న్యూఢిల్లీ –
భారతదేశంలో అన్ని వర్గాలలో తీవ్ర పేదరికం extreme poverty గణనీయంగా తగ్గిందని ఇటీవలి నివేదికలు చెబుతున్నప్పటికీ ముస్లిం సమాజం ఇంకా విస్తృత
సామాజిక-ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముస్లిములు దేశంలో అత్యంత బలహీన వర్గాలలో ఒకటిగా నమోదు
అయ్యింది.
ప్రముఖ ఆర్థికవేత్తలు అరవింద్ పనగరియా మరియు
విశాల్ మోర్ చేసిన ఒక అధ్యయనం, నవంబర్
29, 2025న ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో
ప్రచురించబడింది. దీని ప్రకారం, జాతీయ
తీవ్ర పేదరికం national extreme poverty 2011–12లో 21.9% నుండి 2023–24లో కేవలం 2.3%కి తగ్గిందని అంచనా వేయబడింది.
ముస్లింలలో తీవ్ర పేదరికం 1.5%గా నమోదైంది,.హిందువులలో తీవ్ర పేదరికం రేటు 2.3% కంటే కొద్దిగా తక్కువ ఉంది..
గ్రామీణ ప్రాంతాలలో ముస్లింల తీవ్ర పేదరికం
రేటు 1.6% కాగా, హిందువులలో తీవ్ర పేదరికం రేటు 2.8%గా
ఉంది, పట్టణ ప్రాంతాలలో తీవ్ర పేదరికం
ముస్లింలలో 1.2% మరియు హిందువులలో తీవ్ర పేదరికం 1%గా ఉంది. క్రైస్తవులు మరియు బౌద్ధులు
వరుసగా 5% మరియు 3.5%తో అధిక పేదరికం రేట్లను
ఎదుర్కొంటున్నారు, అయితే సిక్కులు మరియు జైనులలో తీవ్ర
పేదరికం రేటు సున్నాగా నమోదైంది.
ఈ మెరుగుదలలలో ఆర్థిక వృద్ధి మరియు సంక్షేమ
పథకాల సానుకూల పాత్రను ఆర్ధికవేత్తలు పనగరియా మరియు మోర్ గుర్తించారు.
"వేగవంతమైన ఆర్థిక వృద్ధి మరియు లక్షిత ప్రభుత్వ కార్యక్రమాలు లక్షలాది
మందిని తీవ్ర పేదరిక రేఖకు పైకి తీసుకువచ్చాయి," అని నివేదిక పేర్కొంది.
అయితే, ఈ
గణాంకాలు కేవలం వినియోగ ఆధారిత పేదరికాన్ని మాత్రమే కొలుస్తాయని మరియు విస్తృత, బహుముఖ కొరతలను పరిగణనలోకి తీసుకోలేదని
నిపుణులు నొక్కి చెబుతున్నారు. వీటిలో విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం, గృహనిర్మాణం మరియు ఉపాధి భద్రత
ఉన్నాయి.
NFHS-5 (2019–21) డేటాను ఉపయోగించి నీతి ఆయోగ్ సంకలనం చేసిన జాతీయ బహుముఖ పేదరిక సూచిక National Multidimensional Poverty Index (NMPI) ప్రకారం,
2015–16లో 24.85% నుండి 2023–24లో 14.96% జనాభా ఇప్పటికీ బహుముఖ పేదరికాన్ని
అనుభవిస్తున్నారు. ఈ గణాంకాలలో ముస్లింలు అసమానంగా disproportionately ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అధికారిక డేటా, ఆదాయం, వినియోగం
మరియు ఆస్తులలో గణనీయమైన అంతరాలను వెల్లడిస్తుంది. ముస్లింలు జాతీయ సగటు నెలవారీ
తలసరి వినియోగం national average monthly
per capita consumption లో 87.9% సంపాదిస్తున్నారు మరియు సగటు గృహ
ఆస్తులలో కేవలం 79% మాత్రమే కలిగి ఉన్నారు, అయితే పై వాటిలో హిందువులు వరుసగా 100% మరియు 93% కలిగి ఉన్నారు.
ముస్లింలలో వయోజన అక్షరాస్యత 68–70%గా ఉంది, ఇది హిందువుల వయోజన అక్షరాస్యత 75–78% కంటే వెనుకబడి ఉంది.
