13 April 2016

భారతీయ ఉన్నత విద్య వ్యవస్థ గురించి కొన్ని విశేషాలు- ఇండియా ర్యాంకింగ్స్ 2016.(India Rankings 2016)





• భారత దేశం లో ప్రతి తొమ్మిది మంది   పిల్లలలో ఒకరు స్కూల్ చదువు పూర్తి చేసి కళాశాల లో చేరతున్నాడు.
అమెరికా తో పోలిస్తే ఇండియా లో  భారతదేశం లో ఉన్నత విద్యా రంగం లో ఎన్రోల్మెంట్ శాతం చాలా తక్కువ అది 11% గా  ఉంది.
 • ఒక సర్వే ప్రకారం భారత దేశం లో ప్రతి పది మంది మానవీయ శాస్త్రాల(Arts) డిగ్రీ విద్యార్ధులలో ఒకరు మరియు ప్రతి నలుగురు ఇంజనీరింగ్ విద్యార్ధుల లో  ఒకరు  మాత్రమే ఉద్యోగం  కలిగి ఉన్నారు.
 • ఉన్నత విద్య సంస్థలలో అద్యాపకుల  డ్రాప్-అవుట్ రేట్(మద్య లో వైదోలిగే వారు) చాలా అధికం మరియు  IIT ల వంటి విద్య సంస్థలలో 'ఆచార్యుల’    డ్రాప్-అవుట్ రేట్   20-30% వరకు ఉంది.
• అక్రిడిటేషన్ కౌన్సిల్ మరియు నేషనల్ అసెస్మెంట్(NAAC-నాక్) నిర్వహించిన  సర్వే 70% ప్రకారం 70% విశ్వవిద్యాలయాలు మరియు 90% కళాశాలలు తక్కువ విద్యా ప్రమాణాలు కలిగి ఉన్నాయి.
• దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు ఐదేళ్లలో కనీసం ఒకసారి వారి జాతీయ విద్యాప్రణాళిక (national curriculum) ను సవరించు తున్నాయి.
• భారతదేశం లో ప్రభుత్వం అధికారం మరియు పెరుగుతున్నఇతర ఏజన్సీల నియంత్రణ విద్యా వ్యవస్థ యొక్క ప్రమాణాలను తగ్గించింది మరియు అవినీతి కి దారితీసింది.
ఇటువంటి పరిస్థితులలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తొలిసారిగా దేశ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్‌, ఫార్మసీ కళాశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ర్యాంకులను ప్రకటించింది. నాలుగు క్యాటగిరీల్లో టాప్ 100 జాబితాతో ఇండియా ర్యాంకింగ్స్-2016 విడుదల చేసింది.
ఇప్పటివరకు దేశంలోని ఉన్నత విద్యాసంస్థలకు ర్యాంకింగ్ విధానం లేదని తొలిసారిగా ప్రకటించడం ద్వారా వివిధ కోర్సుల్లో చేరడానికి విద్యార్థులకు ఏ విద్యాసంస్థ అయితే బాగుంటుందనే దానిపై అవగాహన ఉంటుందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ తెలిపారు.
దేశంలోని మొత్తం 3600 ఉన్నత విద్యా సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానించామని, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ సంస్థ ఈ ర్యాంకుల ప్రక్రియలో చురుకైన పాత్ర పోషించిందని తెలిపారు. విద్యా సంస్థల్లో బోధన/అభ్యాసం, పరిశోధన, వృత్తిపరమైన (ప్రొఫెషనల్) ప్రావీణ్యత, ఎక్కువ సంఖ్యలో పట్టభద్రులు ఉత్తీర్ణులు కావడం, ఉపాధి అవకాశాలు (ప్లేస్‌మెంట్స్) లభించడం, సమాజంలో ఆ విద్యా సంస్థపై ఉన్న సాధారణ అభిప్రాయం.. ఇలా ఆరు అంశాల్లో ఆయా విద్యా సంస్థలకు లభించిన మార్కుల శాతాన్ని బట్టి ర్యాంకులను ప్రకటించామని తెలిపారు.
ర్యాంకింగ్‌లో వెనకబడిపోయిన విద్యా సంస్థలు ఇప్పుడు వచ్చిన ర్యాంకులను స్ఫూర్తిగా తీసుకుని ఆరోగ్యకరమైన పోటీ ద్వారా భవిష్యత్తులో మెరుగైన స్థానాన్ని పొందడానికి వీలు కలుగుతుందన్నారు. ఇదే తొలిసారి అయినప్పటికీ ఇకపై ప్రతి సంవత్సరం ర్యాంకులను ప్రకటిస్తామని, తద్వారా ఆయా విద్యా సంస్థలు పనితీరును మెరుగుపర్చుకోవడంతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు స్పష్టత ఏర్పడుతుందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా మన విద్యా సంస్థల ర్యాంకులను బట్టి గుర్తింపు లభిస్తుందని అన్నారు. 

