3 November 2024

తెలంగాణలో దాదాపు అన్ని రంగాలలో ముస్లింల ప్రాతినిద్యం చాలా తక్కువగా ఉంది Telangana Has Abysmally Low Muslim Presence in Almost All Sectors

 




 


న్యూఢిల్లీ -

 

కొత్త పుస్తకం ముస్లింలు ఇన్ ఇండియా గ్రౌండ్ రియాలిటీస్ వర్సెస్ ఫేక్ నేరేటివ్స్ అచీవ్‌మెంట్స్ & అకాప్లిష్‌మెంట్స్ లో  పొందుపరచిన వివరాల ప్రకారం భారతదేశంలోని 29 రాష్ట్రాలలో అతి పిన్న వయస్కు మరియు దేశంలో 11వ అతిపెద్ద రాష్ట్రమైన తెలంగాణ, దేశంలో 12వ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం గా  ఉన్నది.

అయితే తెలంగాణ లోని ప్రభుత్వ విభాగాలు మరియు సంస్థలలో ముస్లిం ఉద్యోగుల యొక్క ప్రాతినిధ్య౦ అత్యల్ప౦గా ఉన్నది.  

2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణా జనాభాలో ముస్లిములు గణనీయమైన 12.68 శాతం ఉన్నప్పటికీ, అనేక సామాజిక-ఆర్థిక డొమైన్‌లలో తగిన ప్రాతినిధ్యం పొందడంలో విఫలం చెందారు. .

 

·       గత రెండు క్యాబినెట్లలో ముస్లిం ఉండగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ముస్లిం మంత్రి లేరు.

·       2014 నుండి 2018 వరకు తెలంగాణ రాష్ట్ర మొదటి ఉప ముఖ్యమంత్రి ముస్లిం,

·       2023 వరకు TRS/BRS ప్రభుత్వంలో హోం, జైళ్లు, అగ్నిమాపక సేవలు, రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్లు, రిలీఫ్ మరియు పునరావాసం మరియు అర్బన్ ల్యాండ్ సీలింగ్ వంటి శాఖలను ముస్లిములు  నిర్వహించారు.

·       2001లో తెలంగాణ రాష్ట్ర జనాభాలో 12.43 శాతం మంది ముస్లింలు ఉండగా, 2011 నాటికి ఆ సంఖ్య 12.68 శాతానికి పెరిగింది.

·       తెలంగాణ రాష్ట్రంలోని ముస్లిం జనాభాలో 75 నుంచి 80 శాతం మంది వెనుకబడిన తరగతుల (బీసీ) వర్గాలు ఉన్నారు.

·       తెలంగాణలోని మొత్తం 4.465 మిలియన్ల ముస్లింలలో, ఒక్క హైదరాబాద్ జిల్లాలో 1.713 మిలియన్లు ముస్లిములు ఉన్నారు.

·       హైదరాబాద్ జిల్లాలోని ముస్లిములు  మొత్తం తెలంగాణా  రాష్ట్రంలోని ముస్లిం జనాభాలో 43.5 శాతం కు సమానం,

·       ముస్లిం జనాభాలో 33 శాతం మంది 14 ఏళ్లలోపు వారు.


·       ప్రభుత్వ స్థానాల్లో ముస్లింల ప్రాతినిధ్యం representation of Muslims in governmental positions 1950లో దాదాపు 40 శాతం ఉండగా అది 2010లో ఐదు శాతానికి పడిపోయింది.

·       హైదరాబాద్ జిల్లాలో 43.5 శాతం మంది ముస్లిములు ఉన్నారు.

·       రంగా రెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్, నిజామాబాద్ మరియు కరీంనగర్ జిల్లాలలో ముస్లింలు ఎన్నికల ఫలితాలలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నారు

·       కనీసం 40 శాతం అసెంబ్లీ నియోజకవర్గాలలో ఫలితాలను ముస్లిములు ప్రభావితం చేస్తారు.

·       తెలంగాణ ప్రభుత్వం 2016లో ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జి సుధీర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల విచారణ కమిషన్ ముస్లిం సమాజం యొక్క సామాజిక-ఆర్థిక పరిస్థితులపై దర్యాప్తు చేసింది.

·       సుధీర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల విచారణ కమిషన్ బ్యూరోక్రసీలో ముస్లింలకు తక్కువ ప్రాతినిధ్యం మరియు ఆర్థిక మరియు సామాజిక వేదికలలో వారి పరిమిత భాగస్వామ్యాన్ని హైలైట్ చేసింది.

