భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో భారత పౌరులలో జాతీయ చైతన్యాన్ని మరియు రాజకీయ మేల్కొలుపును పెంపొందించడం లో ఆర్య సమాజం కీలక పాత్ర పోషించింది. స్వయం పాలన (స్వరాజ్యం) కోసం వాదించి మరియు బ్రిటిష్ ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన ఆర్య సమాజ స్థాపకుడు స్వామి
దయానంద
సరస్వతి
భారత
స్వాతంత్ర్య ఉద్యమానికి సైద్ధాంతిక పునాది వేశారు.
స్వామి
దయానంద
సరస్వతి
తన
రచనలలో బ్రిటిష్ అణచివేతను ఖండించారు మరియు విదేశీ పాలన భారతదేశానికి న్యాయం లేదా మేలు చేయదని నొక్కి చెప్పారు. మహాత్మా గాంధీ ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహానికి దాదాపు 70 సంవత్సరాల ముందుగానే, స్వామి దయానంద సరస్వతి ఉప్పుపై బ్రిటిష్ పన్నును వ్యతిరేకించారు మరియు విదేశీ వస్తువులను బహిష్కరించాలని ప్రోత్సహించారు. స్వామి దయానంద సరస్వతి బావాలు, ఆదర్శాలు తరువాత
స్వదేశీ ఉద్యమంలో ప్రతిధ్వనించినవి..
ఆర్య సమాజం స్వాతంత్ర్యం కోసం పోరాడిన అనేకమంది విప్లవకారులను ప్రేరేపించింది మరియు సమీకరించింది. లాలా లజపతి రాయ్, భగత్ సింగ్, రామ్ ప్రసాద్ బిస్మిల్ మరియు మదన్ లాల్ ధింగ్రా వంటి ప్రముఖ సభ్యులు ప్రసిద్ది చెందిన కాకోరి కుట్ర కేసు మరియు గదర్ పార్టీ విప్లవ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఇతర ప్రముఖ ఆర్య సమాజ స్వాతంత్ర్య సమరయోధులలో స్వామి శ్రద్ధానంద్ కూడా ఉన్నారు,
స్వామి శ్రద్ధానంద్ బ్రిటిష్ వారికి
వ్యతిరేకంగా ప్రజలను సమీకరించారు. స్వామి శ్రద్దనంద డిల్లీ లోని చారిత్రాత్మిక జామా మసీదు మింబర్ (పల్పిట్)
లోంచి ప్రసంగo చేశారు. హిందూ
ముస్లిం ఐక్యతపై స్వామి శ్రద్దానంద్ ఉపన్యాసం ఇచ్చారు
హిందూస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (HRA)
సహ వ్యవస్థాపకుడు సచింద్ర నాథ్ సన్యాల్; గదర్ ఉద్యమంలో కీలక వ్యక్తిగా జైలు శిక్ష అనుభవించిన భాయ్ పరమానంద్; మరియు ఆర్య
సమాజం
ద్వారా తీవ్రంగా ప్రభావితమైన విప్లవాత్మక భావజాలం కలిగిన వినాయక్ దామోదర్ సావర్కర్, స్వామి దయానంద్ ఇంగ్లాండ్‌కు పంపిన పండిట్ శ్యామ్‌జీ కృష్ణ వర్మ లండన్‌లో ఇండియా హౌస్‌ను స్థాపించడం ద్వారా అంతర్జాతీయ౦గా భారత స్వాతంత్ర్య పోరాటానికి పునాది వేశారు.
జైలులో ఉన్న స్వాతంత్ర్య సమరయోధులలో తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్న వారిలో 70% మంది
ఆర్య సమాజిస్టులు అని 1912 లో
నిర్వహించిన ఒక సర్వేలో
తేలింది, ఇది స్వాతంత్ర్య ఉద్యమంలో ఆర్య సమాజం యొక్క విస్తృత ప్రమేయాన్ని ప్రతిబింబిస్తుంది.
భగత్ సింగ్, సర్దార్ అజిత్ సింగ్ మరియు కిషన్ సింగ్ వంటి వారు తమ
విప్లవాత్మక ఆదర్శాలను రూపొందించినందుకు ఆర్య సమాజాన్ని ప్రశంసించారు. రవీంద్రనాథ్ ఠాగూర్, సర్దార్ పటేల్, బాల గంగాధర్ తిలక్ మరియు మహాత్మా గాంధీ వంటి నాయకులు కూడా భారతదేశ స్వాతంత్ర్యానికి ఆర్య సమాజం చేసిన కృషిని గుర్తించారు.
గురుకుల్ కాంగ్రీ మరియు DAV
పాఠశాలలు వంటి ఉద్యమ విద్యా సంస్థలు జాతీయవాద ఆలోచనలకు కేంద్రాలుగా మారాయి, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించిన నాయకులను తయారు చేశాయి.
ఆర్య సమాజ్ మత సంస్కరణ మరియు రాజకీయ కార్యకలాపాల ఏకీకరణ జాతీయవాద భావాలను బలోపేతం చేసింది, నిజమైన స్వేచ్ఛకు రాజకీయ స్వాతంత్ర్యం మరియు సామాజిక పునరుజ్జీవనం రెండూ అవసరమని చెప్పింది. స్వీయ పరిపాలన కోసం స్వామి దయానంద్ ఇచ్చిన తొలి పిలుపు చివరికి భారతదేశ స్వాతంత్ర్యానికి దారితీసిన ఒక ఉద్యమాన్ని రగిలించింది.
No comments:
Post a Comment