21 December 2025

మన్సా మూసా చక్రవర్తి మరియు మాలి యొక్క చేతివ్రాత ప్రతులు Emperor Mansa Musa and the Manuscripts of Mali

 


చక్రవర్తి మన్సా మూసా క్రీ.శ. 1312 నుండి 1337 వరకు మాలి రాజ్యానికి పాలకుడు. మన్సా మూసా పాలనలో, మాలి ఆఫ్రికాలోని అత్యంత సంపన్న రాజ్యాలలో ఒకటిగా ఉండేది మరియు మన్సా మూసా ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకడుగా పరిగణిoప బడేవాడు.  మన్సా మూసా యొక్క  నికర సంపద సుమారు 400 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేయబడింది..

మన్సా మూసా పాలనలో, మాలి ఇస్లామిక్ పాండిత్యానికి కేంద్రంగా ఉండి, ప్రపంచవ్యాప్తంగా జ్ఞానాన్ని మరియు విద్యను వ్యాపింపజేసింది.

మన్సా మూసా పాలనలో, మాలి సామ్రాజ్యంలో మౌరిటానియా, సెనెగల్, గాంబియా, గినియా, బుర్కినా ఫాసో, మాలి, నైజర్, నైజీరియా మరియు చాద్ వంటి దేశాలు ఉండేవి. ఈ విశాలమైన మాలి సామ్రాజ్యం పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం నుండి తూర్పున చాద్ సరస్సు వరకు 2000 మైళ్ల దూరం విస్తరించి ఉండేది.

ఒక నిబద్ధత గల ముస్లిం అయిన మన్సా మూసా, 1312లో అబూ బక్రీ II Abu Bakri II నుండి అధికారం చేపట్టిన వెంటనే తీర్థయాత్రకు (హజ్) సిద్ధమయ్యాడు. మన్సా మూసా హజ్ యాత్ర లో తాను ప్రయాణించబోయే నగరాల గురించి, అలాగే మక్కాకు ఎలా చేరుకోవాలో బాగా తెలుసుకున్నాడు.

క్రీ.శ. 1324లో మన్సా మూసా మక్కాకు తీర్థయాత్రకు (హజ్) వెళ్ళినప్పుడు, ఈజిప్ట్ మీదుగా అతని ప్రయాణం పెద్ద సంచలనం సృష్టించింది. ఆ కాలపు అరబ్ రచయితలు మన్సా మూసా పదివేల మంది పరివారంతో మరియు డజన్ల కొద్దీ ఒంటెలతో ప్రయాణించాడని, ప్రతి ఒంటె 136 కిలోగ్రాముల (300 పౌండ్లు) బంగారాన్ని మోసుకెళ్ళిందని చెప్పారు.

మక్కా నుండి తిరిగి వచ్చిన తర్వాత, మన్సా మూసా తన రాజ్యంలో నగరాలకు పునరుజ్జీవం పోయడం ప్రారంభించాడు. మన్సా మూసా గావో, టింబుక్టు Timbuktu వంటి నగరాలలో మసీదులు మరియు పెద్ద ప్రభుత్వ భవనాలను నిర్మించాడు. మన్సా మూసా చేసిన అభివృద్ధి కారణంగా 14వ శతాబ్దంలో టింబుక్టు ఒక ప్రధాన ఇస్లామిక్ విశ్వవిద్యాలయ కేంద్రంగా మారింది.

మన్సా మూసా అపారమైన సంపదకు చిహ్నంగా ప్రపంచ ప్రజల ఊహలలో నిలిచిపోయాడు. అయితే, మన్సా మూసా సంపద అతని వారసత్వంలో ఒక భాగం మాత్రమే. మన్సా మూసా ఇస్లామిక్ విశ్వాసం, పాండిత్యాన్ని ప్రోత్సహించడం మరియు మాలిలో సంస్కృతిని పోషించడం వంటి వాటికి కూడా గుర్తుండిపోతాడు.

