
అబ్దెల్ ఘనీ మెలారా నావియో (Abdel Ghani Melara Navío) దివ్య ఖురాన్‌ను ఆధునిక స్పానిష్ భాషలోకి అనువదించిన ప్రముఖ స్పానిష్ ముస్లిం పండితుడు మరియు అనువాదకుడు
స్పెయిన్‌లోని సియుడాడ్ రియల్లోని ప్యూర్టోల్లానోలో జన్మించిన అబ్దెల్ ఘనీ మెలారా నావియో, మాడ్రిడ్‌లోని కాంప్లూటెన్స్ విశ్వవిద్యాలయంలో రొమాన్స్ ఫిలాలజీని అభ్యసించి, 1979లో తన డిగ్రీని పూర్తి చేశారు. అదే సంవత్సరంలో, అబ్దెల్ ఘనీ మెలారా నావియో స్పెయిన్‌లోని కార్డోబాలో ఇస్లాంను స్వీకరించారు, ఆ తర్వాత అరబిక్ భాష మరియు ఇస్లామిక్ అధ్యయనాలపై అబ్దెల్ ఘనీ మెలారా నావియో కు ప్రగాఢమైన ఆసక్తి కలిగి లోతైన అధ్యయనం చేశారు.
ఆధునిక స్పానిష్ మాట్లాడే
పాఠకులకు ఖురాన్ యొక్క అర్థాలను మరింత సముచితంగా తెలియజేసే ఒక అనువాదం అవసరమని అబ్దెల్
ఘనీ మెలారా నావియో మరియు ఇతర స్పానిష్ ముస్లింలు భావించి, ఖురాన్‌ను స్పానిష్
భాష లోకి అనువదించే ప్రయాణం ప్రారంభమైంది. దాదాపు 20 సంవత్సరాల కృషి, అధ్యయనం మరియు ఇతర ముస్లింల సహకారం తర్వాత, అబ్దెల్ ఘనీ
మెలారా నావియో స్పానిష్ దివ్య ఖురాన్ అనువాదాన్ని పూర్తి చేశారు. , అబ్దెల్ ఘనీ
మెలారా నావియో చేసిన స్పానిష్ అనువాదం "ట్రాడసియోన్-కామెంటరియో డెల్ నోబెల్ కోరన్" (Traducción-Comentario del Noble Corán) పేరుతో ప్రసిద్ధి చెందింది. దీని అర్థం 'దివ్య ఖురాన్ యొక్క అనువాదం మరియు వ్యాఖ్యానం’
స్పానిష్ దివ్య ఖురాన్ అనువాదo మొదటగా 1994లో స్పెయిన్‌లోని
గ్రనడాలో ప్రచురించబడింది,
ఆ తర్వాత పండితుల
సమీక్ష అనంతరం సౌదీ అరేబియాలోని మదీనాలో ఉన్న కింగ్ ఫహద్ ఖురాన్ ప్రింటింగ్
కాంప్లెక్స్ ద్వారా ప్రచురణ పొందింది.
స్పానిష్ దివ్య ఖురాన్ అనువాదం
కేవలం పదాలకు అర్థాలు మాత్రమే కాకుండా, సంప్రదాయ ఇస్లామిక్ వ్యాఖ్యానాల (తఫ్సీర్) ఆధారంగా
రూపొందించబడింది. ఇందులో ప్రధానంగా ఇబ్న్
కతీర్ (Ibn Kathir), అత్-తబరి (At-Tabari), అల్-జలాలైన్ (Al-Jalalayn) వ్యాఖ్యానాలతో
పాటు, స్పెయిన్
(అండలూసియా) ప్రాంతానికి చెందిన ప్రముఖ పండితులు అల్-ఖుర్తుబి (Al-Qurtubi) మరియు ఇబ్న్ జుజయ్ ల వ్యాఖ్యానాలకు
ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు
దివ్య ఖురాన్ అనువాదం తో
పాటు, మెలారా, ఇమామ్ మాలిక్ యొక్క అల్-మువత్తా, ముఖ్తసర్ సహీహ్
అల్-బుఖారీ మరియు ఖాదీ ఇయాద్ యొక్క అష్-షిఫా వంటి అనేక ముఖ్యమైన ఇస్లామిక్
గ్రంథాలను అనువదించారు. మెలారా కృషి, ముఖ్యమైన ఇస్లామిక్ సాహిత్యాన్ని స్పానిష్ మాట్లాడే
ముస్లింలకు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠకులకు అందుబాటులోకి తీసుకురావడానికి
సహాయపడింది. స్పానిష్ భాషలోని ఆధునిక ఇస్లామిక్ సాహిత్య చరిత్రలో మెలారా సాధించిన
ఘనతకు ఒక ముఖ్యమైన స్థానం ఉంది.
అబ్దెల్ ఘనీ మెలారా నవియో
ఖురాన్‌ను స్పానిష్లోకి అనువదించిన మొట్టమొదటి వ్యక్తిగా కాకుండా, పూర్తి ఖురాన్
అర్థాలకు ఆధునిక స్పానిష్ అనువాదాన్ని రూపొందించిన మొదటి ముస్లింగా గుర్తింపు
పొందారు.
సరళమైన, స్పష్టమైన స్పానిష్ భాషలో ఉండటం వల్ల, నేడు లాటిన్
అమెరికా మరియు స్పెయిన్ దేశాల్లో ఇస్లాం గురించి తెలుసుకోవాలనుకునే వారికి మెలారా అనువాదం
ఒక ముఖ్యమైన ఆధారంగా నిలుస్తోంది నేటికీ ప్రపంచవ్యాప్తంగా స్పానిష్ భాష మాట్లాడే
ముస్లింలు మరియు పరిశోధకులు విస్తృతంగా ఉపయోగించే ప్రామాణిక ఖురాన్ అనువాదాలలో మెలారా
రచన ఒకటిగా నిలిచింది


