26 September 2025

ఇస్లాం ప్రకారం కుమార్తెలు అల్లాహ్ యొక్క ఆశీర్వాదాలు Islam says daughters are blessing from of Allah

 

జాహిలియా (అజ్ఞానం) యుగం లో ఆడ పిల్లలను తృణీకరించేవారు, వారసత్వాన్ని తిరస్కరించేవారు మరియు సామాజిక అవమానం లేదా పేదరిక భయం కారణంగా సజీవంగా ఖననం చేయబడ్డారు. అయితే, ఇస్లాం రాకతో, ఈ అన్యాయమైన ప్రవర్తన గట్టిగా తిరస్కరించబడింది. ఇస్లాం కుమార్తెల స్థితిని పెంచింది, వారికి గౌరవం, హక్కులు ఇచ్చింది మరియు వారిని ఆశీర్వాదం, దయ మరియు ఆధ్యాత్మిక బహుమతికి మూలంగా చూపించింది.

ఖురాన్ అవతరణకు ముందు, కొన్ని అరబ్ తెగలు కుమార్తె జననాన్ని అవమానంగా భావించాయి. ఖురాన్ అటువంటి వైఖరిని స్పష్టమైన పదాలలో ఖండిస్తుంది:

“మరియు వారిలో ఒకరికి స్త్రీ శుభవార్త అందించబడినప్పుడు, అతని ముఖం నల్లగా మారుతుంది మరియు అతను తన దుఃఖాన్ని అణిచివేస్తాడు. తనకు వచ్చిన చెడు వార్త కారణంగా అతను ప్రజల నుండి దాక్కుంటాడు. ఆమెను ఉండనివ్వాలా లేదా భూమిలో పాతిపెట్టాలా? అని సతమతమవుతుంటారు.నిస్సందేహంగా, వారు నిర్ణయించుకునేది చెడు.” (ఖురాన్ 16:58–59)

పై ఆయత్ శిశుహత్య ను నిషేధించడమే కాకుండా, కుమార్తెలను తిరస్కరించడం తీవ్రమైన తప్పు అని బోధిస్తుంది. ఇస్లాం తల్లిదండ్రులు కుమార్తె జననాన్ని కృతజ్ఞతతో జరుపుకోవాలని కోరింది.

 అల్లాహ్ దయ మరియు ప్రతిఫలానికి కూతుళ్లు ఒక సాధనమని ఇస్లాం బోధిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “ఎవరికి ముగ్గురు కుమార్తెలు ఉండి, వారికి విద్య నేర్పి,వివాహం చేస్తే, వారు అతనికి నరకాగ్ని నుండి రక్షణ కవచంగా ఉంటారు.” (సునన్ ఇబ్న్ మాజా)

మరొక హదీసు ప్రకారం, ప్రేమ మరియు శ్రద్ధతో పెరిగిన ఇద్దరు కుమార్తెలు కూడా స్వర్గంలో తల్లిదండ్రుల స్థానాన్ని పొందేందుకు సరిపోతారు. కుమార్తెలు ఒక ట్రస్ట్ (అమానా) మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక విజయానికి అవకాశం.

ఇస్లాం తల్లిదండ్రులకు తమ కుమార్తెలకు తమ కుమారుల మాదిరిగానే ప్రేమ, విద్య మరియు పెంపకాన్ని అందించాలని ఆజ్ఞాపిస్తుంది. ప్రవక్త(స) ఎప్పుడూ అబ్బాయిలు మరియు అమ్మాయిల మధ్య ప్రేమలో తేడాను గుర్తించలేదు. తన కుమార్తె ఫాతిమా అల్-జహ్రా (RA) తన గదిలోకి ప్రవేశించినప్పుడల్లా, ప్రవక్త (స) ఆమెను పలకరించడానికి లేచి, ఆమె నుదిటిపై ముద్దు పెట్టుకుని, ఆమెను తన పక్కన కూర్చోబెట్టుకొనేవారు”.

