ఢిల్లీ, లక్నో,
హైదరాబాద్
మరియు జైపూర్‌లోని అనేక చారిత్రక కట్టడాలు పునరుద్ధరించబడ్డాయి. అలాగే ఇండో-యూరోపియన్
ఆర్కిటెక్చరల్ హెరిటేజ్ స్మారక కట్టడాలను కలిగి ఉన్న ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ ఫోర్ట్
కాంప్లెక్స్‌లో ఉన్న మచ్చి భవన్ లో కూడా పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టాలి.
ఖిల్లా మౌలాకు ఈశాన్యంలో ఉన్న రాంపూర్ నగరం
యొక్క మచ్చి భవన్ యొక్క అద్భుతమైన
నిర్మాణ విలువను కలిగి ఉంది. మచ్చి భవన్ ప్రక్కనే ఉన్న రాంపూర్ రజా లైబ్రరీ భవనం
పునరుద్ధరించబడింది. కానీ కొన్ని కారణాల వల్ల మచ్చి భవన్ చాలా వరకు నిర్లక్ష్యానికి
గురైంది. ప్రస్తుతం దానిని బాలికల ప్రభుత్వ కళాశాలగా మార్చారు.
మచ్చి భవనంలో పాలరాతితో చేసిన పురాతన
ఫౌంటెన్ ఉంది, గోడలపై టేకు చెక్క పలకలు,
అలంకారమైన
పాత నిప్పు గూళ్లు, అలంకరించబడిన రంగురంగుల పలకలు,
వంపు
తిరిగిన ఇనుప హ్యాండ్‌రైల్, బెల్జియన్ కట్ గ్లాసెస్,
ఫ్రెంచ్
షాన్డిలియర్లు మరియు తోటకి అభిముఖంగా ఉన్నశైలి తో కూడిన టెర్రేస్ ఉన్నాయి
మచ్చి భవనంలో ఒకప్పడు నవాబ్ కల్బే
అలీఖాన్ దర్బార్ నిర్వహించేవారు. మచ్చి భవనంలో దూరప్రాంతాల నుండి వచ్చిన పండితుల
మధ్య జ్ఞాన చర్చలు జరిగేవి. రాంపూర్ నవాబు, పండితుల మరియు ప్రముఖుల మధ్య సాహిత్య చర్చలపై
చాలా ఆసక్తిని కనబరిచారు. ఇక్కడ పాలనకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు
తీసుకున్నారు. మతం లేదా కులంతో సంబంధం లేకుండా నగరంలోని ప్రజలు ప్రవేశించడానికి
మరియు దర్బార్ కార్యక్రమాలను వీక్షించడానికి అనుమతించబడ్డారు
మచ్చి భవనం ను నవాబ్ కల్బే అలీ ఖాన్
బహదూర్ పాలనలో ‘దివాన్-ఇ-ఖాస్’గా
అభివర్ణించబడినది. మరొక రాంపూర్ నవాబ్ హమీద్ అలీ ఖాన్ హయాంలో అందమైన నిర్మాణాలు నిర్మించబడ్డాయి
మరియు రాంపూర్ ఆధునిక అందమైన నగరంగా రూపురేఖలు దిద్దుకొంది. ప్రతిభ మరియు
నైపుణ్యాలు ప్రోత్సహించబడ్డాయి.నవాబ్ హమీద్ అలీ ఖాన్ ను రాంపూర్ షాజహాన్ అని కూడా
పిలుస్తారు.
రాంపూర్ రాజకుటుంబానికి చెందిన జహనారా
హబీబుల్లా హయాం లో రాంపూర్ కోటలో భారీ బహిరంగ ప్రదేశాలు మరియు తోటలునిర్మించబడినవి.
ఇండో-యూరోపియన్ క్లాసికల్ ఆర్కిటెక్చర్
విస్తారమైన మొఘల్-ఆకృతితో కూడిన ఉద్యానవనాలతో సంపూర్ణంగా ఉంది. నవాబ్ ఇంటివారు మచ్చి
భవనంను ఆక్రమించుకున్నారు, అవధ్ ప్యాలెస్‌ల మాదిరిగానే మచ్చి భవనం
చేపల చిహ్నంగా తీర్చిదిద్దారు. చేపలు అదృష్టాన్ని మరియు శ్రేయస్సును సూచిస్తాయి కాబట్టి,
ప్రజలు
దీనిని శుభ శకునంగా కూడా భావిస్తారు.అవధ్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ఫలితంగా 1774లో
రాంపూర్ రాచరిక రాష్ట్రంగా ఆవిర్భవించింది..
నవాబ్ హమీదలీ ఖాన్ (1889-1930)
పాలనలో రాంపూర్
నగరం విస్తరించబడినది.
హమీద్ అలీ ఖాన్ W.C రైట్ (ఫ్రెంచ్
ఆర్కిటెక్ట్) ను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా నియమించాడు,
అ
W.C
రైట్
(ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ సౌందర్య మరియు రాజకీయ అధికారాన్ని సూచించే భవనాలను అభివృద్ధి
చేశాడు.
కోట సముదాయాలు స్థానిక ఇటుకలు మరియు
ఇసుకను ఉపయోగించి యూరోపియన్ ఆర్కిటెక్చర్ మిశ్రమంతో పునర్నిర్మించబడ్డాయి. రైల్వే
స్టేషన్లు, ఆసుపత్రులు,
న్యాయస్థానాలు,
పబ్లిక్
గేట్లు,
విశాలమైన
వీధులు మరియు కాలువ వ్యవస్థలు వంటి అనేక "ఆధునిక భవనాలు" నిర్మించబడ్డాయి.
ప్రస్తుతం మచ్చి భవనం ను ప్రభుత్వ బాలికల కళాశాలగా మార్చారు. మచ్చి భవనం ప్యాలెస్
మొదట రాంపూర్ నవాబుల అధికారిక నివాసంగా ఉండేది.
No comments:
Post a Comment