30 July 2016

భారతదేశం లో 'బిచ్చగాడు' అని వర్గీకరించబడిన ప్రతి 4 లో ఒక వ్యక్తి ముస్లిం.


అధికారికంగా భారత దేశం లో  ఉన్న  3.7 లక్షల 'బిచ్చగాళ్ళ' జనాభాలో ముస్లింల వాటా దేశ జనాభాలో ముస్లిం కమ్యూనిటీ వాటా కంటే ఎంతో పెద్దది.

యాచించడం భారతదేశం లో చట్టవిరుద్ధం. భారతదేశం జనాభాలో 14.23% ముస్లింలు ఉన్నారు. అయితే 2011 సెన్సస్ ప్రకారం బిచ్చగాళ్ళు గా నమోదు చేసిన  3.7 లక్షల మంది  వ్యక్తులలో ముస్లింలు   సుమారు 25%గా ఉన్నారు.

గత నెల విడుదల అయిన  సెన్సస్ 2011 డేటా విశ్లేషణ  లో  మతo ఆధారంగా “కార్మికులు కాని వారిగా” (deemed ‘non workers’)   లెక్కించబడిన వారిలో అధికులు ముస్లింలు. అయితే కొందరు మానవ హక్కుల కార్యకర్తల వాదన ప్రకారం  నిర్దిష్ట సమూహాలకు లేదా పౌరుల సమూహాలకు పరిమితంగా లేదా అసమానo గా ప్రభుత్వ పథకాలు మరియు సేవలు అందుబాటులో ఉన్నాయని అవి  వారిని మరింత పేదరికం లోనికి నేడుతుంన్నావని  వాదించు చున్నారు.

ఏ ఆర్థిక కార్యకలాపంలో పాల్గొనని వ్యక్తులు -చెల్లించే లేదా చెల్లించబడని - గృహ విధులు, లేదా వ్యవసాయం లో ఉన్నవారిని “నాన్ వర్కర్స్” గా” జనగణన(senses)లో నిర్వచించబడ్డారు.
సెన్సస్ డేటా ప్రకారం మొత్తం 72.89 కోట్ల మంది కార్మికులు కానివారుగా ఉన్నారు. వారిలో  3.7 లక్షల బిచ్చగాళ్ళు ఉన్నారు. 2001 లో జరిగిన సెన్సస్ లో బిచ్చగాళ్ళు సంఖ్య 6.3 లక్షలుగా ఉంది. ఈ సంఖ్య 2011 లో 41% తగ్గినది.  
.
బిచ్చగాళ్ళుగా  వర్గీకరించబడిన వ్యక్తుల జాబితా  లో  ముస్లింలు అసాధారణ శాతం లో  ఉన్నారు. దేశం మొత్తం బిచ్చగాళ్ళ జనాభా 3.7 లక్షలు అందులో  నాలుగోవంతు అనగా – 92,760 మంది ముస్లింలు.

హిందువులు భారతదేశం యొక్క జనాభా లో 79.8% ఉన్నాయి, కానీ వారిలో  2.68 లక్షల మంది వ్యక్తులు  బిచ్చగాళ్ళ జనాభాలో 72.22% గా  ఉన్నారు. జనాభాలో 2.3% ఉన్న  క్రైస్తవులు, బిచ్చగాళ్ళ  జనాభా లో  3,303 వ్యక్తులు గా అనగా  0.88% ఉన్నారు. బౌద్ధులు (0.52%), సిక్కులు (0.45%), జైనులు (0.06%) మరియు ఇతరులు (0.30%) ఉన్నారు.

మరింత విస్మయకరంగా   ముస్లిం మహిళలు, ముస్లిం పురుషులకన్నా అధికంగా బిచ్చగాళ్ళుగా ఉన్నారు. మరియే  ఇతర వర్గంలో ఇంతమంది స్త్రీ బిచ్చగాళ్ళు లేరు. కేవలం “ఇతరత్రా” 'అని వర్గీకరించబడిన వారు తప్ప. బిచ్చగాళ్ల జాతీయ సగటు స్త్రీల లో 46.87% ఉండగా,  పురుషులలో  53.13% గా  ఉంది.  ముస్లింలలో ఈ  నిష్పత్తి 43.61% పురుష బిచ్చగాళ్ళు మరియు 56.38% మహిళా బిచ్చగాళ్ళు గా ఉంది.

