16 April 2024

ది బుక్ ఆఫ్ వాటర్ (కితాబ్ అల్-మా)- ఇబ్న్ అల్-తహాబి (1033ADలో మరణించారు) The Book of Water (Kitab Al-Ma’a) by Ibn Al-Thahabi, (died 1033 CE

 


కితాబ్ అల్-మా', వర్ణమాల alphabet ప్రకారం ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి ఎన్సైక్లోపీడియా ఆఫ్ మెడిసిన్ గ్రంధం  ఇటీవల అల్జీరియాలో కనుగొనబడింది మరియు ఒమన్‌లో ప్రచురించబడింది. కితాబ్ అల్-మా'900 కంటే ఎక్కువ పేజీలను కలిగి ఉంది మరియు దీనిని ఇబ్న్ అల్-తహాబి (1033ADలో మరణించారు) రచించారు.

పుస్తకానికి కితాబ్ అల్-మా అని పేరు పెట్టడానికి రచయిత ఇబ్న్ అల్-తహాబి కు  స్పష్టమైన కారణం ఏమిటంటే, పుస్తకంలో అల్-మా (నీరు) అనే పదం మొదట కనిపిస్తుంది.

అల్-మా (నీరు) గ్రంధ రచయిత అబూ మొహమ్మద్ అబ్దెల్లా ఇబ్న్ మొహమ్మద్ అల్-అజ్దీ, ఇబ్న్ అల్-తహబి ముస్లిం స్పెయిన్‌లోని వాలెన్సియా నివాసి.

ఇబ్న్ అల్-తహబి నిజానికి ఒమన్‌లోని సుహార్ నగరంలో జన్మించాడు. ఇబ్న్ అల్-తహబి బాస్రాకు వెళ్లి అక్కడినుండి పర్షియాకు వెళ్లి అక్కడ గొప్ప ఇస్లామిక్ పండితులు అల్-బిరుని మరియు ఇబ్న్ సినాల వద్ద చదువుకున్నాడు. తరువాత ఇబ్న్ అల్-తహబి బైట్ అల్-మక్దిస్ (జెరూసలేం)కి వలస వెళ్లి చివరకు వాలెన్సియాలో స్థిరపడ్డాడు

అల్-మా మాన్యుస్క్రిప్ట్‌లో దాదాపు తొమ్మిది వందల పేజీలు ఉన్నాయి. వర్ణమాలలోని ప్రతి అక్షరం కింద, అనారోగ్యం, ఔషధం, శారీరక ప్రక్రియ లేదా చికిత్స పేర్లు ఉన్నాయి.. అల్-మా ఎన్సైక్లోపీడియాలో, ఇబ్న్ అల్-తహాబి పేర్లను జాబితా చేయడమే కాకుండా మానవ అవయవాల పనితీరు గురించి అనేక అసలైన/ఒరిజినల్  ఆలోచనలను జోడించారు.

ఇబ్న్ అల్-తహాబి సిద్ధాంతం  దృష్టి ఎలా జరుగుతుందో ఒరిజినల్ ఆలోచనను అందిస్తుంది. చూడటం అనేది కంటిలోని కనుపాప గుండా వెళ్లి దృష్టి నరాలను తాకిన చిత్రం యొక్క ప్రక్రియ అని వివరించారు. మెదడు, అప్పుడు, రెండు చిత్రాలను ఒకటిగా ఏకీకృతం చేస్తుంది మరియు దాని మెమరీ బ్యాంకులో నిల్వ చేస్తుంది. ఈ వివరణ ఇబ్న్ అల్-తహాబీ మరణానికి కేవలం 33 సంవత్సరాల ముందు 1040లో మరణించిన ఇబ్న్ అల్-హైతం యొక్క దృష్టి సిద్ధాంతాన్ని పోలి ఉంటుంది. అయితే, వారు కలుసుకున్నారా లేదా ఒకరి పని గురించి మరొకరు తెలుసుకున్నారా అనేది ఖచ్చితంగా తెలియదు.

అల్-మా పుస్తకంలో సాధారణంగా మూలికలతో కూడిన అనేక రకాల వ్యాధులు మరియు వ్యాధుల చికిత్సలు ఉన్నాయి. అల్-మా మానసిక లక్షణాల చికిత్స కోసం ఒక కోర్సును కూడా కలిగి ఉంటుంది. ఇబ్న్ అల్-తహాబీ Ibn Al-Thahabi ప్రధాన ఔషధ   సిద్ధాంతం ప్రకారం , నివారణ అనేది నియంత్రిత ఆహారం మరియు వ్యాయామం నుండి ప్రారంభించాలి మరియు సమస్య కొనసాగితే నిర్దిష్ట వ్యక్తిగత మందులను ఉపయోగించండి మరియు అది ఇంకా కొనసాగితే వైద్య సమ్మేళనాలను medical compounds ఉపయోగించండి.

అల్-మా మాన్యుస్క్రిప్ట్‌ని ఇటీవల డాక్టర్. హదీ హమౌడీ సవరించారు మరియు మినిస్ట్రీ ఆఫ్ నేషనల్ హెరిటేజ్ అండ్ కల్చర్, ఒమన్, 1996లో ప్రచురించారు.

No comments:

Post a Comment