ప్రస్తుత కోవిడ్-19 మహమ్మరి సమయంలో ముందు జాగ్రత చర్య గా ప్రార్థన కోసం మసీదుల
తలుపులు మూసివేయబడినాయి. శుక్రవారం ప్రార్థనలు మరియు తరావిహ్ ప్రార్ధనలు
ఇంటివద్దనే చేయాలనీ ఇస్లామిక్ పండితుల సూచన.
ఇంట్లో తరావిహ్ ప్రార్థన మరియు ఆధ్యాత్మికతలో నిమగ్నమయ్యే సమయం ఇది. రంజాన్ నెలలో
సర్వశక్తిమంతుడు (SWT) అయిన అల్లాహ్ దయ మరియు అపారమయిన ఆశీర్వాదాలను మానవాళికి ప్రసాదిస్తాడు. ఇది స్వీయ విశ్లేషణ
మరియు అల్లాహ్ వైపు తిరిగి వెళ్ళే సమయం.
సర్వశక్తిమంతుడైన అల్లాహ్ (SWT)తో మన సంబంధాన్ని బలోపేతం చేయడానికి అలాగే మన
విశ్వాసాన్ని కేంద్రీకరించడానికి మరియు పునరుద్ధరించడానికి రంజాన్ ఒక గొప్ప అవకాశం.
ఈ నెల లో మనము పగలు ఉపవాసంలో
రాత్రులు ప్రార్థన మరియు పవిత్ర ఖురాన్
పఠనంలో గడుపుతాము. తరావిహ్ లో ఇమామ్ యొక్క శ్రావ్యమైన మరియు అనర్గళమైన దివ్య
ఖురాన్ పారాయణం వింటాము మరియు అల్లాహ్ (SWT) యొక్క మార్గదర్శకాలను
పొందుతాము.
ఇంట్లో తరావిహ్ ప్రార్థించండి:
ప్రవక్త(స) రంజాన్లో తరావిహ్ ఆచరించారు మరియు తన సహచరులను
కూడా దీనిని చేయమని ప్రోత్సహించారు.
· "అల్లాహ్ రంజాన్ మాసo లో ఉపవాసం మీపై విధిగా చేసాడు మరియు రాత్రులలో ప్రార్థనలో పాల్గోవటం
ఒక అభ్యాసం" అని ప్రవక్త (స) చెప్పారు అని అబ్దుల్-రౌమాన్ ఇబ్న్ -అఫ్ (ర)
వివరించారు.
· ప్రవక్త(స) తన సహచరులందరినీ రాత్రిపూట ప్రార్థనలో పాల్గొనమని
ప్రోత్సహించారని అబూ హురైరా వివరించాడు.
· ప్రవక్త (స) ఇంకా ఇలా అంటారు, "రంజాన్ సందర్భంగా రాత్రి ప్రార్థనలో ఎవరైతే విశ్వాసం మరియు ప్రతిఫలం ఆశించి
పాల్గొంటారో, వారి మునుపటి పాపాలు క్షమించబడతాయి."
లాక్-డౌన్/క్వారంటైన్ సమయం లో కూడా రంజాన్ లో ఇంట్లో తరావిహ్ ప్రార్థించ వచ్చు.
మసీదులు మూసివేయబడినప్పుడు ఇంట్లో తరావిహ్ను ఎలా ప్రార్థించాలో కొన్ని మార్గదర్శకాలు:
1) మీ ఇంట్లో తరావిహ్
ప్రార్ధన నెల అంతా చేయడానికి పరిశుభ్రమైన మరియు సౌకర్యవంతమైన ప్రదేశాన్ని
ఏర్పరచుకోండి.
2) ఇషాను
ప్రార్థించడానికి ఒక సమయాన్ని ఎంచుకోండి, అధాన్,ఇక్మాహ్
ఇవ్వండి మరియు ఇతర కుటుంభ సభ్యులతో కలసి ప్రార్థించండి.
3) ఇషా ప్రార్థన
చేసిన తరువాత, అధ్కార్ (adhkār) పారాయణం చేసి దువా ను సమగ్రంగా చేయండి.
4) సున్నా ప్రార్థన
యొక్క రెండు రకాత్లను ‘ఇషా’ తర్వాత ప్రార్ధించండి..
5) ఆ తరువాత, మీరు మసీదులో చేసినట్లుగా తరావిహ్ ప్రార్థిస్తారు. తరావిహ్
యొక్క రకాతులు 20,
ఇందులో దివ్య ఖురాన్ ను పఠించవచ్చు. అలాగే, ముషాఫ్ (mushaf) నుండి చదువుకోవచ్చు.
6) అయితే, మీరు ముషాఫ్ నుండి చదువుతుంటే, ఒక రాత్రిలో ఒక జుజ్ పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీరు
అలా చేయడం కుదరకపోతే , మీరు వీలైనంత వరకు దివ్య ఖురాన్ పారాయణం
చేయవచ్చు.
7) పారాయణం (reciting) మరియు చదవడం మాత్రమే సరిపోదు, అనువాదం, వ్యాఖ్యానం
(తఫ్సీర్) ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి
8) 10 రకాతుల తరువాత, దువా-ఎ-తరావిహ్
పారాయణం చేసి, మిగిలిన 10 రకాతులను పూర్తి
చేసి దువా చేయండి.
అల్లాహ్(SWT) మనకు మార్గనిర్దేశం చేసి, ఈ ఆశీర్వాద నెల నుండి ఎక్కువ ప్రయోజనాలను పొందటానికి మరియు
మన పాపాలన్నిటిని క్షమించి, ఈ మహమ్మారిని ఈ ప్రపంచం నుండి అంత త్వరగా
తొలగించడానికి మనకు సహాయo చేయుగాక..
No comments:
Post a Comment