"పేదరికo అనేది  పౌరులకు భద్రతను అందించడం లో  ప్రభుత్వ కార్యక్రమాల వైఫల్యం ఫలితమే అని  చెప్పవచ్చు.ప్రభుత్వ  సేవలు మరియు ప్రభుత్వ కార్యక్రమాలు  తక్కువ అందుబాటు లో ఉండుట వలన అధికులు పేదరికం తో భాధ పడుతున్నారు, దీనికి ఉదాహరణ సమాజంలో కొన్ని సమూహాలు అని బొంబాయి లోని TISS కు చెందినఇల్లు లేనివారికి మరియు పేదల ఫీల్డ్ ప్రాజెక్ట్ “కోషిష్”యొక్క కొ-అర్దినేటర్ మహమ్మద్ తారిక్  చేప్పారు.

2001 సేన్సస్ ప్రకారం బిచ్చగాళ్ళ జనాభా                 = 6,30,940
(ప్రతి లక్ష మంది పౌరులకి 61మంది బిచ్చగాళ్ళ ఉన్నారు).
2011 సేన్సస్ ప్రకారం బిచ్చగాళ్ళ జనాభా                 =3,72,217.
(ప్రతి లక్ష మంది పౌరులకి  30మంది బిచ్చగాళ్ళ ఉన్నారు)
కమ్యూనిటి
సంఖ్య
దేశ జనాభా లో వారి శాతం
బిచ్చగాళ్ళ లో వారి శాతం
హిందువులు
266837
79.8%
72.2%
ముస్లిమ్స్
 92760
14.2%
24.5%
క్రైస్తవులు
  3303
  2.30%
 0.88%
సిక్కులు
 1677
  1.72%
 0.45%
బౌద్ధులు
 1963
  0.70%
 0.52%
జైన్స్
  241
  0.37%
 0.06%
ఇతరులు
 1121
  0.66%
 0.3%
మతం అంటే తెలియని వారు
 2370
  0.24%
 0.62%

  
మొత్తం బిచ్చగాళ్ళ లో స్త్రీ-పురుష శాతం
కమ్యూనిటీ
పురుషులు
స్త్రీలు
హిందువులు
151343 (56.29%)
117494 (43.70%)
ముస్లిమ్స్
  40454 (43.61) 
 52306 (56.38%)
క్రైస్తవులు
  1693 (51.25%)
  1610 (48.74%)
సిక్కులు
  1078 (64.28)
    599 (35.71%)
బౌద్ధులు
  1048 (53.38%)    
    915 (46.61%)
జైన్లు
    128 (53.11%)
    113 (45.88%)
ఇతరులు
    553 (49.11%)
    573 (50.88%)
మొత్తం
197725(53.12%)
174492(46.87%)
2011 సెన్సెస్ ఆధారంగా



భారతదేశం లో యాచించడం చట్టవిరుద్ధం, మరియు దానికి 3-10 సంవత్సరాలవరకు  ఖైదు లో శిక్షింపబడతారు.1959 బొంబాయి యాచక నిరోధక చట్టం  భారత దేశం లోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో అనుసరించబడతుంది. మానవ హక్కుల  కార్యకర్తలు అభిప్రాయం ప్రకారం చట్టం లో  బిచ్చగాళ్ళు కి  స్పష్టమైన వర్గీకరణ లేదు మరియు వివిధ పట్టణాలకు వలస వెళ్ళేవ ఇళ్లులేని మరియు భూమిలేని కూలీలు బిచ్చగాళ్ళుగా  వర్గీకరించబడుతున్నారు. . అనేకభారతదేశం యొక్క చట్టాల వలె, యాచక నిరోధక చట్టం ఒక ప్రాచీన బ్రిటీష్ చట్టం ఆధారంగాదేశ దిమ్మరులకు  వ్యతిరేకంగా రూపొందిoచబడినది.

1959 బొంబాయి యాచక నివారణ చట్టం కింద, జీవనానికి ఎలాంటి కనిపించే సాధనాలు లేక మరియు ఒక బహిరంగ ప్రదేశంలో దిమ్మరిగా తిరుగుతూ కనిపించేవారు ఎవరినైనా ఒక బిచ్చగాడు అని నిర్వచించవచ్చు.దిని ప్రకారం విధిలో పాటలు పాడటం,నృత్యం చేయడం, బవిష్యతు వివరించేవారు,  ప్రదర్సనలు ఇచ్చేవారు  కూడా బిచ్చగాళ్ళుగా  భావించబడతారు. 
       
ఎవరైనా ఒకరిని అతను బిచ్చగాడు లేదా తనను తాను పోషిoచుకోలేని  నిరాశ్రయుడు అని అనుమానం వస్తే అతనిని అరెస్ట్ చేయడానికి పోలీసులకు విచక్షణ అధికారoఉంది.

