MORE-IN
కమ్యూనికేషన్ మరియు
విశ్వాసం అనేవి ఉద్యోగసాధన కొరకు నేటి
యువతకు అవసరమైన ముఖ్య లక్షణాలు.
ప్రపంచం చాలా వేగంగా
కదులుతోంది, సంస్థలు
మారుతున్న పరిశ్రమల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఉపాధ్యాయులు ఒక విషయం
బోధించడానికి సిద్ధమయ్యే లోపే ఆ విషయం పాతది అవుతుంది. టెక్నాలజీలో మార్పులు, ముఖ్యంగా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు రోబోటిక్స్ వలన చాలా ఉపాధి అవకాశాలు తగ్గినవి.
ఉద్యోగ సాధనకు తన నిజమైన
బలం కమ్యూనికేట్ చేయగల సామర్థ్యం. ఈ నైపుణ్యాన్ని సాధించి తమ ఆలోచనలను ఎలా కమ్యూనికేట్ చేయాలో మరియు
ప్రదర్శించాలో యువత నేర్చుకోవాలి.
కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్, క్యూరియాసిటీ, క్రియేటివిటీ, కోలబిరెషన్ అండ్
కాంపిటెన్స్ (Communication, Confidence, Curiosity, Creativity, Collaboration
and Competence) అనే ఆరు “సి” ల విజయాల భావన.
కలిసి పనిచేయడానికి
అవసరమైన నైపుణ్యాలు కమ్యూనికేషన్ మరియు విశ్వాసం. కానీ ఈ రెండు లక్షణాలను వ్యక్తి ఆసక్తిగా, సృజనాత్మకంగా, సహకారంగా మరియు సమర్థంగా వినియోగించాలి. దీనినే విజయం యొక్క సిక్స్ సి అని అందురు.
విషయాలను తెలుసుకోవటమే
గాక తమ ఆలోచనలను ఇతరుల ముందు ఎలా ప్రదర్శించాలో
తెలుసుకోవాలి. ఇతరులను ఒప్పించటం, విభేదాలను పరిష్కరించడం, వైఫల్యాలను
ఎదుర్కోవడం, చర్చలు మరియు
పనులు చేయడంలో పట్టుదలతో ఉండాలి.ఇవన్నీ నేటి యువతకు కావలసిన ముఖ్యమైన నైపుణ్యాలు.
”
18 మరియు 25 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత వీటి సాధన తమ లక్ష్యంగా చేసుకునాలి.
సిక్స్ సి ఆత్మవిశ్వాసాన్ని
పెంచి అభివ్యక్తికరణకు సహాయపడుతుంది.
No comments:
Post a Comment