పశ్చిమ బెంగాల్ లోని పర్యాటక ప్రదేశాలు-ముర్షిదాబాద్
గంగా నది తూర్పు ఒడ్డున ఉన్న ముర్షిదాబాద్ చారిత్రక విశేషాలతో
నిండి ఉంది. ఈ పట్టణం ఇప్పటికీ మసీదులు, సమాధులు మరియు
తోటలతో నవాబుల జ్ఞాపకాలను తిరిగి తెస్తుంది. ఒకప్పుడు ఇది బెంగాల్, బీహార్ మరియు
ఒరిస్సా రాజధాని
మరియు ఇది స్వతంత్ర
బెంగాల్ యొక్క చివరి రాజధాని నగరం. భాగీరథి ఒడ్డున ఉన్న ఈ నగరం వైభవం ఉన్న నగరంగా మరియు
పట్టుపరిశ్రమకు ప్రసిద్ధి చెందింది.
1704 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్
నేతృత్వంలోని బెంగాల్ దేవాన్ ముర్షిద్ కులీ ఖాన్ రాజధానిని డాకా నుండి తన పేరు ఉన్న నగరం ముర్షిదాబాద్ కు
మార్చాడు. ముర్షిదాబాద్ ను పూర్వం 'ముక్సుదాబాద్' అనిపిలిచేవారు. 1716 లో 'సుబే బంగ్లా' (ప్రావిన్స్)
యొక్క 'నవాబ్' (పాలకుడు) బిరుదును దివాన్ ముర్షిద్ కులీ ఖాన్ పొందిన
తరువాత ముర్షిదాబాద్ అధికారిక రాజధానిగా మారింది.
బ్రిటిష్ వారి ఆగమనంతో ముర్షిదాబాద్ భారతదేశ చరిత్రలో
గణనీయమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. 1757 లో బ్రిటీష్ వారు 'ప్లాస్సీ
యుద్ధంలో' సిరాజ్-ఉద్-దౌలాను ఓడించారు ఆ తరువాత భారత దేశం
మొత్తం వలసరాజ్య పాలనలోకి తీసుకురాబడింది. జైన్ జగత్ సేథ్ కుటుంబం ముర్షిదాబాద్లో అనేక
తరాలుగా స్టేట్ బ్యాంకర్లుగా తమ స్థానాన్ని కొనసాగించినది.
బ్రిటిష్ వారు బెంగాల్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత
కూడా పరిపాలనా స్థానం ముర్షిదాబాద్‌లో కొంతకాలం కొనసాగింది.
సుప్రీం సివిల్ మరియు క్రిమినల్ కోర్టులను 1772 లో కలకత్తాకు
తరలించారు, కాని కోర్టులు 1775 లో తిరిగి
ముర్షిదాబాద్కు తీసుకురాబడ్డాయి. 1790 లో లార్డ్ కారన్
వాలిస్ Lord Cornwallis ఆధ్వర్యంలోనే
మొత్తం రెవెన్యు మరియు న్యాయ సిబ్బందిని కలకత్తాకు తరలించారు. కాని ఈ పట్టణం నవాబు
నివాసంగా కొనసాగింది - ఈ ప్రావిన్స్ యొక్క మొదటి గొప్ప వ్యక్తిని (first nobleman of the province) బెంగాల్ నవాబ్ నజీమ్ గా కాకుండా ముర్షిదాబాద్
యొక్క నవాబ్ బహదూర్ అని పిలుస్తారు.
ముషిరాబాద్ లో పర్యాటకులు సందర్శించడానికి మరియు
చారిత్రాత్మక ఆసక్తి ఉన్న ముఖ్యమైన ప్రదేశాలలో, 'హజార్-దుయారి
ప్యాలెస్' - లేదా 'వెయ్యి తలుపుల ప్యాలెస్'Hazaar-duari Palace' - or the 'Palace of a
Thousand Doors ', 'ఇమాంబర''Imambara, 'మోతీ జీల్'Moti Jheel' (Pearl Lake), ' (పెర్ల్ లేక్), జైన దేవాలయంతో 'కత్గోలా ప్యాలెస్'Kathgola Palace ' మరియు 'జాఫర్గంజ్' మరియు 'ఖుష్బాగ్
స్మశానవాటిక Jafarganj'
and 'Khushbagh Cemetery'. ముఖ్యమైనవి. '.
