22 March 2014

2009-14 మద్యకాలం లో 15 వ లోక్ సభ విధి నిర్వహణ తీరుతెన్నులు


:

2009-14 సంవత్సరాల మద్య కాలం లో 15వ లోక సభ తన పదవి కాలాన్ని  ప్రధాన విధి ఐన బిల్లుల ఆమోదం కన్నాతరచూ సభ కార్యక్రమాలకు అంతరాయం కలగటం తోనే ముగించినది.15వ  లోక్ సభ విధినిర్వహణకు అంతరాయం కలిగించిన అంశాలలో 2జి స్కామ్,బొగ్గు క్షేత్రాల కేటాయింపు, రిటైల్ రంగంలో ఎఫ్‌డి‌ఐ లకు అనుమతి,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం మొదలగు నవి ముఖ్యమైనవి. 15వ లోక్ సభ, మునుపటి  లోక్ సభలు ఆమోదించిన బిల్లులకన్నా తక్కువ బిల్లులను ఆమోదించినప్పటికి ఆమోదించిన బిల్లులలో విద్యా హక్కు (ఆర్‌ఈ‌ఏ)భూ సేకరణ ,ఆహార భద్రత, కంపనీబిల్లు  మరియు సివిల్ లియాబిలిటీ ఫర్ న్యూక్లియర్ డామేజ్ బిల్లులు ముఖ్యమైనవిగా చెప్పవచ్చును.

2009-14 మద్యకాలం లో  15 వ లోక్ సభ 
విధి నిర్వ
హణ -తీరుతెన్నులు- ఒక విశ్లేషణ

Ø  గత 5సంవత్సరాల కాలం లో (2009-14) 15వ లోక్ సభ ఉత్పాదకత 61% గా ఉంది. ఇది లోక్ సభ గత 50సంవత్సరాల చరిత్రలో అత్యంత కనిష్టం. 13వ లోక్ సభ 91% ఉత్పాదకతను, 14 వ లోక్ సభ 87% ఉత్పాదకతను కలిగి ఉంది.
Ø  15వ లోక్ సభ తన నిర్ధారిత 356 సిట్టింగ్స్ లో 345 సిట్టింగ్స్ పూర్తి చేసింది
Ø  2009 బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్ సభ 162 గంటలు పనిచేసింది నిర్ధారిత సమయం కన్నా 4 గంటలు అదనంగా పనిచేసినది.
Ø  మొత్తం 15వ  లోక్ సభ  నిర్ధారిత 2070 పని గంటలలో 1330.9 గంటల ఉత్పాదక పనిగంటల పని  జరిగినది. కొన్ని సమావేశాలు తుడుచిపెట్టుకొని పోయినాయి.2010 శీతాకాల సమావేశాలలో నిర్ధారిత 138 గంటలలో 7.62గంటల ఉత్పాదక పని జరిగింది. 2012 వర్షా కాల సమావేశాలలో 21%, 2013 బుడ్జెట్ సమావేశాలలో 49% ఉత్పాదక పని జరిగింది.
Ø  15వ లోక్ సభ కాలం లో రాజ్య సభ 67% ఉత్పాదకతను సాదించినది. రాజ్య సభ నిర్ధారిత 1785 గంటలలో 1198.38 గంటలు ఉత్పాదక పని జరిగింది.  2010రాజ్య సభ శీతాకాల సమావేశాలలో కేవలం 2% ఉత్పాదక పని జరిగింది
Ø  15 వ లోక్ సభ మొదటి 5 సమావేశాలు సగటున 81% విధులను  నిర్వహించగా, 2010 శీతాకాల సమావేశాల తరువాత(2జి స్పెక్ట్రమ్ పై జే‌పి‌సి కమిటీని వేయమని)  సగటున 52% మాత్రమే విధులను  నిర్వహించినది. రాజ్య సభ 55% విధులను  నిర్వహించినది.
Ø  మొత్తం మీద  తనకు నిర్దేశించిన నిర్ణీత సమయం లో తరచూ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ కు అంతరాయం కలుగుట వలన లోక్ సభ 61%, రాజ్య సభ 67% తమ విధి నిర్వహణ ను పూర్తి చేసినాయి.
Ø  15వ లోక్ సభ (2009-14) తన  ఐదు సంవత్సరాల పదవి కాలం లో తన ముందుకు వచ్చిన 328 బిల్లులలో 179 బిల్లులను చర్చించి ఆమోదించినది. ఐదు సంవత్సరాల పదవీకాలం లో మిగతా లోక్ సభలు ఆమోదించినదాని కన్నా ఇది చాలా తక్కువ. 13వ లోక్ సభ 297 బిల్లులను, 14వ లోక్ సభ 248 బిల్లులను ఆమోదించినవి.
Ø  15 వ లోక్ సభ ముందుకు వచ్చిన 228 సాధారణ బిల్లులలో, చర్చ జరగనందున 68 బిల్లులు మురిగి పోయినాయి వాటిలో మహిళా రిజర్వేషన్ బిల్లు, డైరెక్ట్ టాక్స్ కోడ్,మైక్రో ఫీనాన్స్ బిల్లు ముఖ్యమైనవి.
Ø  15వ లోక సభ 2010 శీతాకాల సమావేశాలలో  కనిష్టం గా 11.2%,2011 శీతాకాల సమావేశాలలో గరిష్టం గా 39.53% శాసనాల రూపొందనకు ఖర్చు చేయడం జరిగింది.
Ø  ఆర్ధిక బిల్లులపై 81.35% నిర్ధారిత సమయం ఖర్చు చేయడం జరిగింది. 

