ముగ్గురు సోదరులు అబూ జాఫర్ ముహమ్మద్ ఇబ్న్ ముసా ఇబ్న్ షాకిర్(803 -
873),అబూ అల్-ఖాసిం అహ్మద్ ఇబ్న్
మూసా ఇబ్న్ షాకిర్( 9 వ శతాబ్దం) మరియు అల్-హసన్ ఇబ్న్ ముసా ఇబ్న్ షాకిర్( 9వ
శతాబ్దం) లను బను ముసా సోదరులు లేదా ముసా కుమారులు అని కూడా
అంటారు. వీరు ముగ్గురు బాగ్దాద్‌లో నివసించిన మరియు పనిచేసిన 9వ
శతాబ్దపు పెర్షియన్ పండితులు. వారు తరచూ కలిసి
పనిచేసినప్పటికీ, ఎవరికీ వారు వారి స్వంత నైపుణ్యం ఉన్న ప్రాంతాలు కలిగి
ఉన్నారు.
బను మూసా సోదరులు ముసా ఇబ్న్ షాకిర్ యొక్క
కుమారులు, అతను హైవే మాన్ మరియు తరువాత ఖలీఫా అల్-మామున్ ఆస్థానం లో జ్యోతిష్కుడు /ఖగోళ
శాస్త్రవేత్త. మరణించినప్పుడు, అతను తన కుమారులను ఖలీఫా సంరక్షణ లో ఉంచాడు, అతను వారిని బాగ్దాద్ మాజీ గవర్నర్ ఇషాక్ బిన్ ఇబ్రహీం అల్ ముస్యాబీకి
అప్పగించాడు. ముగ్గురు సోదరులు తమ విద్యను
బాగ్దాద్‌లోని ప్రసిద్ధ హౌస్ ఆఫ్ విజ్డమ్ లైబ్రరీ మరియు అనువాద కేంద్రంలో పనిచేసిన
యాహ్యా బిన్ అబూ మన్సూర్ వద్ద పొందారు.
యాహ్యా ఇబ్న్ అబీ మన్సూర్ ఆధ్వర్యంలో
హౌస్ ఆఫ్ విజ్డమ్‌లో అధ్యయనం చేస్తూ, బైజాంటైన్ల నుండి గ్రీకు
గ్రంథాలను పంపడం, వాటి
అనువాదానికి పెద్ద మొత్తాలను చెల్లించడం మరియు గ్రీకు భాష నేర్చుకోవడం ద్వారా
పురాతన గ్రీకు రచనలను అరబిక్‌లోకి అనువదించే ప్రయత్నాలలో వారు పాల్గొన్నారు.
ఇటువంటి పర్యటనలలో, అబూ జాఫర్ ముహమ్మద్ ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు మరియు అనువాదకుడు
థాబిట్ ఇబ్న్ ఖుర్రాను కలుసుకున్నాడు మరియు అతనిని హౌస్ ఆఫ్ విజ్డమ్‌లో నియమించుకున్నాడు. హునాయిన్
ఇబ్న్ ఇషాక్ కూడా వారి జట్టులో భాగం. సోదరులు చాలా మంది శాస్త్రవేత్తలు మరియు
అనువాదకులను స్పాన్సర్ చేశారు, వారికి నెలకు 500 దినార్లు చెల్లించారు. సోదరుల
ప్రయత్నాల పలితంగా అనేక అనువదించిన అనేక గ్రీకు గ్రంథాలు నిలిచినవి.
అల్-మమున్ మరణం తరువాత, బాను మూసా సోదరులు ఖలీఫాలు
అల్-ముతాసిమ్, అల్-వాతిక్ మరియు అల్-ముతావాకిల్
కింద పని కొనసాగించారు. అల్-వాతిక్ మరియు అల్-ముతావాకిల్
పాలనలో హౌస్ ఆఫ్ విజ్డమ్‌లోని పండితుల
మధ్య అంతర్గత శత్రుత్వాలు తలెత్తాయి. ఒక సమయంలో బాను మూసా సోదరులు అల్-కిండికి శత్రువులు అయ్యారు మరియు
అల్-ముతావాకిల్ చేత హింసకు గురి అయ్యారు. తరువాత వారు అల్-ముతావాకిల్ చేత కొత్త
నగరమైన అల్-జఫారియాకు కాలువను నిర్మించారు.
