బెల్గాం, కర్నాటక:
మున్షీ మజహర్ అలీ బెల్గాం యొక్క
స్వాతంత్ర్య సమరయోధుడు. మజహర్ అలీ
బెల్గాంలోని శనివార్ ఖూట్,
కచేరి
రోడ్‌లోని హెస్కామ్ కౌంటర్ సమీపంలో నివసించాడు.
మజహర్ అలీ బ్రిటిష్ సైన్యపు బెల్గాం రెజిమెంట్‌లో బట్లర్‌గా ఉండేవాడు మరియు
వహాబీ ముస్లిం. వహాబీ ఉద్యమం భారతదేశంలో
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగింది మరియు 1857 మొదటి స్వాతంత్ర్య యుద్ధంలో ముఖ్యమైన పాత్ర
పోషించింది.
బెల్గాం గెజిట్ (పేజీ 133) ప్రకారం "బెల్గాంలోని
సైన్యంలోని ఒక వహాబీ ముస్లిం మున్షీ మజహర్ అలీ, ఇతరులను తిరుగుబాటుకు ప్రేరేపించి, అందుకు శిక్షగా ఆజీవితాంతం
కారాగార శిక్ష కు గురికాబడినాడు."
అని సూచిస్తుంది.
మున్షీ మజహర్ అలీ "రేష్మీ
రుమాల్ ఉద్యమం"లో పాల్గొన్నాడు మరియు బ్రిటిష్ వారిచే అరెస్టు చేయబడ్డాడు.
వేలాది మంది సమక్షంలో రేస్‌కోర్సు మైదానంలో ఉరిశిక్షకు గురయ్యాడు.
బెల్గాం నగర కార్పొరేషన్ కచేరి
రోడ్డు పేరును "మున్షీ మజహర్ అలీ రోడ్"గా పెట్టింది..
No comments:
Post a Comment