Ø  15 వ లోక్ సభ వచ్చే నాటికి 37 పెండింగ్ బిల్లులు ఉండగా, రేపు వచ్చే 16 వ లోక్ సభముందు 60 పెండింగ్ బిల్లులు ఉండబోతున్నాయి. .
Ø  15 వ లోక్ సభ 116 సాధారణ బిల్లులను ఆమోదించినపటికి వాటిలో అధిక శాతం బిల్లులు తగినంత చర్చ లెకుండానే ఆమోదించడం జరిగింధి.15 వలోక సభ ఆమోదించిన బిల్లులలో 36% బిల్లులను అరగంట లోపునే చర్చించడం ఆమోదించడం జరిగింది. వీటిలో 20 బిల్లు ఐదు నిమిషాల లోపునే చర్చించడం  ఆమోదించడము  జరిగింది.
Ø  15వ లోక్ సభ కాలం లో రాజ్య సభ లో ఆమోదించిన మొత్తం బిల్లులలో 38% బిల్లులను  రెండు గంటలకన్న  అధిక సమయం లో  చర్చించి ఆమోదించడం, కొన్ని బిల్లులను అనగా 7 బిల్లులను 5నిమిషాలలోపు చర్చించడం జరిగింది
Ø  15 వ లోక్ సభ పదవి కాలం ముగిసే నాటికి రాజ్య సభ లో పెండింగ్ లో 60 బిల్లు లలో జుడీషియల్ అప్పాయింట్మెంట్ కమిషన్ బిల్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్(అమెండ్మెంట్) బిల్, రియల్ ఎస్టేట్ బిల్, ప్రేవేన్షన్ ఆఫ్ కరప్షన్ (అమెండ్మెంట్)బిల్ ముఖ్య మైనవి
Ø  15వ లోక్ సభ లో క్వశ్చన్ ఆవర్ సమయం  అంతరాయాల  వలన బాగా నష్ట పోయినది. లోక్ సభ ప్రారంభము  లో మొదటి గంట ను క్వశ్చన్ అవర్ అందురు.సాధారణం గా  క్వశ్చన్ ఆవర్ సమయం లో పార్లమెంట్ సబ్యుల ప్రశ్నలకు మంత్రులు మౌఖికం గా సమాధానాలు ఇస్తారు.
Ø  చాలా సందర్భాలలో ను క్వశ్చన్ అవర్ కు కేటాయించిన దానిలో 1% కూడా పని జరగలేదు. 2010 శీతాకాల సమావేశాలలో క్వశ్చన్ అవర్ కు కేటాయించిన దానిలో 0.78%సమయంలో    మరియు 2012 వర్షాకాల సమావేశాలలో 1.23%సమయం లో    ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది. 2009 బుడ్జెట్ సమావేశాలలో క్వశ్చన్ అవర్ కు కేటాయించిన దానిలో 19.75% సమయం లో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది.   
Ø  మొత్తం లోక్ సభలో 61%, రాజ్య సభ లో 59%  క్వశ్చన్ ఆవర్ సమయం నష్టపోయినది.
Ø  15 వ లోక్ సభలో మొత్తం 6479 పశ్నలకు మంత్రుల నుంచి మౌఖికం గా సమాధానాలు ,రాజ్య సభ లో 6512 ప్రశ్నలకు మంత్రుల నుంచి మౌఖికం గా సమాధానాలు రావలసి ఉంది. కానీ వీటిలో లోక్ సభలో 10% ప్రశ్నలకు, రాజ్య సభ లో 12% ప్రశ్నలకు మౌఖిక సమాధానాలు లబించినవి.
Ø  15వ లోక్ సభ మూడు సమావేశాల కాలం లో రాజ్య సభ లో ఏ మౌఖిక ప్రశ్నకు సమాధానం లబించలేదు.
Ø  గత కొద్ది కాలం గా పార్లమెంట్ బడ్జెట్ ప్రస్తావనలపై చర్చ  తక్కువ సమయం జరుగుతుంది, 15వ లోక్ సభ లో అనేక సార్లు ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్ధిక ప్రతిపాదనలపై చర్చ, పరిశీలన జరగకుండానే ఆమోదించడం జరుగుతుంది. క్రిందటి 5 సంవత్సరాలలో మొత్తం ఉత్పాదక సమయంలో  బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చ కు 29% లబించినది. .
Ø  2014 ఇంటీరియమ్ బడ్జెట్ ను చర్చ జరపకుండానే ఆమోదించటం జరిగింది.
Ø  2013 లో ఫీనాన్స్ బిల్లు, 16.6 లక్షల కోట్ల గ్రాంట్ల డిమాండ్ల  పై చర్చ జరపకుండానే వోటింగ్ జరపటం ఆమోదించడం జరిగింది.
Ø  2011 లో 81% మరియు 2012 లో92% మొత్తం డిమాండ్ల పై చర్చ జరపకుండానే వోటింగ్ జరపటం జరిగింది.
Ø  15 వ లోక్ సభ కాల పరిమితిలో 2011 లో బడ్జెట్ ను,గ్రాంట్ల డిమందులను వివిధ మంత్రిత్వ శాఖల  స్టాండింగ్ కమిటీల పరిశీలనకు పంపకుండానే ఆమోదించడం  జరిగింది.







.


18 March 2014

ఆంధ్ర ప్రదేశ్ పార్లమెంట్/రాష్ట్ర శాసన సభ ఎన్నికలలో ముస్లిం వోటర్ల సందిగ్ధత



ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యం గా రాష్ట్ర విభజన జరిగిన తరువాత అన్నీ రాజకీయ పక్షాలు తమ దృష్టిని ముస్లిం మైనారిటీ ల పట్ల కేంద్రీకరించినవి.  రాష్ట్రం లో ముస్లింల జనాభా దాదాపు 12% వరకు ఉంది. ముస్లింలు ప్రధానంగా హైదరాబాద్, కడప, కర్నూల్, చిత్తూర్, అనంతపూర్, నెల్లూరు,గుంటూర్, ప్రకాశం, కృష్ణ జిల్లాలలో అదికంగా కనిపిస్తారు.

