రాజా రామ్ మోహన్ రాయ్ నుండి
జ్యోతిరావు ఫులే వరకు భారతదేశ ఆధునిక చరిత్రలో మహిళల హక్కుల కోసం పోరాటంలో పాల్గొన్న చాలా మంది భారతీయ సంస్కర్తల
పేర్లలో ఎక్కువ భాగం పురుషులవే.
మహిళలను ఇంటికే పరిమితం చేసిన
కాలం లో జన్మించిన వహీద్ జహాన్ బేగం మహిళలు తమ కోసం ఇంకా ఎక్కువ కోరుకోవచ్చని
నిరూపించారు.
1874లో ఢిల్లీకి చెందిన ఒక భూస్వామ్య కుటుంబంలో
మైనర్ మునిసిపల్ అధికారి అయిన మీర్జా మొహమ్మద్ ఇబ్రహీం బేగ్ చిన్న కుమార్తె వహీద్ జహాన్ బేగం.
వహీద్ జహాన్ బేగం ఇంటివద్దనే విద్యను అబ్యసించి ఉర్దూ మరియు పర్షియన్ భాషలలో
నిష్ణాతురాలు అయినది. అంకగణితం మరియు ప్రాథమిక ఆంగ్లంపై నైపుణ్యం సాధించినది.
ఇంటి పని చేసేవారి పిల్లలను
సేకరించి వారికి బోధించడం ద్వారా వహీద్ జహాన్ బేగం తన
పరిసరాల్లోని బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభించినది.
షేక్ అబ్దుల్లా ఒక కాశ్మీరీ న్యాయవాది, అలీఘర్ ఉద్యమంలో ప్రముఖ నాయకుడు. ముస్లిం యువతను ఆధునిక ఆంగ్ల విద్యను
అభ్యసించడానికి ప్రోత్సహించినాడు... ఆ కాలం లో ముస్లిం బాలికలు మరియు మహిళలకు
విద్యను అందించాల్సిన అవసరం గురించి బహిరంగంగా మాట్లాడిన కొద్దిమంది పురుషులలో షేక్ అబ్దుల్లా ఒకరు.
షేక్ అబ్దుల్లా ను వివాహమాడటం ద్వారా మహిళల
విద్య కోసం పాటు పడడానికి షేక్ అబ్దుల్లా చేసే ప్రయత్నంలో భాగస్వామిగా ఉండటానికి
వహీద్ జహాన్ బేగం ముందుకు వచ్చారు.. వహీద్
జహాన్ బేగం- షేక్ అబ్దుల్లా దంపతులకు ఐదుగురు కుమార్తెలు మరియు ఒక కుమారుడు
జన్మించారు.
షేక్ అబ్దుల్లాను వివాహం
చేసుకున్న తరువాత, వహీద్ జహాన్ బేగం మహిళా విద్య అంశాన్ని విస్తృత
ప్రచారం చేసింది మరియు యువతులకు విద్యను అందించడానికి మహిళా ఉపాధ్యాయులకు శిక్షణ
అవసరమని భావించారు
షేక్ అబ్దుల్లా ముస్లిం విద్యా సదస్సు Muslim Education Conference మహిళా విద్యా విభాగానికి Female Education Section కార్యదర్శిగా ఎన్నికయ్యారు, వహీద్ జహాన్ బేగం ఉర్దూ మాసపత్రిక "ఖాటూన్" కు సంపాదకురాలిగా మారింది, షేక్ అబ్దుల్లా- వహీద్ జహాన్ బేగం జంట 1904లో మహిళా విద్యను ప్రోత్సహించడానికి "ఖాటూన్" పత్రిక ప్రచురించడం ప్రారంభించారు మరియు ముస్లిం ఉన్నత వర్గాల బాలికల కోసం ఒక ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు.
వహీద్ జహాన్ బేగం దేశంలోని
విద్యావంతులైన ముస్లిం మహిళలలో సమావేశాలను నిర్వహించింది, తత్ఫలితంగా బాలికల పాఠశాలను స్థాపించడానికి నిధులు సమకూర్చింది.
షేక్ అబ్దుల్లా- వహీద్ జహాన్ బేగం జంట ముస్లిం
బాలికలకు ఉర్దూ, ఖురాన్, గణితం మరియు ఎంబ్రాయిడరి వర్క్ నేర్పడం కోసం ఒక
ప్రాథమిక పాఠశాలను ప్రారంభించినది అందులో ప్రవేశం తమ బాలికలను చదివించగల స్తోమత
కలిగిన ఉన్నత కుటుంబాల కుమార్తెలకు మాత్రమే పరిమితం చేయబడింది.1906లో కేవలం ఏడుగురు విద్యార్థులతో పాఠశాల ప్రారంభమైనప్పటికీ, 1909లో దాదాపు వంద మంది విద్యార్థులకు వసతి కల్పించే స్థాయికి పెరిగింది
పాఠశాలలో చేరిన బాలికలు తమ ఇళ్ల నుండి పాఠశాలకు కర్టెన్ క్యారేజీలలో
ప్రయాణించేవారు. ప్రయాణాల్లో బాలికలకు
ఎదురయ్యే బెదిరింపులను ఎదుర్కోవడానికి, బాలికల కోసం ఒక ప్రత్యేక బోర్డింగ్ స్కూల్‌ను
ప్రారంభించబడినది. వహీద్ జహాన్ బేగం బోర్డింగ్ స్కూల్‌లో చేరిన
ప్రతి అమ్మాయిని తన కుమార్తెలాగా చూసుకుంది. ముస్లిం ఉన్నత వర్గాల నుండి సామాజిక
ఆమోదాన్ని పొందడానికి బాలికల బోర్డింగ్ స్కూల్‌లో కఠినమైన పర్దా అమలు చేయబడింది,
1939లో వహీద్ జహాన్ బేగం మరణించే సమయానికి, బోర్డింగ్ పాఠశాల అనేక డిగ్రీ
కోర్సులను అందించే మహిళా కళాశాలగా అభివృద్ధి చెందింది.
వహీద్ జహాన్ బేగం తన భర్త షేక్ అబ్దుల్లా తో కలిసి ప్రారంభించిన మహిళా కళాశాలలో ఇప్పుడు
దాదాపు 40,000 మంది విద్యార్థులు ఉన్నారు మరియు కళాశాలలో చదువుకోవడానికి విద్యార్థులు
ప్రపంచం నలుమూలల నుండి వస్తారు.
ముస్లిం మహిళల భవిష్యత్ తరాల పురోగతి కోసం కృషి చేయడానికి తన జీవితాన్ని
అంకితం చేయడానికి త్యాగం చేసిన మహిళగా, ముస్లిం సమాజంలో మహిళా విద్య
కోసం పాటు పడే వహీద్ జహాన్ బేగం వంటి మహిళలు భవిష్యత్ తరాల మహిళలకు మార్గదర్శకులు.
No comments:
Post a Comment