19 February 2024

తెలుసుకోవలసిన పెరిమెనోపాజ్ లక్షణాలు మరియు సంకేతాలు Know About The Perimenopause Symptoms and Signs

 రుతువిరతి లేదా మెనోపాజ్‌ అనేది జీవితంలో సహజమైన దశ మరియు చాలామంది స్త్రీలు ఏదో ఒక సమయంలో దానిని అనుభవిస్తారు. కానీ మెనోపాజ్‌తో ముడిపడి ఉన్న పెరిమెనోపాజ్ గురించి కూడా తెలుసుకోవాలి..పెరిమెనోపాజ్, మెనోపాజ్‌/రుతువిరతి యొక్క ప్రారంభ దశలలో ఒకటి.

పెరిమెనోపాజ్ అంటే ఏమిటి?

పెరిమెనోపాజ్ అనేది మెనోపాజ్‌కు దారితీసే సంవత్సరాలను వివరించడానికి ఉపయోగించే పదం. అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (ACOG) ప్రకారం, అండాశయాల ద్వారా ఉత్పత్తి చేయబడిన ఈస్ట్రోజెన్ స్త్రీలలో 30 మరియు 40 సంవత్సరాలలో  హెచ్చుతగ్గులకు గురవుతుంది మరియు ఇది పెరిమెనోపౌసల్ లక్షణాలకి దారి తీస్తుంది.

మయో క్లినిక్ ప్రకారం, మహిళలు వివిధ వయసులలో పెరిమెనోపాజ్‌ను అనుభవిస్తారు. కొందరు తమ 30 ఏళ్ల మధ్యకాలంలోనే మార్పులను గమనించవచ్చు, మరికొందరు తమ 40లలో పెరిమెనోపాజ్ సంకేతాలను గమనించవచ్చు.

ఋతుస్రావం లేకుండా వరుసగా 12 నెలలు గడిపిన తర్వాత, అధికారికంగా మెనోపాజ్‌కు చేరుకున్నారు  దాంతో  పెరిమెనోపాజ్ ముగిసిందని ఫ్లోరిడాలోని ఓర్లాండోలోని విన్నీ పామర్ హాస్పిటల్ ఫర్ విమెన్ అండ్ బేబీస్‌లో ఓబ్/జిన్ క్రిస్టీన్ గ్రీవ్స్, M.D. చెప్పారు.

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆన్ ఏజింగ్ ప్రకారం, రుతువిరతి/మెనోపాజ్‌ సాధారణంగా 45 మరియు 55 సంవత్సరాల మధ్య ప్రారంభమవుతుంది.

పెరిమెనోపాజ్ లక్షణాలు:

పెరిమెనోపాజ్ అనేక  లక్షణాలు కలిగిఉండవచ్చు.

1.క్రమరహిత పీరియడ్స్

2.వేడి సెగలు లేదా వేడి ఆవిరులు/ హాట్ ఫ్లాష్

3.మూడ్ తరచూ మారుతుంది

.4.యోని పొడి గా మారుతుంది.

5.సెక్స్ డ్రైవ్‌లో మార్పు

6.సంతానోత్పత్తిలో తగ్గుదల

7.ఎముక నష్టం-బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది

8.చెడు కొలెస్ట్రాల్ పెరుగుదల-గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.

పెరిమెనోపౌసల్ లక్షణాల గురించి ఏమి చేయాలి

మీకు పెరిమెనోపౌసల్ లక్షణాలు ఉంటే మరియు అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకపోతే, ఎటువంటి మందులు తీసుకోనవసరం లేదా చికిత్స చేయించుకోవాల్సిన అవసరం లేదని డాక్టర్ గ్రీవ్స్ చెప్పారు.

మీరు పెరిమెనోపాజ్‌లో ఉన్నారని మీరు అనుకుంటే, సహాయం కోసం వైద్యునితో మాట్లాడండి. వారు మార్గదర్శకత్వం అందించడంలో మీకు సహాయం చేస్తారు..

No comments:

Post a Comment