జనవరి 26, 1950 న, అనేక చర్చలు, పరిశీలనల తరువాత లౌకికవాదం, సోషలిజం మరియు ప్రజాస్వామ్య విలువలతో కూడిన నూతన రాజ్యాంగాన్ని భారతదేశం రూపొందించుకొని
ఆమోదిoచుకొన్నది. రాజ్యాంగ ప్రస్తావన లేదా అవతారిక (Preamble the Constitution) ఈ విషయాన్నీ ప్రతిబింబిస్తుంది. దేశం యొక్క సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ చట్రాన్ని నిర్మించటానికి
కావలసిన ప్రాథమిక మార్గదర్శకాలను అవతారిక/ప్రస్తావన
నిర్దేశించింది. రాజ్యాంగం దాని అధికారం "భారత ప్రజల నుంచి
పొందినది.
ఈ రాజ్యాంగం మరియు దానిలో పొందుపరచబడిన విలువలు సుదీర్ఘ పోరాటం మరియు అనేక త్యాగాల తరువాత స్వేచ్ఛను సాధించిన భారత దేశ ప్రజల దీర్ఘకాల ఆకాంక్షలను నెరవేర్చడానికి మొదటి అడుగు. భారతదేశం ఎలాంటి దేశంగా ఉండాలో నిర్ణయించే అత్యున్నత అధికారం ఈ దేశ ప్రజలకు కలదు
భారత రాజ్యాంగం భారతదేశాన్ని "సర్వసత్తాక,ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం " గా ప్రకటించింది. ‘లౌకిక’, ‘సామ్యవాద ’ అనే పదాలు 1976 లో 42 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ
ప్రస్తావన లో పొండుపరిచినారు. లౌకిక అనేపదం 1976 లో 42వ రాజ్యాంగ
సవరణ ద్వారా ప్రస్తావనలో పొందుపరచబడినప్పటికీ, లౌకికవాదం రాజ్యాంగం ప్రారంభమైనప్పటి నుండి దాని అంతర్భాగంగా ఉంది. లౌకికవాదం
రాజ్యంగ విభిన్న విభాగాలు మరియు ప్రాథమిక హక్కులలో క్రింద పొందుపరచబడింది. ఇది “న్యాయం” (సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ), “సమానత్వం” (భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14-18), “లిబర్టీ” (ఆలోచన, వ్యక్తీకరణ, నమ్మకం, విశ్వాసం) మరియు ఆరాధన: 19-22 & 25-30) మరియు “సోదరభావం” ( ఆర్టికల్ 23 & 24) తెలుపుతుంది.
ఈ విలువలను సమర్థించడం భారతదేశాన్ని పురోగతి మరియు అభివృద్ధి మార్గంలో ఉంచడానికి ఉన్న ఏకైక మార్గం. భారతదేశంలో ఉన్న సాంఘిక, సాంస్కృతిక, భాషా, జాతి, మతపరమైన వైవిధ్యం ను సంరక్షించాల్సిన అవసరం ఉంది.
వైవిద్యం తో కూడిన ఏకత్వం అనేది భారతదేశ ప్రత్యేకమైన లక్షణం.
రాజ్యంగ ప్రస్తావన/అవతారిక
అనేది రాజ్యాంగంలో అంతర్భాగం. దానిని
మార్చలేమని సుప్రీం కోర్ట్ అనేక రాజ్యంగ వివాదాలలో స్పష్టం చేసినది. యూనియన్
గవర్నమెంట్ v / s LIC వివాదం లో నొక్కి చెప్పింది.
గోలక్నాథ్/ v s పంజాబ్ రాష్ట్రం, 1967 మరియు కేశవ్నంద్ భారతి v / s కేరళ రాష్ట్రం, 1973. కేసులలో రాజ్యాంగ
మూల సూత్రాలకు(Basic Structure) భంగం కలిగే విధం గా పార్లమెంట్ రాజ్యాంగ సవరణలు
చేయలేదని స్పష్టం చేసినది.
మొదటిదానిలో, రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కులను పార్లమెంటు తగ్గించలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది,మరియు రెండవ దాంట్లో
రాజ్యాంగ మూలసుత్రాలకు పార్లమేంట్ భంగం కలిగించలేదని స్పష్టం చేసినది.
ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించడానికి మరియు చట్టాలు చేయడానికి పార్లమెంటుకు "విస్తృత" అధికారాలు ఉన్నప్పటికీ, ఫెడరలిజం, ప్రాథమిక హక్కులు, లౌకికవాదం, స్వతంత్ర న్యాయవ్యవస్థ మరియు పార్లమెంటరీ వ్యవస్థ మొదలైన రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలను లేదా ప్రాథమిక లక్షణాలను సవరించే అధికారం
పార్లమెంట్ కు లేదని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది.
ఈ విషయంలో మరో మైలురాయి తీర్పు ఎస్. ఆర్. బొమ్మాయి v/s యూనియన్ ఆఫ్ ఇండియా కేసు.
భారతదేశ రాజ్యాంగంలోని ప్రాథమిక లక్షణాలలో సెక్యులరిజం ఒకటి అని న్యాయస్థానం అభిప్రాయపడింది, ఏ మతానికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా
ప్రవర్తించే హక్కు రాజ్యానికి లేదని సూచిస్తుంది.
భారత సుప్రీంకోర్టు, ఎల్లప్పుడూ భారత
దేశ లౌకిక స్వభావాన్ని కాపాడినది. మన రాజ్యాంగంలోని సూత్రాలు మరియు పవిత్రతను మనం కాపాడాలి. భారత ప్రజలమైన
మేము ఈ రాజ్యాంగాన్ని మనకు మనం సమర్పించుకొంటున్నాము.
రాజ్యాంగ ఆదర్శాలను మరియు రాజ్యాంగ సంస్థలను గౌరవించడం మరియు వాటి ఆత్మను కాపాడటం మన కర్తవ్యం మరియు మన బాధ్యత,.
No comments:
Post a Comment