టాప్ 10 ఇండియా ర్యాంకింగ్స్ 2016 లిస్ట్
ర్యాంక్
యూనివర్సిటి
ఇంజినీరింగ్
మ్యానేజ్మెంట్
ఫార్మసి
1.      
ఇండియన్ ఇనిస్తిత్యుట్ అఫ్ సైన్సెస్, బెంగలూరు
ఐఐటీ మద్రాస్.                            
 ఐఐఎం బెంగళూరు ,
కర్ణాటక
మణిపాల్ కాలేజ్ అఫ్ ఫార్మాసుటికల్స్,మణిపాల్ 
2.
ఇనిస్తిత్యుట్ అఫ్ కెమికల్ టెక్నోలజి, బొంబాయి
ఐఐటీ బాంబే                        
ఐఐఎం అహ్మదాబాద్
యునివేర్సితి ఇనిస్తిత్యుత్ అఫ్ ఫార్మాసుటికల్స్,చండీగర్ 
౩.
జే.ఎన్.యు. న్యూడిల్లి
ఐఐటీ ఖర్గపూర్                         
ఐఐఎం
కలకత్తా
జామియా హందర్డ్ , డిల్లి.
4
యునివేర్సితి అఫ్ హైదరాబాద్
ఐఐటీ ఢిల్లీ                                
ఐఐఎం
లక్నో
పూనా కాలేజ్ అఫ్ ఫార్మసి, పూణే
5
తేజపూర్ యునివేర్సితి, అస్సాం
ఐఐటీ కాన్పూర్                         
ఐఐఎం ఉదయ్‌పూర్, రాజస్తాన్
ఇనిస్తిత్యుత్ అఫ్ ఫార్మసి నిర్మా యునివేర్సితి, అహ్మదాబాద్.
6
యూనివెర్సిటి అఫ్ డిల్లి, డిల్లి.
ఐఐటీ రూర్కీ                             
ఐఐఎం
కోజికోడ్
కేరళ
బొంబాయి కాలేజ్ అఫ్ ఫార్మసి బొంబాయి
7
బి.హెచ్.యు.వారణాసి
ఐఐటీ హైదరాబాద్                      
ఇంటర్ నేషనల్ ఇనిస్తిత్యుత్ అఫ్ మ్యానేజ్మేంట న్యూ డిల్లి.
బిట్స్, రాంచి
8
ఇండియన్ ఇనిస్తిత్యుత్ అఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నా నాలజి
ఐఐటీ గాంధీనగర్, గుజరాత్
ఇండియన్ ఇనిస్తిత్యుత్ అఫ్ ఫారెస్ట్ మ్యానేజ్మెంట్ ఇండోర్
అమ్రిత స్కూల్ ఫార్మసీ కొచ్చి, కేరళ
9
బిట్స్ పిలాని
ఐఐటీ రొపౌర్ పంజాబ్
ఐఐటీ కాన్పూర్
జేఎస్ఎస్. కాలేజీ అఫ్ ఫార్మసి ఉదకమంద్, తమిళనాడు.
10
ఆలీగర్ ముస్లిం యూనివెర్సిటి, ఆలీగర్
ఐఐటీ పట్నా              


ఐఐఎం ఇండోర్
జేఎస్ఎస్. కాలేజీ అఫ్ ఫార్మసి, మైసూరు

అర్చిటేక్చర్ రంగం లో కాలేజి లు ఆసక్తి చూపనందున వాటికి ర్యాంకులు  ఇవ్వలేదు. వర్సిటీలు, ఇంజినీరింగ్ విభాగాల్లో టాప్-100 స్థానాలను, మేనేజ్‌మెంట్, ఫార్మా విద్యా సంస్థల్లో టాప్-50 విద్యాసంస్థల ర్యాంకులను హెచ్‌ఆర్‌డీ శాఖ ప్రకటించింది

టాప్ ర్యాంకులన్నీ ఐఐటీలవే
 
ఇంజనీరింగ్ విభాగంలో ఒకటి నుంచి 12వ ర్యాంకు దాకా ఐఐటీలే సాధించాయి. మేనేజ్‌మెంట్ విద్యా సంస్థల్లోనూ ప్రభుత్వ రంగంలోని ఐఐఎంలే తొలి పది ర్యాంకులనూ కైవసం చేసుకున్నాయి.

ఉభయ తెలుగు రాష్ట్రాల లోని విద్య సంస్థల ర్యాంకింగ్:
మొత్తం 16సంస్థలకు ర్యాంకింగ్స్2016 లో చోటు లబించినది.
విశ్వవిద్యాలయాల కేటగిరీలో వంద యూనివర్సిటీల జాబితా లో తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు విశ్వవిద్యాలయాలకే ఈ జాబితాలో స్థానం లభించింది. ఇందులో మూడు తెలంగాణకు, మూడు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి ఉన్నాయి.
తెలంగాణా:యూనివర్సిటీల్లో హెచ్‌సీయూకి నాలుగో స్థానం, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ వరుసగా 23, 33వ స్థానాలు దక్కించుకొన్నాయి

ఇంజినీరింగ్ విభాగం :
ఐఐటి హైదరాబాద్ 7వ ర్యాంక్,NITT వరంగల్ 28 ర్యాంక్, సి.బి.ఐ.టి. 71 వ ర్యాంక్,
ఆంధ్ర ప్రదేశ్ నుంచి కే.ల్.యునివేర్సిటి 59 ర్యాంక్, శ్రీ రామకృష్ణ రాజు ఇంజనీరింగ్ కాలేజీ,భీమవరం 73 వ ర్యాంక్, విజ్ఞాన్ ఇంజినీరింగ్  కాలేజీ 88 వ ర్యాంక్ పొందినవి.
మ్యానేజ్మెంట్ విభాగం లో  ఇనిస్తిత్యుత్ అఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్  38వ ర్యాంక్ పొందినది.
ఫార్మా రంగం లో తెలంగాణా లో యూనివర్శిటీ అఫ్ ఫార్మాసుటికల్ సైన్సెస్, వరంగల్  16వ స్థానం పొందినది. ఆంధ్ర ప్రదేశ్ లో రాఘవేంద్ర ఇనిస్తిత్యుత్ అఫ్ ఫార్మాసుటికల్ ఎడుకేషన్ అండ్ రిసర్చ్ (RIPER) అనంతపూర్ కు 20వ ర్యాంక్ లబించినది
విమర్శ:


