28 December 2025

నాజియా బీబీ' - మహిళా ఖో ఖో క్రీడాకారిణి 'Nazia Bibi'-female Kho Kho player

 

'

ముస్లిం మహిళా క్రీడా సాధికారికత

 

ఒక వ్యక్తి పోరాటం చాలా మందికి అవకాశాలను తెరుస్తుంది.”

 

నజియా బీబీ జమ్మూలోని బకర్వాల్ తెగకు చెందిన మొదటి మహిళా ఖో ఖో క్రీడాకారిణి. 21 ఏళ్ల నజియా బీబీ ఖో ఖో ప్రపంచ కప్‌కు ఎంపికైన జట్టులో కూడా ఉంది మరియు ఆ జట్టు బంగారు పతకం గెలుచుకోవడం ద్వారా భారతదేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది.

నజియా బీబీ జమ్మూ జిల్లాలోని నగ్రోటా అనే చిన్న గ్రామంలో (గ్రామీణ ప్రాంతం) పుట్టి పెరిగింది.నజియా బీబీ తండ్రి పేరు సబర్ అలీ ఒక దుకాణదారుడు మరియు పశుపోషణ ద్వారా జీవనోపాధి పొందుతాడు. నజియా బీబీ తల్లి పేరు జులేఖా బీబీ

నాజియా బీబీ తన మామ మాస్టర్ ఇక్బాల్ ప్రోత్సాహం తో ఖో-ఖో ఆడటం ప్రారంబించినది. నాజియా బీబీ ఆరో తరగతిలో ఉన్నప్పుడు పాఠశాలలో ఖో-ఖో ఆడటం ప్రారంభించింది. ప్రారంభంలో, అథ్లెటిక్స్ పట్ల ఆసక్తి ఉండేది, కానీ తరువాత తన దృష్టిని ఖో-ఖో వైపు మళ్లించింది.

నజియా బీబీ గత 12 సంవత్సరాలలో, జిల్లా, రాష్ట్ర, విశ్వవిద్యాలయం మరియు జాతీయ స్థాయి మహిళా ఖో ఖో పోటిలలో పాల్గొన్నది.నజియా బీబీ జమ్మూలోని 'పద్మశ్రీ పద్మ సచ్‌దేవ్ ప్రభుత్వ మహిళా కళాశాల'లో బిఎ విద్యార్థిని, తన కళాశాల జట్టుకు నాయకత్వం వహించి అనేక ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకుంది.

నజియా బీబీ అత్యుత్తమ ప్రదర్శన సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. నజియా బీబీ ప్రదర్శన ఆధారంగా, జాతీయ  శిబిరానికి ఆహ్వానించారు. న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జాతీయ శిబిరం జరిగింది. నాజియా బీబీ యొక్క స్థిరమైన అంకితభావం, కృషి మరియు ప్రభావవంతమైన ఆట నైపుణ్యాలు 2025లో జరిగే మొదటి ఖో-ఖో ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యుల భారత మహిళా జట్టులో ఎంపిక చేయడానికి దారితీశాయి. జమ్మూ మరియు కాశ్మీర్ నుండి తుది జట్టుకు ఎంపికైన ఏకైక మహిళా క్రీడాకారిణి నాజియా బీబీ.

నాజియా బీబీ జట్టులో అటాకర్‌గా ఎంపికైంది. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో, భారతదేశం నేపాల్‌ను 78-40 స్కోరుతో భారీ స్కోరుతో ఓడించి తొలి ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది.

నజియా బీబీ అంతర్జాతీయ విజయం అనేక మంది ప్రతిభావంతులైన క్రీడాకారులకు కొత్త ద్వారాలు తెరిచింది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ నజియా బీబీ విజయానికి అభినందనలు తెలిపారు.

నజియా బీబీ వంటి ప్రతిభావంతులైన మరియు ధైర్యవంతులైన బాలికలు ఇతర బాలికలకు ప్రేరణగా మారతారు. సమాజంలో బాలికల గురించి ఉన్న అభిప్రాయాలను మార్చడంలో వారు కీలక పాత్ర పోషిస్తారు మరియు భవిష్యత్ తరాలకు మార్గం సుగమం చేస్తారు.

ప్రవక్త మసీదు గ్రంథాలయం-మదీనా The Prophet's Mosque Library- Madinah

 

మదీనా అల్ మునవ్వరా:

ప్రవక్త మసీదు గ్రంథాలయం సౌదీ అరేబియాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పండిత స్మారక చిహ్నాలలో ఒకటిగా నిలుస్తుంది, ఇది శతాబ్దాల ఇస్లామిక్ మరియు అరబిక్ భాషా చరిత్రను ప్రతిబింబిస్తుంది.