బను మూసా సోదరులు అనేక ఆటోమాటా (ఆటోమేటిక్ మెషీన్లు) మరియు మెకానికల్
పరికరాలను నిర్మించారు, మరియు వారు అలాంటి వంద పరికరాలను తమ “బుక్ ఆఫ్
ఇంజినియస్ డివైజెస్”లో వివరించారు.
జ్యామితిపై
పునాది రచన అయిన “బుక్ ఆన్ ది మెజర్మెంట్ ఆఫ్ ప్లేన్ మరియు గోళాకార గణాంకాలు the
Measurement of Plane and Spherical Figures” అనేది వారి మరో ముఖ్యమైన రచన. అది ఇస్లామిక్
మరియు యూరోపియన్ గణిత శాస్త్రవేత్తలచే తరచుగా ఉదహరించబడినది
బను మూసా సోదరులు
బాగ్దాద్‌లో అబ్బాసిద్ ఖలీఫా అల్-మమున్
చేత స్థాపించబడిన ఖగోళ అబ్జర్వేటరీలలో పనిచేశారు , అలాగే హౌస్
ఆఫ్ విజ్డమ్‌లో పరిశోధన చేశారు. వారు డిగ్రీ యొక్క పొడవును నిర్ణయించడానికి
జియోడెసిక్geodesic కొలతలు
చేయడానికి 9వ
శతాబ్దపు అన్వేషక యాత్రలో పాల్గొన్నారు.
ముహమ్మద్ ఇబ్న్ మూసా ఖగోళ భౌతిక శాస్త్రం మరియు ఖగోళ మెకానిక్స్ astrophysics
and celestial mechanics యొక్క
మార్గదర్శకుడు. “బుక్ అఫ్ మోషన్స్ అఫ్ ఆర్బ్స్ Book on the motion of the
orbs” లో స్వర్గపు శరీరాలు మరియు ఖగోళ స్పియర్స్ భూమి యొక్క భౌతిక నియమాలకు లోబడి ఉన్నాయని కనుగొన్న మొదటి వ్యక్తి.
మెకానిక్స్ మరియు ఖగోళశాస్త్రంలో, ముహమ్మద్ ఇబ్న్ ముసా, తన “ఆస్ట్రల్ మోషన్ మరియు ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్”అనే
గ్రంధం లో స్వర్గపు శరీరాల heavenly bodies మధ్య ఆకర్షణ శక్తి ఉందని కనుగొన్నాడు, న్యూటన్ విశ్వవ్యాప్త గురుత్వాకర్షణ నియమాన్ని ఇది ముందే సూచిస్తుంది.
బాను మూసా సోదరుల ముఖ్యమైన గణిత రచనల గురించి అల్-దబ్బాగ్ ఇలా వ్రాశాడు: -గ్రీకు గణిత రచనలను
అధ్యయనం చేసిన మరియు అరబిక్ గణిత పాఠశాలకు పునాది వేసిన మొదటి అరబిక్ శాస్త్రవేత్తలలో బాను
మూసా సోదరులు కలరు. ఉన్నారు. వారిని గ్రీకు గణిత శిష్యులు అని పిలుస్తారు, అయినప్పటికీ వారు కొన్ని గణిత భావనల అభివృద్ధికి శాస్త్రీయ గ్రీకు గణిత పరిధి నుండి బయటకు వచ్చారు.