కేంద్ర మానవ వనరుల శాఖ ప్రకటించిన ర్యాంకింగ్ 2016 పై అనేక విమర్శలు తలఎత్తినవి. సౌకర్యాలు లేని IIM-ఉదయపూర్  IIM-కోజికోడే, IIM-ఇండోర్ కన్నా ఎక్కువ ర్యాంక్ లబించడం విమర్శకులను ఆశ్చర్య పరిచినది. అదేవిదoగా డిల్లి లో డిల్లి యూనివర్సిటి, జే.ఎం.యు. తరువాత విధ్యార్ధులను ఎక్కువగా ఆకర్షించే జామియా మిలియా కు 83వ స్థానం లబించడం అందరిని ఆశ్చర్య పరిచినది.  IIFT కు విశ్వవిద్యాలయ స్థాయిలో 81 వ ర్యాంక్ లబించడం అనేక విమర్శకులకు దారి తీసింది. IIFT కేంద్ర కామర్స్ మరియు పరిశ్రమల శాఖ అద్వర్యం లో నడుస్తుంది అది నిజానికి ఒక మ్యానేజ్మెంట్ ఇనిస్తిత్యుషణ్. ర్యాంకింగ్స్ 2017 నాటికి ఈ లోపాలన్నీ సరిద్దిడ్డ బడతాయని ఆశించుదాము.

విద్యలో ఈ -పోకడలు(E-trends in education)




డిజిటల్ లెర్నింగ్ ఆధునిక విద్య లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పోకడల లో  ఒకటి.  ఈ రంగంలో కెరీర్లు పుష్కలంగా ఉన్నాయి. “మీ శక్తి అంత పాత దానితో పోరాటం లో కాదు కొత్త దానిని నిర్మించడం లో ఉంచండo” అని  సోక్రటీస్ మార్పు ను నిర్వచించినాడు.

డిజిటల్ ఆధారిత అభ్యాసం ఆధునిక విద్యలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న  పోకడలలో  ఒకటి. ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు  ఈ-లెర్నింగ్ మార్కెట్లో అనేక నూతన సాంకేతికతలను అంచనా వేసినారు. ఎడ్-టెక్ స్పేస్ ఒక ఉత్తేజకరమైన మార్పు దశ లో కొత్త  పరిచయాలు  చేయడానికి తొందరగా  ఉంది. బోధన మరియు అభ్యాసన ఉద్యమం సమూలంగా  కొత్త లెర్నింగ్ గుణకాల ఆవిష్కరణ లోను  మరియు ఆ రంగంలో నైపుణ్యాన్ని సాదించడానికి అధ్యాపకులకు వివిధ నూతన మార్గాలు తెరిచింది. వాటిలో కొన్నింటిని మేము ఇక్కడ ప్రస్తావిస్తున్నాము:

1.అభివృద్ధి చెందిన శిక్షణ (Augmented Learning)
అభివృద్ధి చెందిన శిక్షణ  అనేది ఒక  సంచలనం పదం. ఇది ఈ-లెర్నింగ్ యొక్క పొడిగింపు అందులో స్థానికత, సందర్భం మరియు భౌతిక స్పేస్ కనిపించును. ఇది విద్యలో డిజిటల్ మరియు ఆడియో టెక్నాలజీ ఉపయోగం అలాగే వర్చువల్ రియాలిటీ  ని ఉపయోగించును. అభివృద్ధిచెందిన ఇన్నోవేటివ్ లెర్నింగ్ లో భాగంగా డిజిటల్ లెర్నింగ్ పద్దతులను మీడియా ఫార్మట్ లోనికి విలీనం చేసి  ఒక వినూత్న పద్దతి సిత్యువేతేడ్ లెర్నింగ్ నేర్చుకోవడానికి ఉపకరిస్తుంది.  ఈ రిచ్ మీడియా అనుభవం వీడియోలు, చిత్రాలు, యానిమేషన్లు, 3D రూపంలో ఆసక్తికరమైన విషయాన్ని చూపించును  మరియు అనుబంధ వాస్తవికత, అప్లికేషన్ తో చిత్రాల స్కానింగ్ ద్వారా, వాటి చుట్టూ ఏమి జరుగు తుందో తెలుసుకుంటాము.

2.ఎం-లెర్నింగ్( M-Learning)
ఒక మొబైల్ సగటున భారతీయ విద్యార్థి జీవితంను  12 శాతం నియంత్రణ లోనికి తీసుకుంటోంది. పరిమిత మౌలిక సదుపాయాలు,  అధిక తీరిక సమయాలు, కళాశాల లేదా వయోజన విద్య ను మొబైల్ విద్య ద్వారా  అందించే  సంస్థలకు కనెక్ట్  అవుతున్నాయి. విషయాన్ని  యాక్సెస్ చేసేందుకు తమ మొబైల్ ను  కేవలం వాటితో  లాగిన్ చేయాలి. లైవ్  వీడియోలు, స్ట్రీమింగ్ సెషన్ ప్రత్యక్ష పరస్పర సంభాషణ , కోర్సు విషయాలు మరియు అనేక ఇతర లక్షణాలను వీటినుండి గ్రహించ వచ్చును. M- లెర్నింగ్ ఫ్లిప్పేడ్ తరగతులు మరియు MOOCs వంటి వాటిని చూపిస్తుంది. HTML5 వివిధ బ్రౌజర్ల ద్వారా ఎం-లెర్నింగ్ నేర్చుకోవటానికి ఉపయోగ పడును.


