ఇస్లాం అన్ని
రంగాలలో మహిళలకు సమానత్వాన్ని ఇచ్చింది. ఇస్లాంలో కుమార్తె, సోదరి,
తల్లి మరియు భార్యమొదలగు మహిళలకు గల వారసత్వ హక్కులను వివరించుదాము.
మహిళలతో సహా వారసులలో ఆస్తి పంపిణీ గురించి దివ్య ఖురాన్
స్పష్టంగా పేర్కొంది. వారసత్వ హక్కుల యొక్క ప్రత్యేకత ఏమిటంటే, చాలా మతపరమైన విషయాలలో,
దివ్య
ఖురాన్ ప్రాథమిక మార్గదర్శకాలను మాత్రమే అందిస్తుంది. ఇది తండ్రి,
తల్లి, భర్త, భార్య,
కుమారులు మరియు కుమార్తెలు - వారసులందరి పంపిణీ యొక్క
వివరణాత్మక ప్రణాళికను అందిస్తుంది. అంతేకాకుండా,
వారసత్వంలోని వాటాలు అన్ని రకాల ఆస్తులకు వర్తిస్తాయి -
వ్యవసాయ లేదా పట్టణ, వాణిజ్య మరియు వాణిజ్యేతర,చరాస్థి లేదా స్థిర ఆస్తులు.
స్త్రీ,
పురుషుల వాటా Share for both men and women:
అల్లాహ్ ఇలా
అంటాడుAllah says:
·
తల్లిదండ్రులు మరియు దగ్గరి బంధువులు విడిచివెళ్లిన
ఆస్తిలో పురుషులకు భాగం ఉంది. అదేవిధంగా తల్లిదండ్రులు,
దగ్గరి బంధువులు విడిచివెళ్లిన ఆస్తిలో స్త్రీలకు
కూడా భాగం ఉంది- అది తక్కువైనా సరే లేక ఎక్కువైనా సరే ఈ భాగం (అల్లాహ్ చే) నిర్ణయిoపబడినది. (4: 7)
·
ఆస్తి పంపకం జరిగేటప్పుడు ఇతర బంధువులు, అనాధలు,
నిరుపేదలు వస్తే, ఆ ఆస్తినుండి వారికీ కూడా కొంత ఇవ్వండి. వారిని మంచిమాటలతో
పలుకరించండి. (4:8)
·
మీ సంతానం విషయం లో అల్లాహ్ మీకు ఇలా
ఆదేశిస్తున్నాడు. ఒక పురుషుని భాగం ఇద్దరు స్త్రీల భాగాలకు సమానం. ఒక వేళ (మృతుని
వారసులుగా) ఇద్దరికంటే ఎక్కువమంది ఆడపిల్లలు ఉంటె, వారికి మొత్తం ఆస్తిలో మూడింట
రెండుభాగాలు ఇవ్వాలి. ఒకే అడపిల్ల వారసురాలైతే, ఆస్తిలో అర్ధభాగం ఆమెకు చెందుతుంది. మృతుడు
సంతానం కలవాడైతే, అతని తల్లితండ్రులలో ఒక్కక్కరికి మొత్తం ఆస్తిలో ఆరో భాగం
లబించాలి. ఒకవేళ అతను సంతానం లేనివాడై అతని తల్లితండ్రులు మాత్రమే అతనికి
వారసులైతే, అప్పుడు తల్లికి మూడోభాగం ఇవ్వాలి. మృతుడికి సోదరిసోధరులు కూడా ఉంటె,
అప్పుడు తల్లికి ఆరో భాగం లబిస్తుంది. మృతుడు రాసిన వీలునామా అమలు జరిపి అతని పై
ఉన్న అప్పులు తీర్చిన తరువాతనే (ఈ భాగాల పంపకం జరగాలి). (4: 11)
భర్త-సంతానం వాటా Share of husbands and children
·
మీ భార్యలకు సంతానం లేని పక్షంలో, వారు విడిచి పోయిన
ఆస్తిలో మీకు(భర్త) అర్ధబాగం లబిస్తుంది. కాని వారికి సంతానం ఉంటె అప్పుడు వారు విడిచివెళ్లిన ఆస్తిలో
మీకు నాలుగో భాగం లబిస్తుంది. ఇది వారు చేసిపోయిన అప్పులు తీర్చిన తరువాత జరగాలి. మీకు
సంతానం లేనిపక్షం లో మీరు(భర్త) విడిచిపోయే ఆస్తిలోని నాలుగో భాగానికి మీ
భార్యలు హక్కుదారులౌతారు.కాని మీరు సంతానవంతులైతే అప్పుడు వారికి ఎనిమిదో భాగం
లబిస్తుంది. (మరణించిన) పురుషుడు లేక స్త్రీ సంతనహీనులై వారి
తల్లితండ్రులు కూడా జీవించి ఉండకపోతే, కాని వారికి ఒక సోదరుడు ఒక సోదరి ఉంటె అప్పుడు
వారిద్దరిలో ఒక్కోక్కరికి ఆరోభాగం లబిస్తుంది. కాని సోదరిసోదరులు ఒకరికంటే
ఎక్కువమంది ఉంటె అప్పుడు మొత్తం ఆస్తిలోని మూడోభాగానికి వారంతా
భాగస్వాములౌతారు. మృతుడు వ్రాసిన
వీలునామా అమలు జరిపిన తరువాత, అతడు చేసిన అప్పులు తీర్చిన తరువాత ఈ పంఫిణి జరగాలి.