బాను మూసా సోదరులు రాసిన గ్రంథం “కితాబ్
మారిఫాట్ మసాఖత్ అల్-అష్కల్ Kitab marifat masakhat al-ashkal (ది బుక్ ఆఫ్ ది మెజర్మెంట్ ఆఫ్
ప్లేన్ మరియు గోళాకార గణాంకాలు(The Book of the Measurement of Plane and Spherical
Figures))”. బాను మూసా సోదరులు ఈ గ్రంధం లో వాల్యూమ్ మరియు ఏరియా నంబర్ విలువలను ఇచ్చారు. వారు
వాస్తవానికి భావనలను నిర్మించారు మరియు వారి స్వంత కొన్ని అసలు రచనలతో ముందుకు
వచ్చారు.. ఈ రచన లాటిన్లోకి క్రెమోనాకు
చెందిన గెరార్డ్ చే “లిబర్ ట్రయం ఫ్రటం డి
జ్యామెట్రియా Liber
trium fratum de geometria” పేరుతో అనువదించబడింది. ఆర్కిమెడిస్ రెండు గ్రంథాలలో ఉదయహరించిన సమస్యలను ఈ గ్రంథం పరిశిలిస్తుంది. అవి “వృత్తం యొక్క కొలతపై మరియు గోళం
మరియు సిలిండర్ మీద On the measurement of the circle and On the sphere
and the cylinder”.
బాను మూసా సోదరులు మరియు ఆర్కిమెడిస్ అనుసరించిన పద్ధతుల్లో చాలా
సారూప్యతలు ఉన్నాయి. అలాగే చాలా తేడాలు కూడా ఉన్నాయి, బాను మూసా సోదరులు యుడోక్సస్
కనుగొన్న అలసట పద్ధతి
method
of exhaustion ని ఉపయోగించారు అది ఆర్కిమెడిస్
చేత సమర్థవంతంగా ఉపయోగించబడింది..
బను ముసా సోదరుల ప్రచురణలలో అత్యంత ప్రాచుర్యం పొందినది “కితాబ్
అల్-ఇయాల్ Kitāb al-Ḥiyal (ది ట్రిక్స్ బుక్(The
Tricks Book)” ఇది ఎక్కువగా మధ్య సోదరుడు అమాద్ యొక్క రచన, ఇది వంద యాంత్రిక పరికరాలతో
నిండిన పుస్తకం. యాంత్రికంగా మసకబారే దీపం, ప్రత్యామ్నాయ ఫౌంటైన్లు మరియు
క్లామ్‌షెల్ గ్రాబ్‌తో సహా కొన్ని నిజమైన ఆచరణాత్మక ఆవిష్కరణలు పుస్తకంలో ఉన్నాయి.
ఈ పరికరాలలో ఎనభై "కాంతి నాళాలు" గా వర్ణించబడ్డాయి, ఇవి మెకానిక్స్ యొక్క నిజమైన
నైపుణ్యాన్ని చూపించాయి, కాంతి
పీడనం వాడకంపై నిజమైన దృష్టి పెట్టాయి. కొన్ని పరికరాలు మునుపటి గ్రీకు రచనల
ప్రతిరూపాలుగా కనిపిస్తాయి, కాని
మిగిలినవి గ్రీకులు చేసినదానికంటే చాలా అభివృద్ధి చెందినవి.
ఖగోళశాస్త్రంలో బను ముసా సోదరులు అనేక పరిశీలనలు
మరియు రచనలు చేశారు. వారు ఖగోళ
పరిశోధనపై దాదాపు డజను ప్రచురణలు రాశారు. అక్షాంశ స్థాయి degree
of latitude ని కొలవాలని
వారికి అల్-మామున్ ఆదేశించారు మరియు వారు ఉత్తర మెసొపొటేమియాలోని ఎడారిలో వారి
కొలతలు చేశారు. వారు బాగ్దాద్ నుండి సూర్యుడు మరియు చంద్రుల గురించి అనేక
పరిశీలనలు చేశారు. ముహమ్మద్ మరియు అహ్మద్ సంవత్సర పొడవును365 రోజులు మరియు 6 గంటలుగా కొలిచారు.
840-41, 847-48, మరియు 850-51AD లలో బను ముసా ముగ్గురు సోదరులు బాగ్దాద్‌లోని తమ ఇంటి
నుండి రెగ్యులస్ (Regulus) నక్షత్రం యొక్క పరిశీలనలు చేశారు.