3.గామిఫికేషణ్ (Gamification)
గామిఫికేషణ్ ద్వారా విద్య 1980 లలో ప్రారంభం అయినది. జేల్డా, కార్మెన్ సాన్దిగో దీని ప్రారంభకులు.  ప్రస్తుత దశాబ్దంలో గామిఫికేషణ్ (Gamification) ఎన్నడు  లేనంతగా   భారతీయ విద్యా విఫణిలో నమోదు చేయబడుతుంది. క్యాస్కేడింగ్ సమాచార సిద్ధాంత భావన  అడుగడుగునా సమాచారాన్ని పాఠశాలల్లో ప్రయోగాత్మక లెర్నింగ్ ద్వారా మరియు ఉన్నత విద్య లో తెరవబడటానికి  అనుమతిస్తుంది. క్లాసు దోజో (ClassDojo), డ్యోలింగో వంటి ప్రపంచవ్యాప్త  బ్రాండ్స్ తో  ఎడ్-గామిఫికేషణ్ చిత్రం మారిపోతున్నది.

4.అదృశ్య లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టం( Invisible LMS)
పురాతన లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టం (LMS) విధానం  కనపడకుండా పోతుంది. అది  కొత్త అవతారం ఎత్తుతుంది. అన్ని లెర్నింగ్ ప్రక్రియలు  విద్య వ్యవస్థలో అవసరం. ఒక శుభవార్త LMS అభ్యాసకులకు తక్కువుగా  కనిపించేది అవుతుంది. ఒక LMS ను సృష్టించడం / హోస్టింగ్ / రికార్డు కీపింగ్ పరంగా మరింత కఠినమవుతుంది మరియు కొత్తదనం, ప్రయోగాలకు అవకాసం ఇవ్వదు. భవిష్యత్తు శాండ్బాక్స్ (sand boxing) లో ఉంది: పాఠాల రచన మరియు ప్రచురణ,స్టూడెంట్ రికార్డుల బద్రపరుచుట మరియు యూజర్ ఇంటర్ఫేస్ నిర్వహణ విద్యా పర్యావరణ వ్యవస్థల స్వతంత్ర, మాడ్యులర్ భాగాలు  నిర్వహించుతాయి.

5. ప్రయోగ శిక్షణ(Experiment Learning)
రోబోటిక్స్, స్వీయ ఎలక్ట్రానిక్ కిట్లు, పాఠశాల కిట్లు, గేమింగ్  ఇలా మీరు ఏదైనా చెప్పండి అది ప్రయోగ శిక్షణ తో (Experiment  Learning) ముడిపడి ఉంది. కొత్త బ్రాండ్లు, భావనలు, ఎడ్-టెక్ కంపెనీలు ప్రతి రోజు వస్తున్నాయి. ఉదా: గుగూల్ గ్లాస్ టూర్స్. ఇండియన్ ఎడ్-టెక్   కంపెనీలు ఈ విషయంలో ముందజ వేసి  కిరణజన్య సంయోగ క్రియ నుండి స్వీయ పని  నమూనాలు, వక్రిభవనం వరకు  ప్రతి మోడల్ వ్యక్తి పరంగా ఉంది.

6.మిశ్రమ జ్ఞానార్జన
 భౌతికoగా పుస్తకాల ద్వారా  లెర్నింగ్ రోజుల వెళ్ళాయి. కానీ ఈ-లెర్నింగ్ పై మొత్తం ఆధారపడటం ఇంకా చాలా దూరంలో ఉంది. ఈ విధానం సాంప్రదాయిక తరగతి బోధన విధానం ను ఈ-లెర్నింగ్ విధానం తో మిళితం చేసింది. ఇది బహుళ పరికరాల  లెర్నింగ్,  కోర్స్ లను ఉన్న వనరులతో కలపడం,వివిధ బోధనా వ్యూహాలు నేర్చుకోవడం తెలుపుతుంది. టెక్నాలజిస్ ను కలపడం, ఫ్లాట్ ఫార్మ్స్, మూలాలు మరియు కంటెంట్ ప్రొవైడర్లు  ఇవి  2016 లో వచ్చే నూతన బోధనా టెక్నాలజీస్.

7.సొంతంగా విద్యార్జన (సెల్ఫ్ -అసిస్టెడ్ లెర్నర్)

కొత్త తరం  విద్యార్ధి కోర్సులు, పుస్తకాలు లేదా కరిక్యులం కోసం ఎదురు చూచుట లేదు, అతను వాటిని దాటి వెళ్ళాలని అనుకొంటున్నాడు. కొత్త విషయాలు   తెలుసుకోవడo, స్వీకరించడం, మరియు తన సొంత సంకల్పం  మరియు వేగంతో విషయాలు కనిపెట్టాలని అనుకోoటున్నాడు. ట్యూటర్స్ ద్వార నేర్చుకోవటం కోచింగ్ క్లాసులకు వెళ్ళే రోజులు పోయాయి. తాజా డేటా ప్రకారం పోటి పరిక్షలలో విజయులైన అబ్యర్ధులు 50 శాతం మంది బాహ్య కోచింగ్ సహాయం లేకుండా స్వయం శిక్షణ తో ఉత్తిర్నులైనారు. విద్యార్ధి రాజు లాగా  తనకి సరిపోయేది ఏమిటో తను స్వయంగా  నిర్ణయించు కొంటున్నాడు.

