4 December 2019

90,000 ఉర్దూ టైటిళ్లను డిజిటైజ్ చేస్తున్నట్లు రేఖతా పేర్కొంది Rekhta claims digitising 90,000 Urdu titles


ఉర్దూ ప్రేమికులకు శుభవార్త:

Image result for urdu e library rekhta"



ఇది వర్చువల్ లైబ్రరీ. ఇందులో  ఉర్దూలో 90,000 శీర్షికలు (titles) - మహాభారతం మరియు దివ్య ఖురాన్లతో సహా, ఆత్మకథలు, కల్పన(ఫిక్షన్), యాత్రాసంబంధాలు(ట్రావలోగ్స్), అనువాదాలు, మాన్యుస్క్రిప్ట్స్ మరియు పాప్ మ్యాగజైన్‌లు - డిజిటలైజ్ చేయబడ్డాయి మరియు విద్యావేత్తలు, పండితుల కోసం ఇంటర్నెట్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచబడ్డాయి. దీనివలన పరిశోధకులు ప్రయోజనం పొందుతారు. రేఖతా.ఆర్గ్ (రేఖతా.కామ్ కూడా) పోర్టల్ Rekhta.org (also Rekhta.com)  'షెర్స్' మరియు 'షాయారీల' సేకరణను మరియు దిగ్గజ కవుల యొక్క ముఖ్యమైన సేకరణను అందిస్తుంది - ఇవన్నీ ఉచితంగా!

"ఉర్దూ వర్చువల్ లైబ్రరీ యొక్క ఆలోచనను నేను మరియు కొంతమంది విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు చర్చించిన తరువాత 2013 లో మా ఇ-బుక్ ప్రాజెక్ట్ పుట్టింది, ఉర్దూ ఆర్కైవ్ లేకపోవడం కొరతగా అందరికీ అనిపిస్తుంది. అప్పుడు మేము ఆ  అడ్డంకిని అధిగమించడానికి ఒక ప్రయత్నాన్ని ప్రారంభించాము. భారతదేశం అంతటా మరియు ముఖ్య నగరాలు  ఉదా:డిల్లి,లక్నో, రాంపూర్, భోపాల్, అలహాబాద్, హైదరాబాద్, ఆలీగర్, పాట్నా మరియు ఇతర నగరాల లో గల ప్రభుత్వ మరియు ప్రైవేటు వనరులకు ఆశ్రయిoచాము. " అని పోర్టల్ వ్యవస్థాపకుడు, నోయిడాకు చెందిన పారిశ్రామికవేత్త సంజీవ్ సరఫ్ అన్నారు.

ఆర్కైవ్ చేయకపోతే, గొప్ప భాష చనిపోయేది. ఉర్దూ యొక్క గొప్ప వారసత్వాన్ని మన భవిష్యత్ తరాలు  కోల్పోతుంది" అని సారాఫ్ తెలిపారు.

90,000 ఇ-పుస్తకాలు - 19 మిలియన్ పేజీలు - పిల్లల సాహిత్యం, నిషేధిత పుస్తకాలు, డైరీలు మరియు అనువాదాలతో సహా విభిన్న వర్గాలుగా వర్గీకరించబడ్డాయి మరియు విద్యార్థులు మరియు పండితులు, పరిశోధకులు, సాహిత్యవేత్తలు మరియు భాష ప్రేమికులు ఎప్పుడైనా మరియు ప్రపంచం లోని ఎక్కడి నుండైనా యాక్సెస్ చేయవచ్చు.

"ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠకులకు డిజిటలైజ్ చేయగలిగే మరియు అందుబాటులోకి తెచ్చే మరిన్ని పుస్తకాల కోసం మేము లైబ్రరీలను మరియు ప్రైవేట్ సేకరణలను వేదుకుతున్నాము. అరుదైన మరియు అవుట్ అఫ్ ప్రింట్ పుస్తకాలు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ గ్రంథాలయాలలో నిల్వ చేయబడి ప్రజలకు పూర్తిగా అందుబాటులో లేని కారణంగా అవి చెదలు,నీరు మరియు అగ్ని నష్టం కారణంగా నష్టం అయ్యే  మరియు విధ్వంసానికి గురయ్యే అవకాశం ఉంది "అని సారాఫ్ వివరించారు.

రేఖతా నిర్వహించిన క్యాంప్స్  ద్వారా చాలా పుస్తకాలు భద్రపరచబడ్డాయి. అనేక ప్రచురణ సంస్థలు మరియు ప్రైవేట్ పార్టీలు ఇష్టపూర్వకంగా శతాబ్దాల నాటి ఉర్దూ పుస్తకాలను విరాళంగా ఇచ్చాయి. ఆసియా యొక్క పురాతన ముద్రణ మరియు ప్రచురణ సంస్థ లక్నో లోని  నావల్ కిషోర్ ప్రెస్, 1858 లో స్థాపించబడింది- ఒక ప్రధాన సహకారి. వీరు మహాభారతం మరియు ఖురాన్ అనువాదాలు మరియు 17 వ శతాబ్దం నుండి ప్రారంభమైన అరుదైన మాన్యుస్క్రిప్ట్‌లను కలిగి ఉన్న సుమారు 2,000 పుస్తకాలను అందించారు.

" చాలా గ్రంథాలు నిర్లక్ష్యం మరియు సరిగా నిర్వహించకపోవడం వల్ల చిరిగిపోయాయి. రేఖ్తా అటువంటి గ్రంథాలన్నింటినీ సమీకరించి, ఆ తరువాత పునర్ముద్రణ, తిరిగి రంగులు వేయడం మరియు పాఠకుల వినియోగం కోసం పునర్నిర్మించారు" అని సారాఫ్ చెప్పారు.

" హిందీ పాఠకుల కోసం అందుబాటులో ఉన్న హిందీ పాఠాలు మరియు స్క్రిప్ట్‌ల డిజిటలైజేషన్ ఆర్కైవల్ ప్రారంభమైంది. పాశ్చాత్య పండితులు మరియు ప్రొఫెసర్లు వారి అధ్యయనాలలో రేఖతా యొక్క ఇ- లైబ్రరీ ని ఉపయోగించుకోవడంతో ఉర్దూ సాహిత్యాన్ని కొత్త జీవం ఇచ్చే ప్రయత్నంలో ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా నడుస్తోంది., "సారాఫ్ అన్నారు.

ఈ ప్రాజెక్టుకు తమ సహాయ సహకారాలు అందించిన  సంస్థలు: ఇదారా-ఇ-అదాబియాట్-ఇ-ఉర్దూ (హైదరాబాద్) Idara-E-Adabiyat-E-Urdu (Hyderabad), అలహాబాద్ విశ్వవిద్యాలయం, గాలిబ్ అకాడమీ, గాలిబ్ ఇన్స్టిట్యూట్, జామియా హమ్‌దార్డ్ (ముగ్గురూ న్యూ డిల్లి నుండి), ప్రభుత్వ ఉర్దూ లైబ్రరీ (పాట్నా), ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి ఉర్దూ, అరబి-ఫార్సీ విశ్వవిద్యాలయం (లక్నో), సౌలత్ Saulat పబ్లిక్ లైబ్రరీ (రాంపూర్), దారుల్ ముసాన్నెఫిన్ షిబ్లి అకాడమీ (అజమ్‌గర్) Darul Musannefin Shibli Academy (Azamgarh) మరియు రాంపూర్ రాజా లైబ్రరీ (రాంపూర్).


No comments:

Post a Comment