ప్రవక్త మసీదు గ్రంథాలయం,  పవిత్ర ఖురాన్ భాష యొక్క సంరక్షకుడిగా ప్రపంచ పరిశోధకులకు ఆధునిక వాతావరణాన్ని అందిస్తూ వారసత్వాన్ని కాపాడుకోవడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది..

1481 (886 AH)లో జరిగిన  వినాశకరమైన అగ్నిప్రమాదo  ప్రవక్త మసీదు గ్రంథాలయం  లోని అరుదైన మాన్యుస్క్రిప్ట్‌ల ఒరిజినల్  రిపోజిటరీలను నాశనం చేసింది. ప్రవక్త మసీదు గ్రంథాలయం 1933 (1352 AH)లో రాజు అబ్దులాజీజ్ పాలనలో అధికారికంగా తిరిగి స్థాపించబడింది.

ప్రవక్త మసీదు గ్రంథాలయం నేడు, ఒక భారీ మేధో కేంద్రంగా అభివృద్ధి చెందింది, అరబిక్ భాషాశాస్త్రంలో మాత్రమే 15,000 కంటే ఎక్కువ ప్రత్యేక టైటిల్స్/శీర్షికలను కలిగి ఉంది, వ్యాకరణం, పదనిర్మాణం మరియు వాక్చాతుర్యాన్ని కలిగి ఉంది.

సందర్శకులకు సేవ చేయడానికి, ప్రవక్త మసీదు లైబ్రరీ సమగ్ర విభాగాల వ్యవస్థ ద్వారా పనిచేస్తుంది. వీటిలో పురుషులు, మహిళలు మరియు పిల్లల కోసం ప్రత్యేకమైన పఠన గదులు, అరుదైన మూల గ్రంథాలను కలిగి ఉన్న మాన్యుస్క్రిప్ట్ విభాగం మరియు మసీదు యొక్క ఉపన్యాసాలు మరియు పాఠాలను నమోదు చేసే ఆడియో విభాగం ఉన్నాయి.

సాంకేతిక విభాగాలు పురాతన పేజీల పునరుద్ధరణ మరియు సంరక్షణపై అవిశ్రాంతంగా పనిచేస్తాయి, ఆధునిక డిజిటల్ లైబ్రరీ ఎలక్ట్రానిక్ పరిశోధన సాధనాలను అందిస్తుంది, చారిత్రాత్మక ప్రవక్త మసీదు గ్రంథాలయం డిజిటల్ యుగంలో జ్ఞానం కోసం ఒక శక్తివంతమైన కేంద్రంగా పనిచేస్తుంది.  

 

 

24 December 2025

జహ్రా కలీమ్: బీహార్‌లో మొదటి ముస్లిం మహిళా ఎమ్మెల్యే Zahra Kaleem:The First Muslim Woman MLA in Bihar

 

Zahra Kaleem — Bihar's first Muslim woman MLA in independent India. ज़हरा  कलीम, आज़ाद भारत में बिहार की पहली मुस्लिम महिला MLA- ज़हरा कलीम का  ताल्लुक़ पटना के ख़्वाजाकलाँ ...

1946లో, జహ్రా కలీమ్ బీహార్ బీహార్ శాసనసభకు మొదటి ముస్లిం మహిళా సభ్యురాలిగా (ఎమ్మెల్యే) ఎన్నికయ్యే విశిష్టతను పొందారు. జహ్రా కలీమ్ బెంగాల్‌లోని ఒక సంపన్న మరియు విద్యావంతుల కుటుంబంలో జన్మించారు. జహ్రా కలీమ్ తండ్రి, అడ్వకేట్ మహమ్మద్ హఫీజ్, బెంగాల్‌లో ప్రసిద్ధి చెందిన న్యాయవాది.

జహ్రా కలీమ్ కలకత్తాలోని ప్రతిష్టాత్మక లోరెటో హౌస్‌లో ఆంగ్ల మాధ్యమంలో విద్యను పొందారు. జహ్రా కలీమ్ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (AMU)లో ఆంగ్ల లెక్చరర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. మహిళల విద్య మరియు హక్కుల కోసం కృషి చేసారు.  

జహ్రా కలీమ్ ఒక అద్యాపకురాలుగా, మహిళల విద్య ద్వారా మాత్రమే నిజమైన సామాజిక సంస్కరణ సాధ్యమని నమ్మేవారు. మహిళలు విద్యను అభ్యసించాలని తరచుగా నొక్కి చెప్పేవారు.