బను ముసా సోదరులలో ముహమ్మద్, ఖలీఫా అల్-ముతావాకిల్
నిర్మిస్తున్న కొత్త నగరమైన అల్-జఫారియాకు కాలువను నిర్మించారు. వారు అల్-ముతావాకిల్
కోసం అల్-డాజాఫారియా పట్టణాన్ని నిర్మించడానికి నియమిoపబడిన 20 మంది బృందంలో వారు ఒక భాగం.
బను ముసా
సోదరులు బాగ్దాద్ రాజకీయ రంగంలో కూడా పాలుపంచుకొన్నారు. అల్-ముతావాకిల్ మరణించిన
తరువాత, ఖలీఫా సోదరుడికి
బదులుగా అల్-ముస్తాన్ నామినేషన్ పొందడానికి ముహమ్మద్ సహాయం చేశాడు. ఖలీఫా సోదరుడు బాగ్దాద్ నగరాన్ని ముట్టడి చేసినప్పుడు, సైన్యం
యొక్క పరిమాణాన్ని అంచనా వేయడానికి ముహమ్మద్ పంపబడ్డాడు, మరియు
ముట్టడి ముగిసినప్పుడు అల్-ముస్తాన్ సింహాసనాన్ని ఎలా త్యజించాలి అనే నిబంధనలను రూపొందించడానికి పంపబడ్డాడు.
బను ముసా సోదరుల రచనలుWorks:
బాను మూసా
సోదరులు దాదాపు 20
పుస్తకాలు రాశారు, వాటిలో ఎక్కువ భాగం ఇప్పుడు పోయాయి.
·
ఆతోమేటా Automata:
వారి
విజయాలలో చాలా ముఖ్యమైనది ఆటోమేషన్ రంగంలో వారు చేసిన పని, వారు
బొమ్మలు మరియు ఇతర వినోదాత్మక సృష్టిలలో ఆటోమేషన్ ఉపయోగించారు. వారు తమ గ్రీకు
పూర్వీకుల కంటే ముఖ్యమైన పురోగతిని చూపించారు.
·
ఖరాసన్ Qarasṭūn,, బరువు
సమతుల్యతపై ఒక గ్రంథం.
·
ది మ్యూజికల్
థియరీ గురించి: ఎ బుక్ ఆన్ ది డిస్క్రిప్షన్ విట్ సౌండ్స్ బై ఇట్సెల్ఫ్
A Book on the Description of the Instrument Which Sounds by
Itself,.
ఖగోళ
శాస్త్రం Astronomy
·
కితాబ్ హరకత్ అల్-ఫలక్ అల్ ఓల ūlā(Kitāb
Ḥarakāt al‐falak
al‐ūlā)
·
బుక్ ఆన్ ది మ్యాథమెటికల్ ప్రూఫ్ బై
జ్యామితి
·
ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఆస్ట్రోలాబ్
• బుక్ ఆన్
ది సోలార్ ఇయర్.
*ఆన్ ది విజిబిలిటీ
ఆఫ్ ది క్రెసెంట్,
• బుక్ ఆన్
ది బిగినింగ్ ఆఫ్ ది వరల్డ్.
*హరాక్ ఆల్ట్ అల్-అఫ్లాక్ Ḥarak
alt al - aflāk).
*కితాబ్
అల్-హయా.
*ఎ బుక్
ఆఫ్ జిజ్,
*జిజ్ పై మరొక పుస్తకం.
ఆస్ట్రాలజీ Astrology:
·
కితాబ్ అల్-దరాజ్
*ఎ బుక్ ఆఫ్ డిగ్రీస్ ఆన్ ది నేచర్ ఆఫ్ జోడియాకల్ సిగ్నల్స్
అనే చైనీస్ రచన యొక్క అనువాదం
“కితాబ్
మారిఫాట్ మసాఖత్ అల్-అష్కల్ Kitab marifat masakhat al-ashkal (ది బుక్ ఆఫ్ ది మెజర్మెంట్ ఆఫ్ ప్లేన్ మరియు గోళాకార గణాంకాలు(The Book of the Measurement of
Plane and Spherical Figures))”.
·
Book on an Oblong Round Figure
·
A treatise containing a discussion between Ahmad and Sanad
ibn ʿAli.
No comments:
Post a Comment