.మానవ హక్కుల కార్యకర్తల అభిప్రాయం ప్రకారం చట్టం యాచకులకి పునరావాసం కల్పించుట కాకుండా, పేద మరియు మానసిక అనారోగ్యం బాధపడుతున్న వారిని చట్టం పేరున  శిక్షిస్తుంది. . బీహార్ వంటి కొన్ని రాష్ట్రాలు బిచ్చగాళ్ళు పునరావాసానికి కార్యక్రమం చేపట్టాయి. కానీ మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాల్లో వీధిలో యాచిస్తూ  కనిపించే ఒక వ్యక్తిని పట్టుకొని జైలులో పెడుతున్నారు.

స్వాతంత్రం వచ్చి 60 ఏళ్ళు గడుస్తున్నా దేశం లోని వెనుకబడిన వర్గాల /అల్పసంఖ్యాకుల పరిస్థితులలో మార్పు రాలేదు. దేశ ప్రగతి ఫలాలు వారికి అందుబాటులో రాలేదు. వారి పట్ల ఇంకా వివక్షత  ఇంకా కొనసాగుతు  ఉంది. 2006 లో ఏర్పాటు చేసిన సచార్ కమిటి ఆనంతరం ఎర్పాటు చేసిన రంగనాథ మిశ్రా కమిటి, కుందు కమిటి  నివేదికలు భారత దేశం లోని అల్పసంఖ్యాకులు ముఖ్యంగా ముస్లిమ్స్ పరిస్థితి ఎస్.సి./ఎస్.టి. కన్నా దుర్భరంగా ఉన్నాయి అని చెబుతున్నాయి. వారు సామాజిక,ఆర్ధిక ,రాజకీయ మరియు ఉపాధి రంగాలలో ముందుకు రావాలంటే రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొన్నాయి.

సచార్ కమిటి నివేదిక అనంతరం అమలు చేసిన ప్రధాన మంత్రి 15 సూత్రాల మైనారిటీ అభివృద్ధి పదకం, మైనారిటీ సంక్షేమ శాఖ అమలు జరిపే అనేక పదకాలు వారి స్థితిగతులలో మార్పులు తేలేక పోయినవి. చిత్తశుద్ది మరియు పారదర్సకత లేక ఆ పధకాల అమలులో అనేక అడ్డంకులను ఎదుర్కొంటున్నవి.
2011 జనాభా లెక్కల విశ్లేషణ ఒక బయంకరమైన నిజాన్ని వెలుగులోనికి తెచ్చింది.  భారత దేశం లోని యాచకులలో అత్యధికులు ముస్లిమ్స్. ఇంకా ఆశ్చర్యకరమైనా విషయం వారిలో స్త్రీ యాచకుల సంఖ్య పురుష యాచకుల కన్నా అదికం మరియు శాతం దృష్ట్యా అన్ని వర్గాల స్త్రీల కన్నా అధికం. ఇది ఎంత సిగ్గు పడవలసిన విషయం. దేశ జనాభాలో 14% ఉన్న ముస్లిమ్స్ లో యాచకుల సంఖ్య వారి జనాభా నిష్పతి కి మించి 25% వరకు ఉంది.

మతరిత్యా  ఇస్లాం లో యాచన నిషేధం. అనేక హదీసుల ప్రకారం ప్రవక్త (స) యాచనను నిరసించారు. దానికి బదులు కాయకష్టం చేసి  తన జీవనోపాధిని స్వయంగా సoపాదిoచుకోమన్నారు. కాయకష్టo చేసిన దానితోనే తన జీవనాన్ని ప్రవక్త దావూద్ కొనసాగించేవారు. కాయకష్టానికి, శ్రమైక్య జీవనానికి ప్రాధన్యత ఇచ్చిన ధర్మం ఇస్లాం ధర్మం. అటువంటి ధర్మావాలoబికులే స్వతంత్ర భారత దేశం లో యాచన లో ముందు ఉన్నారని తెలిసి చాల భాదపడుతున్నాను.

ఇస్లాం ధర్మం లో ఆర్ధిక సమానత్వ సాధనకు జకాత్, సదకా వంటి మంచి సాధనాలు ఉన్నాయి. అవి పేదవారికి సహాయపడి ఆర్ధిక సమానత్వం సాధనకు తోడ్పడును. అదేవిధంగా ఇస్లాం మూలసుత్రాలలో   జకాత్ చేరినది. నేటి ముస్లిమ్స్ ఇస్లామిక్ మూలవిశ్వాసాలను పాటించుట లేదు. కేవలం నమాజ్ ఆచరణ తో తమ బాద్యత తీరినది అనుకొంటున్నారు.

