21 December 2025

మాలిక్ అంబర్(1548 –1626):: ఇథియోపియన్ బానిస Malik Ambar(1548 –1626): Ethiopian slave

 


భారతదేశం మరియు ఇథియోపియా మధ్య సంబంధం కొత్తది కాదు, అది 2,000 సంవత్సరాల నాటిది.  ఇథియోపియాలో బానిసగా జన్మించి, దక్కన్ యొక్క 'అపట్టాభిషిక్త రాజుUncrowned King' 'గా ఎదిగిన మాలిక్ అంబర్ ఈ అనుబంధానికి ఒక వారధి. మాలిక్ అంబర్ ఒక అద్భుతమైన వ్యూహకర్త, శక్తివంతమైన మొఘలులను ఓటమిని అంగీకరించేలా చేశాడు.

మాలిక్ అంబర్ సుమారు 1548లో ఇథియోపియాలోని 'ఒరోమో' తెగలో జన్మించాడు. మాలిక్ అంబర్ అసలు పేరు 'చాపు'. చిన్నతనంలోనే బానిసగా పట్టుబడి, బాగ్దాద్‌ లోని బానిసల మార్కెట్లలో అమ్మబడ్డాడు.అక్కడ ఇస్లాం మతంలోకి మారాడు మరియు "అంబెర్‌గ్రిస్" అనే అరబిక్ పదం నుండి అతనికి అంబర్ అనే పేరు పెట్టారు.

మాలిక్ అంబర్ ప్రయాణం అరబ్ వ్యాపారుల నుండి బాగ్దాద్‌కు, చివరకు భారతదేశానికి సాగింది. విధి మాలిక్ అంబర్ ను  అహ్మద్‌నగర్ నిజాంషాహీకి తీసుకువచ్చింది, అక్కడ ఆ రాజ్యపు పీష్వా (ప్రధానమంత్రి) అతన్ని కొనుగోలు చేశాడు. తన యజమాని మరణానంతరం, మాలిక్ అంబర్ స్వేచ్ఛ పొందాడు. మాలిక్ అంబర్ తన నైపుణ్యాలను ఉపయోగించి, 7,000 మంది సైనికులతో ఒక సైన్యాన్ని నిర్మించాడు మరియు నిజాం షాహీ సైన్యానికి కమాండర్ అయ్యాడు ఆ తర్వాత అంబర్  మాలిక్ ("రాజు") అనే బిరుదు పొందాడు.

అక్బర్ చక్రవర్తి యొక్క మొఘల్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాడు. 1600 నాటికి అహ్మద్‌నగర్‌ రాజ్యానికి మాలిక్ అంబర్ రీజెంట్ అయ్యాడు, 1626లో మరణించే వరకు మాలిక్ అంబర్ అహ్మద్‌నగర్‌ను సమర్థవంతంగా పాలించాడు. మాలిక్ అంబర్ ముఖ్యమైన పాలకుడు మరియు సైనిక వ్యూహకర్త.

మాలిక్ అంబర్ కు అత్యంత విశ్వసనీయ వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ తాత అయిన మాలోజీ రాజే భోంస్లే. మాలోజీ రాజే పరాక్రమాన్ని గుర్తించి, మాలిక్ అంబర్ మాలోజీ రాజే కి పూణే మరియు సుపేతో సహా కీలక ప్రాంతాల జాగీరును (భూమి మంజూరు) ఇచ్చాడు. తర్వాతి సంవత్సరాలలో, షాహాజీ రాజే భోంస్లే కూడా మాలిక్ అంబర్ మార్గదర్శకత్వంలో అనేక యుద్ధాలు చేశాడు.

1624లో జరిగిన ప్రసిద్ధ భట్వాడి యుద్ధంలో, మొఘలులు మరియు బీజాపూర్ ఆదిల్‌షాహీలు కలిసి అహ్మద్‌నగర్‌పై దాడి చేసినప్పుడు, మాలిక్ అంబర్ మరియు షాహాజీ రాజే కలిసి వారిని నాశనం చేశారు. మాలిక్ అంబర్ శక్తివంతమైన మొఘల్ పాలకులను ఎదుర్కోవడంలో ప్రసిద్ధి చెందినాడు. జహంగీర్ పాలనలో మాలిక్ అంబర్ సైన్యం మొఘల్‌లపై గణనీయమైన విజయాలు సాధించింది. మొఘల్ సైన్యానికి జహంగీర్ కుమారుడు షాజహాన్ నాయకత్వం వహించాడు.

