14 September 2025

ముంతాజ్ జహాన్ హైదర్: అలీఘర్ మహిళా కళాశాల మొదటి ప్రిన్సిపాల్ Mumtaz Jahan Haider: The First Principal Of Women’s College Aligarh

 

 



1907లో పాత ఢిల్లీలో జన్మించిన  ముంతాజ్ జహాన్ హైదర్ లేదా 'ముంతాజ్ అపా' ఏడుగురు తోబుట్టువులలో మూడవది. ముంతాజ్ జహాన్,   తల్లి తండ్రులు షేక్ అబ్దుల్లా-వాహిద్ జహాన్ బేగం, పాత అలీఘర్‌లోని బాలా-ఇ-ఖిలా ప్రాంతంలో మదర్సా-ఇ-నివాన్ లేదా బాలికల ప్రాథమిక పాఠశాలను స్థాపించారు. ముంతాజ్ అపా పాఠశాల ఆవరణలోనే పెరిగారు మరియు పాఠశాలలోనే తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు.

ముంతాజ్ జహాన్ అలీఘర్ లో  మెట్రిక్యులేషన్ పూర్తి చేసి లక్నోలోని ఇసాబెల్లా థోబర్న్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో చేరారు. ముంతాజ్ జహాన్ 1931లో లక్నో విశ్వవిద్యాలయం నుండి ఆంగ్లంలో గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన మొదటి ముస్లిం మహిళా విద్యార్థి.

ముంతాజ్ అపా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం UKలోని లీడ్స్‌కు వెళ్లి అలీఘర్‌కు తిరిగి వచ్చింది. 1935లో, ముంతాజ్ జహాన్ AMUకెమిస్ట్రీ విభాగాధిపతి హేదర్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. ముంతాజ్ జహాన్ హేదర్ 1940లో ఉమెన్స్ కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యారు మరియు ముప్పై ఒక్క సంవత్సరాలు విద్యకు సేవలందించారు. ముంతాజ్ అపా పూర్తిగా మహిళా విద్యకు తనను తాను అంకితం చేసుకుంది

ముంతాజ్ జహాన్ హైదర్ అలీఘర్ ఉద్యమానికి మార్గదర్శకురాలిగా గుర్తింపు పొందారు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 1949లో అలీఘర్‌కు వచ్చి మహిళా కళాశాలను సందర్శించినప్పుడు  ముంతాజ్ జహాన్ ముంతాజ్ జహాన్ హైదర్ ప్రిన్సిపాల్ పదవిలో ఉంది. మహిళా కళాశాల పురోగతిని చూసి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ తొమ్మిది లక్షల రూపాయల వార్షిక గ్రాంట్‌ను ప్రకటించారు మరియు భారత ప్రభుత్వం అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి ఇచ్చే అన్ని గ్రాంట్‌ల నుండి క్రమం తప్పకుండా వాటాను పొందుతుందని  హామీ ఇచ్చారు.

ముంతాజ్ జహాన్ సమాజంలోని ఏ వర్గం వారి ప్రాథమిక విద్య హక్కు నుండి బయటపడకుండా చూసుకోవడమే లక్ష్యం, అందువల్ల, ముంతాజ్ జహాన్ మహిళా కళాశాల లో వివిధ పాఠ్యేతర కార్యకలాపాలను ప్రవేశపెట్టింది.

ముంతాజ్ జహాన్ చర్చలు, 'బైత్-బాజీ' మరియు సంభాషణలు వంటి కార్యక్రమాలను నిర్వహించింది. ముంతాజ్ జహాన్ బాలికలను విద్యావంతులను చేసిన వారు స్వయం సమృద్ధిగా మారగలరు మరియు ఇతర ముస్లిం బాలికలను విద్యావంతులను చేయడానికి దోహదపడతారు అని నమ్మినారు. ముంతాజ్ జహాన్ కు ఉపాధ్యాయురాలి పాత్ర కేవలం జ్ఞానాన్ని అందించడం కంటే ఎక్కువ, స్నేహితురాలు, తత్వవేత్త మరియు మార్గదర్శి.

1948లో భర్త మరణించిన తర్వాత, ముంతాజ్ అపా తన పిల్లలు షహ్లా మరియు సల్మాన్‌లను ఒంటరిగా పెంచింది. ముంతాజ్ అపా పిల్లలలో ఒకరు మాజీ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖలో సీనియర్ అధికారిణిగా, రెండోవారు  భారత ప్రభుత్వంలో విదేశాంగ కార్యదర్శిగా పనిచేసినారు..

శ్రీమతి ముంతాజ్ జహాన్ హైదర్ కు 2006లో పద్మ విభూషణ్ అవార్డు లభించింది.

No comments:

Post a Comment