కాని ఇది వారసులకు నష్టం కలిగించేది
కాకూడదు. (4: 12)
ఇక మీరు వాగ్దానం చేసిన వారు-వారికీ ఇవ్వవలసిన భాగం
వారికి ఇవ్వండి. (4: 33)
మహిళల వాటాలు
పురుషులలో సగం ఉంటే, అందుకు కారణం స్పష్టంగా
ఉందని గమనించాలి. భార్యలను, పిల్లలను
పోషించాల్సిన బాధ్యత పురుషులదే, మహిళలది కాదు.
మహిళల వాటా వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉంది విడాకులు లేదా
భర్త మరణం లేదా ఏదైనా ఇతర ఆకస్మిక పరిస్థితుల విషయంలో
ఆమె తనను మరియు తన పిల్లలను పోషించడానికి ఆదాయాన్ని
సంపాదించడానికి ఆమె తన ఆస్తిని ఉపయోగించవచ్చు.స్త్రీలు జీవశాస్త్రపరంగా పురుషులకన్నా
ఎక్కువ బాధ్యతాయుతమైన స్థితిలో ఉన్నారు. అందువల్ల పురుషులు సంపాదించే బాధ్యత నుండి
వారిని(స్త్రీలను) విడిపించడం బాధ్యతగా
కలిగి ఉన్నారు.. అయినప్పటికీ, వారు కోరుకుంటే, ఉద్యోగాలు లేదా వ్యాపారం ద్వారా సంపాదించడానికి వారు(స్త్రీలు)
స్వేచ్ఛను కలిగి ఉంటారు.
వీలునామా -ఆవశ్యకత Will desirable
స్త్రీలకు
వారసత్వ హక్కు ఉన్నందున వితరణ జేయుటకు (bequeath) మరియు వీలునామా
చేసే హక్కు కూడా వారికి ఉంది.
·
మీలో ఎవరికైనా మరణకాలం సమిపించినప్పుడు, వారు
ఆస్తిపాస్తులు కలవారైతే, తమ
తల్లితండ్రులకు,బంధువులకు న్యాయసమ్మతంగా పంచి పెడుతూ మరణశాసనం విధిగా వ్రాయాలి. (2: 180)
·
మరణశాసనం విన్నవారు తరువాత ఒకవేళ దాన్ని మార్చితే
దాని పాపమంతా ఆ మార్చిన వారిదే. అల్లాహ్ అంత వింటాడు. ఆయనికి అన్ని తెలుసు. (2: 181)
వితంతువుల కోసం For Widows
·
మీలోనివారురెవరైనా మరణించి, వారి భార్యలు సజీవంగా ఉంటె, వారు తమ భార్యలకు
ఒక సంవత్సరం వరకు భరణపు ఖర్చులు ఇవ్వాలని వారిని ఇంటి నుండి బహిష్కరించరాదని ఒక
వీలునామా వ్రాయాలి. (2: 240)
ఇది ప్రధానంగా చిన్న వయస్సులోనే మహిళలు వితంతువులుగా
మారే పరిస్థితులకు మరియు/లేదా భర్త ఆస్తి యొక్క ఇతర సహజ వారసులు ఉన్న పరిస్థితులకు
వర్తిస్తుంది. ఆమె వృద్ధాప్యంలో ఉంటే
పునర్వివాహం చేసుకోవటానికి ఉద్దేశించకపోతే మరియు ఆమె
పిల్లలు ఆమెతో నివసిస్తున్నారు అంటే ఇది చాలా సులభం అవుతుంది.
ఒకవేళ
ఆమెకు సప్పోర్ట్ లేకపోతే,
ఆమె తన భర్త యొక్క ఆస్తులలో వాటాను మరియు ఆమె నివసిస్తున్న
చోట నివసించడానికి ఒక సవత్సరానికి అనుమతి పొందుతుంది (ఒకవేళ ఇది ఆమె వారసత్వంగా
పొందకపోతే). ఆ తరువాత ఆమె మళ్ళీ వివాహం చేసుకోవచ్చు లేదా తన భర్త నుండి ఆమెకు
లభించే సహాయంతో ఆమె తగిన ఏర్పాట్లు చేసుకోవచ్చు.
