భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్ యొక్క పెద్ద కుమార్తె అబిదా సుల్తాన్ సాధారణ యువరాణి లాంటిది కాదు, అబిదా సుల్తాన్ తన జుట్టును పొట్టిగా కత్తిరించి, పులులను వేటాదేది, మరియు గొప్ప మార్క్స్ మాన్, నిష్ణాతుడైన పోలో ప్లేయర్ .అబిదా సుల్తాన్ తొమ్మిదేళ్ల వయస్సు నుండి రోల్స్ రాయిస్ కారులను, విమాలను స్వయంగా నడిపింది.
బ్రిటిష్ ఇండియాలోని ఉత్తర రాచరిక రాష్ట్రమైన భోపాల్‌ను ఒక శతాబ్దానికి పైగా పాలించిన ధైర్యవంతులైన 'బేగమ్స్' (ఉన్నత హోదా కలిగిన ముస్లిం మహిళ) కుటుంబంలో 1913లో జన్మించిన అబిదాసుల్తాన్ పర్దాలో ఉండలేదు మరియు 15 సంవత్సరాల వయస్సులో సింహాసనానికి వారసురాలు అయ్యారు.
అబిదాసుల్తాన్ ఒక దశాబ్దానికి పైగా తన తండ్రి(నవాబు హమీదుల్లా ఖాన్) క్యాబినెట్‌ను నడిపింది.భోపాల్ పాలకుడైన సుల్తాన్ జెహాన్ (అబిదా అమ్మమ్మ) మార్గదర్శకత్వంలో అబిదాసుల్తాన్ చిన్నప్పటి నుండి పాలకునిగా తీర్చిదిద్దబడింది.
భోపాల్ సింహాసనానికి వారసుడు, అయిన అబిదాసుల్తాన్ పొరుగు రాచరిక రాష్ట్రమైన కుర్వాయి మరియు పాలకుడు కుర్వాయితో వివాహం చేసుకుంది. కాని వివాహం ఎక్కువకాలం కొనసాగలేదు. ఒక దశాబ్దం కంటే తక్కువ కాలం కొనసాగింది. వివాహం విడిపోయిన తరువాత, అబిదాసుల్తాన్ కుర్వాయిలోని తన వివాహిత ఇంటిని విడిచిపెట్టి తిరిగి భోపాల్‌కు వెళ్లింది. అబిదా ఏకైక కుమారుడు షహర్యార్ మహ్మద్ ఖాన్ కస్టడీ పొందినది. సింహాసనానికి వారసుడిగా తన విధులను నిర్వర్తిస్తూనే అబిదా సుల్తాన్ తన కొడుకును ఒంటరి తల్లిగా పెంచింది.
అబిదాసుల్తాన్ భోపాల్ రాజ్య మంత్రివర్గాన్ని 1935 నుండి 1949 వరకు భారతదేశంలోని మధ్యప్రదేశ్‌లో విలీనం చేసే వరకు నడిపింది.భారతదేశ భవిష్యత్తు ప్రభుత్వాన్ని నిర్ణయించడానికి బ్రిటిష్ ప్రభుత్వం పిలిచిన రౌండ్ టేబుల్ సమావేశాలకు అబిదాసుల్తాన్ కూడా హాజరయ్యారు. ఈ సమయంలో అబిదాసుల్తాన్ మహాత్మా గాంధీ, మోతీలాల్ నెహ్రూ మరియు భారతదేశం యొక్క మొదటి ప్రధాన మంత్రిజవహర్‌లాల్ నెహ్రూ వంటి ప్రభావవంతమైన నాయకులను కలిశారు.
హిందువులు మరియు ముస్లింల మధ్య క్షీణిస్తున్న సంబంధాలు మరియు 1947లో భారతదేశ విభజన తర్వాత చెలరేగిన హింసను అబిదాసుల్తాన్ ప్రత్యక్షంగా అనుభవించింది.
అబిదాసుల్తాన్1950లో పాకిస్థాన్‌కు వలస వెళ్లింది. పాకిస్తాన్‌లో, అబిదాసుల్తాన్ తన రాజకీయ జీవితం ద్వారా ప్రజాస్వామ్యం మరియు మహిళల హక్కుల కోసం పోరాడారు. అబిదాసుల్తాన్2002లో కరాచీలో మరణించింది.
అబిదాసుల్తాన్ పాకిస్థాన్ వెళ్లిన తర్వాత, భారత ప్రభుత్వం అబిదా సోదరిని సింహాసనానికి వారసునిగా చేసింది. కానీ అబిదాసుల్తాన్ ఇప్పటికీ భోపాల్‌లో, 'బియా హుజూర్' అనే మారుపేరుతో ప్రసిద్ధి చెందింది
No comments:
Post a Comment