భారతదేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ అద్భుతమైన
రహదారిని గ్రాండ్ ట్రంక్ రోడ్ ను సూరి సామ్రాజ్యం వ్యవస్థాపకుడు షేర్ షా సూరి
స్థాపించాడు.
భారతదేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ గ్రాండ్ ట్రంక్
రోడ్ ను సూరి సామ్రాజ్య వ్యవస్థాపకుడు షేర్ షా సూరి నిర్మించకపోతే భారతదేశంలోని ప్రయాణికులకు, ఉత్తరం నుండి
దక్షిణానికి లేదా తూర్పు నుండి పడమర కు
వెళ్లడం దాదాపు అసాధ్యం అయ్యేది. ఈ అద్భుతమైన రహదారి గురించి చర్చ
జరిగినప్పుడల్లా, షేర్ షా సూరి పేరు గుర్తుకు వస్తూనే ఉంటుంది. అసాధారణమైన
వ్యక్తిత్వం కల షేర్ షా సూరి తన ఏడు సంవత్సరాల పాలనలో గ్రాండ్ ట్రంక్ రోడ్ తో పాటు
అనేక నిర్మాణాలు చేసాడు.
నేటి బీహార్‌లోని
ససరంలో 1486 లో జన్మించి షేర్ షా సూరి గా పిలువబడే ఫరీద్ ఖాన్ లోడి ఆఫ్ఘన్
పష్తున్ సుర్ తెగకు చెందిన ప్రముఖుడు ఇబ్రహీం ఖాన్ సూరి మనవడు. ఫరీద్ ఖాన్ 'షేర్' అని పిలువబడ్డాడు. అతను యువకుడిగా ఉన్నప్పుడు బీహార్ రాజును, పులి బారి నుండి కాపాడాడు.
తరువాత అతను షేర్ షా గా పిలువబడ్డాడు మరియు భారత ఉపఖండంలోని ఉత్తర భాగంలో సూరి సామ్రాజ్యం
స్థాపకుడయ్యాడు.
ఒక జాగీర్దార్ మరియు డిల్లి పాలకుల ప్రతినిధి అయిన అతను సాహసికుడు మరియు జౌన్‌పూర్ సుల్తానేట్‌తో
సుదీర్ఘ ఘర్షణలో ఉన్న డిల్లికి చెందిన సుల్తాన్
బహ్లుల్ లోడి చేత నియమించబడ్డాడు. అతను మియాన్ హసన్ ఖాన్ సూరి యొక్క ఎనిమిది మంది
కుమారులలో ఒకడు. అతని తండ్రి మియాన్ హసన్
ఖాన్ సూరి నార్నాల్ జిల్లాలో ప్రభుత్వ అధికారి. అతని తాత ఇబ్రహీం ఖాన్ యొక్క 'మజార్' ఇప్పటికీ
నార్నాల్ లో ఒక స్మారక చిహ్నంగా ఉంది.
షేర్ షా బాబర్ ఆధ్వర్యంలోని మొఘల్ సైన్యంలో కమాండర్
హోదాకు మరియు బీహార్ గవర్నర్ స్థాయికి ఎదిగాడు. 1538 లో బాబర్ కుమారుడు
హుమాయున్ యుద్ధానికి దూరంగా ఉన్నప్పుడు, షేర్ షా బెంగాల్
రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకుని తన తెగ సుర్ పేర సూరి రాజవంశాన్ని స్థాపించాడు. 1538 నుండి 1545 వరకు సాగిన అతని
పాలనలో అతడు ప్రతిభావంతుడైన నిర్వాహకుడు మరియు వ్యూహకర్త మరియు అతను అనేక ముఖ్యమైన మార్పులను ప్రవేశపెట్టాడు.
ఒక తెలివైన జనరల్ షేర్ షా తన పరిపాలనలో అనేక ముఖ్యమైన
వ్యూహాలతో నూతన పౌర మరియు సైనిక నియమాలను ఏర్పాటు చేసాడు. 'టాకా' స్థానంలో 'రూప్యా' జారీ చేయబడింది.