మాలిక్ అంబర్ 60,000 గుర్రపు సైన్యాన్ని కూడా నిర్వహించితదుపరి 20 సంవత్సరాలకు మొగల్‌లను విజయవంతంగా ఓడించాడు. మాలిక్ అంబర్ మరణం తరువాత వరకు మొగల్లు డక్కన్‌ను జయించలేకపోయారు.

మాలిక్ అంబర్ దక్కన్ మరాఠాలను మొఘలులకు వ్యతిరేకంగా ఏకం చేసి, గెరిల్లా యుద్ధ పద్ధతికి విజయవంతంగా మార్గదర్శకత్వం వహించారు.

మాలిక్ అంబర్ గెరిల్లా యుద్ధ పద్ధతిని (గనిమీ కావా) సమర్థవంతంగా ఉపయోగించారు. ముఖ్యంగా, భారీ మొఘల్ సైన్యాలను ఓడించడానికి కొండ ప్రాంతాలలో చిన్న చిన్న దళాలతో ఆకస్మిక దాడులు చేసే ఈ వ్యూహాన్ని మొదటగా ఉపయోగించింది మాలిక్ అంబరే. ఆ సమయంలో దీనిని 'బార్గిగిరి' అని పిలిచేవారు.

మాలిక్ అంబర్ ఆఫ్రికన్ మాజీ బానిస సైనికుల సైన్యాన్ని నిర్మించాడు మరియు అహ్మద్‌నగర్‌కు  డీఫ్యాక్తో /వాస్తవిక రాజు అయ్యాడు మరియు అహ్మద్‌నగర్‌ సుల్తాన్ కుమార్తె ను వివాహం చేసుకోవడంతో మరింత ప్రభావవంతంగా మారినాడు.

మాలిక్ అంబర్ ఔరంగాబాద్ నగరాన్ని (అప్పటి ఖడ్కి) స్థాపించి, నెహర్-ఎ-అంబరి అనే నీటి కాలువల వ్యవస్థను నిర్మించినాడు. మాలిక్ అంబర్ మహారాష్ట్రకు సైనిక వ్యూహాలను అందించడమే కాకుండా, భూమి శిస్తు వ్యవస్థకు పునాది వేశాడు, ఇది తరువాత సామాన్య ప్రజలకు (రైతులకు) ఎంతగానో ప్రయోజనం చేకూర్చింది.  

మాలిక్ అంబర్ ఒక తెలివైన దౌత్యవేత్తవ్యూహకర్త మరియు నిర్వాహకుడు. మాలిక్ అంబర్ అనేక ఆర్థికవిద్యా మరియు వ్యవసాయ సంస్కరణలను అమలు చేశారు

మాలిక్ అంబర్ కళలకు బలమైన కళా పోషకుడుమరియు అతని యొక్క అనేక ఛాయాచిత్రాలు ప్రపంచవ్యాప్తంగా మ్యూజియం సేకరణలలో ఉన్నాయి.

మాలిక్ అంబర్ మే 14, 162678 సంవత్సరాల వయస్సులో మరణించాడు.

మాలిక్ అంబర్ సమాధి ఇప్పటికీ పశ్చిమ భారతదేశంలోని ఔరంగాబాద్ జిల్లాకు సమీపంలోని ఖుల్దాబాద్‌లో ఉంది.

విదేశంలో బానిసగా వచ్చి, అక్కడి ప్రజలతో మమేకమై, సామ్రాజ్యంలో అత్యున్నత స్థానానికి ఎదిగిన ఒక వ్యక్తి ప్రస్థానం ప్రపంచ చరిత్రలోనే విశిష్టమైనది.

 

No comments:

Post a Comment