10 April 2016

ఇస్లాం ధర్మం లో మసీదు మరియు విద్యా పాత్ర



 



ఇస్లాo తోలి కాలంలో మస్జిద్  అనేక ప్రయోజనాల కోసం పనిచేసినది  మరియు ముస్లింల జీవితాల్లో అనేక బాధ్యతలు నిర్వహించినది.  ఆరాధన, శిక్షణ మరియు ప్రార్థన స్థలంగా మాత్రమే గాక ఇస్లాం సమాజం  యొక్క రాజకీయ మరియు సామాజిక కేంద్రంగా పని చేసినది.

నేడు, మనం విద్య గురించి పేర్కొన్నప్పుడు చాలా అరుదుగా ఇస్లాం గురించి  ఆలోచింతాము. అనేక సార్లు 'లౌకిక విద్య' మరియు 'మత విద్య.' అనే పదాలు వింటాము.  ఇస్లాం ధర్మం లో విద్య యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.ఇది  అనేక విధాలుగా దివ్య ఖురాన్ లోను, హదిసులలోను స్పష్టమైంది. ప్రవక్త ముహమ్మద్(స) కు  వెల్లడి అయిన దివ్య ఖుర్ఆన్ లోని మొదటి ఆయత్ “ ఓ ప్రవక్తా! పఠoచు సర్వాన్ని సృష్టించిన నీ ప్రభువు పేరుతో. అయన పేరుకు పోయిన నెత్తుటి ముద్దతో మానవుణ్ణి సృజించాడు. పఠoచు: నీ ప్రబువు పరమ దయాళువు. అయన కలం ద్వారా జ్ఞానం నేర్పాడు, మనిషి ఎరుగని జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాడు.”అంటున్నది.-96:1-5.

దివ్య ఖురాన్ మనలను అల్లాహ్ దగ్గరకు    తీసుకొచ్చే జ్ఞాన సముపార్జన చేయమని కోరుతుంది. దివ్య  ఖురాన్ కొన్ని కీలక అంశాలు మన మనస్సు లో పొందుపరచమని కోరుతుంది. ఇల్మ్ (జ్ఞానం) అనే పదం  దివ్య ఖురాన్ లో 750 సార్లు సంభవిస్తుంది.  అల్లాహ్ మరియు రబ్ (పోషకుడు) అనే పదం వరుసగా 2800సార్లు మరియు  950 సార్లు వినిపిస్తుంది. దివ్య ఖుర్ఆన్ తో పాటు ప్రవక్త ముహమ్మద్(స) యొక్క హదీసులు కుడా  ప్రజలను జ్ఞానం పొంద మంటాయి.  

అరబ్బీ బాష కు చెందిన మస్జిద్ అనే పదం నుంచి మసీద్ అనే పదం  వచ్చింది. మస్జిద్ అనగా ప్రార్థనా  స్థలం అని అర్ధం. మసీదు అనే భావన మదీనా లో ప్రవక్త(స) మొదటి మసీదు నిర్మించిన కాలం లో ఉద్భవించినది.  ఇస్లామిక్ తోలి కాలంలో మసీదు అనేక పనులు నిర్వహించినది  మరియు ముస్లింల జీవితాల్లో సమగ్ర బాధ్యతలు స్వీకరించినది. అది ఆరాధన, శిక్షణ  మరియు ప్రార్థన స్థలం గా మాత్రమే కాకా ముస్లిం సమాజం యొక్క ఒక రాజకీయ మరియు సామాజిక కేంద్రంగా విధులు నిర్వహించినది. ఇక్కడే ప్రవక్త(స) అనుచరులు సమావేశమై అతని సందేశాలు  వినేవారు, అతని అనుచరులు చదువు నేర్చుకొనేవారు, ప్రవక్త (స)  తన వహిలను  వినిపించేవారు, తన ప్రతినిదులను కలసి తన సందేశాలను చర్చించే వారు మరియు   అంతర్గత మరియు బాహ్య రాజకీయ కార్యకలాపాలు చర్చించేవారు.

చారిత్రాత్మకంగా మసీదులు విద్యా కేంద్రాలు. మత మరియు ప్రాపంచిక శాస్త్రాలు రెండు అక్కడ భోదించే వారు. అవి ముస్లింల జీవితాల్లో కీలకపాత్ర పోషించినవి. ఇస్లాం మరియు జ్ఞాన సంపాదన కు దగ్గిర సంభంధం  ఇస్లాం  ప్రారంభ దశ నుండి ఉన్నది. ఇస్లాం ధర్మం లో మసీదు విద్యా వ్యాప్తిలో ఒక గొప్ప పాత్రను వహించినది. విద్యతో మసీదుకు  అవినాభావ సంభందం చారిత్రాత్మకంగా  దాని ప్రధాన లక్షణాల్లో ఒకటి. ప్రారంభం నుండి మసీదు ఇస్లామిక్ సమాజమునకు  కేంద్రంగా ప్రార్థన, ధ్యానం, మత సంబంధమైన బోధన, రాజకీయ చర్చకు చోటుగా  మరియు పాఠశాల గా  ఉంది.

