మళియెక్కల్ మరియుమ్మ (1925 - 2022) అని పిలువబడే మరియుమ్మ మాయనాలి, కేరళలో మహిళా చరిత్రలో ముఖ్యమైన వ్యక్తులలో ఒకరిగా పరిగణించబడుతుంది. మరియుమ్మ ఉత్తర కేరళలో ఆంగ్ల విద్యను పొందిన మొదటి ముస్లిం మహిళ.
మలియేకల్ మరియుమ్మ 1925లో మంజుమ్మ మరియు ముస్లిం సమాజ నాయకుడు ఓ. వి. అబ్దుల్లా దంపతుల కుమార్తెగా జన్మించారు. మరియుమ్మ తల్లిదండ్రులు ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొన్నారు. ముస్లిం మహిళలు విద్యా రంగంలో చాలా వెనుకబడిన సమయంలో మరియుమ్మ కాన్వెంట్ పాఠశాల నుండి ఇంగ్లీష్ చదివారు.
మరియుమ్మ 1938లో మంగళూరు లో తలస్సేరి సేక్రెడ్ హార్ట్ స్కూల్‌లో చేరారు మరియు నేటి పదవ తరగతికి సమానమైన ఫిఫ్త్ ఫారం fifth form వరకు చదువుకున్నారు. తలస్సేరి సేక్రెడ్ హార్ట్ స్కూల్‌లోని 200 మంది విద్యార్థులలో మరియుమ్మ ఏకైక ముస్లిం మహిళ. 1943లో వివాహం వరకు మరియుమ్మ పాఠశాలకు వెళ్లింది, తరువాత, ఆమె గర్భవతి అయినప్పుడు, ఇంట్లో చదువుకోవడం ప్రారంభించింది మరియు సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంది.
మరియుమ్మ ఆంగ్లంలో మాట్లాడటానికి కూడా ప్రసిద్ధి చెందింది.ప్రగతిశీల ఆలోచనలను కలిగి ఉన్న మరియుమ్మ మహిళల అభ్యున్నతికి, ముఖ్యంగా ముస్లిం సమాజంలోని మహిళల అభ్యున్నతికి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేసింది మరియుమ్మ మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసి వరకట్న వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడింది.
మరియుమ్మ నాయకత్వంలో స్థాపించబడిన మహిళా సంఘం
మహిళల అభ్యున్నతికి కృషి చేసింది. మరియుమ్మ చివరి రోజుల్లో, “ది హిందూ” అనే ఆంగ్ల వార్తాపత్రికను
చదివేది. వయస్సు సంబంధిత సమస్యల కారణంగా 5
ఆగస్టు, 2022న మరియుమ్మ మరణించింది. మరియుమ్మ కు
నలుగురు పిల్లలు కలరు.
No comments:
Post a Comment