జహ్రా కలీమ్‌కు పాట్నాకు చెందిన ప్రముఖ రచయిత మరియు ప్రొఫెసర్ అయిన కలీముద్దీన్ అహ్మద్‌తో వివాహం జరిగింది. వివాహం తర్వాత, జహ్రా కలీమ్‌ పాట్నాకు మారారు, అక్కడ జహ్రా సామాజిక సేవా కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు.

1946లో, జహ్రా కలీమ్‌ పాట్నాలోని ముస్లిం మహిళల కోసం కేటాయించిన స్థానం నుండి పోటీ చేసి ఎన్నికల్లో గెలుపొందారు. తదనంతరం, 1957లో (స్వతంత్ర భారతదేశంలో), జహ్రా కలీమ్‌ రెండవసారి శాసనసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు మరియు స్వతంత్ర భారతదేశపు మొదటి ముస్లిం మహిళా ఎమ్మెల్యేగా నిలిచారు. 1962లో, జహ్రా కలీమ్‌ బీహార్ శాసనసభ సభ్యురాలిగా (ఎమ్మెల్యేగా) తిరిగి ఎన్నికయ్యారు.

జహ్రా కలీమ్ రాజకీయాలను 'అధికారం' కంటే 'సేవ'కు ఒక సాధనంగా భావించారు.

జహ్రా కలీమ్ ప్రగతిశీల భావాలున్న మహిళ. జహ్రా కలీమ్ మహిళల సామాజిక స్థితిని మెరుగుపరచడానికి కృషి చేశారు. బీహార్ శాసనసభలో మహిళలకు సంబంధించిన సమస్యలను జహ్రా కలీమ్ ప్రముఖంగా ప్రస్తావించారు మరియు సమాజంలో మహిళల స్థానాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించారు.

జహ్రా కలీమ్ 1986లో, తన ఆత్మకథను "డౌన్ మెమరీ లేన్: ఎ పాట్-పౌరీ ఆఫ్ రెమినిసెన్సెస్ ఇన్ బి ఫ్లాట్ మైనర్“Down Memory Lane: A Pot-Pourri of Reminiscences in B Flat Minor" పేరుతో రాశారు.

జహ్రా కలీమ్ వారసత్వాన్ని మరియు చేసిన పనిని గురించి జహ్రా కలీమ్ కుమారుడు ఆరిఫ్ కలీమ్, గర్వంగా ఇలా అన్నారు:"ఇన్నేళ్ల తర్వాత కూడా మా అమ్మగారి విజయాలను హైలైట్ చేయడం చూడటం నాకు గర్వకారణం."

జహ్రా కలీమ్ ప్రధానంగా ఒక రాజకీయవేత్త, సంఘ సంస్కర్త మరియు విద్యావేత్త. జహ్రా కలీమ్ నిజంగా ఒక ఆదర్శప్రాయమైన మహిళ మరియు రాజకీయ నాయకురాలు.

ప్రారంభ ముస్లిం-చైనా సంబంధాలు The formative Muslim-Chinese Relations

 

 


పీటర్ ఫ్రాంకోపాన్ తన పుస్తకం 'న్యూ సిల్క్ రోడ్స్'లో వర్ణించినట్లు 1000 CE కి ముందు చైనా మరియు ఇస్లామిక్ ప్రపంచం మద్య సంబంధాలు ఆర్థికంగా చాలా ముఖ్యమైనవి.

ఖురాన్‌లో చైనా లేదా చైనీయుల గురించి ప్రస్తావన లేదు, తలాస్ యుద్ధానికి ముందు చైనాలో అరబ్బుల ( చైనా బాషలో అరబ్బుల పురాతన పేరు డాషి ) గురించి ఎటువంటి చైనీస్ ప్రస్తావన లేదు.

హుయ్ Hui మూలాలు ఇస్లాం ప్రవక్త జీవితకాలంలోనే (సుమారు 570–632) చైనాలోకి ప్రవేశించిందని పేర్కొన్నాయి. హుయ్ మూలాల ప్రకారం, కొత్త మతాన్ని వ్యాప్తి చేయడానికి ప్రవక్త(స) ప్రత్యేకంగా సాద్ ఇబ్న్ అబీ వక్కాస్‌ను చైనాకు పంపారు.

ఎనిమిదవ శతాబ్దం నుండి పదిహేనవ శతాబ్దం వరకు, ముస్లిం వ్యాపారులు చైనాకు వెళ్లే సముద్రపు సిల్క్ రోడ్‌ను ఎక్కువగా నియంత్రించారు.

