7 December 2019

ఇస్లాం మరియు మసీదులోకి మహిళల ప్రవేశo Islam and the case for women entering mosque




Image result for women in mosque
  
.

మసీదులలో ప్రార్థనలు చేయటానికి ముస్లిం మహిళలను  నిషేధించే సoప్రదాయం అమలును  సవాలు చేస్తూ పూణేకు చెందిన దంపతులు- యస్మీన్ మరియు ఆమె భర్త జుబెర్ అహ్మద్ భారత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భారత రాజ్యాంగంలోని 14,15,21 మరియు 25. రాజ్యాంగ నిబంధనలను క్రింద ఇటువంటి ఆంక్షలను "చట్టవిరుద్ధం" మరియు "రాజ్యాంగ విరుద్ధం" గా ప్రకటించాలని కోరుతూ, దేశంలోని ఏ పౌరుడిపైనా ఎటువంటి వివక్ష ఉండకూడదని పిటిషనర్లు అన్నారు. మతం, జాతి, కులం, లింగం మరియు పుట్టిన ప్రదేశం గౌరవం మరియు సమానత్వం కలిగిన జీవితం అత్యంత పవిత్రమైన ప్రాథమిక హక్కు అని, ముస్లిం మహిళ మసీదులోకి ప్రవేశించడాన్ని నిషేధించలేమని వారు తెలిపారు. దీనిపై తమ రిపోర్ట్స్ సమర్పించాలని సుప్రీంకోర్టు లా కమిషన్ ఆఫ్ ఇండియా, ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ వక్ఫ్ బోర్డులకు నోటీసు జారీ చేసింది.
ఇప్పుడు, ఇస్లాం మహిళలను నిషేధిస్తుందా లేదా ప్రార్థనలు చేయడానికి మసీదులలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుందా అని మనం చూడాలి.
ఆపోహలు మరియు అసలు వాస్తవాలు ఏమిటి?

అపోహ ఏమిటి?
మహిళలకు మత స్వేచ్ఛ ఇవ్వడానికి ముస్లింలు సిద్ధంగా లేరు. వారు సాంప్రదాయిక మనస్తత్వం కలిగి ఉంటారు మరియు ముస్లిం మహిళలు ఎల్లప్పుడూ పురుషుల  నియంత్రణలో ఉంటారు. వారు తమ ఇష్టానుసారం తమ మత హక్కులను అనుభవించ లేరు మరియు ముస్లిం మహిళల విలువ, వారి ఆలోచనలు, వారి భావాలు మరియు వారి ఎంపికలను  ముస్లిం సమాజం ఎప్పుడూ పట్టించుకోదు. అందుకే, ముస్లిం మహిళలకు మసీదులలో నమాజ్ (ప్రార్థనలు) ఇవ్వడానికి అనుమతి లేదు,  ఇది  ఉల్లంఘన మరియు వివక్షత పద్ధతి. అలాగే ఇది ఒక అవమానం, సామాజిక బహిష్కరణ, అణచివేతకు చిహ్నం మరియు మహిళల గౌరవంకు  అవమానకరమైన సంకేతం మరియు దేవుని దృష్టిలో సమాన మానవులుగా ఉండటానికి గల వారి హక్కును తొలగించడమే .

ఇవి అన్ని పూర్తిగా అపోహలు మాత్రమె. ఇస్లాంలో అలాంటి భావన లేదు. ఇస్లాంలో స్త్రీ-పురుషులు సమానమే మరియు లింగ వివక్షత అనే భావన లేదు. మహిళలను సమాజంలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించి వారికి పురుషులతో  సమాన హక్కులు ఇచ్చిన  ఘనత ఇస్లాంకు దక్కుతుంది. మహిళలను సమాజంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా ప్రకటించడం ఇస్లాం యొక్క విప్లవాత్మక దశ.

