| Photo Credit:మజిజియా భాను
25సంవత్సరాల కోజికోడ్‌కు చెందిన మజిజియా భాను తన క్రీడా జీవితం లో అనేక పతకాలు సాధించినది.గత
ఏడాది కొచ్చిలో జరిగిన మిస్టర్ కేరళ పోటీలో మహిళల విభాగంలో హిజాబ్ ధరించిన కేరళకు చెందిన పవర్ లిఫ్టర్
మాజిజియా భాను విజేతగా నిలిచినది. ఒక సనాతన కుటుంబానికి చెందిన 25
ఏళ్ల డెంటల్ డాక్టర్ అయిన మజిజియా తన క్రీడా జీవితం లో అనేక విజయాలు సాధించినది.
అనేక ప్రతికూల మరియు అప్రియమైన
వ్యాఖ్యలను హిజాబ్ ధరించిన ఆమె
ఆత్మవిశ్వాసం తో ఎదుర్కొని వచ్చే నెలలో
మాస్కోలో జరగనున్న వరల్డ్ పవర్ లిఫ్టింగ్ పోటిలలో 56 కిలోల వెయిట్ క్లాస్‌లో పోటీ చేయడానికి
సన్నాహాలతో మజిజియా బిజీగా ఉన్నారు.
ఆమె చిన్న వయస్సు నుండే
క్రీడలపై ఆసక్తిని కనబరిచింది, కళాశాల రెండవ సంవత్సరంలో బాక్సింగ్, అథ్లెటిక్స్ మరియు
ట్రాక్ ఈవెంట్స్‌లో పాల్గొంది, సెరెనా విలియమ్స్ మరియు మేరీ కోమ్ వంటి క్రీడాకారుల విజయాల
నుండి నేను ప్రేరణ పొందాను. డెంటల్ సర్జన్
అయిన మజిజియా క్రమంగా పవర్-లిఫ్టింగ్ పట్ల ఆసక్తిని పెంచుకోంది.
ఆమె సాధించిన పతకాలు:
·
2017 లో జమ్మూ
కాశ్మీర్‌లో జరిగిన నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజతం
·
2017 లో ఇండోనేషియాలో
ఆసియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజతం
·
2018 లో నేషనల్
ఆర్మ్-రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం
ఆమె ఆర్మ్-రెజ్లింగ్ లో కూడా
ప్రావీణ్యత సాధించినది. మజీజియా గత ఏడాది
టర్కీలో జరిగిన ప్రపంచ ఆర్మ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం
వహించారు. కాని ఆమెకు పవర్-లిఫ్టింగ్ పట్ల
ఆసక్తి ఎక్కువ.
పవర్ లిఫ్టింగ్ పోటీలలో
హిజాబ్ ధరించడంపై ఆమెకు అడ్డంకులు ఎదురైనప్పటికీ, వాటిని అధిగమించినది. కొంతకాలం ఆమె బాడీబిల్డింగ్
కూడా చేసినది. బాడి బిల్డింగ్ అనేది పోటీదారుల ఫిట్‌నెస్ పోటి కాని స్కిన్ షో కాదు, ”అని ఆమె అభిప్రాయపడినది.
ఒకరి ఫిట్‌నెస్ స్థాయిలలో
జన్యుశాస్త్రం ప్రధాన పాత్ర పోషిస్తుందని మాజిజియా అభిప్రాయపడ్డారు.ఆమె పోటీలకు సిద్ధమవుతున్నప్పుడు ప్రోటీన్ అధికంగా, పోషకమైన ఆహారం
తిసుకొంటది.
రంజాన్ మాసంలో ఉపవాసం
పాటించినప్పుడు మాజిజియా తన ఫిట్‌నెస్ లక్ష్యాలకు ఆటంకం లేదని చెప్పారు. ఉపవాసం నా
శరీరాన్ని నిర్విషీకరణ detoxify చేయడానికి మరియు నా మనస్సును శుద్ధి చేయటానికి
సహాయపడుతుంది అoటారు.
మాజిజియా ప్రోత్సహించడంలో
ఆమె కుటుంబం చాలా సహాయకారిగా ఉంది. ఆమె తల్లి
"మద్దతు యొక్క అతిపెద్ద స్తంభం" గా మాజిజియా అభివర్ణించింది.
పవర్ లిఫ్టింగ్‌పై దృష్టి
సారించినప్పటికీ, వెయిట్ లిఫ్టింగ్‌లో
ఒలింపిక్ పతకం సాధించాలన్నది తన కల అని మాజిజియా అన్నారు.
No comments:
Post a Comment