రంజాన్ దయ గల నెల మరియు
పవిత్ర ఖురాన్ అవతరించిన నెల. ముస్లింలందరు 70 రెట్లు అధికంగా బహుమతులు
పొందడానికి అనువైన నెల.ఈ నెల ఇస్లామిక్ సంవత్సరాలలో అత్యంత ముఖ్యమైన మరియ్యు పవిత్రమైన నెల.
రంజాన్ యొక్క మూడు దశలు (అశ్రాస్
ashras) రెండు ప్రపంచ( ఈలోకం,
పరలోకం) ఫలాలను పొందటానికి మనలను నడిపిస్తాయి. రంజాన్ కరీం మార్గదర్శకత్వం, ఉపవాసం, దానం, భక్తి మరియు త్యాగం యొక్క నెల. ఆధ్యాత్మికంగా
మరియు ప్రాపంచికంగా ఈ నెల రాకముందే మనము సన్నాహాలు చేస్తాము.
ప్రవక్త ముహమ్మద్
సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:"ఇది (రంజాన్) నెల, దీని ప్రారంభం దయ, దాని మధ్య, క్షమ మరియు దాని
ముగింపు, నరకం యొక్క అగ్ని నుండి విడుదల."
రంజాన్ దశలను ఆశ్రా (Ashra) అని పిలుస్తారు
మరియు ఆశ్రా (Ashra) అరబిక్
పదం. దిని అర్ధం “పది”. ప్రతి దశకు (ఆశ్రా (Ashra)) వేర్వేరు దువాలు
ఉన్నాయి. ప్రతి ఆశ్రా ASHRA నుండి మనం గరిష్ట
ప్రయోజనాలను పొందాలి.
పైన చెప్పినట్లుగా, రంజాన్ యొక్క మూడు దశలకు (ఆశ్రా Ashra) వేర్వేరు వ్యవధి మరియు పఠించటానికి వేరు వేరు
దువాలు ఉన్నాయి. రంజాన్ చంద్రుని దర్శనంతో
మొదలై రంజాన్ మొదటి దశ (ఆశ్రా Ashra) రంజాన్ 10వ తేదీన ముగుస్తుంది, రెండవ దశ (ఆశ్రా Ashra) రంజాన్ 11నుండి 20వరకు మూడవ దశ (అశ్రాAshra)
రంజాన్ 21నుండి 30వరకు ఉంటుంది.
మొదటి (ఆశ్రా Ashra) అల్లాహ్ యొక్క
దయను ప్రతిబింబిస్తుంది. రెండవ (ఆశ్రా Ashra) అల్లాహ్ క్షమాపణ ను ప్రతిబింబిస్తుంది మరియు దీనిని మాగ్ఫిరా యొక్క
ఆశ్రా Ashra అంటారు. రంజాన్
యొక్క మూడవ అశ్రాAshraనరకం నుండి విముక్తిని ప్రతిబింబిస్తుంది మరియు దీనిని నిజత్
యొక్క ఆశ్రాAshra అని పిలుస్తారు.
రంజాన్ మొదటి ఆశ్రాAshra (దయ/Mercy)
ఇతర నెలల కన్నా ఎక్కువ
ఆశీర్వాదం పొందడానికి రంజాన్ ఉత్తమ సమయం. రంజాన్ మొదటి పది రోజులు దయగల రోజులు, అల్లాహ్ తన జీవిని తన నుండి దయ కోరమని అడుగుతాడు.
అల్లాహ్ (SWT) నుండి దయ మరియు ఆశీర్వాదం కోరెండుకు మనం దువా పఠించాలి.
మొదటి ఆశ్రాAshra దువా: "ఓ! నా ప్రభువు క్షమించు
మరియు దయ కలిగి ఉండు మరియు మీరు దయగలవారిలో ఉత్తమమైనవారు.
