1946లో, జహ్రా కలీమ్ బీహార్ బీహార్ శాసనసభకు మొదటి ముస్లిం మహిళా సభ్యురాలిగా
(ఎమ్మెల్యే) ఎన్నికయ్యే విశిష్టతను పొందారు. జహ్రా కలీమ్
బెంగాల్‌లోని ఒక సంపన్న మరియు విద్యావంతుల కుటుంబంలో
జన్మించారు. జహ్రా కలీమ్ తండ్రి, అడ్వకేట్ మహమ్మద్ హఫీజ్, బెంగాల్‌లో ప్రసిద్ధి చెందిన న్యాయవాది.
జహ్రా కలీమ్
కలకత్తాలోని ప్రతిష్టాత్మక లోరెటో హౌస్‌లో ఆంగ్ల మాధ్యమంలో విద్యను పొందారు. జహ్రా కలీమ్ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (AMU)లో ఆంగ్ల లెక్చరర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. మహిళల విద్య మరియు హక్కుల
కోసం కృషి చేసారు.
జహ్రా కలీమ్
ఒక అద్యాపకురాలుగా, మహిళల విద్య ద్వారా మాత్రమే నిజమైన సామాజిక సంస్కరణ సాధ్యమని నమ్మేవారు.
మహిళలు విద్యను అభ్యసించాలని తరచుగా నొక్కి చెప్పేవారు.
జహ్రా కలీమ్‌కు పాట్నాకు చెందిన ప్రముఖ రచయిత
మరియు ప్రొఫెసర్ అయిన కలీముద్దీన్ అహ్మద్‌తో వివాహం జరిగింది. వివాహం తర్వాత, జహ్రా కలీమ్ పాట్నాకు మారారు, అక్కడ జహ్రా
సామాజిక సేవా కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు.
1946లో, జహ్రా కలీమ్ పాట్నాలోని ముస్లిం మహిళల కోసం కేటాయించిన స్థానం నుండి పోటీ చేసి ఎన్నికల్లో
గెలుపొందారు. తదనంతరం, 1957లో (స్వతంత్ర భారతదేశంలో), జహ్రా కలీమ్ రెండవసారి శాసనసభ సభ్యురాలిగా
ఎన్నికయ్యారు మరియు స్వతంత్ర భారతదేశపు మొదటి ముస్లిం మహిళా ఎమ్మెల్యేగా నిలిచారు.
1962లో, జహ్రా కలీమ్ బీహార్ శాసనసభ సభ్యురాలిగా (ఎమ్మెల్యేగా) తిరిగి
ఎన్నికయ్యారు.
జహ్రా కలీమ్
రాజకీయాలను 'అధికారం' కంటే 'సేవ'కు ఒక సాధనంగా భావించారు.
జహ్రా కలీమ్ ప్రగతిశీల భావాలున్న మహిళ. జహ్రా
కలీమ్ మహిళల సామాజిక స్థితిని మెరుగుపరచడానికి కృషి చేశారు. బీహార్ శాసనసభలో
మహిళలకు సంబంధించిన సమస్యలను జహ్రా కలీమ్ ప్రముఖంగా ప్రస్తావించారు మరియు సమాజంలో
మహిళల స్థానాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించారు.
జహ్రా కలీమ్
1986లో, తన ఆత్మకథను "డౌన్ మెమరీ లేన్: ఎ పాట్-పౌరీ ఆఫ్ రెమినిసెన్సెస్ ఇన్ బి
ఫ్లాట్ మైనర్“Down
Memory Lane: A Pot-Pourri of Reminiscences in B Flat Minor" పేరుతో రాశారు.
జహ్రా కలీమ్ వారసత్వాన్ని మరియు చేసిన పనిని గురించి
జహ్రా కలీమ్ కుమారుడు ఆరిఫ్ కలీమ్, గర్వంగా ఇలా అన్నారు:"ఇన్నేళ్ల తర్వాత కూడా మా అమ్మగారి విజయాలను హైలైట్
చేయడం చూడటం నాకు గర్వకారణం."
జహ్రా కలీమ్ ప్రధానంగా ఒక రాజకీయవేత్త, సంఘ సంస్కర్త మరియు విద్యావేత్త. జహ్రా కలీమ్ నిజంగా ఒక ఆదర్శప్రాయమైన మహిళ మరియు రాజకీయ
నాయకురాలు.
No comments:
Post a Comment