ఇబ్న్
యూనుస్950 - 1009 జన్మించినాడు.
అతను గౌరవనీయమైన కుటుంబం నుండి వచ్చాడు ఇతను ఈజిప్టు ముస్లిం మరియు గణిత
శాస్త్రజ్ఞుడు. ఇబ్న్ యూనుస్ ఖచ్చితమైన సమయ
కొలతలకు ప్రసిద్ది గాంచినాడు.
ఇబ్న్
యూనుస్ పూర్తి పేరు అబూల్-హసన్ అలీ ఇబ్న్ అబ్దుల్-రహమాన్ ఇబ్న్ అహ్మద్ ఇబ్న్
యూనుస్ అల్-సదాఫీ అల్-మిస్రి. అతని ముత్తాతను యూనస్ అని పిలుస్తారు అతని ముత్తాత ప్రముఖ న్యాయ విద్వాంసుడు ఇమామ్ షఫీకి
సహచరుడు.
అతని
తాత అహ్మద్ మరియు అతని తండ్రి అబ్దుల్ రెహ్మాన్. ఇబ్న్ యూనుస్ ది పండితుల కుటుంబం, అతని
తండ్రి అబ్దుల్ రెహమాన్ ప్రసిద్ధ చరిత్రకారుడు, జీవిత చరిత్ర రచయిత మరియు హదీసు
పండితుడు. ఇతడు ఈజిప్ట్ చరిత్ర గురించి రెండు సంపుటాలు రాశాడు-ఒకటి ఈజిప్షియన్ల
గురించి మరియు మరొకటి ఈజిప్టుపై యాత్రికుల వ్యాఖ్యానం.
ఫాతిమిడ్
ఖలీఫాలు 10 వ
శతాబ్దం మొదటి భాగంలో ఉత్తర ఆఫ్రికా మరియు సిసిలీని పరిపాలించారు, 969 లో నైలు లోయను జయించి ఈజిప్ట్ దేశంలోకి ప్రవేశించారు. వారు
తమ కొత్త సామ్రాజ్యానికి రాజధానిగా కైరో నగరాన్ని స్థాపించారు.
ఇబ్న్ యూనస్ ఫాతిమిడ్ ఖలిఫాలతో సన్నిహితంగా సంబంధం కలిగి ఉన్నాడు. కైరోలోఅతను ఫాతిమిడ్ రాజవంశానికి ఖగోళ శాస్త్రవేత్తగా ఇరవై ఆరు సంవత్సరాలు పనిచేశాడు.ఇబ్న్ యూనస్ గణిత శాస్త్రవేత్త మరియు ఒక కవి. మొదట ఖలీఫా అల్-అజీజ్ మరియు తరువాత ఖలీఫా అల్-హకీమ్ కోసం పనిచేసాడు.
977AD ఖలీఫా అల్-అజీజ్ కాలంలో ఇబ్న్ యూనస్ ఖగోళ పరిశీలనలు చేయడం ప్రారంభించాడు.
ఇబ్న్ యూనస్ కు ఖలీఫా అల్-అజీజ్ ఖగోళ పరిశోదనకు కావలసిన పరికరాలు అందించాడు.
ఇబ్న్ యూనస్ ఒక జ్యోతిష్కుడు అతడు తన ఖగోళ పరిశీలనలకు ప్రసిద్ధి చెందినాడు. అతను అనేక త్రికోణమితి మరియు ఖగోళ పట్టికలను రుపొందిoచి నాడు. ఇబ్న్ యూనస్ ఖగోళ పరిశోధనలకు ఖలీఫా మద్దత్తు ఇచ్చినాడు.
ఖలీఫా అల్-అజీజ్
996 లో
మరణించాడు. అతని తరువాత అతని కుమారుడు అల్-హకీమ్ ఖలీఫా అయ్యాడు ఇబ్న్ యూనస్ తన ఖగోళ పరిశీలనలలో ఖగోళ పట్టికలను
తయారు చేయడంలో ప్రొఫెషనల్ కాలిక్యులేటర్లు వాడాడు.
