సెప్టెంబర్ 2, 1946న, తాత్కాలిక ప్రభుత్వ సభ్యులు ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. బ్రిటిష్ వారి నుండి భారతీయులకు
అధికారాన్ని బదిలీ చేయడానికి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది, వైస్రాయ్ మరియు కమాండర్-ఇన్-చీఫ్ మినహా
తాత్కాలిక ప్రభుత్వo పూర్తిగా భారతీయులతో కూడినది.
ఐదుగురు
హిందువులు, ఐదుగురు
ముస్లింలు మరియు షెడ్యూల్డ్ కులం, పార్సీ, సిక్కు
మరియు క్రైస్తవ వర్గాల నుండి ఒక్కొక్క సభ్యుడు ఉండేలా మొత్తం 14 మంది సభ్యులు ఉండాలని ప్రణాళిక వేయబడింది, కాని 12 స్థానాలు మాత్రమే భర్తీ చేయబడ్డాయి: జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, సి.
రాజగోపాల్‌చారి, శరత్ చంద్ర
బోస్, డాక్టర్
జాన్ మత్తాయ్, సర్దార్
బల్దేవ్ సింగ్, జగ్జీవన్
రామ్, సి.హెచ్.
భాభా, అసఫ్ అలీ, సయ్యద్ అలీ జహీర్ మరియు సర్ షఫాత్ అహ్మద్.
అసఫ్ అలీ, సయ్యద్ అలీ జహీర్ మరియు సర్ షఫాత్ అహ్మద్ -ముగ్గురు
ముస్లింలను చేర్చడం వల్ల తాత్కాలిక ప్రభుత్వంలోని ముస్లిం సభ్యులందరూ లీగ్ నుండి
రావాలనే జిన్నా డిమాండ్ దెబ్బతింది.
సర్ షఫాత్ చేరిక ముస్లిం లీగ్‌కు ఇష్టం
లేదు ఎందుకంటే సర్ షఫాత్ ముస్లిం లీగ్
నుండి ప్రాథమిక తేడాల కారణంగా వదిలిపెట్టాడు.
1946 ఆగస్టు 24 సాయంత్రం, సర్ షఫాత్ వాకింగ్ నుండి తిరిగి వస్తుండగా, సిమ్లాలోని దర్భాంగా హౌస్ (ఇప్పుడు పాఠశాల ఉంది) సమీపంలో ఇద్దరు యువకులు
సర్ షఫాత్ పై దాడి చేశారు. సర్ షఫాత్ కు లోతైన గాయాలు అయ్యాయి.
అక్టోబర్ 26, 1946న, జిన్నా తాత్కాలిక ప్రభుత్వంలో చేరడానికి అంగీకరించిన తర్వాత, ముగ్గురు సభ్యులు - శరత్ బోస్, సర్ షఫాత్ మరియు సయ్యద్ జహీర్ - ముస్లిం లీగ్‌కు
మార్గం కల్పించడానికి రాజీనామా చేశారు.
ఉన్నత
ప్రభుత్వ పదవికి ఈ క్లుప్తమైన ఎదుగుదల సర్ షఫాత్ రాజకీయ
జీవితంలో ఉన్నత స్థానం. తరువాత జనవరి 1947లో, సర్ షఫాత్ ను
కెనడాకు భారత హైకమిషనర్‌గా నియమించాలనే చర్చలు జరిగాయి, కానీ అవి కార్యరూపం దాల్చలేదు.
సర్ షఫాత్ 1920లలో యుపి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా, రౌండ్ టేబుల్ సమావేశానికి ముస్లిం ప్రతినిధి
బృందంలో భాగంగా ఉన్నారు మరియు 1941 నుండి 1944 వరకు
దక్షిణాఫ్రికాకు భారత హైకమిషనర్‌గా కూడా ఉన్నారు.
సర్ షఫాత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ స్థాపనలో పాత్ర పోషించినాడు. జూన్ 1935లో పూణేలో జరిగిన ఇండియన్ హిస్టరీ
కాంగ్రెస్ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించినాడు. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో మోడరన్ ఇండియన్
హిస్టరీ ఛైర్మన్‌గా సర్ షఫాత్ 1924లో
జర్నల్ ఆఫ్ ఇండియన్ హిస్టరీని ప్రారంభించారు. మద్రాస్ విశ్వవిద్యాలయం మరియు అలీఘర్
ముస్లిం విశ్వవిద్యాలయంలో కూడా ఇండియన్ హిస్టరీ బోధించారు.
అనారోగ్యంతో బాధపడుతూ సర్ షఫాత్ జూలై 1947లో సిమ్లాలో మరణించారు.
మూలం: http://www.thewire.in / సెప్టెంబర్ 02, 2020
No comments:
Post a Comment