భారతదేశ
స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొన్న "కుల్సుమ్ సయానీ" ప్రముఖ ముస్లిం స్వాతంత్ర్య
సమరయోధురాలు, సామాజిక
సంస్కర్త, గొప్ప విద్యా కార్యకర్త మరియు ప్రసిద్ధ రేడియో అనౌన్సర్ అమీన్ సయానీ
తల్లి.
కుల్సుమ్
సయానీ 1900 అక్టోబర్ 21న భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో జన్మించారు.
కుల్సుమ్ సయానీ తండ్రి రాజ్‌బలి పటేల్, వృత్తిరీత్యా వైద్యుడు, మహాత్మా గాంధీ మరియు మౌలానా అబుల్ కలాం ఆజాద్‌లకు వ్యక్తిగత వైద్యుడు. 1917లో, కుల్సుమ్ సయానీకి తన తండ్రితో పాటు
మహాత్మా గాంధీని కలిసే అవకాశం లభించింది. మహాత్మా గాంధీని కలిసిన తర్వాత, కుల్సుమ్ సయానీ మహాత్మా గాంధీ చూపిన మార్గాన్ని
అనుసరిస్తానని ప్రతిజ్ఞ చేసింది.
18 సంవత్సరాల వయసులో, కుల్సుమ్
సయాని, జాన్ మొహమ్మద్ సయానిని వివాహం
చేసుకుంది, జాన్
మొహమ్మద్ సయాని కూడా స్వాతంత్ర్య సమరయోధుడు.తన భర్త నుండి లభించిన ప్రోత్సాహంతో, కుల్సుమ్ సయాని స్వాతంత్ర్యం కోసం నడిచే
ఉద్యమాలలో బహిరంగంగా పాల్గొనేది.
1921లో, వేల్స్
యువరాజు బొంబాయిని సందర్శించినప్పుడు, వేల్స్ యువరాజు కి వ్యతిరేకంగా అనేక ప్రదేశాలలో
నిరసనలు ప్రారంభమయ్యాయి. బొంబాయినగరంలో అశాంతి వ్యాపించింది. బొంబాయినగరంలో లాఠీచార్జి మరియు అరెస్టులు ప్రారంభమయ్యాయి మరియు
మార్షల్ లా విధించబడింది.
లాఠీచార్జి మరియు
నిరసన ప్రదర్శనలలో
“గాయపడిన
వారిని చూసుకోవడానికి కాంగ్రెస్ ఆసుపత్రిని స్థాపించినది.. జాన్ మొహమ్మద్ సయాని దానికి
ఇంచార్జ్ వైద్యుడు.
చెడులను
మరియు నిరక్షరాస్యతను నిర్మూలించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
సామాజిక దురాచారాల గురించి అవగాహన కల్పించడానికి "జన్ జాగ్రణ్"
కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమాలలో కుల్సుమ్ సయాని ముంబై నగరం మరియు
దాని శివారు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించారు.
కుల్సుమ్
"చర్ఖా తరగతి"లో చేరి నిరక్షరాస్యులకు బోధించడం ప్రారంభించింది.
"ప్రతి వ్యక్తి, ఒకరికి
నేర్పండి" అనేది వయోజన విద్యలో చాలా ప్రభావవంతమైన పద్ధతి మరియు ఈ పద్ధతిని
ప్రారంభించినది కుల్సుమ్ సయాని.
1938లో, కుల్సుమ్ సయాని తన స్వంత ఖర్చుతో 100 మందిలో 2 మంది ఉపాధ్యాయులతో ఒక పాఠశాల స్థాపించినది.
ముస్లిం బాలికలు మరియు మహిళలు విద్యను పొందేలా ఒప్పించడానికి ముస్లిం ప్రాంతాలకు
వెళ్లడం ప్రారంభించింది. కుల్సుమ్ సయాని ఇంటింటికీ వెళ్లి తమ స్త్రీలను మరియు బాలికలను తరగతులకు పంపమని ప్రజలను
ఒప్పించింది.వయోజన
అక్షరాస్యత కోసం ఏర్పడిన అనేక కమిటీలలో కుల్సుమ్ సయాని చేరింది.