అల్-హకీమ్ జ్యోతిషశాస్త్ర అంచనాలను రూపొందించడానికి గణనీయమైన సమయాన్ని కేటాయించినట్లుగా తెలుస్తుంది.ఇబ్న్ యూనస్ అల్-హకీమ్ ఇంటి నుండి శుక్రుడిని గమనించాడని మనకు తెలుస్తుంది.
ఇబ్న్
యూనుస్ జ్యోతిషశాస్త్రంలో, అంచనాలు
తయారుచేసినాడు మరియు “కితాబ్ బుల్లగ్
అల్-ఉమ్నియా ("ఆన్ ది అటైన్మెంట్ ఆఫ్ డిజైర్"("On
the Attainment of Desire")
అను గ్రంధంను రచించినాడు. ఇది
సిరియస్ నక్షత్రం యొక్క హెలియాల్ రైసింగ్heliacal risings of Siriusలకు సంబంధించిన రచన మరియు కాప్టిక్ సంవత్సరం వారంలో ఏ రోజు ప్రారంభమవుతుందనే
దానిపై అంచనాలు ఉన్నాయి.
ఇబ్న్
యూనుస్ యొక్క ప్రధాన రచన, “అల్-జిజ్
అల్-హకీమి అల్-కబీర్ al-Zij al-Hakimi al-kabir.” ‘అల్-కబీర్’ అంటే ‘పెద్దది’ ఇది ఖగోళ పట్టికల హ్యాండ్‌బుక్. ఇందులో చాలా ఖచ్చితమైన పరిశీలనలు ఉన్నాయి. ఇబ్న్ యూనస్ తన ఈ గ్రంధమును ఖలీఫా అల్-హకీమ్‌కు అంకితం ఇచ్చాడు. ఈ పుస్తకం లో
81
అధ్యాయాలు ఉన్నాయి. యూనస్ చేసిన పరిశీలనల జాబితాలు మరియు అతని పూర్వీకులు చేసిన
పరిశీలనలు కూడా ఉన్నాయి. గణిత చిహ్నాలు లేకుండా యూనస్ తన జిజ్‌లో పరిష్కారాలను చూపాడు.
ఇబ్న్
యూనస్ 40
గ్రహ సంయోగాలు మరియు 30
చంద్ర గ్రహణాలను వివరించాడు. ఉదాహరణకు, అతను 1000 సంవత్సరంలో సంభవించిన గ్రహ సంయోగాన్ని ఖచ్చితంగా
వివరించాడు:
993 మరియు
1004 యొక్క
సూర్యగ్రహణాలతో పాటు 1001 మరియు
1002 యొక్క
చంద్ర గ్రహణాల
గురించి ఇబ్న్ యూనస్ రికార్డు చేసినాడు.
గ్రహాల
స్థానాల గురించి ఇబ్న్ యూనస్ వర్ణన సరిగ్గా ఉందని మరియు అతను డిగ్రీలో మూడింట ఒక
వంతు దూరం లెక్కించడం ఖచ్చితంగా సరైనదని ఆధునిక పరిశోధనలు తెల్పుతున్నాయి. అతను
చంద్రుని గ్రహణాలను కూడా ఖచ్చితంగా వివరించాడు
హకీమి
జిజ్ యొక్క మొదటి అధ్యాయం ముస్లిం, కోప్టిక్, సిరియన్ మరియు పెర్షియన్ క్యాలెండర్లకు క్యాలెండర్
పట్టికలను వివరిస్తుంది.
ఈ క్యాలెండర్ల మధ్య తేదీలను మార్చడానికి ఇబ్న్ యూనస్
పట్టికలు ఇస్తాడు. ఈస్టర్ తేదీని లెక్కించడానికి పట్టికలు కూడా ఇవ్వబడ్డాయి.
త్రికోణమితి విధులు Trigonometric functions కోణాల angles కంటే
ఆర్క్లు arcs గా
ఇవ్వబడతాయి. గోళాకార త్రికోణమితి Spherical trigonometry ఈ పనిలో ఉన్నత స్థాయికి
చేరుకుంటుంది.
No comments:
Post a Comment