మాన్సా మూసా I మరియు అతని వారసుల పాలనలో, టింబుక్టు ఒక విజయవంతమైన వాణిజ్య కేంద్రం నుండి వాణిజ్యం మరియు పాండిత్యానికి కేంద్రంగా రూపాంతరం చెందింది, టింబుక్టు మాలి సామ్రాజ్యాన్ని ఇస్లాం స్వర్ణయుగం యొక్క  అత్యంత ప్రభావవంతమైన సామ్రాజ్యాలలో ఒకటిగా నిలిపింది.

ఇస్లామిక్ ఒయాసిస్‌గా టింబుక్టు యొక్క హోదా దాని మూడు గొప్ప మట్టి మరియు కలప మసీదులు - సంకోరే, జింగరేబర్ మరియు సిది యాహియా mud & timber mosques: Sankoré, Djingareyber & Sidi Yahia లో  ప్రతిధ్వనిస్తుంది, ఈ మట్టి మరియు కలప మసీదులు టింబుక్టు యొక్క స్వర్ణయుగాన్ని గుర్తుకు తెస్తాయి. 14వ మరియు 15వ శతాబ్దాలకు చెందిన ఈ ప్రార్థనా స్థలాలు 'శాంతి రాయబారులు' అని పిలువబడే ఇస్లామిక్ పండితులకు నిలయంగా కూడా ఉండేవి.

తువారెగ్‌లు Tuaregs టింబుక్టులో మొదటి మసీదు అయిన సంకోరే మసీదును నిర్మించగా, మాన్సా మూసాI దానికి గణనీయమైన మెరుగుదలలు చేసి, ముఖ్యమైన ఇస్లామిక్ పండితులను, లేదా ఉలమాలను ఆహ్వానించాడు. సంకోరే మసీదులో విద్యా సంబంధిత వ్రాతప్రతులు ఉన్న ఒక భారీ గ్రంథాలయం ఉండేది.

ఆతర్వాత మాన్సా మూసాI జింగరేబర్ మసీదును నిర్మించాడు, జింగరేబర్ మసీదు నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి ప్రఖ్యాత ఇస్లామిక్ పండితుడు అబు ఇషాక్ అల్ సాహెలికి 200 కిలోల బంగారం చెల్లించాడు. జింగరేబర్ మసీదు మాలి యొక్క ఒక ప్రసిద్ధ విద్యా కేంద్రం, దీనిని వివిధ భాషలలో జింగరేబర్ లేదా జింగరే బెర్ Djingareyber or Djingarey Ber అని పేర్కొంటారు.

తరువాత 15వ శతాబ్దంలో, తువారెగ్ పాలకుడు అకిల్ అకమల్వా Akil Akamalwa మాలి సామ్రాజ్యంలో అధికారంలోకి వచ్చినప్పుడు, గొప్ప సిది యాహ్యా Sidi Yahya మసీదును నిర్మించాడు. సిది యాహ్యా Sidi Yahya మసీదుకు దాని మొదటి ఇమామ్ అయిన సిది యాహ్యా అల్-తడెల్సి Sidi Yahya al-Tadelsi పేరు పెట్టారు. ఇది టింబుక్టు విశ్వవిద్యాలయంలో ఒక భాగం.

ఈ మూడు విద్యా కేంద్రాలు, లేదా మదర్సాలు, నేటికీ ఖురాన్ సంకోరే విశ్వవిద్యాలయం Koranic Sankore University గా పనిచేస్తున్నాయి, ఖురాన్ సంకోరే విశ్వవిద్యాలయం సహారా ఉప-సహారా ఆఫ్రికాలో అత్యంత పురాతన ఉన్నత విద్యా సంస్థగా నిలిచింది.

పశ్చిమ ఆఫ్రికాకు చెందిన శక్తివంతమైన రాజులు మరియు ఇస్లామిక్ నాయకులు వ్యాపారం చేయడానికి, విద్యను అభ్యసించడానికి మరియు రాజకీయ మిత్రులను ఏర్పరచుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి టింబుక్టుకు ప్రయాణించారు.

