17 September 2025

హజరా బేగం 1910-2003-కమ్యూనిస్ట్ నాయకురాలు మరియు మహిళా హక్కుల సమర్ధకురాలు

 

 


ముస్లిం మహిళ అయిన హజ్రా బేగం జాతీయవాద ఉద్యమం కోసం పనిచేశారు మరియు తరువాత భారతదేశంలో కమ్యూనిజo లక్ష్యాన్ని   ముందుకు నడిపించారు.

ప్రగతిశీల సున్నీ ముస్లిం పఠాన్ కుటుంబంలో జన్మించిన హజ్రా బేగం యవ్వనం లో కమ్యూనిజం వైపు ఆకర్షితురాలై ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ (AIPWA), మరియు ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ (AIWC)తో సంబంధం కలిగి ఉంది.

హజ్రా బేగం (1910-2003) భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకురాలు మరియు 1954 నుండి 1962 వరకు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ (NFIW) ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

హజ్రా బేగం 1910లో ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు, రాంపూర్‌లో పెరిగారు.తండ్రి మీరట్‌లో మేజిస్ట్రేట్‌గా ఉన్నారు హజ్రా బేగం బాల్యం లో పర్దా పాఠశాలలో విద్యను అభ్యసించి తరువాత లాహోర్‌లోని క్వీన్ మేరీ పాఠశాలలో చదువుకుంది.

మీరట్ కుట్ర కేసు, సహాయ నిరాకరణ ఉద్యమం తో హజ్రా బేగం ప్రభావితురాలు అయినది.

హజ్రా బేగం మొదటి వివాహం చిన్న వయసులోనే ముగిసింది, వివాహం విడిపోయిన తర్వాత, హజ్రా బేగం 1933లో మాంటిస్సోరి బోధనా కోర్సును అభ్యసించడానికి గ్రేట్ బ్రిటన్‌కు వెళ్లింది, అక్కడ సజ్జాద్ జహీర్ వంటి మార్క్సిస్ట్ వర్గాలతో పరిచయం ఏర్పడింది

.బ్రిటన్‌లో చదువుతున్న సమయంలో, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్‌లో చేరిన మొదటి భారతీయులలో హాజ్రా బేగం ఒకరు. హాజ్రా బేగం భారతీయ మార్క్సిస్ట్ విద్యార్థుల బృందంలో భాగం. హజ్రా బేగం తన బృందం యొక్క అంతర్జాతీయ స్నేహితులతో సోవియట్ యూనియన్‌లో జరిగిన సమావేశానికి కూడా హాజరయ్యారు హాజ్రా  బేగం 1935లో సోవియట్ యూనియన్‌ను సందర్శించింది1935లో హాజ్రా బేగం కె.ఎం. అష్రఫ్, జెడ్.ఎ. అహ్మద్ మరియు సజ్జాద్ జహీర్‌లతో కలిసి భారతదేశానికి తిరిగి వచ్చింది

భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, హాజ్రా బేగం జెడ్.ఎ. అహ్మద్‌ను వివాహం చేసుకుంది మరియు వారి వివాహాన్ని M. అష్రఫ్ పార్టీ మార్గంలో నిర్వహించారు. హాజ్రా దంపతులు ఇద్దరూ భారత కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పూర్తికాల పార్టీ కార్యకర్తలయ్యారు

హజ్రా బేగం అలహాబాద్ రైల్వే కూలీస్ యూనియన్ వ్యవస్థాపక కార్యదర్శి. హజ్రా బేగం అజంగఢ్‌లోని జులాహాలలో, అలహాబాద్ చుట్టూ ఉన్న కిసాన్ కార్మికులలో,కలసి  రాయ్ బరేలిలో పనిచేశారు, తరువాత 1940ల మధ్యలో హజ్రా బేగం నగరాల్లోని ఉపాధ్యాయులలో పనిచేశారు. కాన్పూర్‌లో, హజ్రా బేగం చర్మశుద్ధి కార్మికులు మరియు వస్త్ర కార్మికుల మధ్య పనిచేశారు..

హజ్రా బేగం 1940లో ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్‌కు ఆర్గనైజింగ్ సెక్రటరీ అయ్యారు మరియు దాని హిందీ-భాషా ఆర్గనైజేషన్ రోష్నిని సంపాదకురాలిగా ఉన్నారు. హజ్రా బేగం వారపత్రిక క్వామి జాంగ్‌కు తరచుగా రాస్తుండేవారు.

హజ్రా బేగం అలహాబాద్‌లోని కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో చురుకుగా పనిచేసింది, అక్కడ హజ్రా బేగం రైల్వే కూలీలు, ప్రెస్ కార్మికులు మరియు రైతులను సమికరించినది. హజ్రా బేగం జెడ్.ఎ. అహ్మద్, కె.ఎం. అష్రఫ్ మరియు రామ్మనోహర్ లోహియాతో పాటు అలహాబాద్‌లోని సిఎస్‌పి యువ నాయకుల ప్రధాన బృందంలో భాగం; లోహియా తప్ప మిగతా వారందరూ అండర్ గ్రౌండ్ సిపిఐ సభ్యులు కూడా. ఆ సమయంలో హజ్రా బేగం కొద్దిమంది మహిళా సిపిఐ సభ్యులలో ఒకరు.

1948-51 మధ్య కాలంలో, నిర్బంధం నుండి తప్పించుకోవడానికి హజ్రా బేగం అజ్ఞాతం లోకి వెళ్లింది.. హజ్రా బేగం 1949లో ఐదు నెలలు లక్నో జైలులో జైలు శిక్ష అనుభవించింది మరియు విడుదలైన తర్వాత అండర్‌గ్రౌండ్‌లో పనిచేసింది

హజ్రా బేగం 1952లో వియన్నాలో జరిగిన ప్రపంచ శాంతి సమావేశంలో పాల్గొంది. హజ్రా బేగం జాతీయ భారత మహిళా సమాఖ్య స్థాపకుల్లో ఒకరు మరియు 1954 నుండి 1962 వరకు మాజీ ప్రధాన కార్యదర్శి.

వియన్నా (1952) మరియు ఉమెన్స్ ఇంటర్నేషనల్ డెమోక్రటిక్ ఫెడరేషన్, కోపెన్‌హాగన్ (1953), వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ మదర్స్, ఆఫ్రో-ఆసియన్ ఉమెన్స్ కాన్ఫరెన్స్, కైరో 1961 సమావేశాలకు  హాజరు అయినది.

హజ్రా బేగం కు ఉర్దూ థియేటర్ డైరెక్టర్ సలీమా రజా అనే కుమార్తె మరియు నటి ఆయేషా రజా మిశ్రా అనే మనవరాలు ఉన్నారు. హాజ్రా బేగం చాలా కాలం అనారోగ్యంతో బాధపడుతూ 2003 జనవరి 20న మరణించారు

No comments:

Post a Comment