వాస్తవికత ఏమిటి?
వాస్తవికత ఏమిటంటే, ఇస్లాంలో స్త్రీలు మసీదులలో ప్రార్థనలు చేయటానికి అనుమతి ఉంది  మరియు వివక్షత  లేదు. సమానత్వం మరియు ఆరాధన హక్కు ముస్లిం స్త్రీలకు కలదు. ఇబ్న్ ఉమర్ (అబ్దుల్లా బిన్ ఉమర్) ఇలాఅన్నారు : దేవుని దూత, “దేవుని పనిమనిషిని మసీదుకు వెళ్ళకుండా నిరోధించవద్దుఅని అన్నారు. అదే సమయంలో, ముహమ్మద్ ప్రవక్త (స)ముస్లిం పురుషులకు "మీ మహిళలు అనుమతి కోరినప్పుడు మసీదుకు వెళ్ళకుండా నిరోధించవద్దు"అని సలహా ఇచ్చారు.
"ముహమ్మద్ (స) మదీనాలోని తన మసీదులోకి మహిళలు ప్రవేశించడాన్ని నిషేధించలేదు". మహిళలు తమ  బంధువులు లేకుండా కూడా నమాజ్ చేయడానికి  మసీదుకు వెళ్ళడానికి అనుమతిoచారు.. ప్రవక్త మొహమ్మద్(స) సమయంలో మహిళలు మసీదులో జమాత్‌తో కలిసి నమాజ్ చేసారు. ప్రవక్త మొహమ్మద్ భార్య అయేషా రజిల్లాహో ఉన్హా మాట్లాడుతూ, నమాజ్-ఇ-ఫజార్ (ఉదయం ప్రార్థన) ను ప్రవక్తతో కలిసి చేయడానికి మహిళలు మసీదుకు వస్తున్నారని, పూర్తి దుస్తులు ధరించి, వారు తమ నమాజ్ పూర్తి చేసి తిరిగి తమ ఇళ్లకు తిరిగి వెళ్ళారని చెప్పారు.

ఈ హదీసులన్నీ స్త్రీలకు మసీదులోకి ప్రవేశించడానికి మరియు అక్కడ ప్రార్థనలు చేయడానికి అనుమతి ఉన్నట్లు చెబుతున్నాయి.. ముస్లిం స్త్రీలకు సమానత్వ హక్కు మరియు ఆరాధన హక్కు  కలదు. ప్రార్థనలు చేయడానికి మసీదు సందర్శించడానికి స్త్రీలకు ఇస్లామిక్ హక్కు ఉంది.

 ప్రవక్త (స) నుండి ఉమర్ రజియుల్లా ఖిలాఫత్ ప్రారంభ రోజుల వరకు మహిళలు మసీదులలో నమాజ్ చేస్తూ జుమా ఉపన్యాసానికి హాజరయ్యారు. ఒకసారి ఉమర్ (ఇస్లాం యొక్క రెండవ ఖలీఫా) జుమా ఉపన్యాసం చేస్తున్నప్పుడు మహర్ మొత్తాన్ని నిర్ణయిoచడానికి ప్రయత్నించారు. ఇది వాస్తవంగా  వివాహా ఉభయ  పార్టీల ఇష్టం పై ఆధారపడి ఉంటుంది.

ఆరాధకుల నుండి ఒక వృద్ధురాలు నిలబడి, ప్రవక్త మొహమ్మద్ (స) మహార్ మొత్తాన్ని నిర్ణయించలేదని, నిర్ణయిoచడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు? అని ఉమర్ (ర) ను ప్రశ్నించారు.  అప్పుడు ఉమర్(ర) తన మాటలను ఉపసంహరించుకున్నారు  మరియు ఈ స్త్రీ లేకపోతే ఉమర్ నాశనం అయ్యే వాడు అని అన్నారు. ఈ సంఘటన వలన అతని తీర్పు ప్రారంభ రోజుల్లో మహిళలు ప్రార్థనలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

ముస్లిం స్త్రీలు మస్జిదులలో ప్రవేశం పట్ల అసమ్మతి అనేది ఉమర్ ఖిలాఫత్ యొక్క తరువాతి కాలంలో ప్రారంభం అయినది. దానికి కారణం ఆనాటి సమాజం లో దురాచారాలు ప్రబలటం. ముహమ్మద్ భార్య అయేషా బింట్ అబీ బకర్ (అల్లాహ్ యొక్క శాంతి మరియు ఆశీర్వాదం) ఒకసారి ఇలా చెప్పారుప్రవక్త(స) గనుక ఇప్పుడు జీవించి ఉంటే మరియు ఇప్పటి స్త్రీలను చూస్తుంటే, బని ఇజ్రాయెల్ జాతి తమ స్త్రీలను నిషేధించినట్లుగానే స్త్రీలు మసీదుకు వెళ్లడాన్ని నిషేధించేవారు.ఉమర్ కాలంలో ఉమర్ భార్య అతికా మరియు ఇతర మహిళలు మసీదులో నమాజ్ చేస్తున్నారని మరియు వారి భర్తలు వారిని మసీదులలోకి ప్రవేశించకుండా నిరోధించలేదని కూడా  చరిత్ర యొక్క సాక్ష్యం ఉంది. ఫలితంగా, నేటికీ, ఇండోనేషియా, మలేషియా, అరబ్ దేశాలతో పాటు ముస్లిం దేశాలలో మరియు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కూడా మసీదులలో ప్రార్థనలు చేయడానికి మహిళలకు అనుమతి ఉంది.