 రాయల సీమ,తెలంగాణ ప్రాంతం లో ముస్లింలు, అధికంగా ఉన్నారు. హైదరాబాద్ లో 40% పైగా ముస్లిం జనసంఖ్య ఉంది. పాతబస్తీ లో 90% వరకు ముస్లిం లు ఉన్నారు. అన్నీ తెలంగాణ జిల్లాలలో కూడా ముస్లింలు తగినంత సంఖ్య లో  ఉన్నారు. ఇక దక్షిణ కోస్తా ప్రాంతానికి వస్తే ముస్లింల జనాభా 5-6% కన్నా ఎక్కు వ లేదు. వీరిలో 95% మంది చేతి వృతులు మీద ఆధార పడిన వారు. ఆక్షరాస్యత అదికంగా లేదు. గోదావరి జిల్లాలలోనూ, ఉత్తర ఆంధ్రా లో వీరి సంఖ్య అతి స్వల్పము.ముస్లింలలో ఉన్నత విద్యావంతులు, వృతి నిపుణుల సంఖ్య అత్యంత స్వల్పంగా ఉంది.
గత2009  అస్సెంబ్లీ/పార్లమెంట్  ఎన్నికలలో మొత్తం 11 మంది ముస్లిం రాష్ట్ర శాసన సబ్యులు, ఒక పార్లమెంట్ సభ్యుడు ఎన్నికైనారు. 11మండి రాష్ట్ర శాసన సబ్యులలో 3గురు కాంగ్రెస్ కు,7గురు ఎం‌ఐ‌ఎం కు, ఒకరు టి‌డి‌పి కి ప్రాతినిద్యం వహించగా, ఒక్క పార్లమెంట్ సబ్యుడు ఎం‌ఐ‌ఎం కు  ప్రాతినిద్యం వహించినారు.
తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ/పార్లమెంట్ కు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి.ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో జరిగే  2014 శాసనసభ/పార్లమెంట్ ఎన్నికలలో ముస్లింలు నిర్ణయాత్మక  పాత్ర వహించబోతున్నారు. అబ్యర్ధుల గెలుపు ను నిర్ణయించడం లో వీరి ఓటింగ్, ప్రభావాన్ని కల్గించగలదు.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో దాదాపు 40-50 రాష్ట్ర శాసనసభనియోజక వర్గాలలో మరియు 15 పార్లమెంటరీ నియోజక వర్గాలలో ముస్లింలు నిర్ణయాత్మక శక్తి గా ఉన్నారు.
తెలంగాణ ప్రాంతం లోని ముస్లింలు సంప్రదాయకం గా మొదటి నుంచి కాంగ్రెస్ కు వోట్ బ్యాంక్ గా ఉన్నారు. పాత బస్తి లో ఎం‌ఐ‌ఎం హవా కొనసాగుతూనే ఉంది.
ఎన్‌టి రామా రావు సమయం లో తెలంగాణ లోని ముస్లింలు తెలుగు దేశం కు పూర్తి మద్దతు ప్రకటించినారు. ఎన్‌టి‌ఆర్ అనంతరం చంద్ర బాబు హయం లో ముస్లిం లు తెలుగు దేశం కు కొంతవరకు దూరం అయినారు. గత ఎన్నికలలో టి‌డి‌పి బి‌జే‌పి వైపు మొగ్గు చూపటాన్ని వీరు  హర్షించలేదు. ప్రస్తుతం బి‌జే‌పి కి టి‌డి‌పి, మద్దతు ప్రకటిస్తున్న వార్తల నేపద్యం లో ముస్లింలు టి‌డి‌పి వైపు ఎంత మొగ్గు చూపుతారనే సంశయం ఉంది పైగా మోడి బూచి ఉండనే ఉంది.
తెలంగాణ ఏర్పాటును ముస్లింలు హర్షించినా  టి‌ఆర్‌ఎస్ వైపు అనుమానం గానే ఉన్నారు. టి‌ఆర్‌ఎస్ లో ముఖ్యమైన ముస్లిం నాయకులు ఎవరు లేరు పైగా కే‌సి‌ఆర్ ఎన్నికల తరువాత ఎన్‌డి‌ఏ వైపు మొగ్గు చూపుతాడెమో అన్న అనుమానం వారిలో ఉంది? మహబూబ్ నగర్ ఉప ఎన్నికలలో టి‌ఆర్‌ఎస్  ముస్లిం అబ్యర్ధి ఓటమిని వారు మరచిలేక పోతున్నారు.
ఇక ఎం‌ఐ‌ఎం పాత బస్తి నుంచి తన రాజకీయ పరిధి ని పెంచుకోవాలని చూస్తుంది, ముస్లింలు అధికంగా ఉన్న రాయలసీమ, కోస్తా లో కొన్ని నియోజక వర్గాలలో పాగా వేయాలని ప్రయత్నిస్తుంది.
 కాంగ్రెస్స్ తెలంగాణ సాధకునిగా, మైనారిటి ల రక్షకునిగా, షబ్బీర్ అలీ లాంటి మైనారిటీ నాయకులను ప్రొజెక్టు చేస్తూ మైనారిటీ లలో తన స్థానాన్ని సుస్థిర పరుచుకోవాలని ప్రయాత్నిస్తుంది. 
ఆంధ్ర ప్రాంతం లో మొదటినుంచి కాంగ్రెస్స్ కు ముస్లిం లు అనుకూలంగానే ఉన్నారు.
ఎన్‌టి‌ఆర్ హయాంలో ముస్లిం ల నుంచి తగినంత మంది  ముస్లింలు తెలుగు దేశం వైపుకు మరలారు. ఎన్‌టి‌ఆర్ కూడా ముస్లింలను బాగానే అదరించినారు. చంద్ర బాబు హయం లో ముస్లిం లు తెలుగు దేశం పట్ల కొంత అసహనం ప్రదర్శించిన కోస్తా ముస్లింలలో చెప్పుకోదగిన సంఖ్యలో టి‌డి‌పి వోటర్లు, క్యాడర్ ఉంది.
ప్రస్తుతం సీమాంద్ర ప్రాంతం ముస్లింలలో వై‌సి‌పి గాలి బాగా వీస్తున్నది. వై‌ఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ ఫదకాలు మైనారిటీ లలో బాగా పాపులర్ అయినాయి. వై‌సి‌పి పట్ల ముస్లింలు అధిక సంఖ్యలో మద్దతు ప్రకటిస్తున్న ఇటీవల జగన్, మోడి కి మద్దతు పలకటం వారికి మింగుడు పడటం లేదు? వై‌సి‌పి ని ఎంతవరకు నమ్మవచ్చో,అది చివరకు ఎన్‌డి‌ఏ కి  మద్దతు పలుకు తుందేమో అన్న అనుమానం వారిలో ఉంది!
ఈవిధంగా తెలంగాణ, సీమాంద్రప్రదేశ్ లోని ముస్లింలు ఒకే రకం గా ఓటు చేసి స్థితిలో లేరు వేరు వేరు ప్రాధాన్యతలను కలిగి ఉన్నారు అయితే ఉమ్మడిగా బి‌జే‌పి /మోడి భయం వీరిని వెన్నాడుతూనే ఉంది.