సా.శ. 750లో ఉమయ్యద్ ఖలీఫాల పతనం తరువాత, అబ్బాసిద్ రాజవంశం తమ రాజధానిని డమాస్కస్ నుండి బాగ్దాద్‌కు మార్చింది, దీని ఫలితంగా ముస్లింలు తూర్పు వైపుకు మరింత అన్వేషణ మరియు ఆక్రమణలు జరిపారు, అదే సమయంలో చైనీస్  టాంగ్ పాలకులు పశ్చిమం వైపుకు ముందుకు సాగారు.

ఈ నేపథ్యంలో, జనరల్ జియాద్ బిన్ సలేహ్ ఇబ్న్ అల్-అతిర్ Ziyad bin Saleh ibn al-Atir ఆధ్వర్యంలోని అబ్బాసిద్ దళాలు 751లో ఫెర్గానా లోయలో Fergana టాంగ్ దళాలతో ఘర్షణ పడ్డాయి. ఈ యుద్ధం తలాస్ యుద్ధంగా తరువాతి తరాలకు తెలిసింది. ముస్లిం చరిత్రకారుడు ఇబ్న్ అల్-అతిర్ (1160–1233) మరియు పర్షియన్ భౌగోళిక శాస్త్రవేత్త ఇబ్న్ ఖుర్రదద్‌బిహ్ Ibn Khurradadhbih (c. 820–912) అరబిక్‌లో చైనా గురించి ప్రస్తావించారు.

ఇబ్న్ ఖుర్రదద్‌బిహ్ చైనాలో బియ్యం,  పింగాణీ వాడకం ఉందని మరియు చైనా లో లబించే ఇనుము అద్భుతమైన నాణ్యతతో ఉందని అన్నాడు. చైనాలో 300 సంపన్న నగరాలు కలవని  ఇబ్న్ ఖుర్రదద్‌బిహ్ ప్రస్తావించాడు.

తలాస్ యుద్ధం జరిగిన నాలుగు సంవత్సరాల తరువాత, టాంగ్ రాజ వంశస్తులు తమ సైన్యం  లో అరబ్ కిరాయి సైనికులను మరియు ఉయ్ఘర్లను చేర్చుకున్నారు. ఆ తరువాతి రాజవంశాలన్నీ సైనికులు, నావికులు, ఖగోళ శాస్త్రవేత్తలు మరియు నిర్వాహకులుగా ముస్లింలను నియమించుకోన్నారు.

ఎనిమిదవ శతాబ్దం నుండి పదిహేనవ శతాబ్దం వరకు, ముస్లిం వ్యాపారులు (అరబ్, పెర్షియన్, ఇండియన్ మరియు ఆగ్నేయాసియా) చైనాకు సముద్ర సిల్క్ రోడ్డును ఎక్కువగా నియంత్రించారు. చైనీస్ పట్టు మరియు పింగాణీ పశ్చిమ యురేషియాలో చాలా ఇష్టపడేవారు మరియు ప్రతిగా చైనా ముస్లిం ప్రపంచం నుండి సుగంధ ద్రవ్యాలు, అంబర్, గుండ్లు, గాజుసామాను మరియు కోబాల్ట్‌ను పొందింది.

పర్షియన్ చరిత్రకారుడు అల్-తాలిబి al-Thaalibi (961–1038) ప్రకారం, తలాస్ యుద్ధంలో పట్టుబడిన చైనీస్ కళాకారులు ముస్లిం ప్రపంచంలోకి కాగితం తయారీని ప్రవేశపెట్టారు.

పదవ శతాబ్దం ప్రారంభంలో అరబ్ యాత్రికుడు అబూ జాయద్ అసన్ అల్-సిరాఫీ చైనీస్ కళాకారులను 'భూమిపై అత్యంత తెలివైన వ్యక్తులు' అని అభివర్ణించాడు.  “జ్ఞానo  కోసం చైనా అయినా వెళ్ళండి.” అనే ప్రసిద్ద హదీసు కలదు.

'ముస్లిం హెరోడోటస్' అని పిలువబడే అరబ్ చరిత్రకారుడు అల్-మసూది (895–956) చైనీస్ పురాతన కాలం నాటి 'ఋషి రాజులను' ప్రశంసించాడు. చైనీస్ పాలకులు  ఇచ్చిన న్యాయమైన తీర్పులు  హేతువు ద్వారా మార్గనిర్దేశం చేయబడ్డారని' సూచించారు. అల్-మసూది తన కాలంలోని చైనీయులు 'చిత్రలేఖనం మరియు అన్ని కళలలో నైపుణ్యం కలిగినవారు' అని కూడా అన్నాడు.