ఇస్లాం మతం విస్తరించిన ప్రతి చోట, మసీదులు ఏర్పాటయ్యాయి, మరియు మసీదు లో ప్రాథమిక మత విద్య  ప్రారంభమైంది. ఒకసారి ఏర్పాటు అయిన తరువాత  అటువంటి మసీదులు సుప్రసిద్ధ జ్ఞాన శిక్షణా కేంద్రాలుగా వర్దిలినవి.అటువంటి ప్రసిద్ధ ప్రదేశాలలో వందల, కొన్నిసార్లు వేల మంది విద్యార్థులతో ముఖ్యమైన గ్రంధాలయాలు కలిగి  ఉండేవి. ఉదాహరణకు   మదీనా, కైరో (అల్ అజహర్ ) మరియు డమాస్కస్ మసీదులు.
మసీదుకు అనుభందంగా  మొదటి పాఠశాల,  మదీనా లో 653CE, డమాస్కస్ లో మొదటి పాఠశాల 744CE లో ఆరంభమయ్యింది మరియు 900CE నాటికి ప్రతి మసీదు అబ్బాయిలు మరియు అమ్మాయిలకు  విడివిడిగా ఒక ప్రాథమిక పాఠశాలను కలిగి ఉండేది.  పిల్లలకు సాధారణంగా ఐదేళ్ల వయస్సు లో వారి విద్యాభ్యాసం ప్రారంభించేవారు. వారు నేర్చుకున్న మొదటి విషయం ప్రార్ధన(Salah) చేయడం మరియు దివ్య  ఖురాన్ పారాయణ చేయడంగా ఉండేది.  ప్రాథమిక విద్య పఠనం తరువాత  అరబిక్ నేర్వడం (చదవడం, వ్రాయడం)గా ఉండేది.

ప్రాథమిక అధ్యయనాలతో పాటు, విద్యార్థులకు  ప్రాథమిక అంకగణితo నేర్పించేవారు.జకత్  మరియు వారసత్వానికి సంభందించిన లెక్కలు తెలుసుకోవడానికి ఇది ఉపకరించేది. పైన పేర్కొన్న పాఠాలను ఏ మసీదులో అయిన పొందవచ్చు మరింత ఆధునిక అభ్యాసం కోసం పెద్ద మసీదులలోని మదరసాలలో శిక్షణా ఇవ్వబడేది.  శిక్షణ పొందే వారు విధిగా అరబిక్ వ్యాకరణం మరియు కవిత్వం, తర్కం, బీజగణితము, జీవశాస్త్రం, చరిత్ర, చట్టం, మరియు  వేదాంత శాస్త్రాలను అద్యయనం చేయవలసి ఉండేది.

మసీదుకు అనుభంద  మదర్సాల్లో కొన్ని ప్రపంచ స్థాయి శిక్షణా కేంద్రాలు గా ఉండేవి. .ప్రపంచ ప్రఖ్యాత అల్ అజహర్ యూనివర్శిటీ ప్రపంచంలోని పురాతన విశ్వవిద్యాలయం ఒకటి. ఇది 358AH నుండి  969CE మద్య  ఒక మసీదు వలె స్థాపించబడింది. ఇప్పుడు, అక్కడ వందల వేల చదువు కొంటున్న విద్యార్ధులను చూడవచ్చు.

చారిత్రాత్మకంగా ఇస్లాం మతం యొక్క చరిత్రలో మసీదు ఎల్లప్పుడూ ఒక ముఖ్యమైన సామాజిక పాత్ర పోషించింది ఇది ప్రార్థన, విద్యా సంస్థ, మత, రాజకీయ మరియు సామాజిక  కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది. మస్జిద్ ముస్లిం సమాజం యొక్క ఒక కేంద్ర బిందువు అయింది. ఖుత్బా (ఉపన్యాసం) ముస్లిం సమాజం ను ఉద్దేశించి ప్రసంగించడానికి  ఒక అద్భుతమైన అవకాశంగా ఉండేది.

ఖుత్బా ఎల్లప్పుడూ ముస్లిం ఉమ్మాకు  సూచనలు,సమాచారం ఇవ్వడం  మరియు తగిన చర్యలు తీసుకోవడం లో ప్రముఖపాత్ర ఆక్రమించినది. అల్లాహ్ సలాత్ అల్- జుమ్మా సమయంలో అన్ని వాణిజ్య మరియు ఇతర కార్యకలాపాలు ఆపివేసి  ప్రజలు ఖుత్బా వినడానికి మస్జిద్ కు రావాలని ఆదేశించినాడు.
దివ్య ఖురాన్ లో అల్లాహ్ అంటాడు:” విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజుకై పిలిచి నప్పుడు, అల్లాహ్ సంస్మరణ వైపునకు పరుగెత్తండి; క్రయవిక్రయాలను వదిలి పెట్టండి. మీరు గ్రహించ గలిగితే ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది.” 62:9.

ఖుత్బా ను ఉమ్మా మొత్తం కోసం  ప్రవక్త (స) మొదలుపెట్టినాడు. కాని నేడు ఖుత్బా సందేశం ఇచ్చేవారు ఇస్లాం మతం యొక్క ప్రాధమిక అంశాలను విస్మరిస్తున్నారు.
ఒక ఆదర్శవంతమైన ఇమామ్ ఫజ్ర్ నమాజ్ తర్వాత ఉదయం ఒక చిన్న ఉపన్యాసం ఇచ్చి తరువాత రోజులో ఆవిశ్వాసులకు ఇస్లాం మతం  గురించి వివరించి తరువాత  ఇస్లామిక్ సంస్థలలో (మదరసా, స్కూల్ లేదా కాలేజి లో)మాట్లాడి ఆతరువాత అవసమైతే మీడియా వారితో సమావేశం జరుపవలెను.  