మసీదులలో ప్రార్థనలు చేయడం మహిళలకు తప్పనిసరి కాదు, అబ్దుల్లా బిన్ ఉమర్ అన్నట్లు స్త్రీలు  తమ ఇళ్లలో నమాజ్ చేసిన మసీదులో నమాజ్ చేయుటవలన పురుషులు పొందిన దానితో పాటు  వారికి సమాన మొత్తం బహుమతి లభిస్తుంది. ప్రవక్త మొహమ్మద్(స) "నమాజ్ను చేయడానికి మీ భార్యలు మసీదును సందర్శించడాన్ని ఆపవద్దు, కాని వారి ఇళ్ళు వారికి మంచివి" అని అన్నారు. కాబట్టి, పురుషుల తో  పోల్చితే మహిళా సమాజానికి ఎక్కువ ప్రయోజనం కలదు. వారు మసీదులో మరియు ఇంట్లో నమాజ్ను చేయవచ్చు మరియు వారు తమ ఇళ్లలో నమాజ్ను చేసినప్పుడు కూడా మొత్తం బహుమతిని పొందుతారు.


కాని ఈ రోజుల్లో, కొంతమంది పండితులు మసీదులలో ప్రార్థనలు చేయడానికి మహిళలను అనుమతించటానికి అనుకూలంగా లేరు. వారి ప్రకారం స్త్రీలు  మసీదులలో నమాజ్ చేయడానికి  అనుమతించకూడదు మరియు ఇది మక్రూ (అయిష్టత). ఇది పూర్తిగా అహేతుకమైనది మరియు అశాస్త్రీయమైనది, ఎందుకంటే ఇది ఇస్లాం యొక్క నిబంధనలకు విరుద్ధం మరియు మొహమ్మద్ ప్రవక్త(స) అనుమతించినప్పటికీ, పండితులకు ప్రవేశించకుండా నిరోధించే హక్కు లేదు. ఫిట్నాకు స్త్రీలే కారణమని ఆలోచించే వారు, ఫిట్నా (బాధ) మరియు అనైతిక అంశాలకు మహిళలు బాధ్యత వహించరని తెలుసుకోవాలి.

 వారు తమ అభిప్రాయాన్ని మార్చుకోవాలి మరియ స్త్రీలు అనుమతి కోరితే వారిని అనుమతించాలి అంతే తప్ప మసీదులో నమాజ్ చేయకుండా నిరోధించే హక్కు వారికి లేదు.  సహిహ్ ముస్లిం-ప్రకారం : పురుషులకు ఉత్తమ వరుసలు మొదటి వరుసలు, మరియు చెత్త చివరి వరుసలు, మరియు మహిళలకు ఉత్తమ వరుసలు చివరివి మరియు చెత్త వారికి మొదటివి ”.

ముహమ్మద్ (స) "మసీదులోకి ప్రవేశించడానికి  స్త్రీలకు మరియు పురుషులకు వేర్వేరు తలుపులు ఉండాలి. పురుషులు మరియు మహిళలు ఒకే తలుపు ద్వారా వెళ్ళటం మరియు రావడం చేయకూడదు. " అని ఆదేశించారు. “‘ ఇషా సాయంత్రం ప్రార్థనతరువాత, మొదట స్త్రీలు మసీదు బయటకు వెళ్లాలని ఆయన ఆదేశించారు.


 కాబట్టి ఇస్లాం లో మహిళలు మసీదులలోకి ప్రవేశించకుండా నిరోధించడo మరియు దానిని "చట్టవిరుద్ధం" మరియు "రాజ్యాంగ విరుద్ధం" గా ప్రకటించే  అవకాసం లేదు. ఇది సంపూర్ణ కృత్రిమ ప్రచారం.  ఇస్లాంలో ముస్లిం మహిళలకు ఇప్పటికే కొన్ని అదనపు ప్రయోజనాలతో అనుమతి ఇవ్వబడింది.


No comments:

Post a Comment