ఇస్లామిక్ స్వర్ణయుగం, ముస్లిం భౌగోళక ప్రయాణాలు, అన్వేషణలు మరియు భౌగోళిక సాహిత్యంతో నిండి తరువాత కాలం లో క్రైస్తవ
పశ్చిమ అన్వేషణలు మరియు ఆవిష్కరణలకు మార్గం సుగమం చేసింది
అబుల్ హసన్ అలీ ఇబ్న్ హుస్సేన్ ఇబ్న్ అలీ అల్ మసూది ప్రారంభ ఇస్లామిక్ స్వర్ణ
యుగ చరిత్రకారుడు మరియు భూగోళ శాస్త్రవేత్త, అల్ మసూది ప్రవక్త ముహమ్మద్ (స) యొక్క సహచరుడు అబ్దుల్లా ఇబ్న్ మసూద్
వంశస్థుడు. అతను ఖలీఫా అల్ ముతాదిద్ Al Mu’tadid (క్రీ.శ 892-904) పాలనలో బాగ్దాద్‌లో పుట్టి చదువుకున్నాడు. తొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో, ఇస్లామిక్ ప్రపంచం స్పెయిన్ నుండి భారతదేశ సరిహద్దుల వరకు విస్తరించింది.
అబుల్ హసన్ అలీ ఇబ్న్ అల్-హుస్సేన్ అల్-మసూడీ ఇస్లామిక్ ప్రపంచంలో బహుముఖ
ప్రజ్ఞాశాలి. అల్-మసూది తూర్పు యొక్క ప్రసిద్ధ రచయిత మరియు అన్వేషకుడు. అల్ మసూది ఇరవై సంవత్సరాల యువకుడు గా ఉన్నప్పుడు మొదట పర్షియాకు వెళ్ళాడు. మరుసటి
సంవత్సరం బాగ్దాద్కు తిరిగి వచ్చిన అతను మన్సురా మరియు ముల్తాన్ (నేటి పాకిస్తాన్)
కు వెళ్ళాడు.
మన్సురా సింధ్ ప్రావిన్స్ యొక్క రాజధాని. సంపన్న ప్రాంతం. మన్సురా నుండి అల్
మసూది గుజరాత్ లోని సూరత్ వెళ్ళారు. ఇక్కడ అతనికి హిందూ నాగరికతతో
మొట్టమొదటిసారిగా పరిచయం ఏర్పడినది.ఆర్యభట్ట రచనలు ఇస్లామిక్ ఖగోళ శాస్త్రానికి పరిచయం అయ్యాయి.
అల్ మసూది మరింత దక్షిణం వైపు ప్రయాణించి, భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో ఉన్న మలబార్‌లోకి దిగి, శ్రీలంకను సందర్శించి, అక్కడి నుండి ఇండోనేషియాలోని సుమత్రా మరియు ఆధునిక
మలేషియాలోని మలక్కాకు ప్రయాణించారు.
మలాకా జలసంధి హిందూ మహాసముద్రం నుండి దక్షిణ చైనా సముద్రం వరకు ఓడలకు మార్గంగా
ఉంది. భారతదేశం యొక్క తూర్పు సముద్ర తీరం మరియు మలక్కా మధ్య చురుకైన వ్యాపారం జరిగింది.
ఇక్కడి నుండి అల్ మసూది ఉత్తరాన కాంటోనిన్ చైనాకు వెళ్లారు.
అక్కడినుండి అల్ మసుడి దక్షిణాన మడగాస్కర్ ద్వీపానికి మరియు ఆఫ్రికా యొక్క
తూర్పు సముద్ర తీరానికి వెళ్ళాడు. మడగాస్కర్, జాంజిబార్, ఒమన్లను దర్శించి అతను 922 లో బస్రాకు తిరిగి వచ్చాడు మరియు తన మొట్టమొదటి చారిత్రక సంకలనం “మురుజ్-అల్-జహాబ్
వా అల్-మా-ఆదిన్ అల్-జవహీర్” (మెడోస్ ఆఫ్ గోల్డ్ మరియు గనుల విలువైన రాళ్ళు)
రాశాడు.దీనిలో అతను సందర్శించిన
భూముల వివరాలు, భౌగోళికత మరియు జీవావరణ శాస్త్రాన్ని మనోహరంగా వివరించాడు.
తరువాత అల్ మసూది కాస్పియన్ సముద్రం యొక్క దక్షిణ తీరాన్ని కూడా
సందర్శించి మధ్య ఆసియా మరియు తుర్కిస్తాన్ గుండా ప్రయాణించారు మొదట డమాస్కస్
(సిరియా) కు తరువాత
ఈజిప్టులోని ఫస్ట్రాట్ (కైరో) కు వెళ్ళాడు. ఇక్కడ, అతను తన రెండవ వాల్యూమ్ మురుజ్ అల్ జమాన్ Muruj al Zaman, ను ముప్పై
సంపుటాలలో రాశాడు. ఈ కళాఖండంలో, అతను సందర్శించిన ప్రజల సంస్కృతులు, మతపరమైన పద్ధతులు
మరియు ఆచారాలను నమోదు చేసాడు మరియు వారి నాగరికతలపై పరిశీలనలు చేసాడు. తన రచనలను
అనుభావిక పరిశీలన మరియు ప్రేరక విజ్ఞాన శాస్త్రంపై ఆధారపడి రచించిన మొదటి చరిత్రకారుడు.