·       తెలంగాణ ప్రభుత్వంలోని 23 శాఖల్లో ముస్లిం ఉద్యోగుల ప్రాతినిధ్యం దాదాపు 7.36 శాతంగా ఉందని, ఇది దాదాపు 13 శాతంగా ఉన్న సమాజ జనాభాకు పూర్తి భిన్నంగా ఉందని కమిషన్‌ గమనించింది.

·       విద్య, ఆరోగ్యం, ఆర్థికం, వ్యవస్థాపకత మరియు క్రెడిట్ లభ్యతలో సమాజాన్ని చేర్చడం కోసం కార్యక్రమాలు మరియు పథకాలను కమిషన్ సిఫార్సు చేసింది.

·       ప్రస్తుతం, ముస్లిం సమాజంలోని 16 శాతం మంది వ్యక్తులు ఎప్పుడు  ఏ విద్యా సంస్థకు హాజరు కాలేదు.

·       లింగాల మధ్య అసమానతతో ముస్లిం సమాజంలో డ్రాప్ అవుట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి.

·       డేటా ప్రకారం, 18-20 మరియు 21-29 మధ్య వయస్సు గల పురుషులలో డ్రాపౌట్ల శాతం వరుసగా 31.6 శాతం మరియు 81.5 శాతం గా ఉంది.ఉంది.

·         18-20 మరియు 21-29 మధ్య వయస్సు గల స్త్రీలలో  డ్రాపౌట్ల శాతం వరుసగా 71.5 శాతం మరియు 52.8 శాతం గా ఉంది.

 

·       2023లో స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో, 69 మంది అధికారులలో ఒకరు ముస్లిం, 105 స్టేట్ పోలీస్ సర్వీస్ అధికారులలో ముగ్గురు ముస్లింలు


·       పోలీసు శాఖలలో, పోలీసు సూపరింటెండెంట్లు (ఎస్పీలు) మరియు అదనపు ఎస్పీల సంఖ్య 42 మంది ఉన్నారు, అందులో ఒకరు ముస్లిం.

·       సబ్-డివిజనల్ పోలీసు అధికారులు (SDPOలు) మరియు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSPలు) సంఖ్య 65, వీరిలో ఇద్దరు ముస్లింలు.

·       లా అండ్ ఆర్డర్, క్రైమ్ విభాగాల్లో 667 మంది ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు ఉండగా అందులో 36 మంది మాత్రమే ముస్లిం వర్గానికి చెందిన వారు

 

·       తెలంగాణలోని స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో, 525 మంది అధికారులలో 23 మంది ముస్లింలు కాగా, 155 స్టేట్ పోలీస్ సర్వీస్‌లలో ఆరుగురు ముస్లిం సమాజానికి చెందినవారు.

·       లేబర్ డిపార్ట్‌మెంట్‌లోని ముస్లిం అధికారులు (ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్‌లు, డిప్యూటీ మరియు అసిస్టెంట్ డైరెక్టర్‌లతో సహా) మొత్తం 154 మందిలో 15 మంది ఉన్నారు.

·       స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో, ఉన్నత అధికారులు 29 మంది లో ఒక్క ముస్లిం కూడా లేరు.

·       804 మంది రిటైనర్ లాయర్లలో 45 మంది ముస్లింలు.

·       వాణిజ్య పన్నుల శాఖ నిర్వహణ బృందం Management Team మొత్తం సంఖ్య 248 కాగా వారిలో ఇద్దరు ముస్లింలు ఉన్నారు,

·       85 మంది డ్రగ్ కంట్రోల్ మరియు ఇన్‌స్పెక్షన్ అధికారులలో, రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు ముస్లింలు కలరు..

·       తెలంగాణలో గత దశాబ్ద కాలంలో ఏ ముస్లిం కూడా ప్రాసిక్యూషన్ హెడ్ మరియు అడ్వకేట్ జనరల్ (ఏజీ) కాలేదు.

·       తెలంగాణ ఐదుగురు ప్రధాన న్యాయమూర్తులలో  ఒకరు కూడా ముస్లిం లేరు అలాగే 35 మంది న్యాయమూర్తులలో అసలు ముస్లిం కమ్యూనిటీ కి ప్రాతినిధ్యం లేదు.

·       468 మంది అదనపు ఏజీలు మరియు ప్రభుత్వ ప్లీడర్లలో పద్నాలుగు మంది ముస్లింలు

·       193 జిల్లా ప్రాసిక్యూటింగ్ అధికారులలో 10 మంది ముస్లింలు.

·       ఎక్సైజ్/ప్రోహిబిషన్ డిపార్ట్‌మెంట్ నిర్వహణ మరియు తనిఖీ బృందాలలో, మొత్తం 15 మందిలో ఒకరు మాత్రమే ముస్లిం.