1837 నాటి అద్భుతమైన 'హజార్-దుయారి
ప్యాలెస్' Hazaar-duari Palace నిజమైన మరియు
నకిలీ 1000 తలుపుల ప్యాలెస్. ప్యాలెస్‌ను డంకన్ మాక్లియోడ్
ఆర్కిటెక్చర్‌తో నిర్మించారు, ఇది యూరోపియన్ శైలిలో ఉంది. దీనిని నవాబ్ నజీమ్
హుమాయున్ జా మరియు 'నిజామత్ క్విలా' అని పిలిచే పాత
కోట స్థలంలో ఉంది. ఇప్పుడు మ్యూజియంగా
మార్చబడిన హజార్-డుయారి
ప్యాలెస్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా క్రింద అతిపెద్ద సైట్ మ్యూజియంగా
పరిగణించబడుతుంది.
ఇది 4742 పురాతన
వస్తువులను కలిగి ఉన్న ఇరవై గ్యాలరీలను కలిగి ఉంది, వీటిలో 1034 వస్తువులు మాత్రమే
ప్రజలకు ప్రదర్శించబడుతున్నాయి. వీటిలో పెద్ద సంఖ్యలో ఆయుధాలు, డచ్, ఫ్రెంచ్ మరియు
ఇటాలియన్ కళాకారుల ఆయిల్ పెయింటింగ్స్, పాలరాయి
విగ్రహాలు, లోహ వస్తువులు, పింగాణీ మరియు
గార (stucco) విగ్రహాలు
ఉన్నాయి. చాలా ఆసక్తికరమైన పత్రాలు కూడా ఉన్నాయి. వీటిలో 'ఫర్మన్స్' (రాయల్ ఆర్డర్లు), అరుదైన పుస్తకాలు, పాత పటాలు, మాన్యుస్క్రిప్ట్స్, ల్యాండ్ రెవెన్యూ
రికార్డులు మరియు అనేక పల్లకీలు ఉన్నాయి, ఇవి ఎక్కువగా 18 మరియు 19 వ శతాబ్దాలకు
చెందినవి
హజార్దువారి ప్యాలెస్ (Hazaar-duari Palace) మరియు ఇమాంబారా
మధ్యలో ఒక అద్భుతమైన క్లాక్ టవర్ ఉంది. దీనిని డంకన్ మాక్లియోడ్ యొక్క సహాయకుడు సాగర్
మిస్త్రీ నిర్మించారు. ఇది ఒక పెద్ద హెవీ సౌండ్ బెల్ కలిగి మైళ్ళ వరకు వినపడుతుంది.. అలాగే హజార్దురి
మరియు ఇమాంబారా మధ్య ఉన్న 'బచ్చవాలి తోప్' (ఫిరంగి), 7'9వ్యాసం తో మరియు 11'6 '' పొడవు గల ఫిరంగి.
12 మరియు 14 వ శతాబ్దాల మధ్య తయారైన దీని బరువు 7657 కిలోలు.
ఫిరంగిపై ఉన్న ఇత్తడి పొదుగుల నమూనాలు
చూడవలసినవి. 680 అడుగుల పొడవైన బారా ఇమాంబర (నిజామత్ ఇమాంబర), స్మారక వేడుకలకు
ఒక సమావేశ మందిరం. దీనిని 1847 లో నవాబ్ నజీమ్ మన్సూర్ అలీ ఖాన్ ఫెరాదున్ జహ్, సిరాజ్-ఉద్-దౌలా
యొక్క అగ్నిప్రమాదం లో కాలిన పాత చెక్క ఇమాంబారా యొక్క స్థలంలో నిర్మించారు.
'జాఫర్‌గంజ్ శ్మశానవాటిక' మీర్ జాఫర్
శిధిలమైన ప్యాలెస్ అయిన జాఫర్‌గంజ్ వద్ద ఉన్న హజార్దురి ప్యాలెస్ నుండి అర మైలు
దూరంలో ఉంది. 3.51 ఎకరాల విస్తీర్ణంలో ఆయన నిర్మించిన స్మశానవాటికలో మీర్
జాఫర్ కుటుంబ సమాధులు ఉన్నాయి. 'ఖుస్‌బాగ్' లేదా 'గార్డెన్ ఆఫ్
హ్యాపీనెస్', అనేది
అలీవర్ది ఖాన్, అతని మనవడు
సిరాజ్-ఉద్-దౌలా మరియు కుటుంబంలోని ఇతర సభ్యుల స్మశానవాటిక.