భారతదేశం లో వర్ధిల్లుతున్న ప్రైవేట్ ట్యూషన్ విద్యా వ్యాపారం:



ట్యూషన్ ను ఆంగ్లం లో షాడో ఎడ్యుకేషన్ (చాయా చదువు) అని పిలుస్తారు.
2007-08 లో భారత దేశం లో ప్రేవేట్ ట్యూషన్ వ్యాపారం సంవత్సరానికి $6.4 బిలియన్లు ఉంది మరియు వచ్చే నాలుగు సంవత్సరాలలో దాని పెరుగుదల సంవత్సరానికి 15% ఉంటుంది. భారత దేశo లో దారిద్య రేఖ  పరిమితి(poverty line) పట్టణాలలో 965రూపాయలుగా, పల్లె ప్రాంతాలలో 781 రూపాయలుగా ఉంది. భారత దేశం లోని గ్రామీణ మరియు పట్టణ విద్యార్ధులు సాలిన తలసరి 1456 రూపాయలనుంచి 2349 రూపాయల వరకు ప్రేవేట్ ట్యూషన్ పై ఖర్చు పెడుతున్నారు.(NSSO సర్వే)
ADB రిపోర్ట్  ప్రకారం ప్రాధమిక స్థాయి విద్యార్ధులు 63% మరియు హై-స్కూల్ విద్యార్ధులు 83% విద్యార్ధులు భారత దేశం లో ప్రైవేట్ ట్యూషన్ కు హాజరు అగుచున్నారు.
NSSO సర్వే ప్రకారం స్కూల్ దశను దాటి జాతీయ స్థాయి లో 20% గ్రాడ్యుయేట్ విద్యార్ధులు మరియు 13% పోస్ట్-గ్రాడ్యుయేట్ విద్యార్ధులు ప్రవేట్ ట్యూషన్స్ కు హాజరు అవుతున్నారు.
.దాదాపు భారత దేశం లోని అన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా తూర్పు రాష్ట్రాలలో ప్రవేట్ ట్యూషన్ వ్యాపారం బాగా సాగు తున్నది. NSSO సర్వే ప్రకారం త్రిపుర లో 81% మంది విద్యార్ధులు మరియు వెస్ట్ బెంగాల్ లో 78% విద్యార్ధులు (స్కూల్ విద్య మరియు కాలేజి విద్య) ట్యూషన్ తీసుకొంటున్నారు భారత దేశం లోని ప్రతి నలుగురు విద్యార్ధులలో ఒకడు ట్యూషన్ కు హాజరు అవుతున్నాడు మరియు కొన్ని రాష్ట్రాలలో ప్రతి నలుగురు విద్యార్ధులలో ముగ్గురు లేదా 75% మంది NSSO సర్వే ప్రకారం ట్యుషన్ కు హాజరు అగుచున్నారు. వ్యక్తిగతంగా లేదా సమూహంగా, లేదా ఇంటివద్ద లేక వేరొక స్థలం లో ట్యూషన్ కు హాజరవుట అలవాటుగా మారింది. స్కూల్ మరియు కాలేజి లలో విద్యా ప్రమాణాల క్షిణత కు ఇది అద్దం పడుతుంది.
వెస్ట్ బెంగాల్ లో 89% మంది సెకండరి మరియు హయ్యర్ సెకండరి విద్యార్ధులు – బాలురు ప్రేవేట్ ట్యూషన్ కు హాజరు అగుచున్నారు. ఇది జాతీయ స్థాయి లో 37.8% గా ఉంది. త్రిపుర లో 87%, బీహార్ లో 67.2%, ఒరిస్సా లో 63.4% గా ఉంది. ప్రైమరీ స్థాయి లో త్రిపుర లో 78.3%, వెస్ట్ బెంగాల్ లో 71.1%, దామన్ మరియు దియు లో 58.8%,చండీగర్ లో 49.4%, బీహార్ లో 46.8% మరియు ఒరిస్సా లో 45% మంది విద్యార్ధులు  ప్రేవేట్ ట్యూషన్ తీసుకొంటున్నారు. 

NSSO సర్వే ప్రకారం డిల్లి లో 32.2% బాలురు మరియు బాలికలు 36.6% మంది ప్రైమరీ స్థాయి లో ట్యూషన్ కు హాజరు అగుచున్నారు.
భారత దేశం లో గత కొద్ది సంవత్సరాలుగా స్కూల్,కాలేజి రంగంలో విద్య ప్రమాణాలు క్షిణించడం తో ప్రేవేట్ ట్యూషన్ వ్యాపారం బాగా అభివృద్ధి చెందినది. తల్లి తండ్రులు తమ పిల్లలకు చదువుతో బాటు ట్యూషన్ ఉంటె బాగా రాణిస్తారని పోటి పరిక్షలలో ఉత్తిర్నత సాధించుతారని విశ్వసిస్తున్నారు.
నోబుల్ గ్రహీత అమర్త్య సేన్ ప్రకారం ప్రైవేట్ ట్యూషన్ పెరుగు తున్న ఆదాయాల పలితం మరియు తప్పినిసరి అనే భావన పలితంగా అభివృద్ధి చెందుతుంది. టీచర్ల సెలవలు, నిర్ణిత సమయం లో సిలబస్ పూర్తి చేయక పోవటం వలన ప్రైవేట్ ట్యూషన్స  పెరుగు తున్నవి.ప్రాధమిక స్థాయి రెగ్యులర్ క్లాసులలో చెప్పక పోవటం వలననే ప్రైవేట్ ట్యూషన్లు పెరుగుతున్నవి.
78% పేరెంట్స్ ట్యూషన్ అనివార్యమని  బావిస్తున్నారు. 54% మంది ట్యూషన్ ఖర్చులు భరించ లేక తమ పిల్లలను ట్యూషన్ కు పంపుట లేదు.
కాని యు.పి. లో ట్యూషన్ పై ఆధారం చాల తక్కువ. ప్రైమరీ లెవెల్ లో బాలురు 12.2% ట్యూషన్ కి హాజరు అవుతున్నారు. జాతీయ స్థాయి లో  అది 23.1% ఉంది. అప్పర్ ప్రైమరీ స్థాయి లో 13.7% బాలురు లో ఉండగా జాతీయ స్థాయి లో అది 28% ఉంది. యు.పి. లో గ్రాడ్యుయేట్ స్థాయి లో 15.8% మరియు పోస్ట్-గ్రాడ్యుయేట్ స్థాయి లో 9.5% మంది ట్యూషన్ కు హాజరు అగుచున్నారు. అది జాతీయ స్థాయి లో వరుసగా 20.3% మరియు 13% ఉంది.