ముస్లిం పర్సనల్
లా (షరియత్) అప్లికేషన్ యాక్ట్ 1937 లో వారసత్వ
నియమాలు ఈ క్రింది విధంగా పేర్కొనబడ్డాయి
In Muslim Personal Law (shariat) Application Act 1937 the
rules of inheritance are stated as follows:
మహమ్మదీయ
ధర్మ శాస్త్రం లో స్వార్జితం, పిత్రార్జితం అనే తేడా లేదు. ఆలాగే ఆస్థి చరాస్తి,
స్థిరాస్తి అనే తేడా కూడా లేదు. అందువలన ఒక మహమ్మదీయుడు చనిపోయినట్లయితే అంతని
ఆస్థి అంతా వారసులకు ఒకే విధంగా
సంక్రమిస్తుంది.
ఏ మహమ్మదియుడికి తన తల్లి లేదా తండ్రి యొక్క ఆస్తిలో జన్మత:
హక్కు సంక్రమించదు. వారసత్వపు హక్కు అనేది ఒక వ్యక్తి చనిపోయినప్పుడే అతని
వారసులకు సoక్రమిస్తుంది.
కొన్ని సందర్భాలలో వారసత్వమునకు అవకాసమున్నవారిలో కొందరు
తమకు ఆ హక్కు సంక్రమింపక పూర్వమే మరణించవచ్చు.అంతటితో వారి వారసత్వహక్కు కూడా
ఉనికిని కోల్పోతుంది. అతని పిల్లలు తమ తండ్రి యొక్క యొక్క వారసత్వ హక్కులకు
ప్రతినిధులు కారు.
ఈ నియమం సున్నీలకు వర్తిస్తుంది.
·
ఆస్తి లో కుమారుడు, కుమార్తె కన్నా రెట్టింపు
వాటాను పొందుతాడు.
·
సంతానం ఉంటె ఉంటే భార్యకు ఎనిమిదవ వంతు వాటా, సంతానం లేకపోతే ఆస్తిలో నాలుగవ వంతు వాటా లభిస్తుంది.
ఒకవేళ భర్తకు ఒకరు కంటే ఎక్కువ భార్యలు ఉంటే,
ఎనిమిదవ వంతు వాటా అందరు
భార్యలకు సమానంగా విభజించబడుతుంది. భర్త చనిపోయిన భార్య ఆస్తిలో సంతానం ఉంటే నాలుగవ వoతు సంతానం లేకుంటే సగం వాటా లబిస్తుంది.
·
తల్లిదండ్రులకు ఒకరు కంటే ఎక్కువ కుమార్తెలు ఉంటే, ఆస్తిలో మూడింట రెండొంతుల వాటా కుమార్తెల మధ్య సమానంగా
విభజించబడుతుంది.. తల్లిదండ్రులకు ఒకే కుమార్తె ఉంటే తల్లిదండ్రుల ఆస్తిలో సగం ఆమె వారసత్వంగా పొందుతుంది.
·
తమ చనిపోయిన సంతానం ఆస్తిలో మనువలు/మనవరాళ్లు(Grand
Children) ఉంటే తల్లికి చనిపోయిన సంతానం ఆస్తిలో
ఆరవ వంతు, మనువలు/మనవరాళ్లు(Grand
Children) లేనట్లయితే ఆస్తిలో మూడింట ఒకవంతు లభిస్తుంది
·
తల్లిదండ్రులు, పిల్లలు, భార్యాభర్తలు అన్ని సందర్భాల్లో, (ఇతర వారసుల సంఖ్య
లేదా డిగ్రీ ఏమైనా) తప్పనిసరిగా వాటాలను పొందాలి.
వారరసత్వంను
కోల్పోవు సందర్భాలు:
ఒక వ్యక్తిని అతని
వారసుడు హత్యచేసినట్లతే హంతకునికి హతుని
యొక్క ఆస్తిలో వాటా సంక్రమించదు.
·
ఒక మహమ్మదియుడు తన మతమును మార్చుకొన్నా,
వారసత్వరీత్యా అతనికి సoక్రమించవలసిన ఆస్తి సంక్రమిస్తుంది. అతని సంతానమునకు
మాత్రం సంక్రమించదు.
·
సున్నీల ప్రకారం అక్రమ సంభంధం ద్వారా జన్మించిన
పిల్లలు తమ తల్లి ఆస్తికి మాత్రమే వారసులవుతారు.