కైరో, బాగ్దాద్, పర్షియా మరియు ఇతర ప్రాంతాల నుండి వచ్చి  టింబుక్టు నగరంలో నివసిస్తున్న ప్రముఖ పండితుల ఉపయోగం కోసం, పవిత్ర ముస్లిం గ్రంథాలను కట్టుదిట్టమైన సంపుటాలలో సుదూర ప్రాంతాల నుండి టింబుక్టుకు తీసుకువచ్చేవారు.

ఖగోళ శాస్త్రం మరియు గణితం నుండి వైద్యం మరియు చట్టం వరకు ఇస్లాం యొక్క గొప్ప బోధనలు టింబుక్టులో అనేక లక్షల వ్రాతప్రతుల రూపంలో సేకరించి, రూపొందించబడ్డాయి.

టింబుక్టులో పుస్తకాలు అమూల్యమైన ఆస్తులుగా పరిగణించబడ్డాయి, అవి తరతరాలుగా వారసత్వంగా అందించబడ్డాయి. టింబుక్టు గ్రంథాలను ఖురాన్ పాఠశాలలు మరియు మసీదులలో బోధన కోసం ఉపయోగించేవారు. కానీ 17వ శతాబ్దంలో ఫ్రెంచ్ వారు పశ్చిమ ఆఫ్రికాకు వచ్చినప్పుడు, ఈ గ్రంథాలలో చాలా వరకు ఐరోపాకు తరలించబడ్డాయి.

టింబుక్టులోని ప్రైవేట్ కుటుంబాల గ్రంథాలయాలు, నేటికి ఈ గ్రంథాలను సంరక్షించి, అందుబాటులో ఉంచుతున్నాయి. ఇస్లామిక్ అధ్యయనాలు మరియు ఆఫ్రికన్ అధ్యయనాల పండితులు ఈ గ్రంథాలలోని అపారమైన సమాచారాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.

టింబుక్టులోని అహ్మద్ బాబా సెంటర్‌ Ahmed Baba Center లో మరియు మామా హైదరా స్మారక గ్రంథాలయం Mamma Haidara Commemorative Library, బౌజ్‌బెహా Boujbeha కు చెందిన షేక్ జైని బాయే గ్రంథాలయం Library of Cheick Zayni Baye of Boujbeha, వంటి  ప్రైవేట్ కుటుంబ గ్రంథాలయాలలో భద్రపరచబడిన పురాతన గ్రంథాలు, 15 మరియు 16వ శతాబ్దాలలో టింబుక్టు ప్రభావానికి స్పష్టమైన సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

మాలిలోని టింబుక్టులో ఉన్న మమ్మా హైడారా స్మారక గ్రంథాలయం Mamma Haïdara Commerative Library సేకరణలలోని చేతిరాత ప్రతుల సంఖ్య 700,000 వరకు ఉంటుందని అంచనా వేయబడింది. వాటిలో గాజు పెట్టెలో 12వ శతాబ్దానికి చెందిన చిత్రాలతో కూడిన ఖురాన్ కనిపిస్తుంది.

2009 మరియు 2017 మధ్య, బ్రిటిష్ లైబ్రరీ యొక్క ఎండేంజర్డ్ ఆర్కైవ్స్ ప్రోగ్రామ్ British Library’s Endangered Archives Programme చేసిన ఒక బృహత్తర ప్రయత్నంలో జెన్నే Djenne లోని చేతిరాత ప్రతులు డిజిటలైజ్ చేయబడ్డాయి మరియు ఇప్పుడు పండితులకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి, అయితే భౌతిక ప్రతులు జెన్నేలోనే భద్రపరచబడ్డాయి.

టింబుక్టులోని ప్రైవేట్ సేకరణలు మరియు గ్రంథాలయాల నుండి 40,000 కంటే ఎక్కువ పురాతన చేతిరాత ప్రతులు డిజిటలైజ్ చేయబడి, క్రమబద్ధీకరించబడి, ప్రజలకు అందుబాటులో ఉంచబడ్డాయి.

No comments:

Post a Comment