గెర్డా ఫిలిప్స్ బోర్న్ జర్మన్ లో జన్మించిన యూదు మహిళ. ముగ్గురు భారతీయ విద్యార్థులు జాకీర్ హుస్సేన్, అబిద్ హుస్సేన్ మరియు మొహమ్మద్ ముజీబ్ ఉన్నత విద్య కోసం బెర్లిన్ విశ్వవిద్యాలయానికి వెళ్లినారు. 1921లో బెర్లిన్‌లో చదువుకొంటున్న ఈ ముగ్గురు జర్మన్-ఇండియన్ సంబంధాలను సులభతరం చేయడానికి ఏర్పాటు చేసిన పార్టీలో గెర్డా ఫిలిప్స్ బోర్న్ ను కలిశారు. సహాయ నిరాకరణ ఉద్యమం తర్వాత, ఈ ముగ్గురూ వలస పాలనలో స్వంత వలసయేతర విద్యా సంస్థలను నిర్మించాలనుకున్నారు. వారి ఆహ్వానం మేరకు గెర్డా ఫిలిప్స్ బోర్న్ డిసెంబర్ 1932లో భారతదేశానికి వచ్చి జనవరి 1933లో జామియామిలియా ఇస్లామియాలో చేరింది.
డాక్టర్ సయ్యదా హమీద్ ప్రకారం గెర్డా ఫిలిప్స్
బోర్న్ జామియామిలియా ఇస్లామియా నిర్మాణం
లో జాతీయవాదులకు కేవలం సహకారి కాదు, భాగస్వామి.గెర్డా జామియాలో బోధించిన చాలా మంది
విద్యార్థులకు మెమ్‌సాహిబ్ నుండి బారి బెహెన్ bari behen లేదా ఆపా జాన్ (అక్క)గా మారింది.
భారతదేశానికి రాకముందు, గెర్డా ఫిలిప్స్ బోర్న్ జర్మనీలోని ఒక సంపన్న కుటుంబానికి చెందినది,బాగా
చదువుకుంది మరియు ఒపెరా గాయనిగా శిక్షణ పొందింది. గెర్డా ఫిలిప్స్ బోర్న్ కు సాహిత్యం, కళ మరియు సంగీతంపై ఆసక్తి ఉంది, కానీ అన్నింటికంటే ముఖ్యంగా, బోధనపై ఆసక్తి ఉంది. గెర్డా విద్యాబోధనా మరియు సామాజిక సేవలో చురుకైన పాత్ర వహించినది.
గెర్డా బెర్లిన్‌లో తన సొంత కిండర్ గార్టెన్‌ను
ప్రారంభించింది మరియు బెన్ షెమెన్ యూత్ విలేజ్ ప్రాజెక్టుకు కూడా మద్దతు ఇచ్చింది.
గెర్డా పాలస్తీనాలోని వ్యవసాయ బోర్డింగ్ పాఠశాల నిధుల సేకరణలో పాల్గొంది మరియు 1932లో పాఠశాలలో కూడా బోధించింది..
1932లో గెర్డా
ఫిలిప్స్‌బోర్న్ భారతదేశానికి వచ్చినప్పుడు గెర్డా ను కిండర్ గార్టెన్
టీచర్‌గా నియమించారు. గెర్డా ఫిలిప్స్‌బోర్న్ నియామకం నుండి, బోధన, నిధుల సేకరణ మరియు సంస్థ నిర్మాణంలో చురుకుగా పాల్గొనడం ప్రారంభించింది జామియా విద్యార్థులు గెర్డా ఆపా జాన్ లేదా అక్క
అని పిలిచేవారు. గెర్డా వారికి ఉపాధ్యాయురాలిగా మాత్రమే కాకుండా, గురువు మరియు మార్గదర్శిగా కూడా ఉన్నారు. గెర్డా
తన విద్యార్థులకు పరిశుభ్రత, క్రీడలు, ఫోటోగ్రఫీ, పెయింటింగ్ మరియు సంగీతం గురించి భోదించేది..
