హలీమా బీవి కేరళలో తొలి మహిళా
జర్నలిస్టుగా గుర్తింపు పొందారు. ప్రజా రంగంలోకి మహిళల ప్రవేశాన్ని పరిమితం చేసిన
సమయంలో, హలీమా బీవి మహిళా-ఆధారిత జర్నలిజం బ్రాండ్‌కు మార్గదర్శకురాలిగా నిలిచింది.
హలీమా బీవి 7వ తరగతి వరకు అబ్యసించినది
హలీమా బీవీ 17 సంవత్సరాల వయస్సులో పండితుడు, రచయిత మరియు సంపాదకుడైన
కె.ఎం. ముహమ్మద్ మౌలవిని వివాహం చేసుకుంది.
హలీమా బీవీ ముస్లిం మహిళల ఆందోళనలను తెరపైకి తీసుకురావడానికి వివిధ పత్రికలను ప్రారంభించిన ప్రచురణకర్త; హలీమా బీవీ స్థానిక మరియు జాతీయ రాజకీయాల్లో కూడా చురుకుగా పాల్గొంది; హలీమా బీవీ సామాజిక సంస్కర్త, మరియు భారతీయ ముస్లిం మహిళల విముక్తి మరియు సాధికారత కోసం కృషి చేసింది.
హలీమా బీవీ, 1938లో, కేవలం 20 సంవత్సరాల వయస్సులోనే “ముస్లిం వనిత” (ముస్లిం ఉమెన్ మ్యాగజైన్)ను ప్రారంభించింది, దానికి ఆమె ఎడిటర్ మరియు ప్రచురణకర్త. 1944లో హలీమా బీవీ “భారత చంద్రిక” మ్యాగజైన్ ప్రారంబించినది..
హలీమా బీవీ నేతృత్వంలోని “భారత
చంద్రిక పత్రిక సంపాదకీయ బోర్డులో వైకోమ్ ముహమ్మద్ బషీర్, వైకోమ్ అబ్దుల్ ఖాదర్ మరియు వేటూర్ రామన్ నాయర్ ఉన్నారు. పొంకున్నం వర్కి, బాలమణియమ్మ, చంగంపుజ, ఎస్. గుప్తన్ నాయర్ మొదలైన
వారితో సహా మలయాళ సాహిత్యంలో అనేక మంది ప్రముఖ వ్యక్తుల రచనలను కూడా ఈ పత్రిక ప్రచురించింది. “భారత చంద్రిక”
వారపత్రికను ప్రారంభించిన కొన్ని సంవత్సరాల తర్వాత దినపత్రికగా మారింది అయితే, రాజకీయ ఒత్తిడి మరియు ఆర్థిక
సమస్యల చే హలీమా బీవీ 1949లో పత్రికను మూసివేయవలసి వచ్చింది.
1970లో, హలీమా బీవీ “ఆధునిక వనిత”అనే
పత్రికను ప్రారంభించింది. ఈ పత్రిక సంపాదకీయ సిబ్బంది అంతా మహిళలే. హలీమా బీవీ ఒక జర్నలిస్ట్ గా సరళమైన
భాషను ఉపయోగించి సాధారణ ముస్లిం మహిళల సమస్యలను వెలుగులోనికి తెచ్చింది. ఒక
సంవత్సరం తర్వాత ఆర్థిక కారణాల వల్లఈ మ్యాగజైన్ కూడా మూసివేయవలసి వచ్చింది.
హలీమా బీవి ప్రజా జీవితంలో ట్రావెన్‌కోర్‌లో తొలి మహిళా మున్సిపల్ కౌన్సిలర్ అయ్యారు. హలీమా బీవి భారతదేశ స్వాతంత్ర్య పోరాటం లో పాల్గొంది. స్వాతంత్ర్య ఉద్యమానికి కేంద్రంగా ఉన్న రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్‌తో సంబంధం కలిగి ఉంది. నిరసన ప్రదర్శనలలో పాల్గొని అరెస్ట్ అయ్యింది.
ముస్లిం మహిళల అభ్యున్నతి
కోసం హలీమా బీవి కృషి చేసింది. హలీమా బీవి స్త్రీలలో సంఘీభావాన్ని పితృస్వామ్య
అణచివేతకు వ్యతిరేకంగా ఆచరణీయమైన విరుగుడుగా పేర్కొంది.
హలీమా బీవి స్త్రీ విద్యను
ప్రోత్సహించినది. సమాజంలో పురుషుడు మరియు
స్త్రీ సమానత్వం కోసం కృషి చేసింది. మహిళల
జీవితాల మెరుగుదల కోసం సంస్కరణల ఆవశ్యకతను కొరుకొంది. హలీమా
బీవీ స్త్రీవాద ఉద్యమంలో భాగం. కేరళలో మహిళా జర్నలిజంకు మార్గదర్శకత్వం వహించినది.
2019లో, కేరళ సాహిత్య అకాడమీ "కేరళ
జర్నలిజంలో మరుపురాని హీరోయిన్ unsung heroines of Kerala
Journalism.”గా హలీమా బీవీ ని స్మరించుకోoది..
ముస్లిం మహిళల లింగ న్యాయం కోసం ఫోరంForum For Muslim Women’s Gender Justice,, ముస్లిం మహిళలకు ప్రయోజనం చేకూర్చేలా ఆస్తి మరియు వారసత్వ చట్టాలలో చట్టపరమైన
మార్పులను డిమాండ్ చేస్తూ,
హలీమా బీవీని ఉటంకిస్తూ అవగాహన పెంచడానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది: ఈ
కార్యక్రమం జరిగిన టౌన్ హాల్‌ను 'ఎం
హలీమా బీవీ నగర్' అని పిలుస్తారు.
హలీమా బీవీ ప్రశంసనీయమైన విజయాలు సాధించిన అనేక
అద్భుతమైన మహిళలలో ఒకరు.
No comments:
Post a Comment