జ్ఞానాన్ని పొందడం అనేది ప్రతి ముస్లిం, పురుషుడు మరియు స్త్రీపై విధి. కుమార్తెలకు నేర్చుకోవడానికి, పెరగడానికి మరియు వారి ప్రతిభను అభివృద్ధి చేసుకునే హక్కు ఉంది.

వివాహ ప్రతిపాదనలను అంగీకరించడానికి లేదా తిరస్కరించడానికి వారికి స్వేచ్ఛను ఇవ్వడం ద్వారా, ఇస్లాం కుమార్తెలను రక్షిస్తుంది. స్త్రీ అనుమతి లేకుండా, వివాహం చట్టబద్ధంగా పరిగణించబడదు. వారసత్వం విషయంలో కుమార్తెలను న్యాయంగా చూసుకోవాలని ఖురాన్ తల్లిదండ్రులకు సూచించింది. కుటుంబ పరిస్థితుల ఆధారంగా వారసత్వ వాటాలు భిన్నంగా ఉన్నప్పటికీ, కుమార్తె వారసత్వ హక్కు విడదీయరానిది మరియు దైవిక చట్టం ద్వారా రక్షించబడింది.

కుమార్తెలను ప్రేమ, న్యాయంగా మరియు మంచి మర్యాదలతో పెంచడం అనేది ఆరాధన చర్య. తమ కుమార్తెలకు సరైన ఇస్లామిక్ పెంపకాన్ని అందించే తల్లిదండ్రులకు అపారమైన ప్రతిఫలం లభిస్తుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “ఇద్దరు కుమార్తెలను పరిపక్వత వచ్చే వరకు సరిగ్గా పెంచేవాడు తీర్పు రోజున నాతో ఇలాగే ఉంటాడు” అని ఆయన తన వేళ్లను జోడించాడు. (ముస్లిం)

 

 

25 September 2025

సఫీనా హుస్సేన్: 2025 రామన్ మెగసెసే అవార్డు పొందిన ‘ఎడ్యుకేట్ గర్ల్స్ Educate Girls’ సంస్థ స్థాపకురాలు Safina Hussain: Empowering Girls' Education, Honoured with the Ramon Magsaysay Award

 

 

 


 

సఫీనా హుస్సేన్ ఒక సామాజిక కార్యకర్త, ఎడ్యుకేట్ గర్ల్స్ వ్యవస్థాపకురాలు - ఇది భారతదేశంలోని ముంబైలో ప్రధాన కార్యాలయం కలిగిన లాభాపేక్షలేని సంస్థ .

సఫీనా హుస్సేన్ స్థాపించిన ఎడ్యుకేట్ గర్ల్స్ భారతదేశంలోని గ్రామీణ, విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతాలలో బాలికల విద్య కోసం సంఘాలను సమీకరించడంపై దృష్టి పెడుతుంది.  

సఫీనా హుస్సేన్, తన సంస్థ ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ ద్వారా భారతదేశంలో 20 లక్షలకు పైగా బాలికల జీవితాలను   విద్యను అందిoచడం ద్వారా మార్చింది. రాజస్థాన్‌లో సఫీనా హుస్సేన్ ప్రారంభించిన, ‘ప్రగతి’ వంటి కార్యక్రమాలు బాలికలు చదువులు తిరిగి ప్రారంభించడంలో సహాయపడినాయి. 2025 రామన్ మెగసెసే అవార్డు వంటి ప్రతిష్టాత్మక అవార్డు సఫీనా హుస్సేన్ యొక్క ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ సంస్థ పొందినది..