ఉపాధి కూడా మరింత ప్రమాదకరంగా ఉంది, ముస్లిములలో అధిక నిరుద్యోగిత రేట్లు
మరియు తక్కువ నైపుణ్యం, అనధికారిక ఉద్యోగాలలో అధిక
ప్రాతినిధ్యం, దాదాపు 70% మంది ముస్లిములు అస్థిర రంగాలలో స్వయం ఉపాధి పొందుతున్నారు.
“ఈ
గణాంకాలు వివక్ష, అభద్రత మరియు విద్య మరియు ఉద్యోగాలలో ముస్లిములు
ఎదుర్కొంటున్న అవకాశాల కొరతను తెలుపుతున్నాయని ముస్లిం సామాజిక కార్యకర్తలు
అంటున్నారు.”
2006 లో
సచార్ కమిటీ నివేదిక ముస్లింలలో తక్కువ అక్షరాస్యత మరియు అధిక లేమిని నమోదు
చేసింది, ఈ ధోరణులు నేటికీ కొనసాగుతున్నాయి.
తీవ్ర పేదరికం తగ్గినప్పటికీ, బహుమితీయ
దుర్బలత్వాలు multidimensional vulnerabilities సమాజాలను ఆర్థిక షాక్‌లకు మరియు
సామాజిక అణగదొక్కడానికి గురిచేస్తున్నాయని విశ్లేషకులు వాదిస్తున్నారు.
భూమి నష్టం, పెరుగుతున్న
ద్వేషపూరిత నేరాలు మరియు ఉపాధి రంగాల నుండి మినహాయించడం వంటి ఇటీవలి సంఘటనలు ముస్లిముల
ఆందోళనలను తీవ్రతరం చేశాయి. బీహార్ వంటి ముస్లిం-మెజారిటీ జనాభా ఉన్న ప్రాంతాలు
అధిక పేదరికం మరియు పోషకాహారలోపాన్ని ఎదుర్కొంటున్నాయని 2024 అవుట్‌లుక్ ఇండియా నివేదిక పేర్కొంది.
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024 భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా 105వ స్థానంలో ఉంచింది, ఇది "తీవ్రమైన" ఆకలిని
ప్రతిబింబిస్తుంది, మైనారిటీ వర్గాలు అసమానంగా disproportionately ప్రభావితమవుతాయి.
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి మాజీ
సభ్యురాలు డాక్టర్ షమికా రవి ప్రకారం “పనగారియా-మోర్ నివేదిక విద్య, ఆస్తులు మరియు సామాజిక అవకాశాలలో
అసమానతలను విస్మరిస్తుంది. ముస్లింలు ఇకపై సంపూర్ణ వినియోగ పరంగా పేదలుగా
ఉండకపోవచ్చు, కానీ వారి విస్తృత సామాజిక-ఆర్థిక లేమి
ముఖ్యమైనది.”
పనగారియా-మోర్ అధ్యయనం తీవ్ర పేదరికాన్ని
తగ్గించడంలో పురోగతిని చూపించడoలో విలువైనది. అయితే, భారతీయ ముస్లింలకు, విజయాన్ని
కేవలం వినియోగ పరిమితుల ద్వారా కొలవకూడదని, విద్య, ఉపాధి
చేరిక, వివక్షత వ్యతిరేక చర్యలు మరియు ఆస్తుల
నిర్మాణాన్ని asset-building పరిష్కరించే లక్ష్య విధానాల targeted policies అవసరాన్ని నిపుణులు నొక్కి చెప్పారు.
“ఒక సమాజంగా, వ్యవస్థాగత
అడ్డంకులను అధిగమించడానికి పురోగతిని గుర్తించడం మరియు నిరంతర మద్దతు రెండూ అవసరం”
అని మైనారిటీ అభివృద్ధిపై దృష్టి సారించే విధాన పరిశోధకురాలు ఫరా అన్సారీ అన్నారు
భారతదేశ విధాన నిర్ణేతలు సాధారణ పేదరిక
నిర్మూలనకు మించి, ఇప్పటికీ బహుమితీయ పేదరికాన్ని
ఎదుర్కొంటున్న పౌరులతో సహా,
అందరు పౌరులకు చేరిక, సమాన అవకాశం మరియు స్థిరమైన
అభివృద్ధిని inclusion, equal
opportunity, and sustainable development నిర్ధారించే లక్ష్యంగా, సమాజ-నిర్దిష్ట జోక్యాల community-specific
interventions సవాలును
ఎదుర్కొంటున్నారు.
No comments:
Post a Comment