కాబట్టి ఇతర మానవులకు సేవ
చేయడo రంజాన్ యొక్క మొదటి ఆశ్రాAshra యొక్క లక్ష్యాన్ని అయి ఉండాలి. మిగతా మానవులoదరి
పట్ల కనికరం మరియు దయ కలిగి ఉండాలి. మీకు
సాధ్యమైనంతవరకు దాతృత్వం ఇవ్వండి. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసేవారిని అల్లాహ్
ప్రేమిస్తాడు. ఆగ్రహాన్ని నియంత్రించడం చేయాలి.
రంజాన్ రెండోవ ఆశ్రాAshra
(క్షమాపణ/Forgiveness):
రెండవ ఆశ్రా రంజాన్ 11 నుండి 20 వరకు. ఇది అల్లాహ్ (SWT)
నుండి క్షమాపణ కోరే సమయం. కాబట్టి ఈ రోజుల్లో అతడు / ఆమె చేసిన అన్ని
పాపాలకు పశ్చాత్తాపపడాలి.
రెండవ ఆశ్రా దువా: "నా
ప్రభువైన అల్లాహ్ నుండి నా పాప క్షమాపణ కోరుతున్నాను మరియు నేను అతని వైపు మరలుతాను."
పవిత్ర ఖురాన్ పఠనంతో, సర్వశక్తిమంతుడైన అల్లాహ్
నుండి క్షమాపణ అడగడానికి ఇది గరిష్ట సమయం కనుక ఈ దువాను సాధ్యమైనంత ఎక్కువసార్లు
పఠించేలా చూసుకోండి
రంజాన్ మూడవ ఆశ్రా Ashra (నిజాత్/Nijat )
మూడవ ఆశ్రా Ashra రంజాన్ 21 నుండి ప్రారంభమై
29 లేదా 30న ముగుస్తుంది.
సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌ను నరకయాతన నుండి విముక్తి కోరడం ఈ ఆశ్రా Ashra లక్ష్యం. ఈ ఆశ్రాలో
ఎక్కువ దువాలు పఠించడం మరియు ప్రార్థనలు చేయడం చేయాలి.. ఈ ఆశ్రా Ashra లో లైలాతుల్
ఖాదర్ రావడం వలన ఈ ఆశ్రా Ashra మిగతా రెండు ఆశ్రా Ashra లకన్నా గొప్పది
మరియు వెయ్యి నెలల రాత్రుల కన్నా ఇది ఘనమైనది.
ఈ ఆశ్రా Ashra లో, కొంతమంది ఇతికాఫ్ పాటిస్తారు. తమ మొత్తం సమయాన్ని
ఇబాదాకు ఇస్తారు. లైలాతుల్ ఖాదర్ యొక్క ప్రాముఖ్యత పవిత్ర ఖురాన్లో ఇలా
పేర్కొనబడింది:
“మేము దానిని ఎంతో మేలైన,
అత్యంత శుభవంతమైన రాత్రివేళ అవతరిoపజేసాము. ఎందుకంటే మేము ప్రజలను హేచారించదలచాము.ఈ
రాత్రే ప్రతి విషయానికి సంబందించిన వివేకవంతమైన నిర్ణయం ఆ ఆజ్ఞానుసారం జారి
అవుతుంది. మేము ఒక ప్రవక్తను నీ ప్రభువు కారున్యంగా పంపాలనుకోన్నాము.” -(దివ్య ఖురాన్, 44: 3-6)
రంజాన్ మూడవ ఆశ్రా Ashra కి దువా: اَ“ఓ అల్లాహ్! నరకాగ్ని
నుండి నన్ను రక్షించు. "
నిశ్చయంగా అల్లాహ్
మాత్రమే అంతా తెలుసు మరియు అతను సర్వజ్ఞుడు.
అతను తన జీవులకు ఆహరం అందించే ఏకైక దైవం..
అతనిని అన్ని విషయాలు అడగండి మరియు క్షమాపణ కోసం ప్రార్థించేటప్పుడు
మరియు నరకయాతన నుండి రక్షణ పొందటానికి రంజాన్ యొక్క మూడు దశలు (ఆశ్రాలు Ashraశా)మేలైనవి. రంజాన్ మాసం అల్లాహ్ నుండి మరిన్ని ఆశీర్వాదాలను పొందటానికి ఉత్తమమైన
సమయం.
No comments:
Post a Comment