ముస్లింలలో ఆమ్ ఆద్మీ పార్టీ కి పెరుగుతున్న ప్రజాదరణ


  
భారత దేశ జనాభాలో 20 కోట్ల వరకు ముస్లింలు ఉన్నారు. యూ‌పి,బిహార్,ఆస్సామ్,పశ్చిమ బెంగాల్,జమ్ము-కాశ్మీర్,మహారాష్ట్ర,ఆంధ్ర ప్రదేశ్ మొదలగు రాష్ట్రాలలో ముస్లిం లు అధికం గానే ఉన్నారు. లోక్ సభ కు చెందిన దాదాపు 80 నియోజక వర్గాలలో  ముస్లింలు 35% కన్నా ఆదికముగా  ఉండి ఎన్నికలను ప్రభావితం చేసే స్థితి లో ఉన్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ముస్లిం వోటర్లను ఎరాజకీయ పక్షం నిర్లక్ష్యం చేసే స్థితి లో లేదు.
2014 లో జరగనున్న  16 వ లోక్ సభ ఎన్నికల ప్రచార వాతావరణాన్ని గమనించిన దాదాపు అన్నీ రాజకియ పక్షాలు  ముస్లింల పట్ల తమ దృష్టిని ప్రసరించినట్లు  కన్పిస్తున్నది. ఇంతవరకు హిందుత్వకు ప్రాధాన్యమిస్తూ  ముస్లిం వొట్ల పట్ల ఏమాత్రం ఆసక్తి చూపక,ఎన్నికలలో ముస్లిం అబ్యర్ధులకు అల్ప ప్రాధాన్యత ఇచ్చే  బి‌జే‌పి కూడా తన విధానాలను మార్చుకొని కొన్ని స్థానాలలో ముస్లిం అబ్యర్ధులను నిలబెట్టుతుంది. పార్టీ అద్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఒక ముఖ్యమైన ప్రకటన చేస్తూ గతం లో తాము చేసీన తప్పులను మన్నించమని ముస్లిం లను కోరినారు. కాంగ్రెస్స్ అల్పసంఖ్యాక వర్గాల బద్రతకు, సంక్షేమానికి తను చేసిన,చేయ బోతున్న పనులను ఏకరువు పెడుతూ ముస్లిం వోట్ బ్యాంక్ ను నిలబెట్టు కోవడానికి అష్టకష్టాలను పడుతుంది. ముజఫర్ నగర్ అల్లర్లతో ముస్లింలలో తన పట్ల మసక బారిన విశ్వాసాన్ని తిరిగి సాధించడానికి ములాయం ముప్పతిప్పలు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో కొత్తగా దేశ  రాజకేయ చిత్రపటం పైకి వచ్చిన ఆం ఆద్మీ పార్టీ ఏవిదంగా ముస్లింలను ఆకట్టుకోవటానికి ప్రయత్నిస్తుందో, ముస్లింలలో ముఖ్యంగా నిరుద్యోగం, నైరాశ్యం తో భాద పడుతున్న ముస్లిం యువకులకు ఏవిధంగా ఒక ఆశాజ్యోతి గా మారినధో పరిశీలించుదాము.

వచ్చే లోక్ సభ ఎన్నికలలో ఒక   యువ చిరు  వ్యాపారి తాను గత  డిల్లీ ఎన్నికలో చేసిన తప్పు ను సరిదిద్దు కోబోతున్నాను అంటున్నాడు.తన ప్రాంతం లోని కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికలలో లెక్కలోనికి తీసుకోదగిన పార్టీ కాదు,దానికి వోటు వేయడం దండగా  అని చెప్పిన మాటలను నమ్మి నాను అని కానీ ఈ సారి లోక్ సభ ఎన్నికలో తనకు వస్తున్న అవకాశాన్ని కోల్పోనని,ఆమ్ ఆద్మీ పార్టీ కి తప్పని సరిగా వోటు వేస్తాను అని అంటున్నాడు. వచ్చే లోక్ సభ ఎన్నిక ల సంధర్భం గా  కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల ఉన్న ఈ  అబిప్రాయమే చాలా మంది ముస్లింలలో కన్పిస్తున్నది. ఇది ఇంతకు పూర్వం అవినీతి నిరోధకానికి కేజ్రీవాల్ చేపట్టిన ఉద్యమం పట్ల ముస్లిం లు చూపిన వైఖరికి ఇది బిన్నంగా ఉంది. ముస్లింలను ఆకర్షించటానికి ఇటీవల కేజ్రీవాల్ మాట్లాడుతూ అవినీతి కన్నా మతోన్మాదం (కమ్యూనలిజం) దేశానికి పట్టిన పెద్ద చీడ అన్నారు.

