హైదరాబాద్‌లోని క్రీడల గురించి ప్రస్తావనవస్తే
సయ్యద్ అజారుద్దీన్,
అర్షద్
అయ్యూబ్,
సానియా
మీర్జా,
మహ్మద్
సిరాజ్ మరియు నిఖత్ జరీన్ వంటి క్రీడాకారుల చిత్రాలు మనస్సులో మెదులుతాయి. అయితే
భారత్‌ను ఎన్నోసార్లు గర్వించేలా చేసిన మేటి బాక్సర్ మహ్మద్ హుసాముద్దీన్ మాత్రం
కొందరికే గుర్తుంది.
మహ్మద్ హుసాముద్దీన్ తండ్రి బాక్సర్
నిఖత్ జరీన్‌కు మొదటి కోచ్ అనిమీకు తెలుసా!.
హుస్సాముద్దీన్ తన సోదరులు
ఎహ్తేషాముద్దీన్ మరియు ఎహ్తేసాముద్దీన్ ప్రేరణగా బాక్సింగ్ ఎంచుకున్నాడు. హుస్సాముద్దీన్
తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, తన
కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన విజయాలు సాధించాడు.
హుస్సాముద్దీన్ పారిస్ ఒలింపిక్స్ లో పతకాన్ని సాధించాలనే తపనతో ఉన్నాడు.
“ఓటమిని
నేనెప్పుడూ మౌనంగా అంగీకరించలేదు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నేను ఎప్పుడూ
పోరాటానికి సిద్ధంగానే ఉంటాను. దేశానికి మరింత కీర్తిని తెచ్చిపెట్టి,
పారిస్
ఒలింపిక్స్‌లో నా అంతిమ లక్ష్యాన్ని సాధించగలననే నమ్మకం నాకుంది”.అంటాడు
హుస్సాముద్దీన్
హుసాముద్దీన్ ఇండియన్ ఆర్మీలో సుబేదార్.
29 ఏళ్ల మహ్మద్
హుసాముద్దీన్ 56 కేజీల విభాగంలో పోటీపడుతున్నాడు. హుసాముద్దీన్
తెలంగాణలోని నిజామాబాద్‌లో బాక్సర్ల కుటుంబంలో జన్మించాడు. హుసాముద్దీన్ ఆరుగురు
సోదరులలో చిన్నవాడు – సోదరులలో నలుగురు క్రీడలతో సంబంధం కలిగి ఉన్నారు.
హుసాముద్దీన్ తండ్రి,
కోచ్
మహ్మద్ షంషుద్దీన్.
హుసాముద్దీన్ అర్జున అవార్డు గ్రహీత,
మొదటి
ఇండియా ఇంటర్నేషనల్ ఓపెన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం,
2022
బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం, ప్రపంచ
బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లు 2023లో కాంస్య పతకం, 2019లో
రజత పతకం: ఫెలిక్స్ స్టం Felix Stam
2019:
38వ
GB
బాక్సింగ్
టోర్నమెంట్, హెల్సింకి,
ఫిన్లాండ్.
ఇవీ మహమ్మద్ హుసాముద్దీన్ ఇటీవల సాధించిన విజయాల్లో కొన్ని.
మహమ్మద్ హుసాముద్దీన్ 2009లో
ఔరంగాబాద్‌లో జరిగిన జూనియర్ నేషనల్స్‌లో అరంగేట్రం చేసి కాంస్య పతకాన్ని
గెలుచుకున్నాడు.
మహమ్మద్ హుసాముద్దీన్ సీనియర్ నేషనల్స్‌లో
గోల్డ్ మెడల్ సాధించాడు.
బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ యొక్క
సామర్ధ్యం త్వరగా గుర్తించబడింది మరియు 2011లో,
ఫిన్‌లాండ్‌లోని
2012
టామెర్ టోర్నమెంట్‌లో మరియు తరువాత ఆర్మేనియాలోని యెరెవాన్‌లో జరిగిన యూత్ వరల్డ్
ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొనే ముందు క్యూబాలోని హవానాలో పక్షం రోజుల శిక్షణ మరియు
పోటీకి పంపబడ్డాడు.
అంతర్జాతీయ పోటీలలో మహమ్మద్
హుసాముద్దీన్ ప్రదర్శన 2015 మిలిటరీ వరల్డ్
గేమ్స్‌లో కాంస్య పతకంతో ప్రారంభమైనది. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. నేడు మహమ్మద్
హుసాముద్దీన్ తన బరువు విభాగంలో(56kg) దేశంలోని అత్యుత్తమ బాక్సర్లలో ఒకడు అయ్యాడు.
No comments:
Post a Comment