ట్యూషన్  సమస్య ఒక్క ఇండియా కే పరిమితం కాలేదు. ఒక రీసెర్చ్ పేపర్ ప్రకారం  అనేక అభివృద్ధి చెందిన దేశాలలో ఉదా: మిడిల్ స్కూల్ పూర్తి అయ్యేటప్పటికి 70% జపాన్ విద్యార్ధులు మరియు సీనియర్ సెకండరీ స్థాయి దాటేటప్పటికి మలేషియా లో 83% విద్యార్ధులు ట్యూషన్ కి హాజరు అగుచున్నారు. సౌత్ కొరియా లో 83.1% ప్రైమరీ  విద్యార్ధులు, 92.8% మిడిల్ స్కూల్ విద్యార్ధులు, 87.8% హై-స్కూల్ విద్యార్ధులు ప్రైవేట్ ట్యూషన్ కు హాజరు అగుచున్నారు.
గ్రామీణ భారత  స్కూల్స్ లో కొత్త ఎన్రోల్మెంట్ లో దాదాపు 25% మంది ప్రైవేట్ స్కూల్స్ లో జేరుతున్నారు.

ప్రాధమిక స్థాయి లో ప్రవేట్ ట్యూషన్స్ ఎక్కువ అయినది.  రైట్ టూ ఎడ్యుకేషన్ మరియు సర్వ శిక్ష అభియాన్ విస్తృతంగా అమలు  అవుతున్నప్పటికి భారత దేశం లోని 99% పల్లెలలో కొత్తగా స్కూల్ లో చేరేవారిలో 25% ప్రేవేట్ స్కూళ్ళ లలో జేరుతున్నారు.ASER రిపోర్ట్ ప్రకారం 6-14 సంవత్సరాల మద్య వయస్సు గల పిల్లలలో 29% మంది ప్రైవేట్ స్కూళ్ళ లలో జేరుతున్నారు. ఇది 2006-13 మద్య 13% పెరుగుదల గా ఉంది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం ప్రైవేట్ స్కూళ్ళ పై పేరెంట్స్ కు మంచి అభిప్రాయం ఉండుటయే అన్నది వాస్తవం.
ప్రేవేట్  ట్యూషన్ అభివృద్ది చెందటానికి ప్రబుత్వ స్కూల్స్ లో విద్యా క్వాలిటీ సరిగా లేకపోవడమే కారణం కాదు. ఉదా: కేరళలో ఎలిమెంటరీ విద్యార్ధులలో 68.6% మంది ప్రైవేట్ స్కూల్స్ లో మరియు త్రిపురా లో 70% మంది ప్రేవేట్ స్కూల్స్ లో ఎన్రోల్ అయినారు. ఎలిమెంటరీ విద్యార్ధులలో పుదుచేర్రి లో 53.3% మంది, హర్యానా లో 51.4% మంది, యు.పి. లో 49% మంది, పంజాబ్ లో 46.7%, జే.కే. లో 45.5%, మేఘాలయా లో 45.3% ప్రేవేట్ స్కూల్స్ లో ఉన్నారు. అదేవిధం గా ప్రేవేట్ స్కూల్స్ లో ప్రవేట్ ట్యూషన్ కు పోయేవారి సంఖ్య 24.1% కు పెరిగింది.
దీనితో ప్లానింగ్ కమిషన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధమిక విద్య పై వ్యయం విషయం లో పునరాలోచన చేయవలసిన అవసరం ఉంది. మొదటి తరం పిల్లలు ఎక్కువగా చేరటం వలన లెర్నింగ్ ప్రమాణాలు ప్రబుత్వ పాఠశాల లలో ఇంకా ఒక దశాబ్దం వరకు తక్కువుగా ఉండవచ్చు. ఎలిమెంటరి  పిల్లలలో చదేవే శక్తీ, బేసిక్ మ్యాథ్ ను నేర్చుకొనే శక్తీ ప్రేవేట్ స్కూల్స్ ద్వారా 38.8% నుంచి 40.2% కు పెరుగుట గమనించాల్సిన విషయం.    
ప్రేవేట్ ట్యుషన్ పెరుగుదలకు పట్టనికరణ పెరుగుట, ఆదాయాలు పెరుగుట, బయట ప్రపంచం గురించి వివరాలు తెలుయుట  కారణాలుగా చెప్పవచ్చును. అదేవిధం గా ప్రచార సాధనల ద్వార తెలియని విషయాలు తెలియుట  మరియు విద్యా పరిస్థితుల పై  పట్టణాల ప్రభావం  పల్లెలపై ఉండుట కుడా చెప్పవచ్చును.