తొమ్మిదవ
శతాబ్దానికి చెందిన అబుల్ ఖాసిమ్ అల్ జునాయద్ తోలితరం ముస్లిం ఆధ్యాత్మికవేత్తలలో
అత్యంత సుప్రసిద్ధుడు. అందరు అతనిని "పీకాక్ ఆఫ్ ది పూర్ ", "లార్డ్ ఆఫ్ ది
గ్రూప్" మరియు "మాస్టర్ ఆఫ్ మాస్టర్స్“Peacock of the Poor”, “Lord
of the Group” and “Master of Masters”" అని పిలిచెవారు.
ఇతను జునాయద్ సూఫీతరికా యొక్క ప్రముఖుడు. అతని
కుటుంబం ఇరాన్ నుండి వచ్చి బాగ్దాద్‌లో స్థిరపడింది.
.
వృత్తిరీత్యా గాజు
వ్యాపారి జునాయద్ తన జీవితాన్ని ఇస్లామిక్ అధ్యయనాలకు అంకితం చేయడానికి కుటుంబ
వ్యాపారాన్ని వదులుకున్నాడు. జునాయద్ మేనమామ సారీ శక్తి (Sari Saqti) ఆ సమయంలో ప్రముఖ
సూఫీ.
చిన్నతనంలో
జునాయద్ మేనమామ తో పాటు సూఫీ సమావేశాలలో పాల్గొనేవాడు. ఆ సమావేశాలలో "శిష్యుని ముఖాన్ని గురువు కొడితే, శిష్యుడు దానిని
గమనించలేదు." అని తన గురువు చెప్పగా విన్నట్లు
జునయాద్ వివరించాడు. ఆ తరువాత అతను
పూర్తిగా సూఫీ గా మారిపోయాడు.
ఆధ్యాత్మిక
జ్ఞానం ఎంపికైన కొద్దిమందికి మాత్రమే ఉంటుందని దానిని అందరికీ వెల్లడించకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. అతను
సూఫీ మార్గాన్ని “సమర్పించడం, నిజాయితీ, ఉదారత, సహనం, వేరు, ఉన్ని దుస్తులు, సంచారం మరియు
పేదరికం” వంటి ఎనిమిది విభిన్న లక్షణాలతో కూడి ప్రవక్తల జీవితాల మాదిరిగా ఉండాలి అన్నాడు.
,
ఒక సూఫీకి దేవుని ఆజ్ఞలు నెరవేర్చిన అబ్రహం లాంటి హృదయం, డేవిడ్ కు ఉన్న దుఖం, యేసు అనుభవించిన పేదరికం, మోషే లాగా దేవునితో సంభాషించాలనే కోరిక మరియు ముహమ్మద్ ప్రవక్త లాగా చిత్తశుద్ధి కలిగి ఉండాలి అని జునయాద్ అభిప్రాయపడ్డారు.
జునయాద్ ఫనా
మరియు బాకా యొక్క సూఫీ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశాడు, ఇది తరువాత సనాతన
సూఫీయిజం యొక్క మొత్తం తత్వాన్ని నిర్ణయించింది.
"ఫనా అనేది దేవుని చిత్తంలో వ్యక్తిగత చిత్తం యొక్క సమ్మేళనం మరియు అది దేవుని దయ ద్వారా అనుభవించబడుతుంది. సూఫీయిజం ఏమిటంటే, అది నీలో నీవు విలీనం అయి నీలో నీవు ఉనికిలో ఉండాలి. బాకా అనేది భగవంతునిలో నిజమైన ఆత్మ యొక్క వీలినం. దిగువ స్వీయ నిష్క్రమణ నిజమైన స్వీయ రూపాన్ని సూచిస్తుంది ”, అని ఆయన అన్నారు.
.
జునిద్ సూఫీకి
భయం లేదని బోధించాడు, ఎందుకంటే భయం అనేది భవిష్యత్తులో ఏదో ఒక విపత్తును జరుగుతుందని
అనుకోవడం లేదా ఇష్టమైన వస్తువును కోల్పోవడం వంటిది. అయితే సూఫీ కాలపుత్రుడు. అతనికి భవిష్యత్తు లేదు
మరియు భయం లేదు, ఆశ లేదు. ఆశ అనేది ఏదైనా సంపాదించడం లేదా రాబోయే దురదృష్టం
నుండి ఉపశమనం పొందడం లాoటిది.. సూఫీ దుఖించడు, ఎందుకంటే దుఖం
సమయం యొక్క కాటిన్యత నుండి పుడుతుంది మరియు సూఫీ ప్రభువుతో సంతృప్తి మరియు సామరస్యం పొందినప్పుడు
దుఖాన్ని ఎలా అనుభవిస్తాడు అని ప్రశ్నిస్తాడు.
No comments:
Post a Comment