడు కూడా
షేక్ ముషీర్ హుస్సేన్ కిద్వాయ్ జూలై 20,
1930న
లక్నోలో జరిగిన నేషనలిస్ట్ ముస్లిం కాన్ఫరెన్స్‌లో విశిష్ట ప్రతినిధిగా
పాల్గొన్నాడు. షేక్ ముషీర్ హుస్సేన్ కిద్వాయ్ అతను నాలుగుసార్లు (1924,
1930, 1935 మరియు 1936) సెంట్రల్
లెజిస్లేటివ్ అసెంబ్లీకి సభ్యుడు మరియు ప్రతిసారీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు..
షేక్ ముషీర్ హుస్సేన్ కిద్వాయ్ ఆంగ్లం
మరియు ఉర్దూ రెండింటిలోనూ సఫలవంతమైన రాజకీయ రచయిత, మరియు
‘ఇస్లాం,
ఖిలాఫత్,
సోషలిజం
మరియు ఉపఖండ రాజకీయాల’పై షేక్ ముషీర్
హుస్సేన్ కిద్వాయ్ రాసిన వ్యాసాలు ఆ సమయంలో అనేక ఆంగ్ల మరియు ఉర్దూ పత్రికలలో
వచ్చాయి. షేక్ ముషీర్ హుస్సేన్ కిద్వాయ్ ‘ఇస్లాం,
ఖిలాఫత్
మరియు రాజకీయాల’పై అనేక పుస్తకాలను కూడా రచించాడు.
వాటిలో కొన్ని:
1. స్వరాజ్యం
మరియు దానిని ఎలా పొందాలి Swaraj
and How to obtain it
2. పాన్-ఇస్లామిజం మరియు బోల్షెవిజం Pan-Islamism and Bolshevism
3. ఇస్లాం మరియు సోషలిజం Islam and Socialism
4. ఇస్లాం మరియు స్త్రీ Islam and Woman
5. తలీమ్-ఇ నిస్వాన్ Taleem-e Niswan
6. దునియా కే తీన్ షోహదే సలాసా. Duniya ke teen shohdae Salasa
షేక్ ముషీర్ హుస్సేన్ కిద్వాయ్ 1937
డిసెంబర్
27న
తన తుదిశ్వాస విడిచారు.
No comments:
Post a Comment