ముస్లిం మహిళా సాధికారికత:
అలీఘర్ ముస్లిం యూనివర్శిటీకి మొదటి
మహిళా వైస్ ఛాన్సలర్ గా ప్రొ. నైమా ఖాతూన్ నియమించబడినారు. 103 ఏళ్ల చరిత్ర అలీఘర్ ముస్లిం యూనివర్శిటీకి ఒక మహిళ
వైస్ ఛాన్సలర్ అవడం ఇదే తొలిసారి.
ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము సోమవారం
రాత్రి ప్రొఫెసర్ నైమా ఖాతూన్ గుల్రిజ్ నియామక ఉత్తర్వులపై సంతకం చేశారు.
యూనివర్శిటీ కొత్త వైస్ ఛాన్సలర్‌ను
ఎంపిక చేసేందుకు ఏర్పాటు చేసిన ప్యానెల్ ప్రొఫెసర్ నైమా ఖాతూన్ పేరును ఎంపిక
చేసింది.
ఇంతకు ముందు ప్రొఫెసర్ నజ్మా అక్తర్
జామియా మిలియా ఇస్లామియాలో మొదటి మహిళా వైస్ ఛాన్సలర్ అయ్యారు.
JNUకి కూడా మహిళా VC నేతృత్వం
వహిస్తున్నారు
"ఉమెన్స్ కాలేజీ
ప్రిన్సిపాల్ నైమా ఖాతూన్ ఐదేళ్లపాటు AMU వైస్-ఛాన్సలర్‌గా నియమితులయ్యారు" అని
అధికారిక నోటిఫికేషన్ తెలిపింది.
AMU 1920లో
స్థాపించబడింది. దీని మొదటి ఛాన్సలర్ లేడీ బేగం సుల్తాన్ జహాన్ కాగా, మొదటి
వైస్-ఛాన్సలర్ మహమూదాబాద్‌కు చెందిన రాజా ముహమ్మద్ అలీ ముహమ్మద్ ఖాన్.
నైమా ఖాతూన్ AMU సైకాలజీ మరియు
ఎడ్యుకేషనల్ సైన్సెస్ విభాగంలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. నైమా ఖాతూన్ మహిళా కళాశాల
ప్రిన్సిపాల్‌గా మరియు సెంటర్ ఫర్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ కెరీర్ ప్లానింగ్
డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
ప్రొఫెసర్ నైమా ఖాతూన్ ఒడిశాకు
చెందినది.ప్రొఫెసర్ నైమా ఖాతూన్ 1981లో AMU నుండి బ్యాచిలర్ డిగ్రీని అందుకుంది. నైమా ఖాతూన్ BA, సైకాలజీ (ఆనర్స్)
పరీక్షలో మెరిట్ జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది.
ప్రొఫెసర్ నైమా ఖాతూన్ 1988 నుండి AMUలో అసిస్టెంట్
ప్రొఫెసర్‌గా బోధిస్తున్నప్పుడు 'ఏ కంపారిటివ్ స్టడీ ఆఫ్ ప్యాటర్న్స్ ఆఫ్ పొలిటికల్
సెగ్రిగేషన్ అండ్ సోషియో-సైకలాజికల్ కోరిలేషన్స్ ఇన్ హిందూ అండ్ ముస్లిం యూత్' అనే అంశంపై పీహెచ్‌డీ
చేసింది.
ప్రొఫెసర్ నైమా ఖాతూన్ AMU
లోని వివిధ హాళ్లకు ప్రొవోస్ట్ మరియు వార్డెన్ మరియు డిప్యూటీ
ప్రొక్టర్‌గా పనిచేసిన గణనీయమైన పరిపాలనా అనుభవం ఉంది.
ప్రొఫెసర్ నైమా ఖాతూన్ ‘పే ఈక్విటీ
మరియు ఫీజు రేషనలైజేషన్ కమిటీ’ వంటి అనేక ముఖ్యమైన కమిటీలలో కూడా సభ్యురాలు.
1999-2000లో ప్రొఫెసర్ నైమా
ఖాతూన్ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ రువాండాలో సైకాలజీ అండ్ ఎడ్యుకేషనల్ సైన్సెస్
ఫ్యాకల్టీలో అసోసియేట్ ప్రొఫెసర్/రీడర్‌గా కూడా పనిచేశారు.
ప్రొఫెసర్ నైమా ఖాతూన్ వైస్
ఛాన్సలర్ పదవికి ఎంపికైన తర్వాత మాట్లాడుతూ యూనివర్సిటీలో ఎలాంటి వివక్ష లేదని, మహిళలకు అనుకూలంగా
సానుకూల చర్యలు తీసుకుంటామన్నారు.
No comments:
Post a Comment