24 December 2025

ప్రారంభ ముస్లిం-చైనా సంబంధాలు The formative Muslim-Chinese Relations

 

 


పీటర్ ఫ్రాంకోపాన్ తన పుస్తకం 'న్యూ సిల్క్ రోడ్స్'లో వర్ణించినట్లు 1000 CE కి ముందు చైనా మరియు ఇస్లామిక్ ప్రపంచం మద్య సంబంధాలు ఆర్థికంగా చాలా ముఖ్యమైనవి.

ఖురాన్‌లో చైనా లేదా చైనీయుల గురించి ప్రస్తావన లేదు, తలాస్ యుద్ధానికి ముందు చైనాలో అరబ్బుల ( చైనా బాషలో అరబ్బుల పురాతన పేరు డాషి ) గురించి ఎటువంటి చైనీస్ ప్రస్తావన లేదు.

హుయ్ Hui మూలాలు ఇస్లాం ప్రవక్త జీవితకాలంలోనే (సుమారు 570–632) చైనాలోకి ప్రవేశించిందని పేర్కొన్నాయి. హుయ్ మూలాల ప్రకారం, కొత్త మతాన్ని వ్యాప్తి చేయడానికి ప్రవక్త(స) ప్రత్యేకంగా సాద్ ఇబ్న్ అబీ వక్కాస్‌ను చైనాకు పంపారు.

ఎనిమిదవ శతాబ్దం నుండి పదిహేనవ శతాబ్దం వరకు, ముస్లిం వ్యాపారులు చైనాకు వెళ్లే సముద్రపు సిల్క్ రోడ్‌ను ఎక్కువగా నియంత్రించారు.

సా.శ. 750లో ఉమయ్యద్ ఖలీఫాల పతనం తరువాత, అబ్బాసిద్ రాజవంశం తమ రాజధానిని డమాస్కస్ నుండి బాగ్దాద్‌కు మార్చింది, దీని ఫలితంగా ముస్లింలు తూర్పు వైపుకు మరింత అన్వేషణ మరియు ఆక్రమణలు జరిపారు, అదే సమయంలో చైనీస్  టాంగ్ పాలకులు పశ్చిమం వైపుకు ముందుకు సాగారు.

ఈ నేపథ్యంలో, జనరల్ జియాద్ బిన్ సలేహ్ ఇబ్న్ అల్-అతిర్ Ziyad bin Saleh ibn al-Atir ఆధ్వర్యంలోని అబ్బాసిద్ దళాలు 751లో ఫెర్గానా లోయలో Fergana టాంగ్ దళాలతో ఘర్షణ పడ్డాయి. ఈ యుద్ధం తలాస్ యుద్ధంగా తరువాతి తరాలకు తెలిసింది. ముస్లిం చరిత్రకారుడు ఇబ్న్ అల్-అతిర్ (1160–1233) మరియు పర్షియన్ భౌగోళిక శాస్త్రవేత్త ఇబ్న్ ఖుర్రదద్‌బిహ్ Ibn Khurradadhbih (c. 820–912) అరబిక్‌లో చైనా గురించి ప్రస్తావించారు.

ఇబ్న్ ఖుర్రదద్‌బిహ్ చైనాలో బియ్యం,  పింగాణీ వాడకం ఉందని మరియు చైనా లో లబించే ఇనుము అద్భుతమైన నాణ్యతతో ఉందని అన్నాడు. చైనాలో 300 సంపన్న నగరాలు కలవని  ఇబ్న్ ఖుర్రదద్‌బిహ్ ప్రస్తావించాడు.

తలాస్ యుద్ధం జరిగిన నాలుగు సంవత్సరాల తరువాత, టాంగ్ రాజ వంశస్తులు తమ సైన్యం  లో అరబ్ కిరాయి సైనికులను మరియు ఉయ్ఘర్లను చేర్చుకున్నారు. ఆ తరువాతి రాజవంశాలన్నీ సైనికులు, నావికులు, ఖగోళ శాస్త్రవేత్తలు మరియు నిర్వాహకులుగా ముస్లింలను నియమించుకోన్నారు.

ఎనిమిదవ శతాబ్దం నుండి పదిహేనవ శతాబ్దం వరకు, ముస్లిం వ్యాపారులు (అరబ్, పెర్షియన్, ఇండియన్ మరియు ఆగ్నేయాసియా) చైనాకు సముద్ర సిల్క్ రోడ్డును ఎక్కువగా నియంత్రించారు. చైనీస్ పట్టు మరియు పింగాణీ పశ్చిమ యురేషియాలో చాలా ఇష్టపడేవారు మరియు ప్రతిగా చైనా ముస్లిం ప్రపంచం నుండి సుగంధ ద్రవ్యాలు, అంబర్, గుండ్లు, గాజుసామాను మరియు కోబాల్ట్‌ను పొందింది.

పర్షియన్ చరిత్రకారుడు అల్-తాలిబి al-Thaalibi (961–1038) ప్రకారం, తలాస్ యుద్ధంలో పట్టుబడిన చైనీస్ కళాకారులు ముస్లిం ప్రపంచంలోకి కాగితం తయారీని ప్రవేశపెట్టారు.

పదవ శతాబ్దం ప్రారంభంలో అరబ్ యాత్రికుడు అబూ జాయద్ అసన్ అల్-సిరాఫీ చైనీస్ కళాకారులను 'భూమిపై అత్యంత తెలివైన వ్యక్తులు' అని అభివర్ణించాడు.  “జ్ఞానo  కోసం చైనా అయినా వెళ్ళండి.” అనే ప్రసిద్ద హదీసు కలదు.

'ముస్లిం హెరోడోటస్' అని పిలువబడే అరబ్ చరిత్రకారుడు అల్-మసూది (895–956) చైనీస్ పురాతన కాలం నాటి 'ఋషి రాజులను' ప్రశంసించాడు. చైనీస్ పాలకులు  ఇచ్చిన న్యాయమైన తీర్పులు  హేతువు ద్వారా మార్గనిర్దేశం చేయబడ్డారని' సూచించారు. అల్-మసూది తన కాలంలోని చైనీయులు 'చిత్రలేఖనం మరియు అన్ని కళలలో నైపుణ్యం కలిగినవారు' అని కూడా అన్నాడు.

 

 

No comments:

Post a Comment