గెర్డా, పియామి బరాదరి piyami baradari అనే విద్యా సమాజo లో ప్రముఖ పాత్రవహించినది. ఇది దేశవ్యాప్తంగా పిల్లలలో పిల్లలు వ్రాసే వ్యాసాలు మరియు లేఖలు రాయడానికి దోహదపడింది. గెర్డా పిల్లల కోసం
పాయం-ఇ-తాలిమ్ లేదా మెసేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే అంతర్జాతీయ జామియా జర్నల్‌ను కూడా
ప్రారంభించింది. గెర్డా తన 'చిల్డ్రన్స్ జూ' అనే చిత్ర
పుస్తకం ద్వారా కళలు మరియు చేతిపనులను నేర్పింది.
గెర్డా కిండర్ గార్టెన్‌లో చదువుకునే చిన్న
పిల్లల హాస్టల్‌ను నిర్వహించినది. రెండోవ
ప్రపంచ యుద్ధానికి ముందు సంవత్సరంలో గెర్డా అనారోగ్యం
పాలైనది. చికిత్స కోసం యూరప్‌కు వెళ్లడానికి నిరాకరించింది మరియు సమాజసేవ లో భాగం
గా రోగులను మహిళలను జాగ్రత్తగా చూసుకోవడంలో నిమగ్నమై ఉంది. జామియాలో జరిగిన సమాజ
మరియు విద్యా కార్యక్రమాలలో సాంప్రదాయ కుటుంబ మహిళలను పాల్గొనేలా చేసింది.
గెర్డా సామాజిక సేవ జామియాకు మించి విస్తరించింది.
మహిళలకు ఎంబ్రాయిడరీ, డ్రాయింగ్
మరియు అల్లికలో పాఠాలు చెప్పడానికి వార్ధాలోని గాంధీ ఆశ్రమానికి కూడా గెర్డా వెళ్లింది.
పరిశోధకుడు జీన్ డాన్నెన్ ప్రకారం గెర్డా, విద్యా విధానాలపై జాకీర్ హుస్సేన్‌కు సలహా
ఇచ్చారని పేర్కొన్నారు. గాంధీ జకీర్ హుస్సేన్‌ను ప్రాథమిక జాతీయ విద్యా ప్రణాళికకు
నాయకునిగా నియమించినప్పుడు ఇవి మరింత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, గెర్డా ను 'జర్మన్ శత్రువు' అని అరెస్టు
చేసి పురంధర్ శిబిరంలో నిర్బంధించారు.శిబిరంలో గెర్డా
ఆరోగ్యం క్షీణించి అనారోగ్యంతో
మరణించినది. జామియా ఆవరణలోనే లోనే గెర్డా ఖననం చేయబడింది.
జామియా మిలియా ఇస్లామియానిర్మాణంలో గెర్డా
ఫిలిప్స్ బోర్న్ పాత్ర కలకాలం జ్ఞాపకం ఉంచదగినది.
జామియాలోని రెండు భవనాలు - బాలికల హాస్టల్ మరియు
డేకేర్‌కు గెర్డా ఫిలిప్స్‌బోర్న్ పేరు పెట్టారు. జామియా మిలియా ఇస్లామియాలోని
గెర్డా ఫిలిప్స్ బోర్న్ డే కేర్ సెంటర్, గెర్డా ఫిలిప్స్ బోర్న్ యొక్క వారసత్వాన్ని,విలువలను
గుర్తు చేస్తుంది. గెర్డా ఫిలిప్స్ బోర్న్ తన జీవితాన్ని విద్య వ్యాప్తికి అంకితం
చేసింది మరియు భారతదేశంలో జామియా మిలియా ఇస్లామియా యొక్క నర్సరీ మరియు ప్రాథమిక
పాఠశాల విభాగంలో కీలకంగా పాల్గొంది.
విద్యావేత్త మరియు మహిళా హక్కుల కార్యకర్త, డాక్టర్ సయ్యదా హమీద్ ఫిలిప్స్ బోర్న్ ను జామియా
యొక్క "అదృశ్య వాస్తుశిల్పి"గా అభివర్ణించారు. నిధుల సేకరణలో గెర్డా చురుకైన
పాత్ర జామియా ప్రముఖ మైనారిటీ విద్యా సంస్థగా ఎదగడానికి కు సహాయపడింది సయ్యదా
హమీద్ గెర్డాను జామియాలోని ఖతూన్-ఎ-అవ్వాల్ లేదా జామియాలోని మహిళలో నంబర్ వన్ గా పేర్కొన్నారు.
No comments:
Post a Comment