65 ఏళ్లుగా కాంగ్రెస్స్ కు వోట్ వేసిన ముస్లింలు పొందినది ఏమీలేదని, పైగా 65 సంవత్సరాలు స్వతంత్రబారత దేశం లో ముస్లిలు సాదించినది ఏమీలేదనని, ఇదే విషయాన్ని గోపాల్ సింగ్ కమిటీ, సచార్ కమిటీలు స్పష్టపరిచాయని, సమాజ్ వాది పార్టీ కూడా ముస్లిం లను అడ్డుపెట్టుకొని అధికారాన్ని పొందిన్నదన్న వాస్తవాలను ముస్లిములు గుర్తించాలని ఆం ఆద్మీ పార్టీ తెలిపింది. పైగా బి‌జే‌పి ని అధికారం లోనికి రాకుండా చేయగలేగేది ఆం ఆద్మీ పార్టీ మాత్రమేనన్న భరోసాను ముస్లింలలో కల్పించింది

ముస్లిం లు మెల్లగా  కాంగ్రెస్ కు  దూరం కావటం , బి‌జే‌పి ప్రధాన మంత్రి అబ్యర్ధి  నరేంద్ర మోదిని ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుర్కొంటున్న తీరును హర్షిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ త్వరలో బలమైన,విశ్వసనీయమైన పార్టీ గా తయారు అవుతుందని ఉన్నత ముస్లిం విద్యావంతులు అబిప్రాయ పడుతున్నారు.సాదారణ ఎన్నికలకొరకు  ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించిన  61 మండి అబ్యర్ధులలో 11 మంధి ముస్లింలు కావడం ఒక విశేషం. మోదిని ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుర్కొంటున్న తీరు ముస్లింలలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్ఠ ను పెంచినది .ముస్లింల పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ అనుసరిస్తున్న ప్రత్యేక విధానం అనగా ముస్లిం అబివృద్ధికి ప్రాధాన్యతను ఇవ్వడం  20-40 సంవత్సరాల మద్య వయస్సు ఉన్నముస్లిం లలో ఆ పార్టీ పట్ల విశ్వాసాన్ని పెంచుతుంది. కాంగ్రెస్ పార్టీ పదే పదే వల్లించే మత కల్లోలాల భయం కన్నా  ఆమ్ ఆద్మీ పార్టీ ముస్లిం అబివృద్ధి విషయాలపై దృష్టి సారించడం కూడా  ఆ పార్టీ వేసిన ముందడుగు చర్య  గా వర్ణించ వచ్చును.

డిల్లీ ఎన్నికలలో ఆం ఆద్మీ పార్టీ ఏర్పర్చిన టాస్క్ ఫోర్స్/ముస్లిం లను ఉద్దేశించి కేజృవాల్ జారీచేసిన ప్రకటనలు  ఆ పార్టీ ని ముస్లింల వద్దకు చేర్చటం లో సఫలమైనవి.చివరకు  సంప్రదాయకం గా కాంగ్రెస్స్ ను సమర్దించే జమాతే-ఏ-ఇస్లామి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ని సమర్ధించ వలసి వచ్చింది. రక్షణ కన్నా అబివృద్ధి అనగా విద్యా,ఆరోగ్యం, ఉపాధి గృహవసతి వంటి సమస్యలను ప్రస్తావించి ఆమ్ ఆద్మీ పార్టీ ముస్లిం ప్రజల హృదయాలను కొల్లగొట్టింధి. బి‌జే‌పి,కాంగ్రెస్స్ లకు బిన్నంగా ముస్లింల రక్షణ,ముస్లింలను తృఫిపరచటం,రిజర్వేషన్  వంటి అంశాలను ప్రస్తావించకుండానే, ముస్లింల వెనుకబాటుతనాన్ని, అందుకు అవసరమైన మౌలిఖవసతులను, ముస్లిం ల అబివృద్ధిని, అందుకు చేయవలసిన కృషిని ప్రస్తావిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ముస్లింలను ఆకర్షించినది. మైనారిటీ లకు తృప్తి పరచడం వంటి విషయాలలో తనకు నమ్మకము లేదని, వాటి బదులు అందరికి సమానవకాశాలు కల్పించుతానని కేజృవల్ అంటున్నాడు.మెరుగైన విద్యావకాశాలు కల్పించడం ద్వార్ ముస్లింల అబివృద్ధికి తోడ్పడుతానని అంటున్నాడు. అధికారం లోనికి వస్తే పబ్లిక్ స్కూళ్ళ కన్నా మెరుగైన విద్యను గవర్నమెంట్ స్కూళ్ళలో భోదిస్తామని అంటున్నారు. 

ఆద్మ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద కేజ్రివల్ తన దేశవ్యాప్త ఎన్నికల పర్యటనలలో భాగం గా  గుజరాత్ లో అబివృద్ధి పేర జరిగిన బూటకపూ ప్రచారాన్ని, అబివృద్ధి ముసుగు లో జరుగుతున్న అవినీతిని,అక్కడివాస్తవాలను వివరించడము  లో పత్రికలు/మీడియా సరియైన పాత్రను వహించడం లేదని విమర్శించారు. 11ఏళ్ల మోడి పరిపాలనలో జరిగిన అబివృద్ధిపేర జరుగుతున్నా ప్రచారం అంతా మీడియా సృష్టి అని వాస్తవాలను ప్రజలకు తెలుపవలసిన బాధ్యత తనపై ఉన్నదన్నారు. మోడి పాలనలో 800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారని, 16000 చిన్న తరహా పరిశ్రమలు మూత పడినాయని,సబ్సిడీలు బంద్ అయినాయి,11% అబివృద్ధి సాదించలేదని, అతి తక్కువ దరకు చదరపు మీటరు 1 రూపాయికి భూమిని పారిశ్రామికవేత్తలకు ఇవ్వవలసి రావడంజరిగినదని, అవినీతి పెరిగిందని  ఆయన అన్నారు. వీటన్నింటినీ మీడియా పట్టిచ్చుకోవడం లేదని, అభివృద్ధి పేర తప్పుడు ప్రచారం జరుతున్నదని అన్నారు. 2002గుజరాత్ మారణకాండ కేసులలో కోర్టులచే క్లీన్ చిట్ పొందిన మోడిని ఆ విషయం పై ప్రస్తావించకుండానే, గుజరాత్ అబివృద్ధి విషయం లో మోడి పేర మీడియా లో మరియు దేశవ్యాప్తం గా జరుగుతున్నఘనమైన అబద్దపు ప్రచారాన్ని ఖండించారు. వాస్తవాలు తెలుసుకోవడానికే గుజరాత్ పర్యటన చేస్తున్నానని, తన ఆరోపణలకు సరియైన సమాధానాలు లబించడం లేదని అన్నారు.

