ప్రవక్త(స) యొక్క జీవితం మరియు దివ్య ఖురాన్
బోధనలు ఇస్లాం యొక్క సమ్మిళిత, దయగల స్వభావాన్ని
ప్రదర్శిస్తాయి. ప్రవక్త ముహమ్మద్(స) జీవితంలో అట్టడుగు మరియు అణచివేయబడిన వారిని మాత్రమే
కాకుండా తన శత్రువులను మరియు ఇస్లాం యొక్క శత్రువులను కూడా ఆలింగనం చేసుకున్న
సంఘటనలు మనకు కనిపిస్తాయి.
మసీదు ఇస్లామిక్ సమాజం మరియు మతానికి
కేంద్రంగా ఉంది. మసీదులు కేవలం ఆరాధన కోసం పవిత్ర స్థలాలు కాదు,
అవి
ఇస్లామిక్ సమాజంలో సామాజిక సంస్థలుగా పనిచేస్తాయి మరియు అనేక సామాజిక బాధ్యతలను
కలిగి ఉంటాయి.
లోపభూయిష్టమైన దైవభక్తి మరియు మతతత్వం మసీదును
కేవలం సమాజం లోని ఒక వర్గానికే పరిమితం చేసి మసీదుల సారాంశాన్ని ఉల్లంఘించి,
ముస్లిం
సమాజాలలో వాటి ప్రాముఖ్యతను కించపరిచింది
దివ్య ఖురాన్ ప్రవక్త(స)ను ప్రజల
హృదయాలను మలినాలను శుభ్రపరిచే వ్యక్తిగా వర్ణిస్తుంది మరియు వారికి ఖురాన్ అర్ధాన్ని
బోధిస్తుంది. దాయీ సమాజానికి రోల్ మోడల్‌గా వ్యవహరించాలి. దాయీ తిరస్కారులు సృష్టికర్త
వైపు మరలడానికి మద్దతు మరియు మార్గదర్శకత్వం ఇవ్వాలి
బోధకుని (దాయీ) విధి దయ యొక్క అన్ని మార్గాలను తెరవడం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన
శత్రువులను మరియు ఇస్లాం కు శత్రువులను కూడా ఆలింగనం చేసుకోవడం ద్వారా వారిలో
తెచ్చిన పరివర్తన మానవ చరిత్రలో ఒక గొప్ప విప్లవానికి నాంది పలికింది
ఇస్లాం సాధారణ మానవులను కూడా ధర్మం
యొక్క ఆదర్శ మూర్తులుగా మార్చగల శక్తి కలిగి ఉంది. ఇస్లాం వ్యక్తులను దైవభీతి పరులుగా,
మరియు దుర్మార్గులను పరివర్తకులుగా
మార్చుతుంది.
గత శతాబ్దంలో ఇస్లాంలో సంస్కరణల కోసం
అనేక ఉద్యమాలు ఆవిర్భవించాయి. ఇవి మసీదులను కలుపుకొని,
పాల్గొనే
మరియు విముక్తి కలిగించే ప్రదేశాలుగా మార్చాయి. మసీదుల సామాజిక విధులు మరియు
సాంస్కృతిక చైతన్యాన్ని పునరుద్ధరించాయి.
స్త్రీలకు కూడా మసీదులలో ప్రవేశం
కల్పించాయి. కులం, మతం, లింగం,
భౌగోళికం
మరియు జాతి యొక్క అన్ని వైవిధ్యాలను దూరం చేసి ఇస్లాం ఒక విముక్తి మరియు సమ్మిళిత
ఉద్యమంగా ఎదిగింది. కొంత కాలంగా ముస్లింలు తమ మతంలోని ఈ ప్రకాశవంతమైన అంశాలను
విస్మరించడం ప్రారంభించారు.
అంతర్గతంగా చేరిక,
సమానత్వం,
సామాజిక
చైతన్యం మరియు సాంస్కృతిక అనుకూలతను కలిగి ఉన్న ఇస్లాం మళ్లీ పుంజుకోవడం మరియు తన
సమ్మిలిత ఆశయాలను పునరుద్ఘాటించడం సాధ్యమే. మతపరమైన మరియు లౌకిక విద్య రెండింటినీ నేర్చుకోవడం,
ఇస్లాం మూల సూత్రమైన మధ్యే మార్గాన్ని అనుసరించడం ద్వారా సయోధ్య మరియు చేరికకు మార్గం ఏర్పరచాలి
No comments:
Post a Comment