22 February 2024

సమోరి టూరే (1830-1900)ఫ్రెంచ్ వారిని ఎదిరించిన ఆఫ్రికా ముస్లిం యోధుడు SAMORI TOURÉ (1830-1900

 


మాండింకా ముస్లిం మత గురువు, సైనిక వ్యూహకర్త మరియు వాస్సౌలౌ సామ్రాజ్య స్థాపకుడు, యుద్ధ వీరుడు మరియు 19వ శతాబ్దంలో పశ్చిమ ఆఫ్రికాలో ఫ్రెంచ్ వలసరాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం జరిపిన విప్లవ నాయకుడు, సమోరి టూరే 1830లో ప్రస్తుత గినియాలోని మిలో రివర్ వ్యాలీలో జన్మించాడు. సమోరి టూరే సున్నీ ఇస్లాం యొక్క మాలికీ ముస్లిం.

సమోరి టూరే తండ్రి ఒక వ్యాపారి, తండ్రి లాగే టూరే కూడా ప్రారంభ జీవితం లో వ్యాపార వృత్తిని ప్రారంభించాడు.  1850వ దశకంలో, దాడి సమయంలో పట్టుబడిన మాలింకే జాతికి చెందిన తన తల్లిని విడిపించడానికి సమోరి టూరే మదీనా (ప్రస్తుత మాలి) వద్ద సైనిక దళాలలో చేరాడు. స్థానిక తెగల చీఫ్‌లు ప్రారంభించిన  వివిధ సైనిక ప్రచారాలలో పాల్గొని సమోరి టూరే సైనిక నైపుణ్యాలను సంపాదించాడు.

టూరే ఎదుగుతున్న మరియు క్రమశిక్షణతో కూడిన సైన్యానికి శిక్షణ ఇవ్వడం మరియు ఆజ్ఞాపించడం ద్వారా ప్రసిద్ధ నాయకుడు అయ్యాడు. సమోరి టూరే తన సైనిక విజయాలను విస్తరించాడు, మందింకా అనే ఐక్య సామ్రాజ్యాన్ని నిర్మించాడు. 1874 నాటికి, సమోరి టూరే తనను తాను ఫామా (చక్రవర్తి)గా ప్రకటించుకున్నాడు మరియు ప్రస్తుత గాంబియాలోని బిసందుగులో తన రాజ్యానికి రాజధానిని స్థాపించాడు.

1880వ దశకంలో, సమోరి టూరే సామ్రాజ్యం ఉత్తరాన బమాకో, మాలి నుండి తూర్పు మరియు దక్షిణాన బ్రిటిష్ సియెర్రా లియోన్, ఐవరీ కోస్ట్ మరియు లైబీరియా సరిహద్దుల వరకు విస్తరించింది. సూడాన్ తూర్పు సరిహద్దుగా ఉండేది. టూరే యొక్క సామ్రాజ్యం 1883 మరియు 1887 మధ్య దాని ఉచ్చ దశకు చేరుకుంది, ఈ కాలంలో సమోరి టూరే అల్మామి అనే బిరుదును స్వీకరించాడు, అంటే ముస్లిం సామ్రాజ్యం యొక్క మతపరమైన అధిపతి.

ఆఫ్రికాను విభజించిన 1884 బెర్లిన్ కాన్ఫరెన్స్ తరువాత, ఫ్రెంచ్ దళాలు మాండింకాపై దాడి చేయడం ప్రారంభించాయి. సమోరి టూరే సైన్యం మొదట్లో ఫ్రెంచ్‌ను ఓడించినప్పటికీ, 1885 మరియు 1889 మధ్య ఫ్రెంచ్ సైనిక బలగాలు, సమోరి టూరే ను పశ్చిమ ఆఫ్రికా అంతర్గత భాగంలోకి నెట్టడంలో విజయం సాధించాయి. అనేక ఘర్షణల తరువాత, టూరే 1889లో ఫ్రెంచ్ దళాలతో వివిధ శాంతి ఒప్పందాలను కుదుర్చుకున్నాడు.

డిసెంబరు 1891లో, టూరే సామ్రాజ్యంలోకి ఫ్రెంచ్ చొరబాట్లు పెరగడం వల్ల దేశం మొత్తం తూర్పువైపు వలస వెళ్లింది. 1893 మరియు 1898 మధ్య, టూరే సైన్యం ప్రస్తుత ఉత్తర ఐవరీ కోస్ట్‌లోని విస్తారమైన భూభాగాలను స్వాధీనం చేసుకుంది. టూరే రెండవ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి మరియు ఎగువ ఐవరీ కోస్ట్‌లోని కాంగ్ నగరంలో దాని కొత్త రాజధానిని స్థాపించినాడు..

మే 1, 1898, కొత్త సామ్రాజ్యానికి ఉత్తరాన ఉన్న సికాస్సో పట్టణాన్ని ఫ్రెంచ్ స్వాధీనం చేసుకున్నప్పుడు, టూరే మరియు అతని సైన్యం రెండవ ఫ్రెంచ్ దండయాత్రను నిరోధించేందుకు లైబీరియన్ అడవులలో స్థావారాలను ఏర్పాటు చేసుకోంది. అయితే, కరువు మరియు ప్రకృతి వైపరిత్యాలు సమోరి టూరే సైనిక బలగాలను బలహీనపరిచినవి  మరియు ఫ్రెంచ్ వారు సెప్టెంబరు 29, 1898న ప్రస్తుత ఐవరీ కోస్ట్‌లోని గులెమౌ వద్ద సమోరి టూరే శిబిరంలో టూరేను స్వాధీనం చేసుకున్నారు. టూరే న్డ్జోల్, గాబన్‌కు బహిష్కరించబడ్డాడు, అక్కడ సమోరి టూరే జూన్ 2, 1900న న్యుమోనియాతో మరణించాడు.

సమోరి టూరే 1882 నుండి 1898లో పట్టుబడే వరకు పశ్చిమ ఆఫ్రికాలో ఫ్రెంచ్ వలస పాలనను ప్రతిఘటించాడు. సమోరి టూరే గినియా యొక్క మొదటి అధ్యక్షుడు అహ్మద్ సెకౌ టూరే యొక్క ముత్తాత. అహ్మద్ సెకౌ టూరే ఆఫ్రికా స్వాతంత్ర్య పోరాటాలలో ప్రముఖ పాత్ర వహించినాడు.

దక్షిణ మాలి మరియు ఈశాన్య గినియాలో వలసవాద ఆధిపత్యం యొక్క మొదటి దశాబ్దాలలో, ఫ్రెంచ్ వారి ఆక్రమణను సమోరీ సంవత్సరాల హింస మరియు అభద్రత నుండి స్థానికులను సమోరీ టూర్ విముక్తి చేసినాడు. సమోరీ టూర్ ఆఫ్రికన్ ప్రతిఘటన వీరుడు మరియు అమరవీరుడుగా ఆఫ్రికన్ ప్రజలు నేటికి గుర్తుంచుకుంటారు.

సమోరీ టూర్ సమాధి కొనాక్రీ గ్రాండ్ మసీదు యొక్క తోటలలోని కమయన్నే సమాధి వద్ద ఉంది.

 

No comments:

Post a Comment