మోడి కంచుకోట ఐనా గుజరాత్ లో అబివృద్ధి పేర జరిగిన ప్రచారాన్ని పటాపంచలు చేస్తున్న కేజ్రివాల ప్రకటనలను భారతీయ ముస్లింలు  స్వాగతిస్తున్నారు. 2002 మారణకాండను ప్రస్తావించకుండానే, మోడి పేర మీడియా లో మరియు దేశవ్యాప్తం గా జరుగుతున్నాఅబద్దపు ప్రచారాన్నికేజృవాల్   ఖండిస్తున్న తీరును ముస్లింలు మెచ్చుకొంటున్నారు. ఇక మోడి సంగతికి వస్తే మోడిని విజయవంతం గా నిలువరించే పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే  ముస్లిం లు నమ్ముతున్నారు.          కేజ్రివాల ముస్లిం ల పట్ల ఎటువంటి అనుకూల ప్రకటనలు చేయన్నప్పటికి ముస్లిం ల అబివృద్ధి పై అతను చేస్తున్నవ్యాఖ్యలు   ముఖ్యం గా ముస్లిం యువతారాన్ని అతనికి దగ్గర చేస్తున్నాయి. గుజరాత్ లోని ఆం ఆద్మీ పార్టీ సమర్ధకులలో ముస్లిం యువకులు ముఖ్యం గా 20-40 మద్య వయస్సు వారు అధికం గా ఉన్నారు. 

యూ‌పి పర్యటనలో కేజ్రివాల పట్ల ముస్లింలు చూపిన ఆదరణ ముస్లింలలో అతనికున్న ప్రాబల్యాన్ని చూపుతుంది. యూ‌పి పర్యటనలో కేజ్రివల్ సభలకు హాజరుఐనవారిలో అధికులు ముస్లింలు,అల్లర్ల భాదితులు.  యూ‌పి లో కాంగ్రెస్స్ ముస్లింలలో తన వోట్ బ్యాంక్ ను ఏనాడో కోల్పోయినది, క్రమంగా సమాజవాది పార్టీ తన వ్యవహార శైలితో,ముజఫర్ నగర్ అల్లర్లతో  ముస్లింల ఆగ్రహానికి గురిఐనది. ముస్లింలలో ములాయం పొగుట్టుకొన్న ప్రతిష్ఠ ను కేజృవాల్ పూర్తి చేస్తున్నారు.నిన్నటివరకు ముస్లిం ల రక్షకుడు మూలాయము  అని నమ్మిన ముస్లిం లు నేడు బి‌జే‌పి ని ఎదుర్కొనే ధీటైన శక్తి ఆం ఆద్మీ పార్టీ కి మాత్రమే ఉందని మరియు మోడి కి సరియైన ప్రత్యర్ధి కేజ్రివల్ అని నమ్ముతున్నారు. ఎన్నికల సమయం లోనే యూ‌పి‌ఏ కు ముస్లిం లు గుర్తుకు వస్తున్నారని ముస్లింలు అంటున్నారు. పార్లమెంట్ చివరి సమావేశాలలోనే మతహింస బిల్లును ప్రవేశపెట్టడం, ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్ ల పై ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ స్టే ఇచ్చినపుడు యూ‌పి‌ఏ దానిని సమర్ధవంతంగా సుప్రేమ్ కోర్ట్ లో ఎదుర్కొలేదనే భావన ముస్లిం విద్యావంతులలో అధికం గా ఉంది. మతకల్లోలాల ప్రస్తావనలకు కాలం చెల్లినదని, అబివృద్ధి ప్రధానమని  ముస్లింలు నమ్ముతున్నారు. కాంగ్రెస్ 60 ఏళ్ల పరిపాలనలో ముస్లింలకు ఏమి ఉపయోగం  జరగలేదని, ముస్లిం ల వెనుకబాటుకు అసలు  కాంగ్రెస్ ప్రధాన కారణమని కేజ్రివల్/ఆం ఆద్మీ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని ముస్లింలు నమ్ముతున్నారు. బి‌జే‌పి-ఆమ్ ఆద్మీ పార్టీ ల మద్య జరిగే  ఎన్నికల పోరాటం  లో కాంగ్రెస్ ను ముస్లింల వోటు చీల్చే పార్టీ గా ముస్లింలు భావిస్తున్నారు.ముస్లింలలో వచ్చిన ఈ పరిణామం వచ్చే ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీకి లాభదాయకంగా మారుతుందని చెప్పవచ్చును. ఆమ్ ఆద్మీ పార్టీ అవతరణ ,వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ విజయావకాశాలను, కాంగ్రెస్ కు గల ముస్లిం వోట్ బ్యాంకు ను కొంతవరకు దెబ్బతిస్తుందని ఖచ్చితం గా చెప్పవచ్చును.