ఇప్పటికైనా ముస్లిమ్స్ తమ అంధ;విశ్వాసాలను, పద్దతులను విడనాడి విద్యావంతులు కానిదే వారి పరిస్తితులు మెరుగు పడవు. దివ్య ఖురాన్ లో అల్లాహ్ స్వయంగా అంటాడు తమను తాము మెరుగు పరుచుకొని జాతిని అల్లాహ్ కూడా మెరుగు పరచ లేడు”. ఇది నిజం, వాస్తవం.



వ్యవస్థాపకత (entrepreneurship) గురించి 6 పాఠాలు


ఇటీవల ఒక పేరుమోసిన బి-పాఠశాల గ్రాడ్యుయేషన్ వేడుకలో మాట్లాడే అదృష్టం వచ్చింది. వేడుక థీమ్ వ్యవస్థాపకత (entrepreneurship) కు  సంభందించినది. ప్రసంగం తయారు చేయడం కోసం కూర్చున్నాను. నాకు కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన  నా సొంత స్నాతకోత్సవం గుర్తుకు వచ్చింది.  నేను నా MBA ప్రోగ్రామ్ లో నేర్చుకొన్న ఆరు పాఠాలను మీ ముందు పెడతాను. అవి మీకు ఉపయోగకరం గా ఉండవచ్చు.
నాయకత్వం అంటే త్యాగం (Leadership is sacrifice):
నాయకత్వం అనగానే ముందు మనకు నాయకుడికి ఉoడవలసిన  లక్షణాలు గుర్తుకు వస్తాయి.  MBA  ప్రోగ్రాం ప్రారంభం లో మనం తరచూ ఇందులో నాకు ఏమిటి? అనే ప్రశ్న వేస్తుoడే వాళ్ళం. కాలక్రమేణా MBA ప్రోగ్రాo పూర్తి అయ్యేసరికి ఇతరులకు ఇందులో ఏమిటి అని అడగటo నేర్చుకోన్నాము. నాయుకుడి లక్షణాలు ఆలోచించే కొద్ది నిజమైన నాయకుడు తన వ్యక్తిగత అవసరాలను/ప్రయోజనాలను  త్యాగం చేసి లక్ష్యం కొరకు జీవిస్తాడు అని తెలుస్తుంది. అటువంటి నాయకులు తమ అనుచర గణానికి ఆదర్శం గా ఉండి ప్రేరణ కలిగిస్తారు.
ఓటమి మంచిదే కాని ప్రయత్నించకుండుట కాదు(Failure is Ok; Not trying is not):
మనం మనుషులం! మనలో కొన్ని లోపాలు ఉండవచ్చు. ఈ ప్రపంచంలో వాస్తవాలకు పలితాలకు మద్య అంతరం ఉంది. రోవియా (Rovio) ఆంగ్రి బర్డ్స్(AngryBirds) ఆట ను తయారుచేయడం లో 51సార్లు వైఫల్యాలను ఎదుర్కొన్నాడు, కొన్నిసారు విసుగుతో మానివేద్దాం  అనుకున్నాడు. అతని  పరాజయమే అతనిని  విజేతగా మార్చినది. అతని విజయ గాధ నేటి వ్యవస్థాపుకులకు ఒక ఆదర్శం. ఒక రోజు లో విజయం సాదించ లేము. నిరoతర  కృషి మరియు ప్రయోగాలు మనలను విజయ పథం వైపు నడిపిస్తాయి.
నిరాడంబరంగా ఉండటం (Staying humble)
MBA ప్రోగ్రాం కొన్నిసార్లు మనలో ఆత్మవిశ్వాసం పెంచును మరి కొన్నిసార్లు అధిక విశ్వాసం తో ఉండేటట్లు చేస్తుంది. తత్పలితముగా మనకు "అంతా తెలుసు" అనిపిస్తుంది.  కాని నిజమైన నాయకులకు  అన్ని సమాధానాలను తెలియదు మరియు వారు చాలా అసౌకర్యంగా ఉంటారు అని  గ్రహించడానికి నాకు కొంత సమయం పట్టింది. వారు "నాకు తెలీదు" అని చెప్పడం వారి వినయం ను తెల్పుతుంది. వారి సరిఅయిన ప్రశ్నలు వేసి  సరిఅయిన  సమాధానాలు పొందుతారు. ఎప్పటికప్పుడు మారిపోతున్న వ్యాపార ప్రపంచంలో వినయ ప్రదర్సన పారిశ్రామికవేత్తల తో సహా అందరికి  మంచి చేస్తుంది.