1938లోనే కాంగ్రెస్ స్థాపించిన మొదటి జాతీయ ప్రణాళిక కమిటీలో కుల్సుమ్ సయానీ
చేరారు. 1939లో ఏర్పడిన
బాంబే నగర సామాజిక విద్యా కమిటీ ముస్లిం మహిళల కోసం 50 కేంద్రాల బాధ్యతను కుల్సుమ్ సయానీకి
అప్పగించింది. కుల్సుమ్ సయానీ సమర్థ నాయకత్వంలో, ఈ సంఖ్య త్వరలోనే 600కి
చేరుకుంది. 1944లో కుల్సుమ్
సయాని అఖిల భారత
మహిళా సదస్సుకు ప్రధాన కార్యదర్శిగా కూడా నియమితులయ్యారు మరియు మహిళా సాధికారత
కోసం కృషి చేశారు.
కుల్సుమ్
సయాని అంకితభావం
మరియు విద్య కోసం అవిశ్రాంత కృషిని గమనించిన టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ ఎడిషన్
(మార్చి 10, 1970) ఇలా రాసింది, “ఆమె
(కుల్సుమ్ సయానీ) 1939లో బాంబే
నగర సామాజిక విద్యా కమిటీకి బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, ఐదు లక్షల మంది పెద్దలు అక్షరాస్యులుగా మారారు.”
కుల్సుమ్
సయాని యువ విద్యార్థులను ప్రతిరోజూ కనీసం 15 నిమిషాలు నిరక్షరాస్యులైన పెద్దవారికి కొత్త అక్షరం నేర్పించమని
ప్రోత్సహించేవారు.
1940లో, మహాత్మా
గాంధీ మార్గదర్శకత్వంలో కుల్సుమ్ సయాని, ఆమె కుమారుడు అమీన్ సయానితో కలిసి, పక్ష పత్రిక "రహ్‌బార్Rahbar"ను
ప్రచురించడం మరియు సవరించడం ప్రారంభించారు. ఈ పత్రిక హిందీ, ఉర్దూ మరియు గుజరాత్ భాషలలో ప్రచురించబడింది.ఈ పత్రిక యొక్క ప్రధాన లక్ష్యం కొత్తగా
అక్షరాస్యులకు సరళమైన హిందుస్తానీ భాష (హిందీ మరియు ఉర్దూ మిశ్రమం) నేర్పించడం.
జూన్ 16, 1945
నాటి ఒక లేఖలో, గాంధీజీ కుల్సుమ్ సయానీని 'కుమార్తె కుల్సుమ్' అని సంబోధిoచారు. జైళ్లలోని రాజకీయ ఖైదీలలో రహ్‌బర్
పత్రిక బాగా ప్రాచుర్యం పొందింది.
సమాజ కార్యకర్తగా కుల్సుమ్ సయాని అనేక
అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినది. 1953లో, పారిస్‌లో జరిగిన యునెస్కో సమావేశంలో, కుల్సుమ్ సయాని అనేక దేశాల
ప్రతినిధులను కలుసుకుని అభిప్రాయాలను పంచుకున్నారు.
1960లో, కుల్సుమ్ సయాని తన పత్రిక రహ్‌బర్‌ను సవరించడం మానేయాల్సి వచ్చింది. కుల్సుమ్ సయాని 1960లో పద్మశ్రీ మరియు 1969లో నెహ్రూ అక్షరాస్యత అవార్డును కూడా అందుకున్నారు.
కుల్సుమ్ సయాని 1987లో మరణించారు. విద్య మరియు
సమాజ అభివృద్ధికి తన జీవితాన్ని నిస్వార్థంగా అంకితం చేసిన దృఢ సంకల్పం కలిగిన
మహిళ ఒక ప్రేరణను మిగిల్చింది.
No comments:
Post a Comment