·       హైదరాబాద్ L&T మెట్రో రైల్‌లోని 69 మంది సీనియర్ మేనేజ్‌మెంట్ టీమ్ సభ్యులలో ఇద్దరు ముస్లింలు.

·       పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD)లో 671 మందిలో ముస్లిం అధికారులు ఒక సూపరింటెండింగ్ ఇంజనీర్‌తో సహా 39 మంది ఉన్నారు 

·       రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్‌టీసీ)లో మొత్తం 240 మంది అధికారులుండగా కేవలం ఎనిమిది మంది మాత్రమే ముస్లిములు  ఉన్నారు.

·       అటవీ శాఖ సీనియర్ మేనేజ్‌మెంట్ బృందంలో 290 మంది అధికారుల్లో ముస్లింలు లేరు.


·       తెలంగాణలోని 164 మంది ఐఏఎస్‌లలో తొమ్మిది మంది ముస్లింలు. తెలంగాణలోని 123 మందిలో ముగ్గురు ముస్లింలు ఐపీఎస్‌లుగా  ఉన్నారు.

·       రాష్ట్ర పోలీసు దళంలో అమరులైన 331 మందిలో 60 మంది ముస్లింలు.

·       తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఇద్దరు చైర్మన్‌లు ఉండగా వారిలో ముస్లింలు లేరు,

·       తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌17 మంది సభ్యులలో ఒకరు ముస్లిం.

·       2009 మరియు 2022 మధ్య రాష్ట్ర వైద్య మండలిలో నమోదైన వైద్యుల సంఖ్య 7,968 కాగా, వారిలో 1,525 మంది ముస్లింలు ఉన్నారు.

·       చట్టబద్ధమైన తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్‌లోని 29 మంది సభ్యుల్లో కేవలం ఇద్దరు ముస్లింలు మాత్రమే సభ్యులుగా ఉన్నారు.

·       423 మంది జిల్లా మరియు సెషన్ జడ్జీలు/సీనియర్ సివిల్ జడ్జీలు/జూనియర్ సివిల్ జడ్జీలలో 17 మంది ముస్లింలు.

·       హైదరాబాద్‌లో, సిటీ సివిల్ కోర్టు, సిటీ స్మాల్ కాజెస్ కోర్టు, మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు, సీబీఐ కోర్టు మరియు ఇంటిగ్రేటెడ్ ఫ్యామిలీ కోర్టులలో మొత్తం 82 మంది న్యాయమూర్తులు ఉండగా అందులో ఏడుగురు ముస్లింలు ఉన్నారు.

·       జనవరి 2024 నాటికి జిల్లాల్లోని అన్ని శాఖల మొత్తం 8,813 మంది అధికారుల్లో 502 మంది ముస్లిం వర్గానికి చెందినవారు. ఈ సంఖ్యలో కలెక్టర్లు మరియు విభాగాధిపతులు, RDOలు మరియు DRDOలు ఉన్నారు మరియు SPలు మినహా పోలీసు అధికారులను మినహాయించారు.

·       తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల 282 మంది ప్రిన్సిపాల్స్‌లో 15 మంది ముస్లింలు.

·       138 తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన మరియు అగ్నిమాపక సేవల విభాగం స్టేషన్ ఫైర్ ఆఫీసర్లలో ఏడుగురు ముస్లింలు.

·       56 జిల్లా ఫైర్ ఆఫీసర్లలో ఇద్దరు మాత్రమే ముస్లింలు.

·       మీ సేవా అధీకృత కేంద్రాల ఏజెంట్ల విషయానికి వస్తే, 4,525 మందిలో 455 మంది ముస్లింలు.

·       తెలంగాణలోని మున్సిపల్ కార్పొరేషన్లలో పనిచేస్తున్న 1,463 మందిలో 126 మంది అధికారులు ముస్లింలు

·       అదేవిధంగా, రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో  (టాప్ మేనేజ్‌మెంట్) 274లో ముస్లింలు27

·       1,053 (విద్యావేత్తలు)లో 70 మంది మరియు పరిపాలనలో 644 మందిలో 24 మంది ముస్లిములు  ఉన్నారు.

·       నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) ప్రకారం తెలంగాణ ఖైదీలలో ముస్లింల వాటా 21.7 శాతంతో దేశంలోనే మూడో స్థానంలో ఉంది.

 

By:Clarion India. Date:November 3, 2024

సోర్స్: ది క్లారియన్ ఇండియా, నవంబర్, 3, 2024

No comments:

Post a Comment