భారతదేశంలో బాలికల విద్యను ప్రోత్సహించడానికి సఫీనా హుస్సేన్ “ఎడ్యుకేట్ గర్ల్స్‌” సంస్థను స్థాపించారు. ఎడ్యుకేట్ గర్ల్స్‌ సంస్థ మొదట రాజస్థాన్‌లో ప్రారంభించి, ఇప్పుడు 55,000 మంది స్వచ్ఛంద సేవకులతో 30,000 గ్రామాలను కవర్ చేస్తుంది. “ఎడ్యుకేట్ గర్ల్స్‌” స్కూల్ డ్రాపౌట్స్‌పై దృష్టి సారించి, 20 లక్షలకు పైగా బాలికలను పాఠశాలల్లో తిరిగి  చేర్పించారు.

ఓపెన్ స్కూల్ ద్వారా బాలికలు చదువులు తిరిగి ప్రారంభించడానికి “ప్రగతి”ని సఫీనా హుస్సేన్ ప్రారంభించారు.  “ఎడ్యుకేట్ గర్ల్స్‌” 2025 రామన్ మెగసెసే అవార్డుతో సహా బహుళ అవార్డులను గెలుచుకున్నది.

భారతదేశంలో లక్షలాది మంది బాలికలు చదువుకు దూరంగా ఉండటం, వివాహం, ఇంటి బాధ్యతల కారణంగా చదువును మధ్యలోనే ఆపేయాల్సి వస్తోంది.గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది బాలికలు ఎప్పుడూ చదువుకోలేదు, చదువుకోవాలని కోరుకుంటారు కానీ అవకాశం లభించదు.అలాంటి బాలికలకు తమ కలలను నెరవేర్చుకోవడానికి, ఆశలతో ఉన్నత స్థాయికి ఎగరడానికి, విద్యను పూర్తి చేయడానికి, తమ సొంత గుర్తింపును సృష్టించుకోవడానికి, స్వావలంబన సాధించడానికి అవకాశం మరియు మద్దతు అవసరం.

ఈ అవకాశం మరియు మద్దతును వారికి "సఫీనా హుస్సేన్" మరియు ఆమె సంస్థ "ఎడ్యుకేట్ గర్ల్స్" అందించాయి. తన దార్శనిక చొరవ మరియు బలమైన సంకల్ప శక్తితో, సఫీనా హుస్సేన్ లక్షలాది మంది బాలికల జీవితాలను పూర్తిగా మార్చివేసింది మరియు వారికి విద్య అనే విలువైన బహుమతిని ఇచ్చింది.

సఫీనా హుస్సేన్ బాలికా విద్యా సాధికారతకు గొప్ప ఉదాహరణ. సఫీనా హుస్సేన్ చాలా మంది బాలికల భవిష్యత్తును చీకటి నుండి బయటకు తీసుకువచ్చింది.

సఫీనా హుస్సేన్ 21 జనవరి 1971న న్యూఢిల్లీలో జన్మించారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల 12వ తరగతి ఉత్తీర్ణత తర్వాత సఫీనా హుస్సేన్ తన చదువును ఆపేసింది. కొంత కాలం తరువాత అత్త "మహే హసన్" చొరవత తో సఫీనా హుస్సేన్‌ తదుపరి చదువులు ప్రారంభించింది.

సఫీనా హుస్సేన్‌ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డెవలప్‌మెంట్ స్టడీస్ (LSE)లో డిగ్రీ పొందింది. . సఫీనా హుస్సేన్ 1998-2004 వరకు శాన్ ఫ్రాన్సిస్కోలో చైల్డ్ ఫ్యామిలీ హెల్త్ ఇంటర్నేషనల్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు-

 విద్య యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకొన్న సఫీనా హుస్సేన్ 2005లో భారతదేశానికి తిరిగి వచ్చింది.

సఫీనా హుస్సేన్  మొదట "ప్రథమ్ సంస్థ"లో పనిచేశారు

భారతదేశం లాంటి దేశంలో, నేటికీ బాలికల విద్య గురించి ప్రజల ఆలోచన చాలా వెనుకబడి ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్యకు ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వబడదు.