ముస్లిం యువకులు, విద్యావంతులు,  ,ఆలిగర్ ముస్లిం యునివర్సిటీ  ,జామియా విశ్వవిద్యాలము ఉపాద్యాయులు, విద్యార్ధి నాయకులు,పూర్వవిద్యార్ధులు, ముస్లింమేధావులు,మత నాయకులు   క్రమంగా కేజ్రివల్/ఆం ఆద్మీ పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారు. కేజృవల్ బాంబె పర్యటన ముస్లింలలో విజయవంతం కాకపోయినప్పటికి దేశవ్యాప్తం గా ముస్లింలలో ముఖ్యం గా యువకులలో ఆం ఆద్మీ పార్టీ పట్ల ఆసక్తి, ఆమోదం పెరుగుతున్నది. తన పట్ల ఉన్న ఆసక్తిని ఏవిధం గా ఆం ఆద్మీ పార్టీ వోట్ లలోనికి మార్చుకొని, స్థానాలు సంపాదిస్తుందో ముస్లింలు వేచి చూడాలి ముస్లింల మద్దతు తో పాటు ఒక నియోజక వర్గం నుంచి గెలవడానికి ఆ అబ్యర్ధి అనుసరించే విధానాలపై కూడా  ఆమ్ ఆద్మీ పార్టీ విజయాలు ఆధార పడి ఉంటాయాని చెప్పవచ్చును. ఏది ఏమైనా ముస్లిం ల మద్దత్తు పొందటం లో ఆమ్ ఆద్మీ పార్టీ సఫలమైనది అని మరియు ముస్లిం లకు మరొక ప్రత్యాన్నము అది ముస్లిం అబివృద్ధి ప్రధానం గా ఉండేది లబించినదని చెప్పవచ్చును.

.
. 
.












9 March 2014

2014 లో జరిగే 16వ లోక్ సభ ఎన్నికలు –కొన్ని విశేషాలు



·       2014 లోక్ సభ ఎన్నికలలో 81.46 కోట్ల మంది వోటర్లు పాల్గొబోతున్నారు. (ఈ సంఖ్య 2009 ఎన్నికల లోని వోటర్ల సంఖ్య కన్నా 10 కోట్లు ఎక్కువ) ఈ సంఖ్య మొత్తం యూరప్ ఖండం లో ని జనాభా కన్నా ఎక్కువ.

·       పురుషులు 42.67 కోట్ల మండి, స్త్రీలు 38.79 కోట్ల మంది ఇతరులు 28,314 మంది,11844 మంది ఎన్‌ఆర్‌ఐ లు  వోటర్లుగా నమోదు అయినారు.

·       మొత్తం వోటర్లలో 18-19 సంవత్సరాల మద్య వయస్సు కలిగిన వారు 2.3 కోట్ల మంది.
·       543 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగును.

·       దేశ వ్యాప్తం గా 131 లోక్ సభ స్థానాలను ఎస్‌సి/ఎస్‌టి ల కోసం రిజర్వే చేయడం జరిగింది.
·       ఇద్దరు ఆంగ్లో ఇండియన్ సబ్యులను రాష్ట్ర పతి లోక్ సభ కు నామినెట్ చేయును.
·       కొత్త లోక్ సభ జూన్1న ఏర్పడ వచ్చును.

·       మంత్రి వర్గం ఏర్పర్చడానికి కనీసం 272 సబ్యుల మద్దత్తు అవసరం
·       యూ‌పి,బిహార్,ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మొదలగు 5 రాష్ట్రాలలో మొత్తం వోటర్లలో సగం మంది ఉన్నారు.

·       ఏప్రిల్ 7 నుంచి మే 12 వరకు అనగా మొత్తం 73 రోజుల వ్యవధిలో 9 దఫాలుగా  ఎన్నికలు జరుగును (2009 లో 75 రోజుల వ్యవధి లో 5 ధఫాలుగా  ఎన్నికలు జరిగినాయి.)

·       ఎన్నికల కౌంటింగ్ మరియు ఫలితములను మే 16 న ప్రకటిస్తారు
.
·       7 కేంద్ర పాలిత ప్రాంతాలు, 28 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగును.

·       ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా,సిక్కిం లలో లోక్ సభ ఎన్నికల తో పాటు రాష్ట్ర శాసన సభ ఎన్నికలు కూడా  జరుగును.
·       ఆంధ్ర ప్రదేశ్ లో రెండు ధఫాలు గా ఏప్రిల్ 30న తెలంగాణా ప్రాంతంలోనూ,మే 7నా సీమాంద్ర ప్రాంతం లోనూ, ఒరిస్సా లో ఏప్రిల్ 10,మరియు 17న, సిక్కిం లో ఏప్రిల్ 12న లోక్ సభ/రాష్ట్ర శాసన సభ ఎన్నికలు నిర్వహించ బడును
.
·       దేశవ్యాప్తం గా 9,30,000 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబడినవి.
·       96% వోటర్లకు ఫోటో ఐడెంటిటీ కార్డు లు ఇవ్వబడినవి.
·       ఎన్నికలలో EVM లు అనగా ఎలెక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లను ఉపయోగించడం జరుగుతుంది.
·       దాదాపు 1కోటి 10 లక్షల మంది ఎన్నికల అధికారులు ఎన్నికలను నిర్వహిస్తారు.