·
గర్భస్థ శిశువుకు కూడా ఒక చనిపోయిన
మహామ్మదీయుడి ఆస్తి లో వాటా ఉంటుంది,అయితే ఆ గర్భస్థ శిశువు సజీవంగా
జన్మించావలయును. మృత శిశువుగా జన్మిస్తే వాటా ఉండదు.
గమనిక: ఒక మహామ్మదీయుడు
చనిపోయినప్పుడు అతని అంత్యక్రియల ఖర్చులు, అప్పులు, మరణ శాసనరీత్యా ఇతరులకు
(legattee) పోగా, మిగిలిన ఆస్తి మాత్రమే వారసులకు సంక్రమిస్తుంది.
వారసత్వంగా మహిళల హక్కుల
గురించి ఇంత స్పష్టంగా ప్రస్తావించినప్పటికి అనేక ముస్లిం సమాజాలలో మహిళలు తమ ఆస్తి
హక్కులను కోల్పోతున్నారనేది నిజంగా షాకింగ్. భారతదేశంలో మత పండితులతో సహా
ముస్లిం నాయకులు ట్రిపుల్ తలాక్ వంటి అంశాలపై చాలా ఆందోళన చేస్తున్నారు కాని ఈ హక్కుల గురించి ఎవరూ ఆలోచించటం లేదు. మహిళలు ఆస్తిలో తమ హక్కుల కోసం స్వరం
పెంచాలి మరియు పర్సనల్ లా బోర్డు మరియు ఇతర సరైన ఆలోచనాపరుల సహాయం తీసుకోవాలి.
ముస్లిం పర్సనల్ లా తమ సోదరీమణులకు చెందిన వాటిని తీసుకోవద్దని మగవారిపై
ఒత్తిడి తెచ్చే ప్రచారాన్ని ప్రారంభించాలి. ముస్లిం సమాజంలోని పురుషులు తమ తప్పులను సరిదిద్డుకోవడం విధి. కొన్ని రాష్ట్రాల్లో మహిళలు వ్యవసాయ
ఆస్తిలో వారసత్వాన్ని చట్టబద్దంగా కోల్పోయినప్పుడు, ముస్లిం ముస్లిం పర్సనల్ లా బోర్డు తో సహా
ముస్లింలు దీనిని ఎదుర్కోకపోవడం మరింత బాధ కలిగిస్తుంది. వ్యవసాయ ఆస్తిలో మహిళల
హక్కులను పునరుద్ధరించాలని ముస్లింలు డిమాండ్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
మెహర్ ఇవ్వమని వత్తిడి తేవాలి STRESS SHOULD ALSO BE GIVEN ON MEHR
ఆస్తిలో వారసత్వంతో పాటు, వివాహం సమయంలో
మెహర్ రూపంలో భర్త నుండి విధిగా బహుమతి పొందే హక్కును అల్లాహ్ మహిళలకు ఇచ్చాడు.
మహిళలు తమకు కావలసినంత మెహర్‌ను డిమాండ్ చేయవచ్చు, ఆపై పరస్పర అంగీకారం ప్రకారం మొత్తాన్ని
నిర్ణయించవచ్చు. తన భర్త మెహర్ ను మాఫీ చేయమని కోరితే ఆమె మానసిక ఉద్రేకంతో మెహర్‌ను
వదులుకోకూడదు. ఇది వారి ఆస్తి మరియు మెహర్ ఆదర్శంగా వెంటనే ఇవ్వాలి; కొన్ని కారణాల
వల్ల భర్త నికా సమయంలో మెహర్ ఇచ్చే స్థితిలో లేకుంటే, తరువాతి దశలో
ఇవ్వాలి. ఇది ఒక ఆస్తి, ఇది
అవసరమైనప్పుడు ఉపయోగించబడుతుంది.
అల్లాహ్ ఇలా అంటాడు:
·
“వారి ద్వారా (భార్యల ద్వారా) మీరు అనుభవించిన
దాపత్య సుఖానికి బదులుగా వారికి మహార్ ను ఒక విధి గా భావించి చెల్లించండి. (4: 24)
మెహర్ తో పాటు (భార్యలకు)రోజువారీ నిర్వహణ ఖర్చు
కూడా చెల్లించండి.
·
వారి(భార్యల) సంరక్షకుల అనుమతితో వారిని వివాహం
చేసుకోండి మరియు న్యాయమైన పద్దతిలో వారికి మహార్ ఇవ్వండి. (4: 25)
రేఫరెన్స్:
1.
దివ్య ఖురాన్ (TIP వారి ప్రచురణ)
2.
మహమ్మదీయ ధర్మ శాస్త్రం (Muslim Law)- పెండ్యాల సత్యనారాయణ.
– స్నేహ లా హౌస్, హైదరాబాద్.(ప్రతి ముస్లిం ఇంట్లో తప్పక ఉండవలసిన రెఫరెన్స్ బుక్
)