29 September 2025

కేరళ లోని ప్రముఖ ముస్లిం మైనారిటీ విద్యా సంస్థ: 60 వసంతాలు నిండిన 'మిలాద్-ఎ-షెరీఫ్ మెమోరియల్ కాలేజ్' (MSM)

 



కాయంకుళం (అలప్పుజ జిల్లా), కేరళ :

 

1964లో  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం జన్మదినోత్సవం జ్ఞాపకార్థం దేవుని స్వంత దేశం(కేరళ) లో మిలాద్-ఎ-షెరీఫ్ మెమోరియల్ కళాశాల (MSM) అలప్పుజ జిల్లాలోని కాయంకుళంలో స్థాపించబడినది. 1967-69 మధ్య కేరళలో మాజీ ఆర్థిక మంత్రిగా పనిచేసిన అల్హాజ్ పి కె కుంజు సాహిబ్ మిలాద్-ఎ-షెరీఫ్ మెమోరియల్ కళాశాల (MSM)స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు.

ముస్లిం మైనారిటీ విద్యా సంస్థ  - మిలాద్-ఎ-షెరీఫ్ మెమోరియల్ కళాశాల(MSM) స్థాపించి 60 ఏళ్ల పైగా అయినది.

MSM కళాశాల పోర్టల్ ప్రకారం దివంగత అల్హాజ్ పి.కె. కుంజు సాహిబ్ మధ్య ట్రావెన్‌కోర్‌లోని చదువురాని ప్రజల సాంస్కృతిక పురోగతి కోసం కళాశాల స్థాపించబడినది.

MSM కళాశాల ప్రవక్త ముహమ్మద్ బోధనలు మరియు జీవన విధానం కు స్మారక చిహ్నంగా నిలుస్తుంది. అల్హాజ్ పి.కె. కుంజు సాహిబ్ పేదలు మరియు అణగారిన వర్గాల పురోగతి విద్య ద్వారానే సాధ్యమవుతుందని ఊహించారు. అందరికీ, ముఖ్యంగా అణగారిన వర్గాలకు, జ్ఞాన ప్రకాశాన్ని అందించే గొప్ప లక్ష్యo తో  1964లో MSM కళాశాల స్థాపించబడింది.

MSM కళాశాల సాధికారత మరియు విద్యకు చిహ్నం. అల్హాజ్ పి.కె. కుంజు సాహిబ్ దార్శనిక నాయకత్వం మరియు సమాజంలోని నిరుపేదలు మరియు విలువైన మైనారిటీలకు సహాయం చేయడంలో నిబద్ధతకు MSM కళాశాల ఒక స్మారక చిహ్నం.

MSM ట్రస్ట్ ద్వారా నిర్వహించబడుతున్న MSM కళాశాల అనేక తరాలకు జ్ఞానం మరియు ఆశ యొక్క దీపస్తంభంగా పనిచేసింది. MSM కళాశాల ప్రారంభం నుండి మద్య కేరళ  ప్రాంత విద్యా సాధన కేంద్రంగా మారింది.

MSM కళాశాల ప్రముఖ పూర్వ విద్యార్థులలో ఆస్కార్ అవార్డు గ్రహీత మాలీవుడ్‌కు చెందిన రసూల్ పూకుట్టి,  భారత మాజీ రాయబారి, ఐక్యరాజ్యసమితికి భారత శాశ్వత ప్రతినిధి టి పి శ్రీనివాసన్, కేరళ హైకోర్టు మాజీ జస్టిస్ కె హరిలాల్, భారత సైన్యం మాజీ బ్రిగేడియర్ సురేష్ జి, తిరువనంతపురంలోని సిఎస్‌టిడి, ఎన్‌ఐఐఎస్‌టి చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ పి సుజాతా దేవి, మాజీ ఎంపి సి ఎస్ సుజాత మొదలగు వారు  ఉన్నారు.

ఆరు దశాబ్దాలకు పైగా, ఎంఎస్‌ఎం MSM కళాశాల జ్ఞానోదయం ద్వారా సామాజికంగా వెనుకబడిన వారికి సేవ చేయడంలో కీలక పాత్ర పోషించింది. MSM కళాశాల ప్రారంభించిన కార్యక్రమాలు విద్యా నైపుణ్యం, విలువ ఆధారిత వ్యక్తిత్వ వికాసం మరియు నాయకత్వం కోసం శిక్షణ మరియు సాఫ్ట్ స్కిల్ డెవలప్‌మెంట్‌పై దృష్టి పెడతాయి. MSM కళాశాల ఈ ప్రాంతంలోని ప్రముఖ కళాశాలలలో ఒకటిగా పేరు గాంచినది..

No comments:

Post a Comment