ఇటువంటి వాతావరణంలో సఫీనా హుస్సేన్ బాలికల విద్య శాతం చాలా తక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుంది, రాజస్థాన్‌లోని భిల్వారా సమీపంలోని ఒక చిన్న గ్రామం నుండి సఫీనా హుస్సేన్ తన కృషిని ప్రారంభించింది.

సఫీనా హుస్సేన్ మొదట్లో నిరాశ ఎదురైనా బాలిక విద్య పై తన పనిని కొనసాగించినది.సఫీనా హుస్సేన్ సంస్థ "ఎడ్యుకేట్ గర్ల్స్" ఎంపిక తో గుర్తించబడిన ప్రాంతాలలో ఏ అమ్మాయి విద్యకు దూరం కాకుండా చూసుకుంటుంది.

సఫీనా హుస్సేన్ సంస్థ "ఎడ్యుకేట్ గర్ల్స్" ముందుగా, ఎంత మంది బాలికలు పాఠశాలకు వెళ్లడం లేదు లేదా ఏ కారణం వల్ల చదువు మానేశారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి గ్రౌండ్ లెవల్ సర్వే నిర్వహిస్తారు.బాలికలను గుర్తించిన తర్వాత, వారి కుటుంబాలు మరియు బాలికలను విద్య కోసం ప్రేరేపించి, వారిని సమీపంలోని పాఠశాలలో చేర్పిస్తారు.

సఫీనా హుస్సేన్ సంస్థ  "ఎడ్యుకేట్ గర్ల్స్" ఉద్యోగులు అప్పుడప్పుడు గ్రామాలను సందర్శిస్తూ బాలిక క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతుందో లేదో మరియు బాలిక విద్యా పురోగతిని పర్యవేక్షిస్తున్నారో లేదో నిర్ధారిస్తారు.

సఫీనా హుస్సేన్ “ప్రతి అమ్మాయికి విద్య హక్కు లభించేలా చూసుకోవాలి" అని చెబుతుంది.

సఫీనా హుస్సేన్ యొక్క "ఎడ్యుకేట్ గర్ల్" అనే సంస్థ "ప్రగతి" అనే మరో మిషన్‌ను ప్రారంభించింది. ఇది ఏదో ఒక కారణం వల్ల చదువును మధ్యలో ఆపివేసిన బాలికలకు ఓపెన్ స్కూల్ ద్వారా తదుపరి విద్యను అందిస్తారు.

సఫీనా హుస్సేన్ యొక్క బాలికా విద్యా ప్రచారం 50 గ్రామాల నుండి ప్రారంభమై నేడు 30,000 గ్రామాలకు చేరుకుంది మరియు ఇది 4 రాష్ట్రాల్లో పనిచేస్తుంది. 55,000 మంది స్వచ్ఛంద సేవకులు "ఎడ్యుకేట్ గర్ల్" లో పనిచేస్తున్నారు. "ఎడ్యుకేట్ గర్ల్" సంస్థ ఇప్పటివరకు 20 లక్షలకు పైగా బాలికలను పాఠశాలల్లో చేర్చుకుంది మరియు ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది.

సఫీనా హుస్సేన్ అనేక అవార్డులను అందుకుంది

2014 మరియు 2023లో, సఫీనా హుస్సేన్ WISE అవార్డును గెలుచుకుంది. విద్యకు చేసిన అత్యుత్తమ కృషికి ఖతార్‌లో WISE అవార్డు ఇవ్వబడుతుంది.

2023 WISE అవార్డుతో పాటు ఎడ్యుకేట్ గర్ల్స్‌కు $500,000 మొత్తాన్ని కూడా అందించారు.

2019లో, సఫీనా హుస్సేన్ ET ప్రైమ్ ఉమెన్ లీడర్‌షిప్ అవార్డును అందుకుంది.

2017లో, సఫీనా హుస్సేన్ NITI ఆయోగ్ ఉమెన్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా అవార్డును గెలుచుకుంది.