మరో ముఖ్యమైనది పోస్టల్ వ్యవస్థ యొక్క
పునర్వ్యవస్థీకరణ. షేర్ షా హుమాయున్ నగరం పేరును 'దినా-పనాహ్' నుండి 'షేర్ ఘర్' గా మార్చాడు
మరియు చారిత్రక నగరమైన 'పాటలిపుత్రా'ను కూడా
పునరుద్ధరించాడు. గ్రాండ్ ట్రంక్ రోడ్ నిర్మాతగా ప్రసిద్ది చెందాడు.
షేర్ షా బీహార్ మొఘల్ గవర్నర్ బహర్ ఖాన్ లోహాని
ఆధ్వర్యంలో తన కెరియర్ ను ప్రారంభించాడు. అతని శౌర్యం కారణంగా బహర్ ఖాన్ అతనికి
'షేర్ ఖాన్' అనే బిరుదును బహుమతిగా ఇచ్చాడు. బహర్ ఖాన్ మరణం
తరువాత, అతను మైనర్ సుల్తాన్ జలాల్ ఖాన్ యొక్క రీజెంట్ పాలకుడు
అయ్యాడు. బీహార్‌లో షేర్ ఖాన్ ప్రాబల్యం పెరుగుతుందని జలాల్ త్వరలోనే గ్రహించి, బెంగాల్ స్వతంత్ర
సుల్తాన్ అయిన గియాసుద్దీన్ మహమూద్ షా సహాయం కోరినాడు.. గియాసుద్దీన్ తన జనరల్
ఇబ్రహీం ఖాన్ ఆధ్వర్యంలో ఒక సైన్యాన్ని పంపాడు, కాని 1534 లో సూరజ్ ఘర్ యుద్ధంలో
షేర్ ఖాన్ అతని పై విజయం సాధించి బీహార్‌పై పూర్తి నియంత్రణ సాధించాడు.
1538 లో షేర్ ఖాన్ బెంగాల్ పై దాడి చేసి గియాసుద్దీన్ మహమూద్
షాను ఓడించాడు. కాని రాజ్యాన్ని స్వాధీనం చేసుకోలేక పోయాడు. 26 జూన్ 1539 న, షేర్ ఖాన్ చౌసా
యుద్ధంలో మొఘల్ రాజు హుమాయున్‌ను ఎదుర్కొని అతనిని ఓడించాడు. 'ఫరీద్ అల్-దిన్
షేర్ షా' అనే బిరుదును
ధరించాడు. మే 1540 లో కన్నౌజ్‌లో
హుమయూన్‌ను మరోసారి ఓడించి అతన్ని భారతదేశం
నుండి బయటకు పంపించాడు.
ఆ తర్వాత షేర్ షా తన
దృష్టిని రాజ్‌పుత్ వైపు మళ్ళించాడు. మాల్వా మరియు జోధ్‌పూర్‌లపై దాడి చేశాడు కాని
కలింజార్ కోట ముట్టడిలో చంపబడ్డాడు. కోట
గోడలను గన్‌పౌడర్‌తో పేల్చాలని షేర్ షా ఆదేశించాడు కాని పేలుడులో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అతను మే 22, 1545 న మరణించాడు
మరియు ససరంలో ఖననం చేయబడ్డాడు. అతని కుమారుడు జలాల్ ఖాన్ అతని తరువాత 'ఇస్లాం షా సూరి' బిరుదు
స్వీకరించాడు.
సూరి రాజవంశం స్థాపకుడు అయిన
షేర్ షా సమాధి 122 అడుగుల ఎత్తులో గ్రాండ్ ట్రంక్ రోడ్ లో ఉన్న ససారం
లోని ఒక కృత్రిమ సరస్సు మధ్యలో గంభీరంగా నిలుస్తుంది.
No comments:
Post a Comment