 నిజమైన పిలుపు (Finding your true calling)
వ్యవస్థాపకులకు ఇది చాలా ముఖ్యoగా తెలవవలసిన ప్రధాన అంశం. ఒక ఆలోచన వెనుక చోదక శక్తి(driving force) లేకుండా, అనేక వ్యవస్థాపకులు వారి మార్గం చేరుటలో అనేక చిన్న చిన్న అడ్డంకులను కూడా ఎదుర్కొంటారు.
ఈ గ్రాడ్యుయేషన్ స్పీచ్ లో నేను మీకు ఇచ్చే సలహా ఒకటి ఉంది: "మీ నిజమైన పిలుపు కోసం వెదకండి." “మీ వెనుక ఉండే చోదక శక్తిని(driving force)  తెలుసుకోండి”. మీరు ఎప్పుడైతే దానికోసం వెదకటం ప్రారంబిస్తారో అప్పుడు మీ భావాలు ధారాళం గా ప్రవహించును మరియు అత్యంత ఎక్కువ  ప్రభావం మీ పై పడును. సాధారణంగా చెప్పాలంటే, మీ నిజమైన పిలుపును కనుగొనడానికి మిమ్మల్లి మీరు అనుమతిoచండి.
మీ సంతులితను  కనుగొనండి (Finding your balance)
బిజినెస్ స్కూల్స్ 'పెట్టుబడి పై రాబడి' విషయం లో సమతుల్య స్కోరు కార్డు యొక్క ఉపయోగం బోధిస్తాయి. మన కోసం స్వీయ సమతుల్య స్కోరు కార్డు సృష్టించటం విషయానికి వస్తే మనలో చాలా కొద్దిమంది మాత్రమె  మన ఆరోగ్యం, సంపద, సంబంధాలు మరియు ఆర్థిక పరిస్థితి  గురించి తెలుసు కొంటారు. అంతుచిక్కని విజయ శోధన లో అనేక మంది ఆరోగ్యo పాడు చేసుకొని, చెదిరిన కుటుంబాలు  మరియు పాడైన సంబంధాలు తో ముగుస్తారు. ఆరోగ్యం రిత్యా వ్యవస్థాపకత ఒక ఓర్పు క్రీడ వంటిది.  బలమైన భౌతిక మరియు మానసిక గుణములు  లేకుండా  విజయం సాదించ లేరు. విజయానికి మార్గాలు ప్రత్యేక స్కూల్స్ ద్వారా నేర్చుకోలేము.
 అభివృద్ధి చెందే అభిప్రాయం ఏర్పరచుకోండి (Developing a growth mindset)
మన చుట్టుపక్కల వాటి పై మనకు నియంత్రణ లేదు మరియు విబిన్నపరిస్థితులలో  ఎలా స్పందించాలో  మనకు తెలియదు. పారిశ్రామిక వేత్త గా కొన్ని సవాళ్ళు మిమ్ములను  మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తోస్తాయి. అభివృద్ధి చెందే అభిప్రాయం/కోరిక   ఈ సవాళ్ళను ఎదుర్కొని మీ బలo విస్తరించేందుకు మరియు పుంజుకొనుటకు  అనుమతిస్తుంది. వెళుతున్నది కఠినమైన దారి అయినప్పుడు మానసికంగా శారీరకంగా బలమున్న వారే ముందుకు వెళ్ళగలరు.
అంతిమ ఆలోచనలు (Final thoughts)
ముందు కంటే ఎక్కువ ఇప్పుడు మనకు ఉద్వేగభరిత సమతుల్యత,విధేయత మరియు ఇతరులతో కలసి పనిచేసి విజయాలు మరియు వైఫల్యాలు ఎదుర్కొనే   ఆరోగ్యకరమైన దృక్పధంతో ఉన్న వ్యవస్థాపకుల/నాయకుల  అవసరం ఎంతైనా ఉంది. నేను అన్ని పాఠశాలలు ( బిజినెస్ స్కూల్స్) ఈ పాఠాలు పై  దృష్టి పెట్టాలని నమ్ముతాను. నాయకత్వ బాద్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న పారిశ్రామిక వేత్తలు, నాయకులకి ఇది  చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము.

వినయపూర్వకoగా ఉండండి  మరియు నిరంతరం  నేర్చుకోoడి.  విష్ యు బెస్ట్ అఫ్ లక్