2016లో, సఫీనా హుస్సేన్ NDTV-లోరియల్ పారిస్ ఉమెన్ ఆఫ్ వర్త్ అవార్డును గెలుచుకుంది

సఫీనా హుస్సేన్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసం 2015 స్కోల్ అవార్డును గెలుచుకుంది.

సఫీనా హుస్సేన్ మరియు ఆమె సంస్థ “ఎడ్యుకేట్ గర్ల్” సాధించిన అతిపెద్ద విజయం "రామోన్ మాగ్సేసే అవార్డు 2025". భారతదేశం నుండి ఈ అవార్డును అందుకున్న మొట్టమొదటి లాభాపేక్షలేని సంస్థ సఫీనా హుస్సేన్ సంస్థ కావడం చాలా గర్వకారణం. 

సఫీనా హుస్సేన్ తన 2 దశాబ్దాల పనిలో, అనేక మైలురాళ్లను నిర్దేశించింది మరియు లక్షలాది మంది బాలికల జీవితాల స్థితి మరియు దిశను మార్చింది.

 

మళియెక్కల్ మరియుమ్మ 1925-2022-కేరళ సామాజిక సంస్కర్త Maliyekkal Mariyumma1925-2022-social reformer of Kerala

 

 

మళియెక్కల్ మరియుమ్మ (1925 - 2022) అని పిలువబడే మరియుమ్మ మాయనాలి, కేరళలో మహిళా చరిత్రలో ముఖ్యమైన వ్యక్తులలో ఒకరిగా పరిగణించబడుతుంది. మరియుమ్మ ఉత్తర కేరళలో ఆంగ్ల విద్యను పొందిన మొదటి ముస్లిం మహిళ.

మలియేకల్ మరియుమ్మ 1925లో మంజుమ్మ మరియు ముస్లిం సమాజ నాయకుడు ఓ. వి. అబ్దుల్లా దంపతుల కుమార్తెగా జన్మించారు. మరియుమ్మ తల్లిదండ్రులు ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొన్నారు. ముస్లిం మహిళలు విద్యా రంగంలో చాలా వెనుకబడిన సమయంలో మరియుమ్మ కాన్వెంట్ పాఠశాల నుండి ఇంగ్లీష్ చదివారు. 

మరియుమ్మ 1938లో మంగళూరు లో తలస్సేరి సేక్రెడ్ హార్ట్ స్కూల్‌లో చేరారు మరియు నేటి పదవ తరగతికి సమానమైన ఫిఫ్త్ ఫారం fifth form వరకు చదువుకున్నారు. తలస్సేరి సేక్రెడ్ హార్ట్ స్కూల్‌లోని 200 మంది విద్యార్థులలో మరియుమ్మ ఏకైక ముస్లిం మహిళ. 1943లో వివాహం వరకు మరియుమ్మ పాఠశాలకు వెళ్లింది, తరువాత, ఆమె గర్భవతి అయినప్పుడు, ఇంట్లో చదువుకోవడం ప్రారంభించింది మరియు సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంది.

 మరియుమ్మ ఆంగ్లంలో మాట్లాడటానికి కూడా ప్రసిద్ధి చెందింది.ప్రగతిశీల ఆలోచనలను కలిగి ఉన్న మరియుమ్మ మహిళల అభ్యున్నతికి, ముఖ్యంగా ముస్లిం సమాజంలోని మహిళల అభ్యున్నతికి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేసింది మరియుమ్మ మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసి వరకట్న వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడింది.

మరియుమ్మ నాయకత్వంలో స్థాపించబడిన మహిళా సంఘం మహిళల అభ్యున్నతికి కృషి చేసింది. మరియుమ్మ చివరి రోజుల్లో, “ది హిందూ” అనే ఆంగ్ల వార్తాపత్రికను చదివేది. వయస్సు సంబంధిత సమస్యల కారణంగా 5 ఆగస్టు, 2022న మరియుమ్మ మరణించింది. మరియుమ్మ కు నలుగురు పిల్లలు కలరు.