ఆధునిక చరిత్ర చరిత్ర
పితామహుడు మరియు గొప్ప చరిత్రకారుడు ఇబ్న్ ఖల్దున్ కు పూర్వగామి గా పిలువబడినాడు. క్రీ.శ 955 లో, అతను కితాబ్ అల్-అవ్సాత్ Kitab al-Awsat రాశాడు, దీనిలో పురాతన
కాలం నుండి క్రీ.శ 955 సంవత్సరం వరకు జరిగిన
చారిత్రక సంఘటనలను కాలక్రమానుసారం జాబితా చేశాడు. పురాణాలు, ఇతిహాసాలు మరియు
వినికిడి నుండి చారిత్రక సంఘటనలను క్రమబద్ధీకరించడానికి ఇది మొదటి పండిత ప్రయత్నం.
అతని చివరి రచన, కితాబ్
అల్-తన్బీహ్ అల్ అల్-ఇష్రాఫ్ Kitab al-Tanbih wa
al-Ishraf, క్రీ.శ 947 లో వ్రాయబడినది. ఇది అతని మునుపటి
రచనల సారాంశాన్ని అందిస్తుంది.
అతను 303 A.H లో గుజరాత్‌లో
పర్యటించాడు. అతని ప్రకారం, చెమూర్ (గుజరాత్ నౌకాశ్రయం) లో 10 వేలకు పైగా
అరబ్బులు మరియు వారి సంతతి నివసించారు.
అల్ మసూదిని అరబ్బుల
హెరోడోటస్ అని పిలుస్తారు. అల్ మసూదికి వెయ్యి సంవత్సరాలకు ముందు ఉన్న హెరోడోటస్
మొదటి ర్యాంక్ చరిత్రకారుడు;. అతని గొప్ప రచన “చరిత్రలు the histories” పురాణాలు, కథలు, అభిప్రాయాలు మరియు కొన్ని వాస్తవాల సమ్మేళనం.
తన పుస్తకాలకు సంబంధించిన వస్తువులను సేకరించడానికి బాబిలోన్, పర్షియా మరియు
ఈజిప్టుకు ఆయన చేసిన ప్రయాణాలు వివాదాస్పదంగా ఉన్నాయి.
అల్ మసూది యొక్క
పరిశీలనలు భౌగోళికం, ఎథ్నోగ్రఫీ, ఎకాలజీ, ఆంత్రోపాలజీ మరియు
చారిత్రక వాస్తవాలలో ఉన్నాయి. పర్షియా, ఇండియా, తూర్పు ఆఫ్రికా మరియు చైనా దేశాలకు ఆయన చేసిన ప్రయాణాలు వాస్తవాలు.ఎంపిరికల్
హిస్తారోగ్రఫి కనుగొన్న వాడు inventor of empirical historiography.అల్ మసూది.
అల్ మసూది అప్పటి తెలిసిన
ప్రపంచ పటాన్ని తయారుచేసినాడు. ఇది మునుపటి పటాలపై గణనీయమైన పురోగతిని
సూచిస్తుంది. ఇది ఒక పెద్ద భూభాగం ను అల్ మసూడి "చీకటి మరియు పొగమంచు
సముద్రం" దాటి తెలియని భూభాగంగా గుర్తించినాడు. ఆ ల్యాండ్ మాస్ దక్షిణ అమెరికా ఖండం యొక్క ఆకృతిని సూచిస్తుంది.
889 వ సంవత్సరంలో ఒక ముస్లిం నావికుడు ఇబ్న్
అస్వాద్ చీకటి మరియు పొగమంచు సముద్రం గుండా ప్రయాణించి బంగారు మరియు వెండి సంపదతో
తిరిగి వచ్చాడని అల్ మసూడి “ది మెడోస్ ఆఫ్ గోల్డ్ అండ్ క్వారీస్ ఆఫ్ జ్యువెల్స్”లో
రాశాడు. మ్యాప్ మరియు వివరణ అమెరికా అరబ్బులు మరియు ఆఫ్రికన్లకు తెలిసిందనే ఊహాగానాలకు
దారితీసింది.
అల్ మసుడి నిష్ణాతుడైన
భూవిజ్ఞాన శాస్త్రవేత్త మరియు ఖనిజ శాస్త్రవేత్త. అతను భూకంపాలను అధ్యయనం చేశాడు
మరియు అతని ఒక గ్రంథంలో 855
CEనాటి భూకంపాన్ని విశ్లేషించాడు. అతను ఖనిజాల నుండి
మొక్కలు, మొక్కల నుండి జంతువులు,
జంతువులనుండి మనిషి ఆవిర్భవించిన పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ పనిలో
అతను చార్లెస్ డార్విన్‌కన్నా తొమ్మిది
వందల సంవత్సరాలు ముందు ఉన్నాడు.
సాంఘిక మరియు చారిత్రక శాస్త్రాలలో
అనుభావిక పద్ధతి empirical method ని స్థాపించిన ఈ
గొప్ప పండితుడు క్రీ.శ 957
లో కన్నుమూశారు.
No comments:
Post a Comment