క్రీ.శ 1723 లో నవాబ్
ముర్షిద్ కులీ ఖాన్ నిర్మించిన 'కత్రా మసీదు' దురదృష్టవశాత్తు
దెబ్బతింది, కానీ బాగా నిర్వహించబడుతోంది. ప్రధాన మసీదులో ఐదు గోపురాలు
ఉన్నాయి, వాటిలో రెండు 1897 లో సంభవించిన
భూకంపంలో కూలిపోయాయి. మసీదు పెద్దది మరియు
దీనిలో 2000 మంది ఒకే సమయంలో
ప్రార్థనలు చేయగలరు.
'మోతీ జీల్' గుర్రపుడెక్క ఆకారంలో ఉన్న సరస్సు,
దీనిని ఘస్సేటి
బేగం భర్త నవాజేష్ మొహమ్మద్ నిర్మించారు. దాని ప్రక్కనే ఉన్న ప్యాలెస్‌లో (ఇప్పుడు
శిథిలావస్థలో ఉంది) లార్డ్ క్లైవ్ 1765 లో సుబే బంగ్లా (బెంగాల్, బీహార్ & ఒరిస్సా) యొక్క దేవానీ
స్వాధీన ఉత్సవం చేసుకున్నారు. మోతీ జీల్
నవాబ్ నజీమ్ రాజకీయ సలహాదారు వారెన్ హేస్టింగ్స్
నివాసంగా(క్రీ.శ 1771 - 73) ఉంది.
కాథ్గోలా బగన్ బారి అని
పిలువబడే 'కాత్గోలా
ప్యాలెస్', రాజా ధన్పత్
సింగ్ దుగర్ మరియు లక్ష్మీపత్ సింగ్ దుగర్ యొక్క ప్యాలెస్ కమ్ గార్డెన్. దీని ప్రసిద్ధ
ఆదినాథ్ ఆలయాన్ని 1873 లో హారెక్ చంద్
నిర్మించారు. సాంప్రదాయకంగా జైన శైలి శిల్పకళలో రూపొందించబడిన దాని చిక్కని గోడలు
ఆలయానికి ప్రత్యేకమైన అందాన్ని ఇస్తాయి.
ముర్షిదాబాద్ నేడు
వ్యవసాయం, హస్తకళలు, సెరికల్చర్
కేంద్రంగా కొనసాగుతోంది. అది తన కొన్ని పురాతన
చేతిపనులకు నిలయంగా ఉంది. దంతాలు, బంగారం మరియు
వెండి, ఎంబ్రాయిడరీ
మరియు పట్టు నేయడం అక్కడ వారి ప్రధాన వృత్తి.
కొన్నేళ్లుగా నగరంలో చాలా
మార్పులు వచ్చాయి. భారతదేశంలోని అన్ని ఇతర పట్టణాలు మరియు నగరాల మాదిరిగానే అక్కడ
కూడా ఆధునికీకరణ జరిగింది. వారసత్వ భవనాల పరిరక్షణ బాగా ఉంది. పర్యాటకులు అందమైన ప్రదేశాలు మరియు అవి అందించే
సేవలతో సంతోషంగా కనిపిస్తారు.
వారసత్వ అభిమానులకు ఎంతో
ఆసక్తి ఉన్న నగరమైన ముర్షిదాబాద్‌ను సందర్శించడానికి ఇది సరైన సమయం. బలమైన
జ్ఞాపకాలతో, దాని రాజభవనాలు, మసీదులు, సమాధులు, ఉద్యానవనాలు
మరియు ఇతిహాసాలు సందర్శకులను అందించడానికి సిద్దంగా ఉన్నాయి, చరిత్రతో నిండిన
ఒక ప్రదేశంగా అందరూ దీనిని సందర్శించాల్సిన
అవసరం ఉంది.
No comments:
Post a Comment