·       మొదటి ధఫా వోటింగ్ ఏప్రిల్ 7న, 2రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో 6 పార్లమెంటరీ స్థానాలకు జరుగును.
·       రెండోవ ధఫా వోటింగ్ ఏప్రిల్ 9న, 5 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో 7 పార్లమెంటరీ స్థానాలకు జరుగును.
·       మూడోవ ధఫా వోటింగ్ ఏప్రిల్ 10న, 14 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో 92 పార్లమెంటరీ స్థానాలకు జరుగును.
·       నాల్గోవ  ధఫా వోటింగ్ ఏప్రిల్ 12న, 3 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో 5 పార్లమెంటరీ స్థానాలకు జరుగును.
·       అయిదోవ ధఫా వోటింగ్ ఏప్రిల్ 17న, 13రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో 122 పార్లమెంటరీ స్థానాలకు జరుగును.
·       ఆరోవ  ధఫా వోటింగ్ ఏప్రిల్ 24న, 12 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో 117 పార్లమెంటరీ స్థానాలకు జరుగును.
·       ఎడోవ  ధఫా వోటింగ్ ఏప్రిల్ 30న, 9 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో 89 పార్లమెంటరీ స్థానాలకు జరుగును.
·       ఎనిమిదో   ధఫా వోటింగ్ మే 7న, 7 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో 64 పార్లమెంటరీ స్థానాలకు జరుగును
·       తొమ్మిదో   ధఫా వోటింగ్ మే12న, 3రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో 41 పార్లమెంటరీ స్థానాలకు జరుగును
·       మొత్తం పార్లమెంటరీ స్థానాలు 543. ప్రస్తుత ప్రభుత్వ పని కాలం మే 31న ముగియును.
·       డిల్లీ, కేరళ లో ఏప్రిల్ 10న,తమిళనాడులో ఏప్రిల్ 24న,కర్ణాటక లో ఏప్రిల్ 17న, ఒక రోజు పోలింగ్ జరుగును. మొత్తం 21రాష్ట్రాలలోనూ, పుదుచ్చేరి  కేంద్రపాలిత ప్రాంతo లోను ఒక రోజు పోలింగ్ నిర్వహించ బడును.  
·       ఆంధ్ర ప్రదేశ్ ,మణిపుర్,ఒరిస్సా,రాజస్తాన్,త్రిపురాలలో రెండు రోజులు పోలింగ్ నిర్వహించ బాదును.

·       బిహార్,ఉత్తర్ ప్రదేశ్ లలో పోలింగ్ 6 రోజులు జరుగును.
·       జమ్ము-కాశ్మీర్,పశ్చిమ బెంగాల్ లో 5 రోజులు పోలింగ్ జరుగును.
·       జార్ఖండ్,ఛత్తీస్ గడ్,అస్సామ్,మద్య ప్రదేశ్, మహారాష్ట్రాలో 3 రోజులు పోలింగ్ జరుగును.

·       ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అనగా ఎన్నికల ప్రకటన వెలుబడిన రోజు నుంచి 5-3-14 నుంచి అమలు లోనికి వచ్చినది.
·       మొదటిసారిగా  వోటర్లకు NOTA (none of the above)ఆప్షన్ ఇవ్వబడినది.(NOTA ఆప్షన్ మొదటిసారిగా డిల్లీ వోటర్లకు  మొన్న జరిగిన అసెంబ్లి ఎన్నికలలో ఇవ్వబడినది)
·       మార్చ్ 9న బూత్ వారి వోటర్ల లిస్ట్ ను పరిశీలించవచ్చును మరియు కొత్తగా వోటర్లుగా చేరుటకు దరఖాస్తు చేయవచ్చును.దీనికోసం ఎన్నికల సంఘం ప్రత్యేక క్యాంపులను నిర్వహించును.

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు

·       ఆంధ్ర ప్రదేశ్, లో లోక్ సభ ఎన్నికల తో పాటు రాష్ట్ర శాసన సభ ఎన్నికలు కూడా  జరుగును.

·       తెలంగాణా ప్రాంతం లో ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 2న,ఆంధ్ర ప్రాంతం లో ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 12న వెలుబడును.
·       నామినేషన్లు స్వీకరణకు తెలంగాణాలో ఏప్రిల్ 9, ఆంధ్ర ప్రాంతం లో ఏప్రిల్ 19 చివరి తేదీ గా ప్రకటించడమైనది.
·       నామినేషన్ల ఉపసంహరణకు తెలంగాణాలో ఏప్రిల్ 12, ఆంధ్ర ప్రాంతం లో ఏప్రిల్ 23 చివరి తేదిగా
నిర్ణయించడమైనది. 
·       ఆంధ్ర ప్రదేశ్ లో రెండు ధఫాలు గా ఏప్రిల్ 30న తెలంగాణా ప్రాంతంలోనూ,మే 7నా సీమాంద్ర ప్రాంతం లో మొత్తం 42లోక్ సభ స్థానాలకు, 294 అసెంబ్లీ స్థానాలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించ బడును.

·       ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం 6.24 కోట్లమంధి వోటర్లు ఎన్నికలలో తమ వోటు హక్కును వినియోగించు కొందురు.(2009 ఎన్నికలలో 5.78 కోట్ల మంది వోటర్లు గా నమోదు అయినారు)
·        తెలంగాణ ప్రాంతం లో 17 లోక్ సభ స్థానాలు, 119 అసెంబ్లి స్థానాలు కలవు. సీమాంద్ర ప్రాంతం లో 25 లోక్ సభ స్థానాలు 175 అసెంబ్లి స్థానాలు కలవు.
·       69,014 పోలింగ్ స్టేషన్ లను ఏర్పాటు చేయడం జరిగింది.
·       మే 16 న ఎన్నికల కౌంటింగ్ ప్రారంబించబడును.

·       ప్రస్తుత అసెంబ్లి పదవి కాలం జూన్ 2 తో ముగియును.
·       ఆంధ్ర ప్రదేశ్ 2 కొత్త రాష్ట్రాలుగా అనగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ గా జూన్ 2న ఆవిర్భవించును.(appointed day)
·       ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్ర పతి పాలన కలదు, రాష్ట్ర అసెంబ్లి శుప్తచేతనావస్థ (suspended animation) లో కలదు.
·       ఎన్నికల ప్రవర్తన నియమావళి వెంటనే అనగా 5-3-14 నుంచి అమలులోనికి వచ్చును.